రచన- దర్శకత్వం : శరత్ రెడ్డి
తారాగణం : ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ఖాన్, కావ్యా రెడ్డి, ఫారుక్ ఖాన్ తదితరులు.
మాటలు : ఫారుక్ ఖాన్, సంగీతం : శ్రవణ్, ఛాయాగ్రహణం : సృజన్ రెడ్డి పింగళి
నిర్మాత : బి ఆర్ కె
విడుదల : 18 సెప్టెంబర్, 2015
***
-సికిందర్
తారాగణం : ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ఖాన్, కావ్యా రెడ్డి, ఫారుక్ ఖాన్ తదితరులు.
మాటలు : ఫారుక్ ఖాన్, సంగీతం : శ్రవణ్, ఛాయాగ్రహణం : సృజన్ రెడ్డి పింగళి
నిర్మాత : బి ఆర్ కె
విడుదల : 18 సెప్టెంబర్, 2015
***
హైదరాబాద్ లోకల్ కామెడీలు ఒక ట్రెండ్ లాగా
కొనసాగుతున్నాయి. ఓల్డ్ సిటీ ‘డెక్కన్ వుడ్’ కేంద్రంగా ఇవి ఏ బాలీవుడ్ కీ, టాలీ
వుడ్ కీ చెందని సినిమాలుగా గత పదేళ్లుగా ఉత్పత్తి అవుతున్నాయి. ‘అంగ్రేజ్’ అనే తొలి
హిట్ కామెడీ తో తెలంగాణాలో, తెలంగాణా సరిహద్దుల్లో కర్నాటక, మహారాష్ట్ర జిల్లాల్లోనూ
మార్కెట్ ని పెంచుకుని ‘హైదరాబాద్ నవాబ్స్’,
‘హంగామా ఇన్ దుబాయి’, ‘హైదరాబాద్ బకరా’ ...అంటూ అడపాదడపా విడుదలవుతూనే ఉన్నాయి. అటు
పూర్తి హిందీ కాని- ఇటు ఉర్దూ కాని యాసలో (అక్కడక్కడా కొన్ని తెలుగు మాటలతో) అచ్చ హైదరాబాదీ ప్రజలు మాట్లాడే
భాషలో ఇవి పాపులరవుతున్నాయి. వీటిలో కామెడీకి అంతుండదు. ఓల్డ్ సిటీ ఉర్దూ హాస్య
కవితలకీ, నాటికలకీ ఎంత ప్రసిద్దో, స్థానిక ప్రజల్లో ఈ సినిమాలంత ప్రసిద్ధ
మవుతున్నాయి. వీటిలో పాత్రలు ధరిస్తున్న చరణ్ శ్రీవాస్తవ్, అద్నాన్ సాజిద్ ల వంటి
వాళ్లకి ఇప్పటికే అభిమానులేర్పడ్డారు.