రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 21, 2020

988 : స్పందన



 


  గత ఆదివారం Q&A లో ప్రశ్నకి, దాని సమాధానానికి దర్శకుడు సిఎస్ గారి స్పందన:         

    స్క్రిప్ట్ టింగ్లీష్ లో ఎందుకు రాస్తున్నారు అనే ప్రశ్న చూసి ఇది రాస్తున్నాను. ఏది కరెక్ట్ అనేది ప్రశ్న కాదు. ఏది అవసరం అనేది అసలు ప్రశ్న. నిర్మాత రాయమని చెప్తే, జవాబు సులభం. అతను చెప్పిన భాషలో రాయాలి. నిర్మాత లేక పోతే, అప్పుడు అసలు సమస్య ఇంగ్లీషా, టింగ్లీషా, లేక తెలుగా? ఒకవేళ రాసే వాడికి తెలుగు రాయడం రాకపోతే అది ఇంకోసమస్య (ఇప్పుడు యూత్ కు చాలా మందికి తెలుగు రాయడం, చదవడం రాదు). రచయతకు భాష అడ్డు కాదు.
        మొదటి
సమస్య: స్క్రిప్ట్ ని పాత పద్దతిలో ఎడమ, కుడి పక్క రాయాలా లేక హాలీఉడ్ టైప్ లో నవల లాగ రాయాలా? నరేట్ చేయడానికి అయితే ఏ పద్దతి అయినా ఒకే కానీ, చదవడానికి స్క్రిప్ట్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి హాలీఉడ్ పద్దతి ఉభయ తారకం. హాలీఉడ్ ఫార్మాట్ చదవడానికి ఈజీగా ఉంటుంది.
        రెండవ
సమస్య: భాష? నిర్మాత లేకుండా, భవిష్యత్తు నిర్మాత కోసం రాసుకుంటూ ఉంటే, జవాబు ఇవ్వడం కొంచెం కష్టం. ఎందుకంటే కొంత మంది నిర్మాతలు, దర్శకులు (పాత తరం, కొంత మంది కొత్త తరం కూడా) తెలుగులో కోరుకుంటారు. కొంత మంది ఇంగ్లీష్ లో కోరుకుంటారు. కాబట్టి ఏది రాయడం ఈజీయో భాషలో రాయాలి.
        మూడవ
సమస్య: డైలాగులు బాషలో రాయాలి? ఇంగ్లీషా, టింగ్లీషా, లేక తెలుగా? స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో రాసినా డైలాగ్స్ తెలుగులో రాయడం బెటర్. చదవడానికి ఈజీ గా ఉంటుంది. పైగా అనుకున్న భావం ప్రతిఫలిస్తుంది.
        స్క్రిప్ట్
తెలుగులో రాసినా, ఇంగ్లీష్ లో రాసినా, ఒక స్టేజిలో అవసరమైతే భాష మార్చి రాయాల్సి ఉంటుంది. అవసరమైతే టింగ్లీష్ లో కూడా. ఎందుకంటే చాలామంది నటులకు, టెక్నీషియన్స్ కు తెలుగు లేదా ఇంగ్లీష్ రాదు కాబట్టి. రెండో భా రాకపోతే విషయం నిర్మాతకు చెప్పి వేరే వారితో రాయించాలి. ఖర్చు నిర్మాతను అడగాలి.

సిఎస్, రచయిత, దర్శకుడు