రచన- కూర్పు- దర్శకత్వం
: కర్రీ బార్కర్
తారాగణం : మైఖేల్ జాన్స్టన్, నవరెట్, కూపర్
టోమ్లిన్సన్, మేగన్ లా లెస్, ఆండీ రిక్టర్
సంగీతం : రాక్ బర్వెల్, ఛాయాగ్రహణం : టేలర్ క్లెమన్స్
బ్యానర్స్ : బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్, క్యాప్‌స్టోన్
స్టూడియోస్, టీ షాప్ ప్రొడక్షన్స్, అండర్ ది
షెల్ నిర్మాతలు : జేమ్స్ హారిస్, హేలీ నికోల్ జాన్సన్, క్రిస్టియన్ మెర్క్యురీ, రోమన్
వియరిస్
విడుదల : మే 15, 2026 (యునైటెడ్ స్టేట్స్)
***
ఆ కోతి పంజా వరాలిస్తుందనీ,
కోరిన మూడు కోరికల్ని తీరుస్తుందనీ నమ్మకం. దాన్ని మిస్టర్ వైట్ తన స్నేహితుడి దగ్గర్నుంచి
తీసుకున్నాడు. ఆ స్నేహితుడు దాన్ని ఉపయోగించవద్దని గట్టిగా హెచ్చరించాడు. ఆ హెచ్చరికని పట్టించుకోకుండా మిస్టర్ వైట్ డబ్బు కోసం కోరిక కోరాడు.
మర్నాడు అతడి కొడుకు హెర్బర్ట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయాడు. దానికి పరిహారంగా
వచ్చిన మొత్తం, తాను కోరుకున్న డబ్బుతో సమానంగా వుంది! తీవ్ర దుఃఖంతో కుంగిపోయిన అతడి భార్య
మిసెస్ వైట్, కొడుకుని బ్రతికించడానికి రెండవ కోరికని కోరమని మిస్టర్ వైట్ ని బలవంతం
చేసింది. మిస్టర్ వైట్ అలాగే రెండవ కోరికని కోరాడు. అప్పుడు అర్ధరాత్రి ఎవరో తలుపు
కొడుతున్నట్టు భయానకంగా చప్పుడైంది. అది విని తమ కొడుకు ఛిద్రమైన శవమేమోనని భయపడిన మిస్టర్ వైట్, వెంటనే ఆ శబ్దాన్ని ఆపెయ్యడానికి
చివరి కోరిక కోరాడు. నిశ్శబ్దమైపోయింది.
అనుమానంగా మిసెస్ వైట్ వెళ్ళి తలుపుతీసి చూస్తే...అప్పుడేం జరిగింది?
తెలీదు. సస్పెన్స్ తో
ఆపేశాడు ఈ కథ రాసిన డబ్ల్యూ. డబ్ల్యూ. జాకబ్స్ అనే రచయిత. ‘ది మంకీస్ పా’ 1902 లో
రాసిన ఒక ప్రసిద్ధ అతీంద్రియ హార్రర్ కథ. ఈ క్లాసిక్ హార్రర్ కథలో శాపవశాత్తూ ఒక కోతి
పంజాకి అతీంద్రియ శక్తులు అబ్బి మనుషుల్ని ఆకర్షిస్తుంది, కోరికలు తీర్చమని
అడిగితే, విధి నిర్ణయంలో జోక్యం చేసుకున్నందుకు ఆ కోరికలకి భారీ మూల్యం చెల్లించుకునేలా
చేస్తుంది ఆ వానర పంజా.
నాటి నుంచీ ఈ కథ ఎన్నో నాటకాలు, సినిమాలు, టీవీ సీరీస్లు, ఒపెరాలు, కామిక్స్ సహా ఇతర మాధ్యమాల్లో
27 సార్లు రిపీటయింది. అలా 1991 నాటి ‘ట్రీహౌస్
ఆఫ్ హార్రర్ I2’ అనే ఎపిసోడ్ ని అనుకోకుండా
చూశాడు ‘అబ్సెషన్’ దర్శకుడు 26 ఏళ్ళ కర్రీ బార్కర్. అందులో హీరో కోతి పంజాతో
సంభాషించడాన్ని చూసి, తన ‘అబ్సెషన్’ కథకి దీన్ని వాడుకోవాలని నిర్ణయించాడు.
