'డెవలప్
ఏ క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్
ఫర్ యువర్ లీడింగ్ క్యారక్టర్'
అన్నాడు
ఏడు ఆస్కార్ల హాలీవుడ్ డైరెక్టర్
బిల్లీ వైల్డర్.
సినిమా
కథ రాయడానికి ఇది చాలా ప్రాథమిక
బాక్సాఫీసు సూత్రం.
స్క్రీన్
ప్లే సూత్రమంటే అదేదో శాస్త్రం
చెప్తున్నట్టు బోరుగా వుంటుంది.
కాబట్టి
స్క్రీన్ ప్లే తీసేసి బాక్సాఫీసు
సూత్రాలనే చెప్పుకుందాం
ఇప్పట్నుంచీ.
బాక్సాఫీసు
సూత్రమంటే నిద్రపోతున్న వాడు
కూడా లేచి కూర్చుంటాడు.
డబ్బులొచ్చే
పని కదా?
చెవులప్పగించి
వింటాడు.
నోట్
చేసుకుంటాడు.
అమలు
చేస్తాడు.
మొదట
సినిమా కథకి స్పురించిన
ఐడియాలో కన్ఫ్యూజన్ వుంటే
సినిమా అర్ధం కాదు.
ఐడియాని
ఒక లాగ్ లైన్ గా చూస్తే కన్ఫ్యూజన్
వుందో లేదో,
బిల్లీ
వైల్డర్ అన్నట్టు క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్ వుందో లేదో
తెలుస్తుంది.
'డ్యూటీయే
ప్రాణమైన పోలీసు అధికారి
శివాజీ గణేశన్,
క్రిమినల్
గా మారిన కొడుకు శ్రీకాంత్
ని మార్చడానికి సంఘర్షించి,
చివరికా
కొడుకు దేశద్రోహానికి
పాల్పడేదాకా పోవడంతో చంపేస్తాడు'
('తంగపతకం'
- తమిళం,
1974; హిందీ
రీమేక్ 'శక్తి',
తెలుగు
రీమేక్ 'కొండవీటి
సింహం’).
ఈ
లాగ్ లైన్ స్పష్టంగా వుంది.
పాత్ర
ఉద్దేశం,
పాల్పడే
చర్యలు కార్యకారణ సంబంధంతో
వున్నాయి.
శివాజీ
గణేశన్ ఎవరు?
డ్యూటీనే
ప్రాణంగా ప్రేమించే పోలీసు
అధికారి.
అతడి
ఉద్దేశం ఏమిటి?
క్రిమినల్
గా మారిన కొడుకు శ్రీకాంత్
ని మార్చడం కోసం సంఘర్షించడం.
ఈ
సమస్యని ఎలా పరిష్కరించాడు?
ఆ
కొడుకు దేశద్రోహానికి
పాల్పడేదాకా పోవడంతో చంపేయక
తప్పలేదు.
కన్ఫ్యూజన్
లేదు.
లాగ్
లైన్ లో వున్న వాక్యాలు మూడూ
కార్యకారణ సంబంధంతో వుండాల్సిన
నిర్మాణంలో లాజికల్ గా కలిసి
వున్నాయి :
పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారం.
క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్.
'ఒక
పేరున్న స్కూల్లో టీచరైన
శ్రీదేవి,
అదే
స్కూల్లో చదివే కూతుర్ని ఆమె
క్లాస్ మేట్ ఒకడు ఫ్రెండ్స్
తో కలిసి గ్యాంగ్ రేప్ చేసి
శిక్ష నుంచి తప్పించుకోవడంతో
న్యాయవ్యవస్థ మీద నమ్మకం
కోల్పోయిన శ్రీదేవి -పైకోర్టు
కెళ్ళకుండా,
ఆ
మైనర్ రేపిస్టులందర్నీ వెతికి
వెతికి చంపడం మొదలెడుతుంది'
('మామ్'
-హిందీ,
2017). ఇందులో
కూడా కన్ఫ్యూజన్ లేదు.
శ్రీదేవి
ఎవరు?
స్కూల్
టీచర్.
ఆమె
ఉద్దేశం ఏమిటి?
కూతురి
మీద అత్యాచారం చేసి శిక్షనుంచి
తప్పించుకున్న మైనర్లని
శిక్షించడం.
