రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 30, 2021

June 15, 2017 : డార్క్ మూవీ ఎలిమెంట్స్



          డార్క్ మూవీస్ అనేవి ఇతర జానర్స్ కంటే కూడా  ప్రత్యేక కళతో కూడుకుని వుంటాయివిషయపరంగానే గాకచిత్రీకరణ పరంగానూ ఇవి భిన్నంగా  వుంటాయినేరాలతో మనిషిలోనిసమాజంలోని చీకటి కోణాల్ని వెల్లడి చేయడమనే ప్రధాన ఎజెండాతో ఇవి  రూపొందుతాయిఇంత కాలం తెలుగు సినిమాలు  బలమైన జానర్ ని పట్టించుకోక వెనుక బడిపోయాయికళాత్మకతసృజనాత్మకత అనేవి ప్రేమ సినిమాల్లోనూదెయ్యం సినిమాల్లోనూ ఏనాడో కనుమరుగైపోయాయికానీ డార్క్ మూవీస్ కళాత్మకతసృజనాత్మకత ఏనాడూ చచ్చిపోయేవి కావుఇవిలేక డార్క్ మూవీస్ లేవువీటిని రుచి మరిగిన ప్రేక్షకులు వీటిని విడిచి పెట్టనూ లేరు – (డార్క్ మూవీ పాత్రలు -   May 2, 2017)

          
టీవల విడుదలైన ‘వెంకటా పురం’,‘కేశవ’ చూసే వుంటారు చాలా మంది. వీటిని డార్క్ మూవీస్ గా పొరబడ కూడదుడార్క్ మూడ్ క్రియేట్ చేసినంత మాత్రాన డార్క్ మూవీస్ అయిపోవు పై పేరాలో పేర్కొన్నట్టు నేరాలతో మనిషిలోనిసమాజం లోని చీకటి కోణాలని వ్యక్తం  చేసేవే డార్క్ మూవీస్వెంకటా పురం’, కేశవ’ రెండూ యాక్షన్ మూవీసేయాక్షన్ మూవీస్ వేరుడార్క్ మూవీస్ వేరుకేశవ’ లో హీరో చేసే  మొదటి హత్య తర్వాత పోలీసులు చెట్టుకి   వురేసి వున్న శవాన్ని దింపుకుని వెళ్ళిపోతారు అదేదో తమ సొత్తు అయినట్టుఇలా ఎక్కడైనా జరుగుతుందావిధిగా శవ పంచనామా చేస్తారువీడియోలూ ఫోటోలూ తీస్తారుసాక్ష్యాధారాల కోసం శోధిస్తారుడార్క్ మూవీస్ లో  వాస్తవికత కనిపిస్తుందికాబట్టి యాక్షన్ మూవీస్ ని డార్క్ మూవీస్ అనుకోకూడదుఅలా రాసేసి తీయకూడదువెంకటా పురం’ లో హీరో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఒంటి చేత్తో పోలీసులందర్నీ చంపుతాడుఇలా డార్క్ మూవీస్ లో జరగదుడార్క్ మూవీస్ లో ఇలాటి వాస్తవ దూరమైన సీన్లు వుండవని గత వ్యాసాల్లో చెప్పుకున్నాం. 

          
జస్ట్ ఒకసారి ‘నేనూ మనిషినే’ లో గుమ్మడినే  చూడండిహత్య చేసి హత్య నుంచి తప్పించుకోవడానికి ఎంత హుందాగా వుంటారోఅలాటి హుందాతనాన్ని ఒలకబోసేవే డార్క్ మూవీస్డార్క్ మూవీస్ లో రఫ్ పాత్రలు వుండవు, పైశాచికంగా ప్రవర్తించవు, రక్తపాతాన్ని సృష్టించవు.   డార్క్ మూవీస్ అంటే 1930 లలో హాలీవుడ్ ప్రారంభించిన జానర్ అని గత వ్యాసాల్లో తెలుసుకున్నాం. 1960 లలో కలర్ లో కొచ్చేటప్పటికి నియో నోయర్ గా రూపాంతరం చెందింది నియో నోయర్ సినిమాలు హాలీవుడ్ నుంచి ఇప్పటికీ వస్తున్నాయి

              ఇక క్షణం’,  ‘అనసూయ’ లాంటి క్రైం సినిమాలు వస్తూంటాయి.  నియోనోయర్ జానర్ గురించి తెలియకపోవడం వల్లనో ఏమో,  వీటిని సాధారణ థ్రిల్లర్స్ లాగే  తీసేశారుఅదే నియోనోయర్ లో పెట్టి తీసి వుంటే వీటి విలువ పెరిగేదిహిందీలో కహానీ’ గెరిల్లా ఫిలిం మేకింగ్ టెక్నిక్ తో కళాత్మకంగా తీసిన నియోనోయర్ డార్క్ మూవీదీన్ని తెలుగులో అనామిక’ గా రొటీన్ గా రిమేక్ చేసేశారుచెప్పొచ్చేదేమంటే యాక్షన్థ్రిల్లర్ లతో బాటు క్రైంమర్డర్ మిస్టరీల్ని కూడా ఒకే పోత (టెంప్లెట్) లో పోసి తీసేస్తున్నారుడార్క్ మూవీ అనే ఒక మన్నికగల ప్రత్యేక కళ వుందని తెలుసుకోవడం లేదు.డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ ని ఫాలో అయివుంటే క్షణం,  అనసూయఅనామికలు కళాత్మక విలువలతో డిఫరెంట్ గా వుండేవిటాలీవుడ్ లో కూడా మంచి ఆర్టు వుందని చాటేవి