అప్పుడు ఈ కథ ఎలా తయారయిందో చూద్దాం.
1. ప్రమాదంలో ప్రేమ పిచ్చి!
బేర్ (మైఖేల్ జాన్స్టన్) ఒక మ్యూజిక్ షాపులో పని చేస్తూంటాడు. నిక్కీ (నవరెట్) అక్కడే పని చేస్తూంటుంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ ఐయాన్ (కూపర్ టోమ్లిన్సన్), సారా (మెగాన్ లా లెస్) కూడా అక్కడే పని చేస్తూంటారు. బేర్ నిక్కీని మూగగా ప్రేమిస్తూంటాడు. తన ప్రేమని అమెకెలా చెప్పాలో తెలీదు. చెప్పే ధైర్యం కూడా లేదు. మనసంతా ఆమె మీదే పెట్టుకుని నిరాశగా గడుపుతూంటాడు. ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చేసరికి, ప్రమాదవశాత్తూ పెంపుడు పిల్లి శాండీ ఆక్సికోడోన్ తాగి చనిపోయి వుంటుంది.ఇంకో రోజు బేర్ ఒక ఆలోచన చేసి, నిక్కీని ఆకట్టుకోవడం కోసం బహుమతి కొనడానికి ఒక షాపు కెళ్తాడు. అక్కడ వింతగా అన్పించిన ‘వన్ విష్ విల్లో’ అనే ఒక బొమ్మని కొంటాడు. దాన్ని విరగగొడితే అది కోరిన కోరిక తీరుస్తుందని సేల్స్ గర్ల్ చెబుతుంది. ఇక బేర్ ప్రపంచంలో ఎవరికన్నా ఎక్కువగా నిక్కీ తనని ప్రేమించాలని కోరుకుని దాన్ని విరగ్గొడతాడు. వెంటనే నిక్కీ వచ్చి, బేర్ ఇంట్లో పడుకోవడానికి అనుమతి కోరుతుంది. బేర్ కి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతాయి బొమ్మ తన కోరిక నెరవేర్చిందని!
అలా బేర్ ఇంట్లో మకాం పెట్టిన నిక్కీలో వేగంగా భయపెట్టే మార్పులొస్తాయి. ఆమె తనని ప్రేమించేట్టు ఒక ప్రయోగం చేశాడు. ప్రేమించడం కాదు, ఆ ప్రేమ అదుపు తప్పి పిచ్చి ప్రేమగా మారిపోయి, దుష్టశక్తి అవహించినట్టు నిక్కీ అతడ్నివదిలిపెట్టకుండా భయపెట్టడంతో, ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. బేర్ ప్రేమ కోసం బేర్ ని ప్రేమిస్తున్న సారానే దారుణంగా చంపేస్తుంది నిక్కీ. పరిస్థితి అదుపుతప్పి పోవడంతో, ఇప్పుడు వన్ విష్ విల్లో బారి నుంచి నిక్కీని బేర్ కాపాడేడా? అసలు నిజంగానే బేర్ ని నిక్కీ ప్రేమిస్తోందా? తన తప్పిదం వల్ల ప్రాణాల మీదికొచ్చిన నిక్కీ ని కాపాడేందుకు బేర్ ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

2. ఎలావుంది కథ?
