రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 25, 2018

708 : స్క్రీన్ ప్లే సంగతులు           మీరు కథ వేరు, గాథ వేరు అని చాలా సార్లు రివ్యూలలో రాస్తున్నారు. అంటే ఏమిటి? వాటినెలా గుర్తించాలి ? గాథలు ఎందుకు సినిమాలకి పనికిరావు?
           
వి. సూత్య కాంత్, స్ట్రగ్లింగ్ రచయిత, Q&A నుంచి
         
సినాప్సిస్  రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్ (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు. జక్కన్నలో  చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి  ఐడియా అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్ కన్పిస్తోందా?  బిగినింగ్  -మిడిల్- ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది జక్కన్నే చెప్పాలి.  
‘జక్కన్న’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి
         
ఒక్క నాల్గు పేజీల సినాప్సిస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  సహితంగా రాసుకుంటే తప్పులన్నీ  తెలిసిపోతాయి. వాటిని సరిదిద్దుకోవడం ఇక్కడే ఈజీ, సవ్యమైన సినాప్సిస్ వచ్చేదాకా. సినాప్సిస్ నస పెడుతోందంటే సినిమా ఎన్ని  ఆటలేసినా కష్టపెట్టకుండా వుండదు. ఆటలు పడే కొద్దీ  తప్పులన్నీ ఒకటొకటే తొలగిపోయి, సినిమా తేటపడే టెక్నాలజీ ఏమీ ఇంకా రాలేదు.  
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ స్క్రీన్ ప్లే సంగతులులోంచి 

      స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. దృశ్యపరంగా చూసేందుకు కథలే బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర జడ్జ్ మెంట్ నిస్తుంది.  గాథ లో సమస్య వున్నా పాత్ర దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఫలానా సమస్యతో  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యామోచ్ అనేసి స్టేట్ మెంట్ పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది.
ఓకే బంగారం’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి 

      ‘మొగుడు’  నిజంగానే హిందూ వివాహ వ్యవస్థ మీద తీసిన ఉదాత్త సినిమాయేనా? పెళ్లి వ్యవస్థ మీద సినిమా తీస్తున్నామని భావించుకుంటూ వేరే బాట పట్టిపోయిన క్రియేషనే ఇది ... వరకట్నంవిడాకులువేరుకాపురాలూ  లాంటి సమస్యల్లాగే పెట్టిపోతల దగ్గరకుటుంబ ఆచారాల దగ్గరాపెళ్లి తంతులోనూ వచ్చేతేడాలుంటాయి. ఇలాటి ఒక తేడా గురించి తీసిన సినిమా మాత్రమే మొగుడు’. దీనికి పెళ్లి వ్యవస్థతో ఎలాటి సంబంధమూ లేదు...రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గురించి సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు- ఏది తప్పు ఏది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల  పరిశీలనార్ధం కృష్ణ వంశీ  ఎక్కు పెట్టినట్టేఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగిపోయి వుంటేఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి వుండేదిఇలా కాకుండా ఆర్గ్యుమెంట్ ని (సైద్ధాంతిక విభేదాల్నిహింసాత్మక చర్యలకి దారితీయించినానా బీభత్సం సృష్టించడంతోదీన్నాపే మరో చర్యగా చివరాఖరికి గోపీచంద్ భోరున ఏడుస్తూ చెప్పుకునే గాథలా తయారయ్యింది సినిమా. కథ’  అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథనిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అనేసి ఉత్త స్టేట్ మెంట్ మాత్రంగా ఇచ్చేసి వదిలేస్తుంది తేడా గుర్తించడం అవసరం. ఆర్గ్యుమెంట్ సహిత కథలేసినిమాలకి పనికోస్తాయే గానీస్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే గాథలుకాదు.
’పైసా’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి  