దీన్నెలా
సాధించింది?
పై
కోర్టు కెళ్ళడానికి న్యాయవ్యస్థ
మీద నమ్మకం లేక ఆ మైనర్
రేపిస్టుల్ని చంపిపారెయ్యడం
మొదలెడుతూ.
ఈ
లాగ్ లైన్ లో వున్న వాక్యాలు
మూడూ కూడా కార్యకారణ సంబంధంతో
వుండాల్సిన నిర్మాణంలో లాజికల్
గా కలిసి వున్నాయి :
పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారం.
క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్.

'ఆమె
భర్తతో విడాకులై స్కూలు కెళ్ళే
మైనర్ కూతురితో వుంటోంది,
ఆ
కూతుర్ని మైనర్లు రేప్ చేసి
స్వల్ప శిక్షలతో బయటపడడంతో,
స్వల్ప
శిక్షలతో మైనర్లు బయటపడే
పరిహాసం ఇంకెన్నాళ్ళని
ఒకొక్కర్నీ చంపడం మొదలెడుతుంది'
('డోంట్
క్రై మమ్మీ'
-కొరియన్,
2012). ఇందులో
కూడా ఏమాత్రం కన్ఫ్యూజన్
లేదు.
ఈ
లాగ్ లైన్ లో వున్న వాక్యాలు
మూడూ కూడా కార్యకారణ సంబంధంతో
వుండాల్సిన నిర్మాణంలో లాజికల్
గా కలిసి మెలిసి వున్నాయి :
పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారం.
క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్.
'ఆమని
ఒక స్కూల్ టీచర్.
ఆమె
మైనర్ కొడుకు మైనర్ అమ్మాయిని
రేప్ చేయడంతో తన భర్త కూడా ఈ
బుద్ధితోనే తన చేతిలో చచ్చిన
గతం మెదిలి,
ఇప్పుడు
ఈ కొడుక్కే కాదు మొత్తం మగజాతి
కళ్ళు తెరిపించాలని -
'ప్రతిఘటన'
లో
విజయశాంతి 'మర్మస్థానం
కాదది మీ జన్మస్థానం'
అని
పాడినట్టు తన నగ్నదేహాన్ని
ప్రదర్శనకి పెట్టుకుని
ఆత్మహత్య చేసుకుంటుంది'
(‘నారి'
-తెలుగు,
2025). ఇందులో
కూడా కన్ఫ్యూజన్ లేదు.
ఆమని
ఎవరు?
స్కూల్
టీచర్.
ఆమె
ఉద్దేశం ఏమిటి?
ఆమె
మైనర్ కొడుకు మైనర్ అమ్మాయిని
రేప్ చేయడంతో తన భర్త కూడా ఈ
బుద్ధితోనే తన చేతిలో చచ్చిన
గతం మెదిలి ఒక ఉద్దేశం
పెట్టుకుంది.
ఆ
ఉద్దేశాన్ని ఎలా అమలు చేసింది?
ఈ
కొడుక్కే కాదు మొత్తం మగజాతి
కళ్ళు తెరిపించాలని -
'ప్రతిఘటన'
లో
విజయశాంతి 'మర్మస్థానం
కాదది మీ జన్మస్థానం'
అని
పాడినట్టు తన నగ్నదేహాన్ని
ప్రదర్శనకి పెట్టుకుని
ఆత్మహత్య చేసుకుంది.
ఈ
లాగ్ లైన్ లో కూడా మూడు వాక్యాలూ
కార్యకారణ సంబంధంతో వుండాల్సిన
నిర్మాణంలో లాజికల్ గా కలిసి
వుంటూ,
లాగ్
లైన్ కి న్యాయం చేస్తున్నాయి
: పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారం.
క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్.
'పబ్లిక్
స్కూలు ప్రిన్సిపాలైన భూమికా
చావ్లా,
అదే
స్కూల్లో చదివే ఆమె మైనర్
కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి
మైనర్ అమ్మాయిని గ్యాంగ్
రేప్ చేయడంతో,
వాళ్ళందరికీ
కలిపి శిక్షలు పడేలా చూస్తుంది
భూమిక.
