రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 4, 2020

905 : రివ్యూ



దర్శకత్వం : సచిన్ రవి
తారాగణం :
: క్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాత్స, అచ్యుత్ కుమార్, బాలాజీ నోహర్, ప్రమోద్ శెట్టి, రిషబ్ శెట్టి తదితరులు
‌: క్షిత్ శెట్టి, సంగీతం: అజనీష్ లోక్నాథ్, ణ్ రాజ్;  ఛాయాగ్రహణం : కర్మ చావ్లా, కూర్పు: క్షిత్ శెట్టి, చిన్ వి
బ్యాన
ర్‌: పుష్కర్ ఫిలింస్
నిర్మాతలు: హెచ్‌.కె.ప్రకాశ్, పుష్క ల్లిఖార్జునయ్య
విడుదల : జనవరి 1, 2020
      న్నడ నిర్మాతలు పానిండియా మార్కెట్ మీద దృష్టి పెట్టి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. 2018 లో ఇలా ఐదు భాషల్లో ‘కేజీఎఫ్’ తీసి భారీ విజయం సాధించాక, ఇప్పుడు ‘అవనే శ్రీమన్నారాయణ’ (అతడే శ్రీమన్నారాయణ) తో ఐదు భాషల బ్లాక్ బస్టర్ ని ఉద్దేశించారు. కొత్త దర్శకుడు సచిన్ రవి, హీరో రక్షిత్ శెట్టిలు ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ ని అఖిల భారత ప్రేక్షకులకి సగర్వంగా సమర్పించారు. పానిండియాలో నాల్గు భాషలు సౌతిండియావే వుంటున్నాయి. నార్త్ లో హిందీ ఒక్కటే. అయినా పానిండియా అంటున్నారు. సౌతిండియా నుంచి ఇలాటి పానిండియాలు ఇటీవల ‘సైరా’, ‘సాహో’ లు వచ్చాయి. వీటి ఫలితాలు చూడనే చూశాం. ఐతే 60 కోట్లతో తీసిన ‘కేజీఎఫ్’ పానిండియా - ఓవర్సీస్ బాక్సాఫీసు 250 కోట్లు దాటి అతిపెద్ద హిట్టయింది. కన్నడ నుంచే  వచ్చిన ఈ రెండో పానిండియా మాటేమిటి? ఇది చూద్దాం...

కథ
     1980 లలో అమరావతి అనే కల్పిత ప్రాంతం. అక్కడొక టూరింగ్ నాటకాలేసుకునే ట్రూప్ భారీగా దోపిడీలు చేసి సొత్తుని దాస్తూంటారు. ఈ ప్రాంతానికి దొరగా రామరామ అభీర (మధుసూదన రావు) వుంటాడు. ఓ రోజు అతను ఈ ముఠాని పట్టుకుని కొందర్ని చంపేస్తాడు. కానీ ఆ నిధి ఎక్కడ దాచారో రహస్యం తెలియదు. ఇంతలో తను కూడా చనిపోతాడు. అతడి ఇద్దరు కొడుకులు జయరాం, (బాలాజీ మనోహర్), తుకారాం (ప్రమోద్ శెట్టి) లు తండ్రి వారసత్వం కోసం పోటీ పడతారు. బలవంతుడైన జయరాం కోటలోంచి తుకారాం ని తరిమేస్తాడు. తుకారాం తర్వాతి కాలంలో అమరావతిలో రాజకీయ నాయకుడవుతాడు, జయరాం బందిపోటై నిధి వేటలో వుంటాడు. పదిహేనేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అమరావతికి కొత్త పోలీసు ఇన్స్ పెక్టర్ గా శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) వస్తాడు. అతడికి రిపోర్టర్ లక్ష్మి (శాన్వి) పరిచయమవుతుంది. శ్రీమన్నారాయణ కానిస్టేబుల్ అచ్యుత్ (అచ్యుత్ కుమార్) తో కలిసి నిధి రహస్యం కనుక్కునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో జయరాం, తుకారాంల నుంచి ఎలాటి ప్రతిఘటనలు ఎదురయ్యాయనేదే మిగతా కథ.  

