రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, October 23, 2025

1337 : స్పెషల్ ఆర్టికల్

ర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఓ ఏలో  భాగంగా యోగ్యత (క్వాలిఫికేషన్) గురించి తెలుసుకున్నాం. ఈవారం లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్), విశ్వాసం (బిలీఫ్), ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్),  కార్యాచరణ (యాక్షన్) ల గురింఛి వరుసగా తెలుసుకుందాం… దర్శకుడవ్వాలనేది గోల్ అనుకుంటే ఆ గోల్ కల కాకూడదు. గోల్ కి యాక్షన్ వుంటుంది, డెడ్ లైన్ వుంటుంది. కలకి ఈ రెండూ వుండవు. కలలు గంటూ కూర్చుంటే ఏమీ జరగదు. కలల్ని  గోల్ గా మార్చుకుంటేనే  ఏదైనా సాధించ గల్గేది.దర్శకుడవ్వాలని గోల్ పెట్టుకోవడమంటే దానికి డిసెంబర్ 2025 అనో, ఇంకోటనో ఒక డెడ్  లైన్ పెట్టుకోవడమన్న మాట.  డెడ్ లైన్ తో బాటు మరికొన్ని స్పష్టతల్నివ్వాలి. ఎంత బడ్జెట్ సినిమా కావాలి- రెండు కోట్లా, మూడు కోట్లా, అయిదు కోట్లా…పది, ఇరవై, యాభై…ఎన్ని కోట్లు అన్నది స్పష్టంగా పేర్కొనాలి. బాగా డబ్బు కావాలన్నా ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోగా కావాలి తెలియాలన్నట్టు ఇది కూడా ఇంతే. గోల్ ని మనసులో అనుకోవడం  కాకుండా రాయాలి. డిజిటల్ గా టైపు చేసుకోవడం గాక, ఎల్లో పేజీలున్న నోట్ బుక్ లో పెద్ద పెద్ద అక్షరాలతో గ్రీన్ పెన్నుతో స్వయంగా రాయాలి. ఇదంతా మన సబ్ కాన్షస్ మైండ్ గ్రహించడానికి. గోల్ ఎంత స్పష్టంగా, రంగులతో ఆకర్షణీయంగా వుంటే అంత ఇంప్రెస్ అయి వేగంగా కదిలి విశ్వానికి వైబ్రేషన్స్ పంపిస్తుంది.

క్కడొక ప్రశ్నవస్తుంది- దర్శకత్వ  అవకాశాల కోసం గోల్ ని సెట్ చేసుకోవడం ఓకే, కానీ అసలు దేని ఆదారంగా గోల్ ని సెట్ చేయడం? ఒక బడ్జెట్, ఒక డేట్ వుంటే సరిపోతుందా? ఆ బడ్జెట్ దేని ఆధారంగా తయారయింది? ఆ స్క్రిప్టు రెడీగా వుందా? ఇదీ ప్రశ్న. ఈ ప్రశ్న దగ్గరే చాలా మంది చేతులెత్తేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్క్రిప్టు వుండదు, కథ తాలూకు ఏవో నాల్గు పేజీలు జేబులో పెట్టుకుని ప్రయత్నిస్తూంటారు. ఇది గోల్ పట్ల బద్ధకమే గానీ నిబద్ధత కాదు. ఇలా పని జరుగదా అంటే జరగవచ్చు, అదెప్పుడు జరుగుతుందో తెలీదు. డెడ్ లైన్లు పనిచెయ్యవు. ఎల్ ఓ ఏ తో ఒక డెడ్ లైన్ లోగా సాధించాలంటే మాత్రం ఆకర్షణ నియమాల్ని పూర్తిగా పాటించాల్సిందే. దీనికి కూడా కొన్ని ఆటంకాలేర్పడొచ్చు. అయితే ఎల్ ఓ ఏ వల్ల పూర్తిగా విశ్వాన్ని నమ్మే మైండ్ సెట్ వచ్చేస్తుంది కాబట్టి,  ఆ  విశ్వానికి సరెండరై పోతాం కాబట్టి- అవి ఆటంకాలన్పించవు. విశ్వం ఇంకేదో మంచి అవకాశం అందిద్దామని ప్రయత్నిస్తున్నట్టు ఆత్మ విశ్వాసమేర్పడుతుంది. 

