రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 13, 2021

1008 : నిర్ణయం


డియర్ రీడర్స్,

        2021 లో తీసుకున్న నిర్ణయమేమిటంటే, మాస్ ఎంటర్ టైనర్లకి రివ్యూలు ఆపెయ్యాలని. గత 23 ఏళ్లుగా అవే సినిమాలకి అవే రివ్యూలు అలాగే రాసి రాసి, అవే స్క్రీన్ ప్లే సంగతులు అలాగే రాసి రాసి, ఒక చట్రంలో ఇరుక్కుపోయాం. ఇందులోంచి కొత్తగా నేర్చుకోవడానికింకేమీ లేదు. ఈ బ్లాగు ప్రధానంగా మేకర్స్ కి, రైటర్స్ కి ఉద్దేశించింది. ఇంకెంత కాలం ఇవే రివ్యూలు, ఇవే స్క్రీన్ ప్లే సంగతులు చదువుతూ వుంటారు. ఏమిటి ఉపయోగం. ఉపయోగపడే రివ్యూలు వైవిధ్యమున్న సినిమాలతో వస్తాయి. ఇప్పుడు అన్నిభాషల్లో వూహించని వైవిధ్యం అందుబాటులో కొచ్చేసింది. వీటిలోంచి క్రియేటివిటీకి కొత్త ద్వారాలు తెరుచుకునే వీలెంతో వుంది. తెలుగులో కూడా ఇలాటి వైవిధ్యంతో, క్రియేటివిటీ పరిధులని పెంచే చిన్న సినిమాలు వచ్చినా, పరిచయం చేసుకుందాం. సంచిక డాట్ కాం లో రాస్తున్న ప్రాంతీయ, అవార్డు సినిమాల్లో అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి. క్రియేటివిటీకి పదును పెట్టుకుంటే, తెలుగు మూస కమర్షియల్ సినిమాల రూపు రేఖలు కూడా ఇవి మార్చేయగలవు. క్రియేటివిటీ పరంగా ఇంకెంత కాలం టెంప్లెట్ సినిమాల మీద ఆధారపడతారు. వీటిలో రవంత స్క్రీన్ ప్లే టిప్ కూడా దొరకదు. 2021 లో నైనా ఆలోచనా ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సెలవు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

సికిందర్