Q: నితిన్ నటించిన ‘తమ్ముడు’ కథను ఎలా అర్ధం జేసుకోవాలి.
అది తమ్ముడి కథా, లేక అక్క కథా? తమ్ముడు దూరమైన అక్కను కలుసుకోవాలనే ఉద్దేశంతో
వుంటే, అక్కేమో ప్రభుత్వానికి గ్యాస్ లీక్
సంఘటనపై రిపోర్టు అందించే లక్ష్యంతో వుంటుంది. వీళ్ళలో ఎవరి ఆశయం గొప్పది? ఏ ఆశయం
చెప్పడానికి ఈ సినిమా తీశారు? దయచేసి వివరించగలరు.
−సి. రవీంద్ర బాబు
A : 2000లో జూలియా రాబర్ట్స్ ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు పొందిన
‘ఎరిన్ బ్రోకోవిచ్’ భూజలాలు కలుషితమై ప్రజలు తీవ్ర
వ్యాధుల బారిన పడే కథ. ఈ భారీ పర్యావరణ కాలుష్యానికి కారణమైన కార్పోరేట్ కంపెనీ నుంచి ప్రజలకి నష్టపరిహారం
ఇప్పించి తీరాలన్న ఆశయంతో జూలియా
రాబర్ట్స్ పోరాడుతుంది. ఈ కథ 1. సామాజిక
అన్యాయం, 2. కార్పొరేట్ దుష్ప్రవర్తన, 3.శక్తివంతమైన సంస్థల్ని సవాలు
చేసే సాధారణ స్త్రీ శక్తి మొదలైన థీమ్స్ ని
హైలైట్ చేస్తూ సాగుతుంది. పాత్రపరంగా ఒంటరి న్యాయవాది ఆమె. కుటుంబ పరంగా
సింగిల్ మదర్. జలకాలుష్యం బాధితుల బాధల్ని తీర్చే
ఆమె దృఢ సంకల్పం, అంకిత భావం ప్రేక్షకుల నుంచి బలమైన సానుభూతిని, భావోద్వేగాల్ని
రాబట్టుకుంటుంది.
ఐతే ఇక్కడ ‘తమ్ముడు’ లో లాంటి తిరకాసు వుంది. జులియా పాత్రకి రెండు ముఖా లుంటాయి. వృత్తిగత ముఖం, వ్యక్తిగత ముఖం. వృత్తిగత ముఖంతో సామాజిక పోరాటం, వ్యక్తిగత ముఖంతో రిలేషన్ షిప్ సమస్య. ఈ ద్వంద్వ పాత్ర చాపాలు (డ్యుయల్ క్యారక్టర్ ఆర్క్స్) కథనాన్ని కన్ఫ్యూజ్ చేయవు. ఎందుకంటే మొదటిది ప్రధాన కథగా, రెండోది ఉప కథగా సర్దుకున్నాయి కాబట్టి. అంటే వ్యక్తిగత లక్ష్యమైన రిలేషన్ షిప్ కి రెండో స్థానమిచ్చి సబ్ ప్లాట్ కి పరిమితం చేశారు. వృత్తిగత లక్ష్యమైన సామాజిక పోరాటానికి మొదటి స్థానమిచ్చి (మెయిన్ ప్లాట్) ప్రధాన కథగా నడిపారు. కనుక ఈ సినిమా కథ దేని గురించి అన్న దాని పట్ల కన్ఫ్యూజన్ లేదు.
తమ్ముడు’ లో గ్యాస్ లీక్ బాధితులకి న్యాయం చేసే విధంగా కంపెనీని ఎదిరించి రిపోర్టు అందించే వృత్తిగత ఆశయంతో ప్రభుత్వాధికారిగా అక్క పాత్రలో లయ వుంటే, తన చిన్నప్పుడు చేసిన తప్పు వల్ల దూరమైన అక్కని కలుసుకోవాలన్న వ్యక్తిగత ఆశయంతో తమ్ముడి పాత్రలో నితిన్ వున్నాడు. అంటే పైన చెప్పుకున్న డ్యుయల్ క్యారక్టర్ ఆర్క్స్ ఇక్కడ ఇద్దరికీ విడివిడిగా వున్నాయి. అక్కకి సమాజం కోసం వృత్తిగత ఆశయం, తమ్ముడికి తన కోసం వ్యక్తిగత ఆశయం. సమాజం కోసం ఆశయం గొప్పదా, తన కోసం ఆశయం గొప్పదా? ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ?
ఎరిన్ బ్రోకోవిచ్’ లో వున్నట్టు ఈ కథ 1. సామాజిక అన్యాయం, 2. కార్పొరేట్ దుష్ప్రవర్తన, 3.శక్తివంతమైన సంస్థల్ని సవాలు చేసే సాధారణ స్త్రీ శక్తి మొదలైన థీమ్స్ ని హైలైట్ చేస్తూ సాగిందా? గ్యాస్ లీక్ బాధితుల బాధల్ని తీరుస్తూ ప్రేక్షకుల నుంచి బలమైన సానుభూతిని, భావోద్వేగాల్ని రాబట్టుకునే దృఢ సంకల్పం, అంకితభావం అక్క పాత్రకున్నాయా?
సబ్ ప్లాట్ గా ఉండాల్సిన తమ్ముడి ఆశయం మెయిన్ ప్లాట్
గా మారి, మెయిన్ ప్లాట్ గా వుండాల్సిన అక్క ఆశయం అసలు అడ్రసే లేకుండా పోయాక ఇది ఏ
కథ అనేది ఎలా చెప్పాలి?