శిక్షలు
పడ్డాక కొడుకుని బయటికి తీసి
సంస్కరించడం మొదలెడుతుంది,
సంస్కరించాక-
అసలు
మొదట కొడుకు పెంపకంలో తల్లిగా
విఫలమైనందుకు తన పైన తనే కేసు
వేసుకుని తనని శిక్షించాలంటూ
కోర్టు కెక్కుతుంది'
- ఇదీ
ఇప్పుడు స్క్రీన్ ప్లే సంగతులు
చెప్పుకుంటున్న తాజా 'యూఫోరియా'
(తెలుగు,
2026) లాగ్
లైను!
చాలా
కన్ఫ్యూజింగ్ గా లేదూ?
'యూఫోరియా'
లాగ్
లైన్ లో మూడు కాదు,
ఐదు
వాక్యాలున్నాయి.
ఈ
ఐదూ కార్యకారణ సంబంధంతో
వుండాల్సిన నిర్మాణంలో లాజికల్
గా కలిసి మెలిసి వున్నాయా?
పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారం-
వీటి
ఆధారంగా పాత్రకి ఒక క్లీన్
లైన్ ఆఫ్ యాక్షనూ ఏర్పడిందా?
పబ్లిక్
స్కూలు ప్రిన్సిపాల్ భూమికా
చావ్లా మైనర్ కొడుకు ఫ్రెండ్స్
తో కలిసి మైనర్ అమ్మాయిని
గ్యాంగ్ రేప్ చేస్తే,
వాళ్ళందరికీ
కలిపి శిక్షలు పడేలా చూసిన
భూమిక,
మళ్ళీ
శిక్ష పడ్డాక కొడుకుని బయటికి
తీసి సంస్కరించడం మొదలెట్టిందా?
అంతేగాక,
అసలు
మొట్ట మొదట కొడుకు పెంపకంలో
తల్లిగా తను విఫలమయ్యానని
తన మీద తనే కేసు వేసుకుని
కోర్టు కెక్కిందా?
కన్ఫ్యూజింగ్
గా లేదూ?
ఆమెకి
అన్ని ఉద్దేశాలా?
అవి
కూడా పరస్పర విరుద్ధంగా?
లాగ్
లైన్లో ఐదు వాక్యాలా?
అదనంగా
రెండు వాక్యాలు ఎందుకు చేరాయి?
ఎందుకు
చేరాయంటే స్క్రిప్టు రాసే
ముందు ఈ కథకి అనుకున్న ఐడియాని
నిర్దుష్టంగా నిర్మించుకోక
పోవడం వల్ల.
ఈ
మూడు వాక్యాల లెక్కేమిటి?
ఏమిటంటే
ఇది బాక్సాఫీసు సూత్రాల్లో
త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్
కుండే లెక్క.
బిగినింగ్,
మిడిల్,
ఎండ్
అనే మూడు విభాగాలు.
'తంగపతకం’
లో 'డ్యూటీయే
ప్రాణమైన పోలీసు అధికారి
శివాజీ గణేశన్’ అనేది బిగినింగ్
విభాగం (ఉపోద్ఘాతం),
'క్రిమినల్
గా మారిన కొడుకు శ్రీకాంత్
ని మార్చడానికి సంఘర్షించడం'
మిడిల్
విభాగం (కథ),
'చివరికా
కొడుకు దేశద్రోహానికి పాల్పడే
దాకా పోవడంతో చంపేస్తాడు'
-ఇది
ఎండ్ విభాగం (ఉపసంహారం).
ఇలాగే
పైన పేర్కొన్న 'మామ్',
'డోంట్
క్రై మమ్మీ’,
'నారి'
ఐడియాల
నిర్దుష్ట నిర్మాణం చూడొచ్చు.
పిచింగ్
చేయడానికి ఐడియాని మూడు
వాక్యాలుగా రాస్తే లాగ్ లైన్
వస్తుంది.
లాగ్
లైన్ స్టోరీ లైన్ కూడా
కావొచ్చు.
నిజానికి
'యూఫోరియా'
లాగ్
లైను మొదటి మూడు వాక్యాల్లోనే
వుంది.
భూమికా
చావ్లా పబ్లిక్ స్కూలు
ప్రిన్సిపాల్,
అదే
స్కూల్లో చదివే ఆమె మైనర్
కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి
మైనర్ అమ్మాయిని గ్యాంగ్
రేప్ చేయడంతో,
వాళ్ళందరికీ
కలిపి శిక్షలు పడేలా చూస్తుంది
భూమిక-
ఈ
మూడు వాక్యాల లాగ్ లైన్ లో
కన్ఫ్యూజన్ లేదు.