విశ్వాన్ని నమ్మాక అదెవరికీ అన్యాయం చేయదు- ఇతడికి కులం వుందా, మతం వుందా, ప్రాంతం వుందా, కనెక్షన్స్ వున్నాయా. పేదోడా ఉన్నోడా, ఆడా మగా ఏదీ చూడదు. ఈ ఎవేర్ నెస్ చాలా ధైర్యాన్నిస్తోంది కదూ? విశ్వం దృష్టిలో అందరూ సమానమే. విశ్వం అందర్నీ సమానంగా చూసే మనుషులతో మనం కక్షలూ వివక్షలూ పెంచుకుని ఏం చేస్తున్నాం? ఆ విశ్వానికి దూరమవుతున్నాం. ఇవేవీ కాకుండా విశ్వం గోల్ క్వాలిటీని బట్టి ఫలితాల క్వాలిటీని నిర్ణయిస్తుంది. గోల్ ఎలిమెంట్స్ చవకబారుగా వున్నాయా ఈసురోమంటూ చవకబారు అవకాశాలు,  ఉత్తమంగా వున్నాయా  హుషారుగా ఉత్తమావకాశాలూ అందేలా చూస్తుంది. ప్రకృతిని సాంఖ్య శాస్త్రం ఇలా వివరిస్తుంది : ప్ర -అంటే విశ్వంలో ఆల్రెడీ పదార్థం వుంది. దానికి కృతి చేసే చేతులు కావాలి. అంటే ఏం సాధించాలన్నా ప్రకృతిలో కొదవ లేకుండా వుంది-జస్ట్ దానికి కృతి చేసే చేతులే కావాలి. రారా నాయనా, నా దగ్గర సినిమా అనే ముడి పదార్థముంది, దానికి దర్శకత్నం చేసే చేతుల కోసం చూస్తున్నా, రా- నువ్వొచ్చి చేసుకుని  నా వైభవం ప్రపంచానికి చూపించూ- అని ఎదురు తెన్నులు కాస్తోంది విశ్వం! ఇంతకంటే వివరించి చెప్పాలా ఆకర్షణ నియమం? 

క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే విషయం చెప్తోంది డబుల్ స్లిట్ ఎక్స్ పెరిమెంటుతో.  గత వారం ఫిజిక్స్ లో నోబెల్ సాధించిన ముగ్గురు శాస్త్రవేత్తలైతే ఇంకో విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు- అది క్వాంటమ్ టన్నెలింగ్ అనేది. దీన్ని మనమిక్కడ వర్తింప జేసుకుంటే దర్శకత్వ అవకాశాల గోల్ మరింత సూటిగా, స్పీడుగా పూర్తయి పోతుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. దీని అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం దీని గురించి ఎన్ ఎల్పీ ఎక్స్ పర్ట్ రామ్ వర్మ చెబుతున్నది అర్ధంజేసుకోవడానికి  విశ్వ ప్రయత్నం చేస్తున్నాం.

గోల్ ఎలిమెంట్స్ అంటే?


మనకి ఈ అడ్వాన్సుడు ఎల్ ఓ ఏ సరిపోతుంది. గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? ఓ కథ తాలూకు స్క్రీన్ ప్లే లో వచ్చే కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, భావోద్వేగాలూ అనే నాలుగు గోల్ ఎలిమెంట్స్ కాదు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వేరు, దర్శకత్వ అవకాశాల కోసం అరచేతిలో ఎల్ ఓ ఏ స్ట్రక్చర్ వేరు. ఇక్కడ గోల్ ఎలిమెంట్స్ అంటే- పైన చెప్పుకున్నట్టు ఓ డెడ్ లైన్, దాంతో బాటు బడ్జెట్టే గాకుండా ఇంకా స్క్రిప్టు, మల్టిపుల్ స్క్రిప్టులు, బిజినెస్, టార్గెట్  రిటర్న్స్, నిబద్ధత, తీవ్రత  వగైరా కూడా!

