దర్శకులు రాసుకుంటున్న స్క్రీన్ ప్లేలు గత 26
ఏళ్ళుగా 90 శాతం ఫ్లాప్స్ కే దారితీస్తున్న విషయం తెలిసే వుంటుంది. అయినా ఇప్పటి స్ట్రీమింగ్
యుగంలో కూడా అదే పాత మూసలో స్క్రీన్ ప్లేలు రాయడం, ఫ్లాపుల పరంపర కొనసాగించడం మానడం లేదు. వారం
వారం విడుదలవుతున్నసినిమాలు ఇందుకు సాక్ష్యం. ఇలా ఇంకెంత కాలం? స్క్రీన్ ప్లేలకి
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్మాణాత్మక సూత్రాల్ని ఈ బ్లాగు ద్వారా దృష్టికి
తెస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సినిమా నిర్మాణంలో నటీనటులు,
సాంకేతికులూ శ్రద్ధగా పనిచేసుకుపోతారు. ఒక్క స్క్రీన్ ప్లేల విషయంలోనే దర్శకులు
ఇష్టారాజ్యంగా చేసుకుపోతున్నారు. దీని ఫలితం అనుభవిస్తున్నారు. బ్లాగులో కొత్త
సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు పేజీలకి పేజీలు విడమర్చి వాడుక భాషలో రాసినా పరిస్థితిలో
మార్పు లేదు. ఈ సైన్స్ కొందరికి అర్ధంగాక పోవడం కారణం కావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బ్లాగు ఒక నిర్ణయం
తీసుకుంది. దర్శకులకి కథల్ని స్క్రీన్ ప్లేలుగా మార్చడానికి తగిన సహాయం అందించాలని.
ఇది చాలా కాలంగా జరుగుతున్నదే అయినా, ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులకి తెలియడం
కోసం ఈ ప్రకటన. స్క్రీన్ ప్లే రచన ఆషామాషీ వ్యవహారం కాదనీ, దీన్ని సీరియస్ బిజినెస్
గా తీసుకోవాలనీ గనుక మనస్ఫూర్తిగా భావిస్తే, రండి –స్క్రీన్ ప్లేలకి ఫ్లాపుల బెడద
వదిలిద్దాం! 90 శాతం ఫ్లాపుల సంఖ్యని వీలైనంత తగ్గించడం బాధ్యతగా చేపడదాం!
కాంటాక్ట్స్ ఈ కింద ఇస్తున్నాం.