రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 23, 2018

626 : మూవీ నోట్స్

Add caption

You disappointed me big time, Venu bhai!
నీదీ నాదీ ఒకే కథ - తిరోగమన వాదంలా వుంది. పకోడా వాదానికి సమర్ధింపులా వుంది. చదువులకి వ్యతిరేకంగా వుంది. వ్యక్తిత్వ వికాసాన్ని వద్దంటోంది. నిరాశగా, నిర్ గమ్యంగా బతకమంటోంది. నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోమంటోంది.ఆ ఆనందం భౌతిక వాదాన్ని కాదంటోంది. కానీ మనిషి శరీరం భౌతికమైనదే. ఈ సృష్టి భౌతిక మైనదే. మనిషి జీవితం భౌతికాత్మికమే.  భౌతిక స్వరూపం లేకుండా ఆత్మ లేదు, ఆనందం లేదు. ఈ స్ట్రక్చర్ లేని పనిలో ఆనందం చేతకాక తిరోగమనవాదమే. ఆర్టు సినిమా జీవితమే.  ఫేక్ పర్సనాలిటీలు ఎక్కడా లేవు, గ్లోబల్ ప్రపంచంలో భాగం కాలేని బీదనినాదమే అది. ‘అసమర్ధుని జీవయాత్ర’ 
కూడా ఇంత డిప్రెస్సివ్ మూడ్ లోకి తీసికెళ్ళదు  ముగింపుతో. అథోజగత్ యాత్రే యువత బాటగా చూపించారు...సారీ భాయ్, వెరీ సారీ!


సికిందర్

(ఈ మూవీ చూసి ఏమైనా అంటే మేధావి అంటారని చూడకూడదనుకున్నాను. ప్రివ్యూకి పిల్చినా పోలేదు. అలా వూరుకోకుండా బయట చూశాను. చూసి వూరుకోకుండా రాశాను. రాస్తే చాలామందికి నచ్చలేదు. తెలంగాణా సినిమా కాబట్టి నెగెటివ్ గా  వున్నా జై అనాలని అర్ధమైంది. అలాగే జై అందాం... జై నీదీ నాదీ ఒకే కథ!)