రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జులై 2022, గురువారం

ఇది ఏ కాలం సినిమా!

    డాక్టర్ పోలీసుగా మారే రామ్ సినిమాలో వైద్యం చేయాల్సింది స్క్రిప్టుకి. రామ్ కి కావాల్సింది మంచి స్క్రిప్టు డాక్టర్, విలన్ కి వైద్యం చేసే పోలీస్ క్యారక్టర్ కాదు. దర్శకుడు లింగు స్వామి ఏనాటిదో పోలీసు- గూండా కాలం చెల్లిన కథకి కాలం చెల్లిన టేకింగ్ చేసి బోరు అనే పదానికి పూర్తి న్యాయం చేశాడు. అవతల విక్రమ్ దర్శకుడు హై ఎండ్ టెక్నాలజీ మేకింగ్ కి, లో -గ్రేడ్ మాస్ క్యారక్టర్స్ ని జోడించి సరిక్రొత్త బిజినెస్ మోడల్ ని సృష్టిస్తే, రామ్- లింగుస్వామిలు ఇంకా ఎక్కడో వుండిపోయి ఈ కాలపు సినిమా అంటే వారియర్అనుకుంటున్నారు!