Friday, September 25, 2020
Thursday, September 17, 2020
977 : సందేహాలు - సమాధానాలు
Q : నా పేరు వి.డి., అసోసియేట్. థ్రిల్లర్ కథల్లో ప్రధాన పాత్ర తనే అన్ని విషయాలు తెలుసుకొని ప్రేక్షకులకు రివీల్ చేస్తే అది ఆక్టివ్ పాత్ర అన్నారు.
అయితే మొన్న వచ్చిన ‘వి’ సినిమాలో కూడా హీరో పాత్ర ముందు వేరే పాత్ర కూర్చుని జరిగిన కథ అంతా చెపుతుంది.
ప్రతిసారి ఇలాంటి కథల్లో ఇదే పొరపాటు జరుగుతోంది. దీన్ని తప్పించుకుని హీరోనే అన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా కథను ఎలా రాసుకోవాలి?
A : ముందుగా జానర్ స్పష్టత
తెచ్చుకుందాం. ‘వి’ థ్రిల్లర్ కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, క్రైమ్ థ్రిల్లర్ జానర్.
అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ. ఒక పెద్ద స్టార్ తో వేలిముద్రలు, డీఎన్ఏ, రక్తపు జాడల వంటివి పోగేసుకుని విశ్లేషించుకునే
సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ ఈ రోజుల్లో వర్కౌటవుతుందా? అవి చిన్న హీరోల పాదరక్షలు. లేదా టీవీ సీరియల్స్ సరుకు. పెద్ద స్టార్స్ కి
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో యాక్షన్ సబ్ జానర్ కథ అవసరం. ‘క్యాచ్
మీ ఇఫ్యూ కెన్’ స్టీవెన్ స్పీల్ బెర్గ్ సినిమాలాగా. ఇందులో క్రిమినల్
గా బిగ్ స్టార్ లియోనార్డో డీ కాప్రియో, ఇతణ్ణి పట్టుకునే ఎఫ్బీఐ
అధికారిగా ఇంకో బిగ్ స్టార్ టామ్ హాంక్స్ నటించారు. ఇది పరారీలో వుంటున్న క్రిమినల్
హీరోని క్లూస్ ఆధారంగా పట్టుకునే చిన్న రేంజి కథ కాదు. యాక్షన్ ద్వారా పట్టుకునే బిగ్
యాక్షన్ కథ. అంటే హై కాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్. ఈ కథ కూడా క్రిమినల్ ని
పట్టుకోవడం గురించిన పొడిపొడి కథ కాదు. బ్యాక్ డ్రాప్ లో విచ్ఛిన్న కుటుంబం, దుర్భర బాల్యం గురించిన బాధాకర కథ. ఇలాటి కథ తీయాలని స్పెర్గ్ బెర్గ్ కల.
ఎఫ్బీఐ
అధికారి కూడా క్లూస్ తో ఇన్వెస్టిగేషన్ చేయడు. స్థూలంగా లీడ్స్ తోనే పట్టుకునే యాక్షన్లో
వుంటాడు. అంటే క్రిమినల్ ఫలానా చోట వున్నాడని తెలుసుకుని వెళ్ళి పట్టుకోబోతే ఎత్తుకు
పై ఎత్తు వేసి క్రిమినల్ పారిపోతూంటాడు. ఇదీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో వుండే కథనం.
ఇక
‘వి’ లో నాని ఫ్లాష్ బ్యాక్ ఇంకో పాత్ర
ద్వారా సుధీర్ బాబు వింటూ కూర్చోవడం జానర్ మర్యాద కాదు, అక్రమంగా
చొరబడిన ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్. ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్
లో ఇంకో పాత్ర చెప్పడం మొదలెట్టినట్టు. అట్టు వేస్తే అట్టే వేస్తారు, అట్టులో రొట్టె కలపడం వంట మర్యాద కాదు. అలాటి అట్టు రొట్టె గిరగిరా తిరుగుతూ
వెళ్ళి పొయ్యిలోనే పడుతుంది. కాబట్టి దర్యాప్తు అధికారి సాక్షుల ద్వారానో, ఇంటరాగేషన్లోనో విడతలు విడతలుగా సమాచారం రాబట్టు కోవడం ఇన్వెస్టిగేషన్ జానర్
మర్యాదల కథనం. ‘వి’ ని దర్శకుడి పాయింటాఫ్
వ్యూలో కథగా చెప్తున్నప్పుడు, నాని ఫ్లాష్ బ్యాక్ ని ఒకానొక విషమ
ఘట్టంలో నానియే స్వయంగా తల్చుకునే జ్ఞాపకంగా వుండి వుంటే ప్రథమ పురుషలో బాగా కనెక్ట్ అయ్యేది. అసలు ‘వి’ ని హైకాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్
గా తీసి వుండాలని ఇదివరకే చెప్పుకున్నాం.
ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రాయడం గురించి. చిన్న హీరోలకైనా ఇవి రాయకపోవడం మంచిది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీయడానికి ఇప్పుడెవరికీ అంత పరిజ్ఞానం లేదు. పైన చెప్పిన యాక్షన్ క్రైమ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రేక్షకులు కూడా యాక్షన్ లో వుండే క్రైమ్ చూసేందుకు ఇష్టపడతారుగానీ, తమ మేధస్సుకి ఎవరో పెట్టే అపరిపక్వ పరీక్షలకి బలి పశువులు కావాలనుకోరు.
Q : రెండవ ప్రశ్న. ప్రేమ కథల్లో రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, ట్రియాంగిల్ లవ్ స్టోరీ లకు స్ట్రక్చర్ ఎలా వుంటుంది. వాటికి ప్లాట్ పాయింట్స్ ఏంటి? పాత్రలు ఆక్టివ్ లేక పాసివ్ పాత్రలుగా ఎలా వుంటాయి?? క్యారెక్టర్ ఆర్క్ ఎలా వుంటుంది అన్న విషయాల మీద పూర్తి వివరాలు చెప్పగలరు.
A : పూర్తి వివరాలు చాలాసార్లు ఆర్టికల్స్ రూపంలో బ్లాగులో ఇచ్చాం.
―సికిందర్
Monday, September 14, 2020
976 : సందేహాలు - సమాధానాలు
―దర్శకుడు
Q : ‘వి’ లో నెలకొన్న ఎండ్ సస్పెన్స్, మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే సమస్యల్ని రివ్యూలో వివరిస్తారనుకున్నాము.
―కెవిపి, అసోసియేట్
A : ‘వి’ స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు కాబట్టి సమస్యల విషయం అలా వుండిపోయింది. ఇంకోటేమిటంటే, ‘వి’ ఒక జానర్లో కూడా లేదు. ఎప్పుడే జానర్లోకి వెళ్ళిపోయి రసాస్వాదనని దెబ్బతీస్తుందో మనమే కాచుకోవాలి. దీని స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే కొన్ని రోజులు పట్టేలా వుంది.
2. ఒక్క ముక్కలో అసలు కథంటే ఏమిటి? - ఒక్క ముక్కలో కథంటే ప్రశ్న, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం. ప్రశ్న పుడితేనే ఆ ప్రశ్నతో పాత్ర సంఘర్షించి, తగిన సమాధానం కనుగొంటుంది. ఆ సమాధానం పాత ఫార్ములా సమాధానమై వుండకూడదు, వర్తమాన పరిస్థితులకి వర్తించేదై వుండాలి. ఇది స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ (ప్రశ్న), ప్లాట్ పాయింట్ టూ (సమాధానం) లకి వివరణ.
3. మలయాళం సినిమాలని చూసిన లొకేషన్లలోనే మళ్ళీ మళ్ళీ చూడక తప్పదా? - నిజమే, మలయాళ రూరల్ సినిమాలు అవే లోకషన్లతో కనబడుతున్నాయి. అవే కొండలు, అవే లోయలు, అవే ఇళ్ళు. వరసబెట్టి తెలుగు సినిమాలు అరకు లోయలో తీస్తే ఎలా వుంటాయో అలా వుంటున్నాయి. పైత్యం బాగా ముదిరింది. వీటికి రివ్యూలు రాస్తునప్పుడు అద్భుతమైన కొండ కోనలు, లోయలూ పచ్చదమంటూ పదేపదే రాయడం కూడా పైత్యమే. రాయబోయే ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’ రివ్యూ కూడా ఇలాగే
Monday, September 7, 2020
975 : రివ్యూ
తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు
సంగీతం : శ్రీహరి నాయర్, ఛాయాగ్రహణం : సజద్ కకూ
బ్యానర్ : వేఫేరర్ ఫిలిమ్స్
నిర్మాత : దుల్కర్ సల్మాన్
విడుదల : నెట్ ఫ్లిక్స్
కొత్త దర్శకుడు షంజు జేబా అవిరళ కృషి ‘మనియారయిలే అశోకన్’. దీనికి నిర్మాత దుల్కర్ సల్మాన్. హీరో జాకబ్ గ్రెగరీ. ఈ ఎన్నారై సహాయ నటుడు ఈ సినిమాతో హీరో అయ్యాడు. తెలుగులో కూడా బాగా తెలిసిన అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఒక హీరోయిన్. ఈమె మొదట్లో వచ్చి వెళ్లిపోయాక, ఇంకో హీరోయిన్ గా నజ్రియా నజీమ్ చిట్ట చివర్లో వచ్చి సెటిలవుతుంది. వీళ్ళిద్దరి రాకపోకల మధ్యంతా ఏం జరిగిందన్నది అసలు విషయం. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, 0.25 రేటింగ్ తో ట్రెండింగ్ అవుతోందంటే ఇంత ప్రమాద మెలా జరిగిందో చూద్దాం....