          
డార్క్ మూవీ ఎలిమెంట్స్ రచనకి సంబంధించినవి కావుచిత్రీకరణకి సంబంధించినవికాబట్టి చిత్రీకరణలో ఈ జానర్ విలక్షణతని  కెమెరా మాన్ కూడా అర్ధం జేసుకోవాల్సి వుంటుంది. అధ్యయనం చేయాల్సి వుంటుంది. రచయిత - దర్శకుడు- కెమెరామాన్ ముగ్గురి సమన్వయంతో మాత్రమే ఒక  నియో నోయర్ అనే డార్క్ మూవీని  కళాత్మకంగా తీయగలరు. నియో నోయర్ చిత్రీకరణకి కొన్ని ఎలిమెంట్స్ వుంటాయి.

 ప్రారంభంలో బ్లాక్ అండ్ వైట్ లో ఫిలిం నోయర్ ప్రారంభించిన ఎలిమెంట్స్ నే దాదాపు తర్వాత కలర్ లో కొచ్చాక నియో నోయర్ సినిమాలూ  అనుసరిస్తున్నాయి. వీటిని తెలుగుకి వాడినా అసందర్భంగా ఏమీ వుండవు.  అవేమిటో ఈ కింద చూద్దాం :

          1. 
చారుస్కూరో లైటింగ్, 2హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హైఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్6. కాంప్లెక్స్ షాట్స్,  7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమెట్రికల్ కంపోజిషన్9. బార్స్డయాగోనల్ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్10. లాంగ్ ట్రాక్ షాట్స్, 11. అబ్ స్క్యూర్ సీన్స్12. డచ్ యాంగిల్స్ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్14. మిర్రర్స్, 15. మోటిఫ్స్  మొదలైనవి. 

1. చారుస్కూరో (Chiaroscuro) లైటింగ్ :  
       
         ఎఫెక్ట్ హై కాంట్రాస్ట్ లైటింగ్ తో ప్రగాఢ నీడల్ని సృష్టిస్తుందిపాత్రల్నిసీనులో ఇతర విశేషాల్ని  హైలైట్ చేయడానికి దీన్ని వాడతారుఇంటరాగేషన్ సీన్లలో కూడా  లైటింగ్ ని వాడతారు. బ్యాక్ లైటింగ్ వుండదు. పాత్ర చుట్టూ గంభీర వాతావరణం వుంటుంది. 



          2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్ :              మామూలుగా లో కాంట్రాస్ట్ లైటింగ్ వుంటుందినియోనోయర్లో హై కాంట్రాస్ట్ లైటింగ్ తో బ్యాక్ గ్రౌండ్ లో లేదా ఫోర్  గ్రౌండ్ లో  నీడల్ని సృష్టిస్తారు.  ప్రమాదమో, చేసిన పాపమో వెంటాడుతోందనే అర్ధంలో.  నీడ ముందుంటే ప్రమాదం, వెనుక వుంటే చేసిన పాపం. ముందున్న నీడకి ప్రేక్షకులకి అర్ధం తెలిసిపోయి ప్రమాదాన్ని ఊహించేయవచ్చు పాత్రకంటే ముందే. దీంతో సస్పెన్స్ పుడుతుంది. 



         3. డీప్ ఫోకస్ :
   డీప్ ఫోకస్ లో బ్యాక్ గ్రౌండ్ కి కూడా సమాన ప్రాధాన్యమిస్తారు. అంటే బ్యాక్ గ్రౌండ్ ని బ్లర్ చేయరు. డీప్ ఫోకస్ ని రెండు అవసరాలకోసం వాడతారు : అది మనిషికన్ను ఎలా చూస్తుందో అలాటి షాట్ సృష్టిస్తుంది గనుక;  రెండోది,  డబ్బు ఆదా చేయడానికి. ఒకే షాట్ లో నటులందరూ వుండేట్టు చూడ్డం వల్ల, కట్స్ పడవు. కట్స్ పడకపోతే వాటిని తీయడానికి సమయం సొమ్మూ  కలిసివస్తాయి. 

4. ఎక్స్ ట్రీం హైఎక్స్ ట్రీం లో యాంగిల్స్ : 

        మామూలుగా  లెవెల్ కెమెరా యాంగిల్ పెడతారు.నియో నోయర్ లో ఎక్స్ ట్రీం హై
ఎక్స్ ట్రీం లో యాంగిల్స్ పెడతారు. సీనులో, పాత్రలో తీవ్రతని ప్రదర్శించడానికి.          

