రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, నవంబర్ 2017, సోమవారం

545 : సెకండాఫ్ సంగతులు!




     సినిమా హిట్ అన్పించుకున్నాక తప్పుబట్టడాని కేముంటుంది, ఏమీ వుండదు. అందులో వున్న అన్ని లోపాలూ ఉల్లంఘనలూ సమస్తం ఇన్ స్టంట్ ఒప్పులైపోతాయి. సినిమా స్కూళ్ళు, స్క్రీన్ ప్లే పుస్తకాలు అనవసరాలై పోతాయి. అయితే ఈ విజయానికి  ఇన్స్పైర్ అయి, ఇంకెవరైనా దీన్నే ఫాలో అయిపోవచ్చు. ఇలాగే  ఎలాపడితే అలా తీసెయ్యొచ్చు,  అది కూడా హిట్టవచ్చు. అది పూర్తిగా చీకట్లో రాయి విసరడం. ఎందుకంటే, ఎలా పడితే అలా తీయడానికి రూల్స్ ఏమీ వుండవు. ఎవరికెలా తోస్తే అలా తీసేయడమే. కనిపిస్తున్న విజయమే గైడ్ బుక్. రూల్స్ ని బ్రేక్ చేయడం కూడా రెండు విధాలా వుంటుంది.  రూల్స్ ఏమిటో తెలుసుకుని బ్రేక్ చేయడం, రూల్స్ పట్టకుండా ఏదో చేసుకుపోవడం. కొందరికి రూల్స్ అంటేనే ఇగో వచ్చేస్తుంది, నా సినిమాకి ఎవరో రూల్స్ చెప్పడమేమిటని. ఆ రూల్స్ అనేవి విజయవంతమైన సినిమాల్లోంచి ఏర్పడినవైతేనేం, వాటి గొప్ప మాకెందుకని. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా తాము 10 శాతం  విజయాల బ్రాకెట్ కి చెందిన వైట్ కాలర్ వాళ్ళమనుకుంటారు. తీరా చూస్తే  90 శాతం బ్లూ కాలర్ ఫ్లాపుల మార్కెట్ లో వుంటారు. 90 అనేదే వాస్తవం, 10 అనేది వొఠ్ఠి మిధ్య! గాఠ్ఠి మిధ్య!! ఎంతటి వాడైనా 90 కే భయపడాలి, భయపడి నేర్చుకోవాలి, నేర్చుకుంటూ చావాల్సిందే. కంపెనీలకి ఆర్ అండ్ డీ వున్నట్టు, కళాకారులకి అలాటిది వుండాల్సిందే! కళాకారుడి కొవ్వు ఎంతంటే,  కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూంటే, కళాకారుడు టెలిఫోన్లు తయారు చేస్తూంటాడు. గ్రాంఫోన్లు కూడా తయారు చేస్తాడు. మార్కెట్ కి పనికి రాకపోయినా వాడి క్రియేటివిటీ వాడికద్భుతమే!

         
కాబట్టి రూల్స్ తెలియకుండా ఎలాపడితే అలా తీయాలన్నా  అసలా తప్పులెలా వుంటాయి, అవి తప్పులెందుకవుతాయి, ఉల్లంఘనలెలా వుంటాయి, అవి ఉల్లంఘనలెలా అవుతాయి, మనం ఏ బాపతు అకృత్యాలకి  పాల్పడ వచ్చు తెలియాలి. వూరికే చీకట్లో రాయి విసిరి చూద్దామనుకోకుండా, ఏ వంకరలో రాయి విసిరితే తగులుతుందో తెలుసుకుంటే  ఇలాటి విజయాల్ని సులభతరం చెయ్యొచ్చు.  


          గత వ్యాసంలో ఏ రూల్స్ కీ అందని ఫస్టాఫ్ సంగతులు చూశాం. ఇప్పుడు ఫస్టాఫ్ కి సెకండాఫ్ పూర్తి భిన్నం. ఫస్టాఫ్ లో  మోడర్నిజమైనా వుంది, ట్రెండీ నెస్ అయినా  వుంది. సెకండాఫ్ లో ఈ రెండూ మాయమై ఇంకెలా  వుందో తెలుసుకుందాం 
 



రేపు!