       అసలు సినిమాకి కథ చేశారా, గాథ చేశారాని పెద్ద సందేహం,  కథే చేసివుంటే ప్లాట్ పాయింట్స్ కన్పించాలి. మొదటి ప్లాట్ పాయింట్లో సంఘర్షణ పుట్టి మిడిల్ లో పడాలి కథ. మిడిల్లో పడి మరింత సంఘర్షణాత్మకం అవాలి కథ. రెండో ప్లాట్ పాయింట్లో సంఘర్షణకి సమాధానం దొరికి ఎండ్ లో పడాలి కథ. చాలా సింపుల్...ఇదంతా చూస్తూంటే స్ట్రక్చర్ వుండని గాథలా వుంటుంది. కమర్షియల్ సినిమాకి పనికి రాని ప్రక్రియ గాథ. కమర్షియల్ సినిమాలకి కథలే వుండాలని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. కథంటే ఆర్గ్యుమెంట్. హీరోకీ విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ వాదాలు చెలరేగుతాయి.  ఎవరికి  వాళ్ళు తమ వాదాన్ని గెలిపించుకోవడానికి పోరాటం మొదలెడతారు. చివరికి ఎవరి వాదం కరెక్టో జడ్జిమెంట్ ఇస్తుంది కథ.  గాథ ఇలాకాదు. ఇది స్టేట్ మెంట్ మాత్రంగా వుంటుంది. నేనిలా చేస్తే, నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ  నా కథా అని స్టేట్ మెంట్ మాత్రమేఇచ్చుకునేదిగా వుంటుంది. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుందిగాథ స్టేట్ మెంట్ నిస్తుందిఅనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగిందిహాస్పిటల్లో చేరాడుకాలు ఫ్రాక్చరైందని తేల్చారుతిరిగి నడవాలంటే కొన్ని నెలలుపడుతుందని చెప్పారుకొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడుఇది గాథఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగానే వుండిపోతుంది
ఇలాగే వుంటుందిఈ మూడోసర్కార్  కథనంఅనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగిందిహాస్పిటల్లో చేరాడు వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని  పట్టుబట్టాడుకోర్టులో కేసు వేశారుఅనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడువాహనదారుడిదే తప్పని తేలిందిఅనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించిందిఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోందిఇలావుండదు మూడో సర్కార్ కథనం.పైనచెప్పుకున్న స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందోఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథఅంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోందిఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీగాథలు కాదుఇంకోటి గమనిస్తే గాథకిస్ట్రక్చర్  వుండదుకథకే వుంటుందిసినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండిసాగి సాగి  బిగినింగ్ తోనేముగుస్తుంది
         ఈ మూడో సర్కార్ ఇలాగే వుంటుంది. అందుకని సినిమాకి పనికి రాదుకథ కి బిగినింగ్ తో బాటు మిడిల్ఎండ్ కూడావుండి  సంతృప్తికరంగా ముగుస్తుందిగాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు- మూడో సర్కార్ కీ లేవు. కథకి వుంటాయిగాథకి క్యారక్టర్ఆర్క్ వుండదుఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుందిమూడో సర్కార్ ఇంతే. కథకి క్యారెక్టర్ ఆర్క్ తో పాత్రఉద్విగ్నభరితంగా వుంటుందిగాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదుకథనం నేలబారుగా సాగుతూ వుంటుందిదీన్ని మూడో సర్కార్ లో గమనించవచ్చు. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుందికథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుందిగాథలో ఇవి వుండవు- మూడో సర్కారే ఉదాహరణ.
          గాథలో సంఘర్షణ వుండదు- మూడో సర్కార్ లోనూ లేదు. సంఘర్షణ లేనిది కథ వుండదుగాథకి ప్రతినాయక పాత్రవుండదు- మూడో సర్కార్లో వున్నా లేనట్టే వున్నారు. కథకి ప్రతినాయక పాత్ర కీలకంగాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి- ఆర్ట్ సినిమా లాంటిదే  మూడోసర్కార్గాథ.  కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి.  గాథతో జరిగే మోసమేమిటంటేఅది గాథ అని చాలాసేపటి వరకూ తెలీదుఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాంఎంతకీ రాదువిశ్రాంతి వచ్చేస్తుంది.అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడుతెలుస్తుంది మోసంమోసపోయామే అని లేచిపోవడమో, లేక ఏంచేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాంసర్కార్ తోనూ ఇదే అనుభవం. కాకపోతే ప్రారంభంలో చూపించింది ప్లాట్ పాయింట్ వన్ అని మోసపోయాం.