కాబట్టి ఒక డెడ్ లైన్ తో బాటు బడ్జెట్ నిర్ణయించుకున్నాక, సబ్జెక్టు విషయానికొస్తే కథ తాలూకు నాల్గు పేజీల చిత్తు ప్రతి పనికి రాదు. 30 పేజీల సినాప్సిస్ కూడా పనికిరాదు. సబ్జెక్టు తాలూకు మొత్తం ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లే) కాపీ వరకూ తయారు చేసుకోవాల్సిందే. డైలాగు వెర్షన్ లేకపోయినా ఫర్వాలేదు. టేబుల్ మీద నీటుగా పేర్చి ఇలాటి ట్రీట్ మెంట్ బైండింగులు విశ్వానికి (మొదట మన సబ్ కాన్షస్ మైండ్ కి) కనిపించాల్సిందే. విశ్వానికెలా తెలుస్తుంది? ఎవ్విరీ థింగ్ ఈజ్ ఎనర్జీ కాబట్టి. ఆ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ వుంటుంది కాబట్టి. ఈ బైండింగులు ప్రసారం చేసే వైబ్రేషన్స్ వాతావరణంలో కలిసి విశ్వానికి చేరుతూంటాయి కాబట్టి. 

ఈ ట్రీట్ మెంట్ ఎలా తయారు చేసుకుంటారో, ఎందరి సాయం తీసుకుంటారో, ఎంత ఖర్చు పెడతారో విశ్వానికి అనవసరం. మెటీరియల్ లేకుండా  గాలిలో గోల్స్ కుదరవు. ఒక వస్తువు అమ్మాలంటే ఆ వస్తువు తయారై వుండాల్సిందే. ట్రీట్ మెంట్ తయారు చేసుకున్నాక బడ్జెట్ అంచనా వేసుకోవాలి. ట్రీట్ మెంట్ తో పక్కా బడ్జెట్ రాదు. ఫైనల్ గా డైలాగు వెర్షన్ తో వస్తుంది. ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. తర్వాత దాని బిజినెస్. బిజినెస్ మార్గాలు రాయాలి.  టార్గెట్ రిటర్న్స్- గ్రాస్ కలెక్షన్స్ ఎంత రావాలని ఆశిస్తున్నారు? బడ్జెట్ మీద నికరాదాయం ఎంత శాతముండాలి? ఈ అంకెలు రాసుకుంటే అన్ని కోణాల్లో మేకింగ్ క్వాలిటీ రీచ్ అయ్యేలా క్రమశిక్షణ అలవడుతుంది. ఐదు బడ్జెట్ కి ఆరు వచ్చే పనైతే ఆ మేకింగ్ ఉత్సాహం వేరే వుంటుంది. ఏం సాదిస్తున్నామో తెలియకుండా సినిమాలుతీస్తే గుడ్డెద్దు చేలో పడ్డ చందమే, గత పాతికేళ్ళుగా నూటికి 92 శాతం ఫాపులకి కారణమిదే. ఈ బడ్జెట్ కి ఇంత వస్తుంది సార్ అని నిర్మాతకి లెక్కలు చెప్పే ఆత్మవిశ్వాసం లేకపోవడం గోల్ ని బలహీనపరుస్తుంది. 