ప్రేమంటే అదొక మత్తు అనీ, పిచ్చి అనీ, ఒకరిని ఎంత బలంగా కోరుకుంటే అంత బలంగా సొంతమవుతారనీ వివిధ మాధ్యమాలు నూరిపోస్తున్నాయి. ప్రేమ కోసం స్ట్రగుల్ చేసే హీరోకే హీరోయిన్ దక్కుతుందనీ చిత్రీకరణలుంటాయి. అమ్మాయి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా టార్చర్ పెట్టయినా సరే సొంతం చేసుకోవాలన్న మగ ప్రవృత్తి ఎప్పుడూ పని చేస్తూంటుంది. దీనికే ఓటు పడుతూ వుంటుంది. ఇంకో పక్క వశీకరణ మంత్రాలనేవి వున్నాయి.అలాటి వశీకరణ మంత్రమే ‘వన్ విష్ విల్లో’ రూపంలో ఈ కథలో హీరోకి దొరికిన బొమ్మ. దాంతో హీరోయిన్ లో తన మీద అమర ప్రేమని రగిలించి సొంతం చేసుకుందామనుకుంటే రివర్స్ అయింది. లేకపోతే ప్రేమ కోసం అమ్మాయిని టార్చర్ పెడితే ఆమెకెలా వుంటుందో తెలియాలి కదా? ఆ అనుభవాన్నే ఫుల్ హారిఫిక్ డోసుతో కలిపి ఆమె సరఫరా చేసింది. చచ్చినట్టూ అనుభవించి చూశాడు. గుణశేఖర్ తీసిన ‘యూఫోరియా’ లో గ్యాంగ్ రెప్ చేస్తే ఆ బాధితురాలి పరిస్థితి ఎలా వుంటుందో, పోలీసులు ఆ గ్యాంగ్ రేపిస్టులకే బిర్యానీలు నోట్లో కుక్కి కుక్కి తినిపించి అనుభవంలోకి తెచ్చినట్టు.
మగవాడి వ్యామోహాన్ని సమాజం ఎంత తేలికగా ఆదర్శీకరిస్తోందో చూస్తున్నదే. ఎన్నో ఏళ్ళుగా
మనం వింటున్న కథల్లో 'కాదు' అనే ఆన్సర్ ని అంగీకరించని
మగాళ్ళని ప్రేమకి నిదర్శనంగా భావించడం. వాడు ఆమె ఇంటి బయట కాచుకుని వుంటాడు, ఆమె దినచర్యల్ని అనుసరిస్తాడు, ఆమె జీవితంలోకి చొరబడతాడు, స్టాకింగ్ చేస్తాడు, ఇంకేదో
చేస్తాడు, తిరస్కారాన్ని అంగీకరించడు, చివరికెలాగోలా ఆమెని దక్కించుకుని హీరో అనిపించుకుంటాడు. ఇలా డిజైన్
చేసి పెట్టారు.
నిజానికి ఇది పైకి కనిపిస్తున్నట్టు ఒక ‘పిచ్చి ప్రియురాలి’ కథ కాదు. ఒక తీవ్ర
అభద్రతా భావంతో ప్రేమ కోసం తపిస్తున్న పనికిమాలిన యువకుడి కథ. కేవలం తనని
కోరుకుంటోందని ఫీలవడం కోసం ఒకమ్మాయి స్వాతంత్ర్యాన్ని హరించివేస్తాడు. తాను
కోరుకున్నది కచ్చితంగా పొందిన తర్వాత, స్వాధీనంలో వుంకోవడం ప్రేమ కాదని అప్పుడు గ్రహిస్తాడు, కానీ అప్పటికే జరిగిపోయిన నష్టం పూడ్చలేనిదిగా మారిపోతుంది.
‘అబ్సెషన్’ కేవలం ఒక శాపగ్రస్త ప్రేమ గురించిన హార్రర్ కథ కాదు. మేల్ ఇగోని సమాజం
ఎలా ఆదర్శనీయం చేస్తుందో, దాని పర్యవసానాల్ని స్త్రీలు భరించేలా ఎలా బలవంతం చేస్తోందో
అనే దానిపై ఒక తీవ్ర ఆగ్రహం. ఈ కథ ప్రేమని దాని అత్యంత వికారం కల్గించే మూలంలోకి
తీసుకువెళ్ళి, కేవలం ఒక పురుషుడు ఏక పక్షంగా ప్రేమని కోరుకున్నందు
వల్ల, ఒక స్త్రీ తన శరీరంమీద, తన గుర్తింపు మీదా హక్కుని కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందో కళ్ళు తెరిపించే
కథ.