         
చేస్తున్నది కథలనుకుని  గాథలు రాసుకుంటూ తీసినవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి- కృష్ణ వంశీ మొగుడు’, ‘పైసా’; శర్వానంద్ రాజాధిరాజా’, మహేష్ బాబు బ్రహ్మోత్సవం’, సునీల్ జక్కన్న’  సుధీర్ బాబు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, విజయ్ దేవరకొండ ద్వారక’ ...చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి.
‘సర్కార్ -3’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి

         కమర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని పరిష్కరిస్తేనే కథ, లేకపోతే ప్రేక్షకులకి వ్యధ. కమర్షియల్ సినిమా కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆర్గ్యుమెంట్ లేకుంటే అవి కథలు కావు, గాథ లవుతాయి. సమస్య వల్ల ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఆర్గ్యుమెంట్ సమస్యని పరిష్కరిస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా కథలు సమస్యల్ని పరిష్కరించే దృష్టితో వుంటాయి. సమస్య ఆర్గ్యుమెంట్ పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథల  లక్షణం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు సంఘర్షించుకోవడమే.  అందుకే సమస్య సంఘర్షణ పరిష్కారం అని మౌలికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని  లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల  కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, దగ్గర్లోని   చెత్తకుండీలో ఇంత  చోటు చూసుకుని హాయిగా విశ్రమించడం తప్ప. ఇక్కడ సినిమా కథంటే  సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే నొక్కి చెప్పడ మెందుకని సందేహం రావచ్చు.  అసలు సమస్యంతా ఇక్కడే వుంది.  కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీసేస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక.   బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో  చెప్పుకున్నాం స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని!  ప్పుడు కూడా కావాలంటే ఈవారం, గతవారం విడుదలైన రెండు పెద్ద సినిమాలు చూడొచ్చు.  కాకపోతే కొన్నిసార్లివి బిగ్ నేమ్స్ వల్ల ఆడేస్తాయి.          ఆర్గ్యుమెంట్ లేని కథలు ఆర్ట్ సినిమా గాథలు... కథకీ గాథకీ తేడా ఏమిటంటే, కథ సమస్యని పరిష్కరించే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది (స్టేట్ మెంట్).  అంటే గాథలు సమస్య గురించి వాపోతూ స్టేట్ మెంట్ ఇచ్చే మాత్రంగా వుంటే, కథలు సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి.  ఇందుకే గాథలు చప్పగా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు నిచ్చే హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, సంఘర్షణా జడ్జిమెంటూ వుండని చప్పటి గాథలుకాదు. కథల్లో యాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే సమస్యకి ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథల్లో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాలు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ప్రయోజనమూ వుండదు. పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. తేడా తెలుసుకోకుండా కథా రచన చేపడుతున్నారు కాబట్టి సినిమాల్లో  కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం పదుల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నేమ్స్ ని ఆసరా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వుంటాయి. ప్రేక్షకులు అసలీ నోట్లిచ్చుకుని నకిలీ సినిమాలు ఏంచక్కా  చూస్తూనే వుంటారు. 
 