ఇక టైటిల్స్.  ముందే టైటిల్స్ పెట్టుకోవడానికి  సిగ్గు పడుతూంటారు. పెళ్ళి చూపులు ఇలా కుదరవు. గోల్ సర్వాంగ సుందరంగా,  టైటిల్స్ తో వెంటనే కట్నం మాట్లాడుకునేలా బైండింగుల మీద ఊరిస్తూ కనపడాల్సిందే!  తర్వాత, ఒకే సబ్జెక్టుతో గోల్ పెట్టకుంటే అవకాశాలు వచ్చినా అది నిర్మాతలకి  నచ్చకపోవచ్చు. అందుకని రెండు మూడు సబ్జెక్టులు వుంచుకోవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ కాదా, దీంతో గోల్ రెండు మూడు పాయలుగా విడిపోతుంది కదా అన్పించవచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ కాదు. ఒక వైపు ప్లాన్ ఏ అని దర్శకత్వ ప్రయత్నాలు, మరో వైపు ఇది కుదరకపోతే కాఫీ షాప్ ని ప్లాన్ బీ అని పెట్టుకుంటే,  గోల్ రెండు పాయలుగా విడిపోయి ఏం జరుగుతుందంటే -ప్లాన్ బీ గురించిన ఆలోచనలు ముందే తిష్టవేసి ప్లాన్ ఏ ని దెబ్బ తీస్తూంటాయి. ఇలా ఈ పని,కాకపోతే ఆ పని చేద్దామని రెండు గోల్స్ పెట్టుకుని దిగితే ఏదీ జరగదు. ఒక వృత్తిని నిర్ణయించుకుని, దానికి సంబంధించిన కార్యక్రమాలు మల్టీ టాస్కింగ్ చేస్తే గోల్ ఒకటే కాబట్టి దెబ్బ తినదు. కనుక  రెండు మూడు సబ్జెక్టుల్ని పిచింగ్ చేస్తూ ముందుకి సాగవచ్చు.

నిబద్ధత, తీవ్రత లేమిటి? నాల్గు రోజులు గోల్ మీద పని చేసి,  నాల్గు రోజులు మానేస్తే నిబద్ధత అనిపించుకోదు. సాధించే వరకూ పట్టు విడవకుండా గోల్ మీద పని చేయాల్సిందే.  అలాగే దాని బలం లేదా తీవ్రత కూడా అదే  స్థాయిలో వుండాల్సిందే. ఇవి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. అంటే ఉత్సాహం వుంటే ఫ్రీక్వెన్సీ,  లేదంటే నో వెకెన్సీ. డెడ్ లైన్ పెట్టుకున్నాక ఏదీ వాయిదా వేయకూడదు. గోల్ బలహీన పడకుండా వుండాలంటే ఇంకేం చేయాలో  చివర్లో వచ్చే కార్యాచరణ విభాగంలో తెలుసుకుందాం. 

ఇంత వరకూ గోల్ సెట్టింగ్ కి దృష్టిలో పెట్టుకోవాల్సిన ఎలిమెంట్స్ 1. డెడ్ లైన్, 2. బడ్జెట్,  3. స్క్రిప్ట్, 4. బిజినెస్, 5. టార్గెట్ రిటర్న్స్, 6. నిబద్ధత, 7. తీవ్రత. వీటిలో చివరి రెండూ తప్పితే మిగిలిన వాటిని ఆకు పచ్చ ఇంకుతో పసుపు పచ్చ నోటు పుస్తకంలో రాసుకోవాలి. ఈ పుస్తకం రోజూ చదువుతూ వుండాలి. స్క్రిప్టు బైండింగులు కనపడేలా టేబుల్ మీద వుంచి, దుమ్ముపట్టిపోకుండా చూసుకోవాలి. దుమ్ము నెగెటివ్ ఎనర్జీ. గోల్ సాధన కోసం ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో వుండాలి. ఏ మూడ్ లేదా ఎమోషన్స్ తో వుంటే, హై ఫ్రీక్వెన్సీ వుంటుందో పై చిత్రపటం చూడండి. (ఇంకా వుంది)  -సికిందర్