‘అబ్సెషన్’ హీరో పాత్ర పేరు గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. హీరో
పాత్ర పేరు బేర్. బేర్ అంటే ఎలుగుబంటి. మగాడి కంటే ఎలుగుబంటినే ఎంచుకుంటామని
యువతులు జోకులేసుకుంటున్నారు. ఎలుగుబంటి దాడి మాత్రమే చేస్తుంది, ఎందుకంటే అది ఎలుగుబంటి
కాబట్టి. కానీ మగవాళ్ళు తమ హక్కుని
ప్రేమగా,
మోసాన్ని
ఆప్యాయతగా, వ్యామోహాన్ని శృంగారంగా
మభ్యపెడతారని వాతలు పెడుతున్నారు.
3. రెండు అక్రమాల సక్రమ కథలు!
ఏ
కథయినా దేనికో ఒక వెర్షన్ గా వుంటుంది. ఈ కథ చూస్తూంటే ‘ఫాటల్ ఎట్రాక్షన్’ గుర్తు
కొస్తుంది. ‘ఫాటల్ ఎట్రాక్షన్’ లోని అక్రమ సంబంధాన్ని అక్రమ ప్రేమగా మారిస్తే
‘అబ్సెషన్’ తయారయినట్టు అన్పిస్తుంది. పైన చెప్పుకున్న ‘ది మంకీస్ పా’ కథలోని కోతి
పంజాని ‘వన్ విష్ విల్లో’ గా మార్చి ప్లాట్ డివైస్ గా ప్లే చేసినట్టు, ‘ఫాటల్ ఎట్రాక్షన్’ ని నవతరం జెన్ జీ కోసం
‘అబ్సెషన్’ గా మార్చినట్టు తోస్తుంది. దర్శకుడు ఇది తెలిసి చేసి వుండకపోవచ్చు.
కానీ కనిపించేది అదే.
‘ఫాటల్ ఎట్రాక్షన్’ (1987) ఎరోటిక్ థ్రిల్లర్ అయితే, ‘అబ్సెషన్’ సూపర్ నేచురల్ హార్రర్. ‘ఫాటల్ ఎట్రాక్షన్’ లో వివాహితుడైన కథానాయకుడు ఓ యువతితో సంబంధం పెట్టుకుని వదిలేస్తే, ఆమెకి పిచ్చెక్కి అతడి ప్రేమ కోసం విధ్వంసం సృష్టిస్తుంది. ‘అబ్సెషన్’ లో కథానాయకుడు ప్రేమ కోసం మంత్రం ప్రయోగిస్తే, ఆమె ప్రేమ పిచ్చెక్కి విధ్వంసం సృష్టిస్తుంది.
ఈ రెండూ ప్రేమల గురించి కాదు; ప్రేమల పేరుతో జరిగే పొసెషన్ గురించి. మెసేజీలు వేర్వేరు. మొదటిది ‘కుటుంబ వ్యవస్థని కాపాడుకో’ అంటే, రెండోది ‘ప్రేమని బలవంతంగా పొందకు, దానికి స్వేచ్ఛ నివ్వు’ అంటుంది. ‘ది మంకీస్ పా’ కథలోని నీతిలాగే -మానవ కోరికలకి హద్దులు వుండాలని, మన అదుపులో లేని విధి లేదా మాయా శక్తులలో జోక్యం చేసుకోవడం తీవ్ర పశ్చాత్తాపానికీ, వినాశనానికీ మాత్రమే దారితీస్తుందనీ ‘అబ్సెషన్’ కూడా నొక్కి చెబుతుంది.
