రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

687 : స్పెషల్ ఆర్టికల్



గేట్ కీపర్ : జేసన్ బ్లమ్
నిర్మాత, బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్
ఆమోదించిన స్క్రిప్టులలో కొన్ని : పారా నార్మల్ యాక్టివిటీ, విప్లాష్, గెటవుట్

         
      స్క్రీన్ రైటింగ్ లో చీకాకు పెట్టె ట్రెండ్ : సెల్ఫ్ డబ్బా కొట్టుకునే కామెడీలు ఎక్కువవుతున్నాయి. కథలో జరుగుతున్న వాటి గురించి పాత్రలు కామెంట్లు చేయడం. స్క్రీన్ ప్లే అదిరిందనో ఇంకేదనో రచయిత / దర్శకుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ పాత్రలచేత పలికించడం. 2000 సంవత్సరం ఆరంభంలో ఇది ఫన్నీగానే అన్పించేది ప్రేక్షకులకి. ఇప్పుడు ఓవరై పోయింది.  ఇంకా పాత్రలు ఇతర సినిమాల్ని ప్రస్తావిస్తూంటాయి. ఇది కథలోంచి ఇతర సినిమాల పైకి ప్రేక్షకుల దృష్టి మళ్లించడమే. మీరు థియేటర్లో వున్నారని ప్రేక్షకులకి గుర్తు చేయడమే. కానీ రచయిత చేయాల్సింది ప్రేక్షకులు తాము థియేటర్లో వున్నామన్న సంగతి మర్చిపోయేలా చేయడమే.

జేసన్ బ్లమ్
       
          స్క్రిప్టు సాంప్రదాయ ఫార్మాట్ ని అనుసరించక తప్పదా? :  అస్సలు అవసరంలేదు. దాదాపు మేం చేసిన సినిమాలు ఫార్మాట్ ని బ్రేక్ చేసినవే. ‘పారానార్మల్ యాక్టివిటీ’ తో మొదటి సారిగా ఫార్మాట్ ని బ్రేక్ చేశాం. ఈ ఎనబై నిమిషాల మూవీలో ఫస్ట్ యాక్టే (బిగినింగ్) 45 నిమిషాలూ నడుస్తుంది. ఆ తర్వాత సగానికి ప్రధాన మలుపు వస్తుంది. సినిమాల్లో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం రిస్కుతో కూడుకున్న పనే. మేం చేసే ప్రతీ సినిమా ఫార్మాట్ అనే ఒక కాన్సెప్ట్ వుందనే హెచ్చరిక చేస్తూనే వుంటుంది.  

          చదివిన మొదటి మంచి స్క్రిప్టు : ‘సినిస్టర్’, ఆ తర్వాత ‘గెటవుట్’. 
      ఉన్న పాత సినిమాలనే సోర్స్ గా తీసుకుని రాసే స్క్రిప్తుల గురించి : నిజం చెప్పాలంటే ఈ సమ్మర్ లో బాగా సక్సెస్ అయిన సినిమాలు సూపర్ హీరో సినిమాలే. వీటికే ప్రేక్షకులు ఎక్కువ వుంటున్నారు. వంద మిలియన్ డాలర్లతో నేను  సినిమా తీస్తే ఇదే పని చేస్తాను. పాత సినిమాలని సోర్స్ గా తీసుకుని కామెడీలు తీస్తున్నారు. వాటికంటే హార్రర్స్ ని రీబూట్ చేయడం మేలు. హార్రర్స్ కాన్సెప్ట్స్ మీద ఆధారపడతాయి; కామెడీలు ఎక్కువగా నటుల మీదా కమెడియన్ల మీదా ఆధార పడతాయి. 
           స్క్రిప్టు నచ్చలేదని చెప్పడం : దీని గురించి నాకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ వున్నాయి. ఎందుకంటే స్క్రిప్టు బాగాలేదంటే కడిగి పారేసే వాళ్ళే ఎక్కువ. అందుకని అభిప్రాయం చెప్పడంలో వెంటనే రెస్పాండ్ అయి, నా పర్సనల్ టేస్టుకి లింకు పెడతాను. పర్సనల్ గా నాకు నచ్చలేదంటే కొంత బ్రతికి బయట పడతాను.
***