’ప్లాట్ పాయింటా? ఫ్లాప్ పాయింటా?’ నుంచి 

       రాజుగారి గదితీసిన దర్శకుడు  ఓంకార్ మలయాళ రీమేక్ ని  విషయంతో సంబంధం లేకుండా రాజుగారి గది -2టైటిల్ తో విడుదల చేశారు. పైన చెప్పుకున్నట్టు భావోద్వేగాల చింతనే తప్ప చివరికి ఏం  తేల్చామనే విషయం పట్టించుకోలేదు. ఇందుకే దీనికో స్క్రీన్ ప్లే లేకుండా పోయింది. గాథలకి స్ట్రక్చర్ వుండదు. అందుకనే ఫస్టాఫ్ లో గాథ మొదలవలేదు. కథయితే మొదలై వుండేదేమో. ఫస్టాఫ్ దెయ్యం కామెడీలతో గడిపేశారు. 40 నిమిషంలో నాగార్జున పాత్ర వచ్చినా దాని పరిచయ ఎపిసోడ్ ఒకటి సాగి, ఇంటర్వెల్ లో సమంతా ఆత్మకి  ఎదురుకావడంతో అర్ధోక్తిలో ఆగుతుంది.

         
సెకండాఫ్ ఇరవయ్యో నిమిషం లో అసలు గాథే మిటో తెలుస్తుంది సమంతా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో.  ఇక గాథ మొదలవుతుంది. ఇదే కథ అయి ఇప్పుడు ప్రారంభమై వుంటే,  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యేది. గాథ కావడం వల్ల సంఘర్షణ లేదు. సంఘర్షణ లేకపోతే కథ అవదు. ఇక్కడ గాథతో ఇంకోటేం జరిగిందంటే, ఎండ్ సస్పెన్స్ బారిన పడింది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత దాదాపు ముగింపు వరకూ వీడియో ఎవరు తీశారనే దర్యాప్తు తోనే సాగుతుంది. వీడియో తీసిన పాత్ర చిట్టచివర్లో తెలిసి పాత్ర కూడా డిఫెన్స్ లో పడడంతో సంఘర్షణకి తావే లేకుండా పోయింది. ఇక నాగార్జున కౌన్సెలింగ్ మొదలవుతుంది.

         
మహేష్ భట్ రాజ్’  కోవలో కథ చేసి ఓంకార్ దీన్ని పవర్ఫుల్ గా నిలబెట్టాల్సింది. అప్పుడు థ్రిల్, హార్రర్, సస్పెన్స్, అన్ని ఎమోషన్సూ కలగలిసి సమస్యతో సంఘర్షణతో, ఆర్గ్యుమెంట్ తో ఒక సమగ్ర కథ ఆవిష్కరణయేది. 
‘రాజుగారి గది’ రివ్యూ నుంచి  

     గాథ కాబట్టి, పాత్రలే తప్ప ప్రధాన పాత్ర వుండదు కాబట్టిస్ట్రక్చర్ ని ఆశించకూడదు. దాదాపు ప్రతీ రెండో తెలుగు సినిమా ఇంకా చాదస్తంగానే చిన్నప్పట్నుంచీ కథనెత్తుకుని అచ్చిబుచ్చి కబుర్లతో స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కి చిన్నప్పటి కథలు ఎవరికి ఆసక్తికరం. తీరుబడిగా కూర్చుని సినిమాలు చూసే రోజులా? నేరుగా హీరోలనే చూపించేసి, వాళ్ళెంత గాఢమైనస్నేహితులో రెండు ముక్కల్లో చెప్పేస్తే అయిపోతుంది.  ఇక్కడ చూపించిన చిన్నప్పటి సీన్లు మరీ సిల్లీగా వున్నాయి. ఇదంతా స్క్రీన్ టైంని వృధా చేయడమే. మాట కొస్తే హీరోలు పెద్దయ్యాక కూడా అరగంట వరకూ పాయింటే వుండదు గాథ నడిచేందుకు. హీరోయిన్ వచ్చాక వుంటుందనుకుంటే, ఆమెతో కూడా ఒకదానితో ఒకటి సంబంధంలేని అతుకుల బొంత సీన్లు.  కేవలం ఇంటర్వెల్ దగ్గర కాస్త గాథ పెట్టుకుని ముగించేసే తేలిక పనితో సీన్ల పేర్పుడు కార్యక్రమం పెట్టుకున్నట్టుంది.  తెలుగు సినిమా తీయడం ఇంత ఈజీ అయిపోయిందా చిన్న పిల్లాడు కూడా తీసేయగలడు కదూ?