వాక్యాలు
మూడూ కార్యకారణ సంబంధంతో
వుండాల్సిన నిర్మాణంలో లాజికల్
గా కలిసి మెలిసి వున్నాయి :
పాత్ర
ఉద్దేశం,
సంఘర్షణ,
పరిష్కారంతో.
క్లీన్
లైన్ ఆఫ్ యాక్షన్ తో.
అంటే
ఈ మూడు వాక్యాల్లోనే కథ
ముగిసిపోయింది.
ఇలా
లాజికల్ గా కథ ముగిసిపోయాక,
శిక్ష
పడ్డ కొడుకుని బయటికి తీసి
సంస్కరించడ మేమిటి?
అసలు
కొడుకుని సరిగ్గా పెంచలేనందుకు
తనని శిక్షించాలంటూ తనపైనే
కేసు వేసుకుని కోర్టు
కెక్కిక్కడమిటి?
అసలామె
ఉద్దేశమేమిటి?
ఏం
చెప్పాలనుకుంటోంది కథని
పొడిగించి?
పై
మూడు వాక్యాల లాగ్ లైనుతో కథ
ఇంటర్వెల్ కి ముగిసిపోయింది
సినిమాలో.
ముగిసిపోయాక
ఇంకో రెండు వాక్యాలు జోడించి
సెకండాఫ్ చేశారు.
ఇంటర్వెల్
కి కథ ముగిసిపోయి,
ఇంకేదో
కథతో సెకండాఫ్ చేశారంటే ఆ
స్క్రీన్ ప్లే కాదు-
బాక్సాఫీసు
ప్లే సెకండాఫ్ సిండ్రోం అనే
సుడిగుండంలో పడినట్టే!
ఖాయంగా
అట్టర్ ఫ్లాప్ రాసుకున్నట్టే.
ఇది
'యూఫోరియా'
తోనే
మొదలు కాలేదు,
అడపాదడపా
సెకండాఫ్ సిండ్రోంతో సినిమాలు
తీస్తూ ఫ్లాపవుతూనే వున్నారు-
సవ్యసాచి,
దర్బార్,
నిను
వీడని నీడను నేనే,
సైజ్
జీరో,
24 కిస్సెస్,
నర్తనశాల,
పడి
పడి లేచే మనసు,
ఉగ్రం,
ఊర్వశివో
రాక్షసివో,
ధమ్,
దొంగోడు.
కాటమ
రాయుడు,
మిస్సింగ్,
‘వి’,
జో
అచ్యుతానంద,
నూటొక్క
జిల్లాల అందగాడు,
రంగుల
రాట్నం...ఇలా
ఎన్నో.
'యూఫోరియా'
విషయంలో
ఇంటర్వెల్ కే కథ అయిపోయిందని
గుర్తించలేదు.
అందుకని
కథ కలుపుకుంటూ పోయారు.
ఒక
సినిమాకి సీక్వెల్ తీయొచ్చు.
ఒక
సినిమాలోని ఫస్టాఫ్ కి సీక్వెల్
గా సెకండాఫ్ తీయొచ్చా?
ఇలాగే
వుంది 'యూఫోరియా'
బాక్సాఫీసు
ప్లే.
ఇందుకే
ముందు ఐడియాని నిర్మించుకోవాలి.
నిర్మించుకుంటే
లోపాలు ఇక్కడే తెలుస్తాయి.
లోపాల్లేకుండా
వచ్చే వరకూ ఆ ఐడియాతో కసరత్తు
చేస్తూనే వుండాలి.
అప్పుడే
స్క్రిప్టుకి పూనుకోవాలి.
ఐడియాలో
స్ట్రక్చర్ లేకపోతే -
అంటే
కథ లేకపోతే-
స్క్రిప్టులోనే
స్ట్రక్చర్ వుండదు,
సినిమాకి
బాక్సాఫీసే వుండదు!
ఐడియాలో
కథ కనిపించకపోతే ఇంకెక్కడా
కనిపించదు!
(ఇంకా
వుంది)
-సికిందర్