కథ
తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. ఒక ప్రయత్నం ఫలించి పెళ్ళి చూపు లేర్పాటవుతాయి. తన కంటే పొడుగ్గా వున్న ఆ అమ్మాయి శ్యామ (అనుపమా పరమేశ్వరన్) ని చూసి నచ్చిందంటాడు. ఆమెకి నచ్చకపోయినా కోపిష్టి తండ్రి ముందు ఆమెకి సాగదు. పంతులు జాతకాలు చూస్తాడు. అశోకన్ జాతకం దారుణంగా వుంటుంది. పెళ్లి చేసుకుంటే తనో, తనని కట్టుకున్నదో చావడం ఖాయం. ఇంత దారుణమైన జాతకంతో సంబంధం తప్పినందుకు శ్యామ సంతోషిస్తుంది. అశోకన్ కి అశోక వనమే.
తర్వాత పంతుల్ని కలిసి మార్గం చెప్పమంటాడు. ముందు అరటి చెట్టుని పెళ్లి చేసుకో, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు పంతులు. మొదటి పెళ్ళికే గండం గానీ రెండో పెళ్ళికి కాదంటాడు. అశోక్ వెళ్ళి తమ పొలంలోనే వున్న అరటి చెట్టుకి రహస్యంగా తాళి కట్టేస్తాడు. ఈ విషయం తెలీక ఏదో కారణం చేత వాళ్ళమ్మ అరటి చెట్టుని ఫటేల్ మని నరికేస్తుంది. ఇది చూసి తీవ్ర మానసిక క్షోభకి గురవుతాడు అశోకన్.
ఇప్పుడేం చేశాడు? పెళ్ళికి మళ్ళీ కొత్త బాట ఎలా వేసుకున్నాడు? పొడగరి శ్యామనే చేసుకున్నాడా? పొట్టి తనంతో ఇబ్బంది తొలగిపోయిందా?...ఇవీ మిగతా కథలో తేలాల్సిన విషయాలు.
నటనలు - సాంకేతికాలు
ఇక ఇద్దరు హీరోయిన్లు ఆయారామ్ గయారామ్ టైపు. అనుపమా పరమేశ్వరన్ మొదట్లో కాసేపు, నజ్రియా నజీమ్ చివర్లో కాసేపు కాల్షీటు చేసుకుని వెళ్లి పోతారు. మధ్యలో ఇంకో కాల్షీటు తీసుకుని నేవీ డ్రెస్సులో దుల్కర్ సల్మాన్ వచ్చి, గ్రెగరీని నాల్గు దులిపి వెళ్ళిపోతాడు. హీరోయిన్లు అతిధి పాత్ర లేసిన సినిమా ఇదే కావచ్చు దేశంలో.
గ్రెగరీ స్నేహితులుగా కృష్ణ శంకర్, షైన్ టామ్ చాకో కూడా మృదువుగా నటిస్తారు. అందరిదీ మృదువైన నటనలే. సినిమా ఎక్కడా లౌడ్ గా వుండదు. సంభాషణలు లయబద్ధంగా వుంటాయి. దృశ్యాల్లో మోటు తనముండదు. తక్కువ పరికరాలతో సంగీతం కూడా మృదువుగా వుంటుంది. గ్రామం, చుట్టూ కొండలూ, ఘాట్ రోడ్ల లొకేషన్స్ పెయింటింగ్స్ లా వుంటాయి. మేకింగ్ పరంగా కొత్త అనుభూతి నిచ్చే ఆడియో- విజువల్ క్రియేషన్ ఇది. కొత్త దర్శకుడు షంజు జేబా తానూహించిన కథాప్రపంచం కంటే ఎక్కువే ఆవిష్కరించి వుంటాడు. తెలుగులో మేకింగ్ పరంగా చిన్న సినిమాలకి ఇలాటి ఆవిష్కరణలు ఎందుకు జరగవో ఎప్పుడూ వెంటాడే ప్రశ్నే.