          ఇక ఇంటర్వెల్ ముందు పది నిమిషాల్లో నాల్గు మలుపు లొస్తాయి.  మలుపువచ్చినప్పుడల్లా ఇదే ఇంటర్వెల్ అనుకుంటాం.  గంటన్నర గడుస్తున్నా ఇంటర్వెల్లే రాదు. డిటో సెకండాఫ్ ముగింపు వరకూ. మళ్ళీ ముగింపులో, సడెన్ గావచ్చే  ముగింపుకి పనికొచ్చే నాల్గు సీన్లు  తప్ప,  మిగతావి సహనపరీక్ష పెట్టే  అతుకుల బొంత సీన్లే. అసలేం మ్యాటర్చూస్తున్నామో అర్ధం గానట్టు వుంటాయి. 

         
కొన్ని సిట్టింగ్స్ లో,  ప్రేమిస్తోందో లేదో తెలీని హీరోయిన్ కి హీరో తన ప్రేమ ఎలా వెల్లడించాలన్న దాని మీద హోరాహోరీ పోరాటాలు జరుగుతున్నాయి. నిజంగానే అది చాలా కష్టమైన పని పాత్రల్ని సరైన తీరులో దృష్టిలో పెట్టుకుంటే. కానీ గాథలో ఒకరు కాదు ఇద్దరు హీరోలు వచ్చేసి,  హీరోయిన్ కి తమ ప్రేమల్ని చెప్పేస్తారు కాఫీ ఇప్పించినంత ఈజీగా ఆమె మనసేమిటో తెలుసుకోకుండానే!
ఉన్నది ఒక్కటే జిందగీ’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి 

         సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు.  కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది సినిమాలు చూడలేక.  స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు.  ఎందుకంటే దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. లెక్కన కొంత కాలం పోయాక షార్ట్ ఫిలిం చూసి టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు. 

         
కమర్షియల్ గా కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణిగణరాజ్యాల్ని  ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. రయీస్కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ.  గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి. 
‘రయీస్’ రివ్యూ నుంచి 

       కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి.  ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో  బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు  కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు. ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు.  కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. 

         
కథకీ-  గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి.  ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీ  ‘గాథలు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానోగాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు.  సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. 

         
దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది.  దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది.  గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే  కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటైదాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ  అనేది తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసిచిట్ట చివర జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు సంఘర్షించకఆర్గ్యుమెంట్ ఎత్తుకోకజడ్జ్ మెంటూ  ఇవ్వక-  కేవలం ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగిచివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ  దారిన తాము వెళ్ళిపోతాయి. 

          ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు.  అది కథయితేనే వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల  సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి  బిగినింగ్ మాత్రమే వుండిఅదే సాగి సాగి   బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్ఎండ్ లనే మూడంకాలుండి, ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి.  

         
ఇంకా చెప్పుకుంటే,  గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి.  గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది.  ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట.  ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి  పడేస్తూ పోతుంది.

         
గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు.గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు.  కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ. 

         
గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న  ఉత్త ఆర్ట్ సినిమాలే నని పదేపదే చెప్పుకున్నాం).

         
మరింకా చెప్పుకుంటే, ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి -   తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం పిడుగో  పడి చావడంతో ముగియదు.  గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదుఅది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.. పలాయనం చిత్తగించేదే గాథల్లో  కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగాపరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి.

         
ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు.