          5. టైట్ క్లోజప్స్ :  ఉద్రిక్తతని ఎలివేట్ చేయడానికి టైట్  క్లోజప్స్ తీస్తారు

          
6. కాంప్లెక్స్ షాట్స్ : 

       డబ్బు ఆదా చేయడానికి కాంప్లెక్స్ (సంకీర్ణ ) షాట్ కంపోజింగ్ చేస్తారు. పాత్రలన్నీ ఏకకాలంలో ఒకే షాట్లో వుండేలా చూస్తారు. త్రికోణంగా నిలబడి మాట్లాడుకునేట్టు షాట్స్ తీస్తారు. 

          7. కాంప్లెక్స్ మీసాన్సెన్ (
 mise-en-scène షాట్స్ : 

          టైట్ క్లోజప్ లో ఫర్నీచర్, వస్తు సామగ్రితో క్రిక్కిరిసివున్న గదిలో పాత్రని చూపిస్తారు,. దీనివల్ల ఆ పాత్ర పీకలదాకా ఇరుక్కుందనే ఫీలింగ్ ని ఎలివేట్ చేస్తారు. 

          8ఎసెమెట్రికల్ (Asymmetrical) కంపోజిషన్ :  ఒక పాత్ర రెండో పాత్రకి సమాన ఎత్తులో కన్పించకుండా అసమాన కంపోజిషన్ చేస్తారు.

           9బార్స్డయాగోనల్ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ :            పాత్రలు పరిస్థితులకి బందీలై నట్టు, కర్మఫలం అనుభవిస్తున్నట్టు ఫీల్ కలగడానికి ఈ షాట్స్ తీస్తారు


          10లాంగ్ ట్రాక్ షాట్స్ :  సీనులో టెన్షన్ పెంచడానికి కట్ చేయకుండా ఒకేలాంగ్ ట్రాక్ షాట్  తీస్తారు.

        11. అబ్ స్క్యూర్ (Obscure) సీన్స్ : సీను బ్యాక్ 
గ్రౌండ్ లో గానీ  ఫోర్ గ్రౌండ్లో గానీ పొగ , పొగ మంచుఆవిరి మొదలైన వాటితో అస్పష్టతా భావాన్ని, లేదా మిస్టీరియస్ ఫీలింగ్ ని కల్గిస్తారు. 

        12.  డచ్ యాంగిల్స్ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్ :
       అసహనం, మతిమాలిన తనం, సమన్వయ లోపం తెలియజేయడానికి డచ్ యాంగిల్స్ లో షాట్స్ తీస్తారు. అనుకున్నది బెడిసి కొట్టిం దనో, పాత్ర గతం ఛండాలమనో  తెలపడానికి ఇన్వర్టెడ్ (తలకిందుల) ఫ్రేమ్స్ లో చూపిస్తారు. 
          13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్ :   సైకలాజికల్ ఎఫెక్ట్ కోసం నీరు, నీటిలో ప్రతిబింబాలు చిత్రీకరిస్తారు.

          14.  మిర్రర్స్ :  ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మిర్రర్స్ ని వాడతారు. పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ అయినప్పుడు కూడా అద్దంలో చూపిస్తారు.
 

          
15. మోటిఫ్స్ ( మూలాంశాలు) : ఒకే వస్తువూ వివిధ సీన్లలో రిపీట్ అవడాన్ని మోటిఫ్ అంటారు.  రింగులు రింగులుగా సిగరెట్ పొగ వూదడం కూడా ఒకటి. సింబాలిజం కోసం వాడతారు. 

           ఇదీ- డార్క్ మూవీస్ సైన్స్. డార్క్ మూవీస్ లో షాట్స్ కూడా కథ చెప్పడానికి తోడ్పడతాయి. కెమెరా- కలం -పాత్ర మూడింటి డైమెన్షన్ తో  డార్క్ మూవీ నేరమయ ప్రపంచం కళాత్మకంగా ఆవిష్కారమౌతుంది. పై పదిహేను ఎలిమెంట్స్ ని అర్ధంజేసుకుని కథ కనుగుణంగా ఉపయోగించుకుంటే సీన్లు మ్యాజిక్ చేస్తాయి. ప్రేక్షకులకి సరికొత్త వీక్షణా నుభవం లభిస్తుంది. డార్క్ మూవీస్ బడ్జెట్ మూవీసే. డార్క్ మూవీస్ ని శాస్త్రీయంగా ఇలా తీస్తే బడ్జెట్ మూవీస్ సెగ్మెంట్ లో అద్భుతాలు చేస్తాయి. 




                  (బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ - లాంగ్ ట్రాక్  -అబ్ స్క్యూర్ - కాంప్లెక్స్ మీసాన్సెన్- ఇన్వర్టెడ్ – మిర్రర్స్)

          ఎలిమెంట్స్ గురించి ఈ వ్యాసం చదవడమే గాకుండా  వీలైనన్ని నియో నోయర్ మూవీస్ కూడా చూస్తే విషయం సుబోధకమౌతుంది. 

(next : కథనం)
-సికిందర్