కథా కథనాలు
ఏ కథయినా ఒకే పాయింటు లేదా సమస్యతో వుంటుంది. అశోకన్ పాత్రకి పొట్టి తనం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేశాక, మళ్ళీ రంగు తక్కువ, చిరుద్యోగం అనే లోపాలు కూడా కలపడంతో పొట్టి తనమనే పాయింటు తేలిపోయింది. ఇంతే కాదు, జాతకమనే ఇంకో పాయింటు కూడా పొట్టితనం పాయింటుతో క్లాష్ అయి ఇదేం కథో అర్ధం గాకుండా చేసింది. ఈ కథ పొట్టితనం గురించా, జాతకం గురించా?
ఈ జాతకం పాయింటు కూడా గందరగోళంగా వుంది. అశోకన్ పెళ్లి చేసుకుంటే మరణ గండం వుందన్నపుడు దానికి విరుగుడు చెట్టుని పెళ్లి చేసుకోవడంగా చెప్పారు. అశోకన్ అరటి చెట్టుని పెళ్లి చేసుకున్నాక జాతక దోషం తొలగిపోయినట్టే. ఆ చెట్టుని తల్లి నరికి పారేస్తే జాతకం ప్రకారం మరణం గొడవ కూడా వదిలిపోయి క్లీన్ చిట్ వచ్చేసినట్టే. వెంటనే శ్యామని కాకపోతే ఇంకో తన సైజు అమ్మాయిని పెళ్లి చేసుకుని శోభనం జరుపుకో వచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎక్కడో సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో సినిమా నటి విషయమే వుంది. ఐశ్వర్యా రాయ్ కి కుజ దోషం వల్ల విడాకులో, మరణమో పొంచి వుందని, దోష నివారణకి రెండు చెట్లతో పెళ్లి జరిపించి, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో జరిపించారు.
ఇక స్నేహితులే మెడలు వంచి తాము చూసిన సంబంధం ఇందూ (నజ్రియా నజీమ్) తో పెళ్లి జరిపించి అవతల పడేస్తారు. ఇందూని అడిగినప్పుడు పొట్టితనాన్ని ప్రశ్నించదు. పొట్టితనం ప్రశ్నకాకపోతే ఈ కథంతా ఎందుకు? ఇప్పుడు పొడుగు అమ్మాయి ఇందూని చేసుకున్న తనని చూసి నల్గురూ నవ్వితే తట్టుకోగలడా? సహజంగా ఏ సైజుకా సైజు ఈడూ జోడూ చూసి పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తారు. అశోకన్ పేరెంట్స్ కి ఈ కామన్ సెన్సు కూడా లేకుండా ఏళ్ల తరబడి సంబంధాలు చూడ్డం.
ఈ జాతక దోషం గతంలో సంబంధాలు చూసినప్పుడు లేదా? ఇప్పుడే దేవుడు అర్జెంటుగా లేచి అప్డేట్ చేశాడా? సెంటిమెంట్లకి లాజిక్ కూడా అవసరం. ఇలా కథలోనే ఇన్నిదోషాలున్నాయి. దీంతో కథనంలో విషయం లేకుండా పోయింది. మొదటి అరగంట కథలో అనుపమా పరమేశ్వరన్ ఒకటి రెండు సీన్లు పూర్తి చేసుకుని వెళ్లిపోయాక, చివర్లో నజ్రియా నజీమ్ వచ్చి రెండు సీన్లలో కన్పించే వరకూ, మధ్యలో దాదాపు గంటన్నర పాటు చెట్లతో అశోకన్ అర్ధం పర్ధం లేని కథే.
Saturday, September 5, 2020
974 : రివ్యూ
తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు
సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం : పీజీ విందా
నిర్మాత : దిల్ రాజు
విడుదల : అమెజాన్ ప్రైమ్
***
కథ
సుధీర్ బాబు రొటీన్ ఫార్ములా యాక్షన్ సినిమా పోలీసు పాత్రగా దర్యాప్తు కూడా అదే మూస పద్ధతిలో చేసి, మూస నటనతో సరిపెట్టుకున్నాడు. నివేదా థామస్ క్రైమ్ రచయిత్రినంటూ బిల్డప్ ఇచ్చుకుని, ఆ రాసే క్రైమేదో రాసి కథలో పాలుపంచుకోకుండా, ఫక్తు నామమాత్రపు పాత్రగా, సుధీర్ బాబుతో రోమాంటిక్ గ్లామర్ బొమ్మ తనానికి పరిమితమైపోయింది. కశ్మీరీ పాత్ర సాహెబాగా అదితీ రావ్ హైదరీ, నాని పాత్రకి ప్రియురాలిగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఇంకో జీవం లేని ఫార్ములా పాత్రతో సరిపెట్టుకుంది. ఈ ఇద్దరు పేరున్న నటీమణులు నటించడానికి తగిన యూత్ ఓరియెంటెడ్ కొత్త పాత్రలు లభించకుండా వెలవెల బోయారు.
