రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, డిసెంబర్ 2018, మంగళవారం

714 : స్క్రీన్ ప్లే సంగతులు

      భైరవగీత’ 80 లొకేషన్స్ లో తీశామని చెప్పారు. మేకింగ్ అద్భుతమే కాదనలేం. మేకింగ్ హేండివ్వదు. థింకింగ్ బాగోకపోతే  రైటింగే హేండిచ్చేస్తుంది. యథా రాత తథా తీత. రైటింగ్ రహస్యాలు అలాంటివి. మేకింగ్ రహస్యాలన్నీ రైటింగ్ రహస్యాల్లోనే దాగి వుంటాయి. ఓ షాట్ తీయాలన్నా సరే, ఆ రహస్యం రైటింగ్ లోనే వుంటుంది. తామే రాసుకుంటూ తీసే కొత్త దర్శకులెంత అదృష్టవంతులంటే, షూటింగ్ స్క్రిప్టు వాళ్ళే రాసుకోగలరు. విడిగా ఒక రైటర్ రాయలేడు, రాసివ్వలేడు. అతను లెఫ్ట్ రియాక్షన్స్, రైట్ డైలాగ్స్ రాసి సెల్యూట్ కొట్టి వెళ్లిపోవాలి - ఇంతకి మించి ఇంకేం రాసే అధికారం లేదు. ఒక్క కెమెరా యాంగిల్ రాసినా, కొత్త దర్శకుడైనా విసిరికొట్టేస్తాడు. అతడికా అధికారముంది. యాంగిల్స్ గానీ, ఇతర టెక్నికల్ డేటా గానీ సూచించడం రైటర్ జాబ్ కాదు. అది దర్శకుడు చూసుకునే పని. అయితే ఎందరు తామే రాసుకుని తామే తీసే కొత్త దర్శకులు సెట్ లో ఏం తీస్తారో స్క్రిప్టులో ఏం రాసుకుంటున్నారు?  స్క్రీన్ మీద ఏది ఎలా ప్లే అవుతుందో రాసుకునే స్వేచ్ఛ వుండీ స్క్రిప్టులో ఎంత రాసుకుంటున్నారు? దీనికి సమాధానం జీరో. మళ్ళీ రైటర్ రాసినట్టే అదే లెఫ్ట్ రియాక్షన్లూ, అదే రైట్ డైలాగులూ.
          కసారి ఈ కింది స్క్రిప్టు చూద్దాం...
అర్ధరాత్రి వేళ  వివిధ సిటీ లొకేషన్స్ చూపిస్తూ
( ఆర్ ఆర్ లో ట్రాఫిక్ సౌండ్స్ మాత్రమే, స్క్రీన్ మీద 2013,
హైదరాబాద్
అని పోస్టవుతూ,  ref: u tube clippings-
uptown areas )
- ఒక వీధి లోకొస్తూంటే...                             
ఒక పాత బిల్డింగ్
పాటతో రివీలవు తుంటుంది.
                                                                          పాట :   బాబూజీ ధీరే చల్నా..ప్యార్ మే జరా సంభల్కే..          
ఓ. .. బడే ధోకే హై..బడే ధోకే   హై..ఇస్ రాహ్ మే...
( ‘ఆర్ పార్’ -1954, గీతా దత్ )
బయట ఎక్కడో సెల్ ఫోన్ లోంచి వస్తున్నట్టు సన్నగా,
లో వాల్యూంలో వస్తూంటుంది పాట. బిల్డింగ్ పై అంతస్తు
లో ఒక కిటికీ సగం తెర్చివుంటుంది
. ఆ సందులోంచి...

          ఇలా పై విధంగా విజువల్స్ ఏమిటో, సౌండ్ ఏమిటో, ఎఫెక్స్ట్ ఏమిటో సీను కనుగుణంగా ఎందరు విజువల్ రైటింగ్ తో ప్రిపేరవుతున్నారు. పేపరు మీద స్వయంగా సంపూర్ణంగా అనుభవించనిది తెర మీద అనుభవం కాదు. శ్రద్ధగా, ఏకాగ్రతతో సినిమా తయారయ్యేది రెండే చోట్ల- ఒకటి ఆరంభిస్తూ రైటింగ్ టేబుల్ మీద, ఇంకొకటి ముగిస్తూ ఎడిటింగ్ టేబుల్ మీద. మధ్యలో జరిగే మేకింగ్ తతంగమంతా గందరగోళం, డిస్టర్ బెన్స్, టెన్షన్. అతను టేకులు తింటాడు, ఇతను డబ్బులు రావాలంటాడు, ఇంకొకామె మాకు భోజనాలులేవా అంటుంది, ఇంకో అసిస్టెంట్ డుమ్మా కొడతాడు... అంతుండదు. సినిమా అంటే 90% రైటింగ్, 10% మేకింగురా బాబూ అని హిచ్ కాక్ మొత్తుకున్నా, 10% రైటింగ్, 90% మేకింగే చేస్తున్నారు. 90% ఫ్లాపులు వస్తున్నాయి. ఇక ఆ 10% రైటింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు నేరకపోయి ప్రొడక్షన్ పనులు పెట్టుకున్నారా, ఇంతే సంగతులు. ఏకాగ్రత అనే పదార్థాన్నిఇక  వెతికి పట్టుకోవాలి.

        ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ రైటర్స్ తో కలిసి రాసుకుంటున్నంత కాలం ఎలాటి ప్రొడక్షన్ వ్యవహారాలూ ఆలోచించే వాడు కాదు, ఎవర్నీ డిస్టర్బ్ చేయనిచ్చే వాడు కాదు. ఒక కథా రచయితో, నవలా రచయితో ఎలా ఏకాంతంలో కూర్చుని తన రాత తను ప్రశాంతంగా రాసుకుంటాడో, అలా హిచ్ కాక్ స్క్రిప్ట్ మొత్తం రైటర్స్ తో కలిసి రాసుకునేవాడు. ఇలాటి ప్రశాంతత రైటర్స్ ఏకాగ్రతకి కూడా చాలా అవసరం. దీన్ని ప్రొవైడ్ చేసే వాడు హిచ్ కాక్. ఒక సీను తయారు చేయడానికి ఎన్ని రోజులు  ఆలోచించే వాడో గానీ, అది టెక్నికల్ గా ఇలా వచ్చేది. ఇక నేరుగా వెళ్లి షాట్లు తీసేయడమే.
FADE IN:
          
 INT. JEFFERIES' APARTMENT - DAY - LONG SHOT
           
Although we do not see the foreground window frame, we see
           
the whole background of a Greenwich Village street.

We can see the rear of a number of assorted houses and small
           
apartment buildings whose fronts face on the next cross-town
           
street, sharply etched by the morning sun.

Some are two stories high; others three; some have peaked
           
roofs, others are flat. There is a mixture of brick and wood
           
and wrought iron in the construction.

The apartment buildings have fire escapes, the others do not.  
           
The neighborhood is not a prosperous one, but neither is it poor.

           
 It is a practical, conventional dwelling place for
           
people living on marginal incomes, luck -- or hope and careful
         
 planning.

The summer air is motionless and heavy with humid heat.

It has opened windows wide, pushed back curtains, lifted
           
blinds and generally brought the neighborhood life into a
           
sweltering intimacy. Yet, people born and bred to life within
           
earshot and eye glance of a score of neighbors have learned
           
to preserve their own private worlds by uniformly ignoring
           
each other, except on direct invitation.

THE CAMERA PULLS BACK until a large sleeping profile of a
           
man fills the screen. It is so large that we do not see any
         
 features, but merely the temple and side of the cheek down
           
which a stream of sweat is running.

THE CAMERA PANS OFF this to the right hand side of the window,
           
and MOVES TO a thermometer which is hanging on the wall just
           
 outside the window. It registers 84.

THE CAMERA MOVES ON into the open, and brings nearer to us a
 `         
room with a large studio window.

To the right of him is a battered upright piano. On top of
           
the piano is a radio. The music selection coming from the
         
 radio stops, and the announcer is heard.

ANNOUNCER
The time -- 7:15 A.M., WOR, New York.
          
The temperature, outside, 84 --
           
Friends -- is your life worth one dollar?


             కనుక ఎన్ని లొకేషన్స్ లో తీశామని కాదు పబ్లిసిటీ, కంటెంట్ ఏమిటన్నది డిమాండ్. ఐదు లొకేషన్స్ లో, ఆరుగురు ఆర్టిస్టులతో, డెబ్బై లక్షలతో కంటెంట్ ఆధారిత కమర్షియల్ పాతిక రోజుల్లో తీసి కూడా కమ్మగా కోటి రూపాయలు జేబులో వేసుకుని నిద్రపోవచ్చు. కంటెంట్ ఏమిటన్నది, అది కాగితం మీద ఎలా వున్నదీ బాక్సాఫీసు చేసే తనిఖీ. తేడాగా వుందా చించి అవతల పారేస్తుంది. 

          ‘భైరవగీత’ ని మహానగరంలో విడుదలైన మెయిన్ సెంటర్ లోంచి మర్నాడే తీసేసి, పోయిన వారం విడుదలైన సినిమా మళ్ళీ వేసుకున్నారంటే ఎందుకని? ఇంకా దీని స్క్రీన్ ప్లే సంగతులు రాస్తే ఎవరికి ఆసక్తి వుంటుంది? ఒక స్క్రీన్ ప్లే సంగతులు రాయడమంటే ఒక స్క్రిప్టు రాసినంత పని. కానీ, తన ఫెయిల్యూర్స్ కూడా సొమ్ము చేసుకుంటాయనీ, ఏడాది తర్వాత క్లాసిక్స్ గా మారతాయనీ, సాక్షాత్తూ అల్ ఫ్రెడ్ హిచ్ కాకే చెప్పుకున్నాక...ఏమో రేపు ‘భైరవ గీత’ గుర్రం ఎగరా వచ్చు...కాబట్టి మిడిల్ విభాగం స్క్రీన్ ప్లే సంగతులు రేపు!

సికిందర్