Q: ఒక కథను "సంక్లిష్టమైనది" అని ఎప్పుడు
భావించ వచ్చు? సంక్లిష్టత అంటే ఏమిటి? సంక్లిష్టమైన కథలను
ఎలా రాయాలో మనం ఎలా నేర్చుకోవచ్చు? అలాగే సంక్లిష్టమైన
కథకు, సంకీర్ణ కథకు మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటిలో దేన్ని
తీసుకోవాలి?
−పిఎస్. రామకృష్ణ
A: ఏ రచయితయినా ముందు చేయాల్సిన పని సింప్లిసిటీని
గౌరవించడం. సంక్లిష్ట కథని కూడా సింప్లిసిటీతో చెప్తే
అర్ధమయ్యేట్టు వుంటుంది. లేకపోతే గందరగోళమవుతుంది. సంక్లిష్ట కథ అంటే - అన్ని నదులూ సముద్రానికి
దారితీయడం లాంటిది. సంకీర్ణ కథ అనేక విభిన్నసముద్రాలకి దారితీసే అనేక నదుల్లాంటిది.
దీన్ని చిన్న చిన్న కథలతో కూడిన ఆంథాలజీల్లో
చూడొచ్చు. ఇందులో అనేక పాత్రల కథలు వేర్వేరు ముగింపులకి చేరుకుంటాయి. సంక్లిష్ట
కథల్లో అనేక పాత్రలు ఒకే ముగింపుకి చేరుకుంటాయి. ఇదీ తేడా. సంక్లిష్ట కథ ఒకే పెద్ద
కథగా వుంతే, సంకీర్ణ కథ చిన్నచిన్న కథల సముదాయంగా వుంటుంది.
సంక్లిష్ట కథ అంటే ఏమిటో ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే అనేక పాత్రలు, వాటి ఫ్లాష్ బ్యాకులు, సమస్యలు, సంఘర్షణలు, లక్ష్యాలూ మొదలైన వాటితో కూడిన వివరణాత్మక కథనం. అయినప్పటికీ ఈ పాత్రలన్నీ ఒకే కాన్సెప్ట్ కి లోబడి, ఒక ప్రధాన పాత్ర చుట్టూ అల్లుకుని, ఒకే ప్లాట్ లైన్ లో వుంటాయి. అంటే స్ట్రక్చరల్ బీట్స్ అన్నీ వేర్వేరు విషయాలతో కూడిన ప్లాట్ పాయింట్స్ తో వుండవు. కథ మొదటి ప్లాట్ పాయింట్ లో ప్రత్యర్ధితో సంఘర్షణ, మిడ్ పాయింట్ లో రోమాంటిక్ సబ్ ప్లాట్ కి ట్విస్టు, అలాగే ప్లాట్ పాయింట్ టూ లో ఏదో సహాయ పాత్ర సమస్యకి మలుపూ రాసుకుంటూ పొతే సంక్లిష్ట కథ కాస్తా గందరగోళ కథ అవుతుంది.
A : హాయ్ అండి, నమస్తే. బాగానే వున్నాను. అది ప్రయోగాత్మకంగా రాసిన వ్యాసం. స్పిరిచ్యువాలిటీ ప్రకారం చూసినా ఎల్లప్పుడూ ఆనందంగా గడిపితే మన వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీలో వుంటాయి. హై ఫ్రీక్వెన్సీ తో వున్న వైబ్రేషన్స్, విశ్వ వ్యాప్తంగా పరచుకుని వున్న ఎనర్జీ (మిరకిల్ యూనివర్సల్ సబ్ స్టెన్స్) తో కనెక్ట్ అవుతాయి. అప్పుడు మన ఫ్రీక్వెన్సీతో వున్న వ్యక్తులు కనెక్ట్ అయి మనం కోరుకున్నవి జరుగుతాయి. అదే విచారంతో వుంటే ఫ్రీక్వెన్సీ పడిపోయి విశ్వంతో కనెక్ట్ కాం కాబట్టి మరింత విచారమే మనకి దక్కుతుంది
పాసివ్ క్యారక్టర్ ని తప్పకుండా యాక్టివ్ క్యారక్టర్ గా మార్చుకోవాలల్సిందే. ఈ రోజే సోమర్సెట్ మామ్ మీద ఒక ఆర్టికల్ కన్పించింది. ఆయన రాసే ప్రాజ్ లో పాసివ్ వాయిస్ వుండదని అందులో వుంది. ఉదాహరణకి, మన రాయకూడని ‘బడు’ భాషలో చెప్పుకుంటే, ‘ఆ పులి చంపబడెను’ అని మామ్ రాయడు. ‘అతను పులిని చంపాడు’ అని రాస్తాడు. ప్రింట్ మీడియా అయిన కథల్లో నవలల్లో ఆయనే పాసివ్ నెస్ ని తిరస్కరిస్తే, విజువల్ మీడియా అయిన సినిమాల్లో మనమెంత తిరస్కరించాలి.
దీనికి రిప్లయ్ కూడా ఇచ్చారు : Thank you sir, అవును మీరు చెప్పింది correct యే.. అర్జున్ రెడ్డి, సాగర సంగమం లలో flash back episodes లో మంచి energy ఉంటుంది.. climax ఒకటి paoetic గా ఉంటే మరొకటి hero zero ego state కు వచ్చి calm down అయ్యి ఉంటుంది.. got it sir.. thnk you so much.