పాత్రలు -పాత్రధారులు - నటనలు ఇలా జీవంలేని జానర్ క్రైసిస్ కథతో డిస్మిస్ అయ్యాక, ఇక మిగిలింది సాంకేతిక ప్రమాణాలు. కెమెరా మాన్, ఇద్దరు సంగీత దర్శకులు, ఎడిటరు, యాక్షన్ డైరెక్టరు మొదలైన సాంకేతికులందరూ ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకుంటున్న తమ టెక్నిక్స్ తో సినిమాలకి నాణ్యతా ప్రమాణాలు చేకూర్చి పెడుతూంటారు. ఒక్క రైటింగ్, డైరెక్టింగ్ శాఖలే ఆ సాంకేతికుల ప్రతిభకి న్యాయం చేకూర్చే మానసిక స్థితిలో లేక, తెలుగు సినిమాలు బాక్సాఫీసు ముందు బొక్క బోర్లా పడిపోతున్నాయి. ఓటీటీలో బాక్సాఫీసు పరీక్ష తప్పించుకోవచ్చనేది వేరే విషయం.
ఫస్టాఫ్ లో నాని రెండు హత్యలు చేసి సవాలు విసరడంతో ఎందుకు సీరియల్ కిల్లర్ గా మారాడన్న డ్రమేటిక్ క్వశ్చెన్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ డ్రమెటేక్ క్వశ్చెన్ ఆధారంగా కథనం చేసుకు పోకుండా, సెకండాఫ్ లో రివెంజి కథగా మార్చి, డ్రమెటేక్ క్వశ్చెన్ ని భంగపర్చారు. దీంతో స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా ఫ్రాక్చర్ అవడమే గాక, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో సినిమా పడింది. ఇక కథని దుమ్ము దులిపి నిలబెట్టడం ఎవరి వల్లా కాలేదు.
అసలు తనకి సవాలు విసురుతూ హత్యలెందుకు మొదలయ్యాయో తెలుసుకోవడానికి క్లూస్ తో సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ కాదు చేయాల్సింది. ఇది కాలంచెల్లిన టెంప్లెట్. ఇన్వెస్టిగేషన్ కతీతమైన బిగ్ పిక్చర్ ని చూడాల్సింది. తనకి సవాలు విసురుతూ హత్యలు జరగడం మామూలు పరిస్థితుల్లో మొదలుకాలేదు. తను మెడల్ సాధించిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. అంటే ఎవరైనా అసూయ పెంచుకున్న అధికారులు తోటి పోలీసుల్ని చంపుతున్నారా అన్న అనుమానం అతడి లాజికల్ మైండ్ కి రావాలి. ఈ మైండ్ బ్లోయింగ్ పాయింటుతో అధికారుల్లో అలజడి సృష్టిస్తే అప్పుడది బిగ్ పిక్చర్ చూడ్డమవుతుంది - స్టార్ సినిమాకి కావాల్సింది బిగ్ పిక్చర్ ని చూపించే హై కాన్సెప్ట్ కథే కావాలి తప్ప, ఏదో బడ్జెట్లో సర్దుకునే సగటు చిన్న సినిమా కథ కాదు.
నాని ప్రేయసిని కోల్పోయాడు. దాంతో పిచ్చెక్కిన పాత్రగా అతడి విజృంభణకి షెడ్ కల్పిస్తే, ఆ ఉన్మాద ప్రేమ యూత్ అప్పీల్ తో కదిలించే విధంగా వెండితెర మీద సార్ధకమయ్యేది. దీనికి తెలుగు కాదు, తెలుగంటే ఇప్పుడు నవ్వులాటగా వుంటుంది- ఇంగ్లీషు క్రైమ్ నవలా రచయిత్రిగా నివేదా థామస్ నానికే రహస్య తోడ్పాటు నందించే యాక్టివ్ పాత్రగా వుండివుంటే - ఈ మొత్తం సినిమా మూస టెంప్లెట్ యాక్షన్ కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలతో వుండేది.