ఈ హార్రర్ రెగ్యులర్ గా మనం చూసే భౌతిక భయానకం కాదు, మానసిక భయానకం. పాత్రల మానసిక లోకాల సైకలాజికల్ హార్రర్. మగవాడి మనస్తత్వం ఆడదానికి సృష్టించిన ఆ అతి హేయ స్థితిని ప్రకటించే హార్రర్. ఆమెలో కన్పించే ఆ దెయ్యం, ఆ దుష్టశక్తి ఆమె కాదు, అతనే. ఆమెలో తనే కన్పిస్తున్నాడు. చనిపోయిన అతడి పెంపుడు పిల్లి శాండీ అవశేషాలతో ఆమె అతడి కోసం శాండ్విచ్ తయారు చేసిందంటే, అతడి వికృత చేష్టని అతడికే వడ్డించాలని. ఆమె గురించి అతడికేం తెలుసని ప్రేమ కోసం వెంటపడ్డాడు? ఆమె అతడ్ని సోదరుడిలా చూసేదని స్నేహితుడు చెప్పేదాకా తెలీదు!

పరిస్థితి విషమించే సరికి -తన కోరికని మార్చుకోవడానికి 'వన్ విష్ విల్లో' కస్టమర్ సపోర్ట్‌కి ఫోన్ చేస్తే - అలా కుదరదని, అతను చనిపోయినప్పుడు
మాత్రమే ఆ కోరిక ఎక్స్ పైర్ అవుతుందనీ సమాధానం వస్తుంది. అంటే అతను చనిపోతేనే ఆమె
మామూలు మనిషి అవుతుందన్న మాట...
కొన్ని చోట్ల సౌండ్ తోనూ, కొన్ని చోట్ల
నిశ్సబ్ద షాట్స్ తోనూ వుంటాయి హార్రర్ దృశ్యాలు. నిక్కీ సారాని కొట్టి చంపే లాంటి
యాక్షన్ సీన్లు ఓ రెండు వుంటాయి. ఫస్టాఫ్ లో కంటే సెకండాఫ్ లో ఏం జరుగుతుందన్న
సస్పెన్స్ తో కూర్చోబెడుతుంది కథ. కాలక్షేప హార్రర్ కాకుండా ఐడియాలజీని ప్రశ్నించే
హార్రర్ కావడంతో, వూరికే భయపెట్టకుండా ఆలోచనలో
పడేసేలా చిత్రీకరణ చేశాడు దర్శకుడు. అందుకే దీనికింత విజయం. 75%
ప్రేక్షకులు జెన్ జీ లే. ఐతే ఇండియాలో ఇంగ్లీషు తప్ప ఇంకో భాషలో విడుదల చేయలేదు.
4. నటనలు -సాంకేతికాలు

హీరోయిన్ నవరెట్ ది అసాధారణ నటన. తన కెరీర్ లో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన హార్రర్ నటనల్లో తనదొకటి. నిక్కీ పాత్రలో త్రిబుల్ యాక్షన్ చేసింది. ఒకే శరీరంలో చిక్కుకున్న ముగ్గురు వేర్వేరు యువతులు తను : ఆత్మీయ స్నేహితురాలు, వికారమైన వ్యామోహంతో కూడిన ఊహాలోకపు ప్రియురాలు, వీటన్నిటి కింద విముక్తి కోసం ఆక్రందిస్తున్న స్త్రీ. అలాగని ఈ క్యారక్టర్ మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ బాపతు కాదు. అలాటి పిచ్చి పని చేయలేదు దర్శకుడు. శరీర భాషపై, ముఖ కవళికలపై ఆమెకున్న పట్టు అమోఘం.