         
 పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న  బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని,  మరొక్క సారి వీటన్నిటినీ  పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న కథకుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ  గాథకి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు.
జనతా గ్యారేజ్’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి

                            Story versus Tale
     A story seeks to make an argument, a tale does not. A tale describes a problem and the attempt to solve it, ultimately leading to success or failure in the attempt. In contrast, a story makes the argument that out of all the approaches that might be tried, the Main Character's approach uniquely leads to success or failure. In a success scenario, the story acts as a message promoting the approach exclusively; in the failure scenario, the story acts as a message exclusively against that specific approach. Tales are useful in showing that a particular approach is or is not a good one. Stories are useful in promoting that a particular approach is the only good one or the only bad one. As a result of these differences, tales are frequently not as complex as stories and tend to be more straightforward with fewer subplots and thematic expansions. Both tales and stories are valid and useful structures, depending upon the intent of the author to either illustrate how a problem was solved with a tale or to argue how to solve a specific kind of problem with a story.

‘డ్రమెటికా – ది న్యూ థియరీ ఆఫ్ స్టోరీ’ నుంచి


       పైవన్నీ చూశాక,  కథ - గాథ ఈ రెండిటితో చాలా గందరగోళం చేసి పడేస్తున్నారని అర్ధమైపోయే వుంటుంది. సినిమాలుగా తీస్తున్నవన్నీ కథలే అనుకుని, తీరా గాథలు తీస్తున్నామని తెలీకపోవడంతో ఈ గందరగోళం, దీని తాలూకు అందమైన అట్టర్ ఫ్లాపులు. చాలా మందికి గాథ అన్న పదమే తెలీదు. ఈ ప్రపంచంలో కథ అనే పదార్ధమొక్కటే వుంటుందనుకుంటారు. ఆ కథా లక్షణాలేమిటో కూడా తెలీవు. ఇలా కూడా అట్టర్ ఫ్లాపులు  తీస్తున్నారు. మొత్తం సీను ఇలాగే భయానకంగా ఏళ్ల కేళ్ళు  కొనసాగుతూ వస్తోంది. దీన్ని సరిదిద్దాలంటే ముందుగా ఏ బ్యానర్ కా బ్యానర్ వచ్చే కథలకి రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘రా’) లాంటిది ఏర్పాటుచేసుకుని,  కాకమ్మ కథల్ని కమర్షియల్ కథలుగా మార్చిపారేసే  గూఢచారుల్ని నియమించుకోవాలి. కానీ దీన్నీ అడ్డుకునే చేతులొచ్చి పడతాయి- ‘నా స్క్రిప్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వెవరు?’ అని రక్కినా రక్కేస్తాయి. కళా ప్రపంచమంటేనే ఇగో సెంట్రిక్. ఈ సినిమాలెలా పోతే మనకెందుకని వూరుకోవడమే. కానీ ఈ బ్లాగు నింపడానికి ఏదోవొక టాపిక్ వెతుక్కోవాలి. బ్లాగు నింపడానికే రాయడం తప్ప దేన్నో ఉద్ధరించడానికి కాదు. 

       కథంటే ఏమిటో తెలీదు, గాథంటే  ఏమిటో తెలీదు. కథ అనుకుంటూ గాథ తీసేస్తారు. సినిమాని సినిమా లాగే చూడాలన్న పనికి రాని డిఫెన్స్ ఒకటుంటుంది. ముందు కథని కథలాగా తీయవయ్యా బాబూ, కథలాగా తీయ్  – అని మొట్టికాయేసే ఆర్డినెన్స్ రావాలి. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు కల్లు ముంతల్లా తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో కనువిప్పయితే కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ  ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ – పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. 

          ఈ కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని  కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి పారేస్తే గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి. 

        ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం.   ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. 

          ‘పెదరాయుడు’ ఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. ఇదెలా గాథ అయిందో వచ్చే వ్యాసంలో చూద్దాం...

సికిందర్