ఇక మన హీరో బేర్ గారు మైఖేల్ జాన్స్టన్ కూడా తక్కువేం కాదు. మొదట సానుభూతి కల్గించి, తర్వాత ఏవగింపు కల్గించే నటనలో పూర్తిగా నిమగ్నమై పోయాడు. మగాడి బలహీనతని డిస్టర్బింగ్ గా, చాలా వాస్తవికంగా నటించాడు. ఆమె శరీరాన్ని యుద్ధ భూ మిగా మల్చి, తనే యుద్ధం చేయలేక పశ్చాత్తాపంతో ఓటమిని కోరుకునే క్లయిమాక్స్ ని ఒక భయానక చేష్ట తో- ఇలాటి యూత్ కి ఒక పాఠం అన్పించేలా రిజిస్టర్ చేశాడు.
సినిమాటోగ్రాఫర్ టేలర్ క్లెమన్స్ దృశ్యపరంగా ఊపిరాడకుండా చేసే సన్నివేశాల్ని ఎఫెక్టివ్ గా చిత్రీకరించాడు. రెండు సార్లు నిక్కీ పాత్ర నిశ్చలమై పోతుంది. ఎంతకీ కదలిక లేకపోవడంతో ప్రొజెక్షన్ ప్రాబ్లమేమో అనుకుని చూస్తాం. వెంటనే చలనంలో కొస్తుంది. అంటే షాట్ ని ఫ్రీజ్ చేసి ఫ్రీజ్ అనిపించని విధంగా ఎడిట్ చేశాడన్నమాట ఎడిటర్ కూడా అయిన దర్శకుడు. నిక్కీ ఆడది అనే గుర్తింపు కనుమరుగవుతున్న కొద్దీ, కెమెరా ఆమెని మరింత టైట్ గా, చీకటి ఫ్రేముల్లో బంధించడం ప్రారంభిస్తుంది. కొన్ని షాట్స్ లో ఆమె కళ్ళు తప్ప ముఖం కూడా కనిపించదు. ఆకాశంలో సగం ఎవరు చూడొచ్చారు, ముందు మనతో వున్న భూమ్మీద సగాన్ని మాయం చెయ్యకండ్రా అంటున్నట్టు!
రాక్ బర్వెల్ అందించిన సౌండ్ డిజైన్, నేపథ్య సంగీతం నిశ్శబ్దాన్ని కూడా భయానకంగా మార్చడమే కాదు, మన కుర్చీ కింద దుష్టశక్తి వూపిరి తీసుకుంటున్నట్టు ఆదరగొడుతుంది. అదరగొట్టాలంటే బీజీఎం మోత అవసరం లేదని నిరూపిస్తుంది.

దర్శకుడు కర్రీ బార్కర్ హాలీవుడ్ జోలికెళ్ళకుండా, ఈ ఇండిపెండెంట్ సినిమాని పూర్తి
సృజనాత్మక స్వేచ్ఛతో సమాజంలో, పోనీ యువతలో ఏలుబడిలో వున్న ఐడియాలజీని ప్రశ్నిస్తూ
జెన్ జీ పద్ధతిలోనే జెన్ జీ మీద ఎక్కుపెట్టాడు. ఫ్రాంచైజీల కంటే, బిగ్ స్టార్స్
ఫాంటసీలకంటే, ఇది తమ గురించి చెబుతున్న తమ కథ అన్పించి సొంతం చేసుకున్నారు ‘జెన్ జీ’ వులు.
ఈ సినిమాలో గుణాత్మకంగా చూపించింది తమ కథే నన్న ఒకేఒక్క మౌత్ టాక్ తో వెల్లువెత్తారు.
ఈ రోజుల్లో యూట్యూబ్, టిక్‌టాక్, డిస్కార్డ్, ట్విచ్, రెడ్డిట్, గ్రూప్ చాట్లు, గేమింగ్ కమ్యూనిటీలలో
జోరుగా మౌత్ టాక్ వ్యాపిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్స్ సినిమా థియేటర్లకి పోటీ అని విమర్శిస్తారు.
కానీ ప్రేక్షకుల్ నాడిని పట్టుకోవడానికి ఇవే ప్రధాన వనరులు. ‘అబ్సెషన్’ దీనికి రుజువు!
-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)