ఎలావుంది కథ
      ట్రెజర్ హంట్ (నిధి వేట) జానర్ కథ. దీనికి ‘సదరన్ ఆడ్ ఫిక్షన్’ (southern odd fiction) అని పేరు పెట్టుకున్నారు ఈ మేకర్లు. ఆడ్ ఫిక్షన్ కాబట్టని కౌబాయ్, పౌరాణిక, గ్యాంగ్ స్టర్, బందిపోటు, ఫాంటసీ తదితర జానర్లన్నీ ఇష్టారాజ్యంగా కలిపేసి పాత్రల్నీ, కథనీ వండి వార్చేసి- ఏదీ ఫీల్ కాకుండా చేశారు. కళాత్మకం అనే పదానికి అర్ధం కూడా మార్చేశారు. కథాకథనాలు పక్కన బెట్టి, బ్రహ్మాండమైన మేకింగ్ తో ‘కళాత్మకం’ చేయబూనారు. కథాకథనాలతో బోలెడు కన్ఫ్యూజ్ చేశారు. రాయడానికీ తీయడానికీ మూడేళ్ళూ  శ్రమించామని చెప్పుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ చూస్తే ఐదు భాషల్లో పానిండియా మార్కెట్ కి సమకట్టారు. కానీ కన్నడ స్వాభిమానం ఎక్కువైపోయి కన్నడ నటీనటుల్నే మొత్తం తారాగణంగా పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కర్ణాటక దాటితే ప్రేక్షకులకి తెలియరు. పైపెచ్చు కన్నడ పైత్యాన్నేదృశ్య దృశ్యాలుగా పంచిపెట్టారు. ఈ పైత్యానికి రెండు గంటల సమయం చాల్లేదు. మూడు గంటలా ఆరు నిమిషాల సమయమంతా తీసుకుని వీరంగం వేశారు. పానిండియా థియేటర్లకి కరెంటు, ఏసీ ఛార్జీల అదనపు బిల్లులు వడ్డించి ఆనందించారు. పానిండియా ప్రయత్నం పెనం మీంచి పొయ్యిలో పడింది. ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ కన్నడిగలకే ఊడిగం చేసింది.


       ఇక కన్నడ సినిమాలు ‘అవనే శ్రీమన్నారాయణ’ కి ముందూ, తర్వాతా’ అంటూ చరిత్ర రాసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఒక ‘మెకన్నాస్ గోల్డ్’ లాగానో, ‘నేషనల్ ట్రెజర్’ లాగానో ఔట్ డోర్ అడ్వెంచర్ కి పూనుకోకుండా, డైలాగులే ఎక్కువ - యాక్షన్ తక్కువగా డ్రామెడీగా మార్చేశారు. నిధి వేట సినిమాలంటే పిల్లా పెద్దా అందరికీ అద్భుత రసంతో వినోదాల విందుగా, పసందుగా వుండే ఆచారాన్ని విడనాడి పెడదారి పట్టిపోయారు. ప్రేక్షక వర్గాల్ని బొటాబోటీ పిడికెడు మాత్రంగా తగ్గించుకుని ఉస్సూరన్పించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించేలా, రిపీట్ ఆడియెన్స్ కి నోచుకునేలా నిర్మించక పోతే,  రిటర్న్ ఎలా వస్తాయి? ‘సైరా’ తో ఈ పాఠం నేర్చుకునే వుండాలి. 


ఎవరెలా చేశారు
       రక్షిత్ శెట్టి కన్నడలో నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి హీరోతో బాటు రచయిత కూడా. పాత్ర ప్రకారం కామిక్ - ఫన్నీ నటన ఓకే. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కొన్ని యాక్షన్ సీన్లూ ఓకే. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ ఫైట్ సీను. అయితే ఇది నామ్ కే వాస్తే కౌబాయ్ క్యారక్టర్. ఆ క్యారక్టర్ లుక్కే వుండదు. ఎంట్రీ సీనుతో ఇచ్చిన బిల్డప్ తర్వాత క్యారక్టర్ తో వుండదు. పని తక్కువ, వాగుడు ఎక్కువ క్యారెక్టర్. ఈ అతి చలాకీతనం క్యారక్టర్ వల్ల కథ వున్న చోటే వుండి పోతుంది. మాటకారి తనం, రకరకాల ట్రిక్స్ ప్రయోగించడం ఇదే క్యారక్టరైజేషన్. ఈ ఇన్స్ పెక్టర్ నారాయణ ఎన్నో మంత్రాలు వేస్తాడు. ఏదీ పేలదు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అవ్వదు. ‘భక్త ప్రహ్లాద’ సినిమా ప్రదర్శనలో ఎంట్రీ ఇస్తాడు. హిరణ్య కశిపుడు స్తంభాన్ని బద్దలు కొడితే రావాల్సిన నరసింహుడి బదులు రక్షిత్ శెట్టి వచ్చేస్తాడు. బాగానే వుంది. కానీ పోనుపోను పాత్రా నటనా మొనాటనీ బారినపడి ఫస్టాఫ్ కే తేలిపోయింది. 36 నెలలూ 3 గంటల 6 నిముషాలూ తీస్తూపోతే డైనమిక్స్ కాపాడ్డం కష్టమే. 18 నెలలు అతిగా రాసి, 18 నెలలు అతిగా తీసినప్పుడు ఇలాగే అవుతుందని అనుకోవాలేమో. 


        హీరోయిన్ హీరోయిన్ లా లేదు. ఆమె కంటికే అనడం లేదు. సహాయ నటిలా వుంది. ఇక ఇద్దరు విలన్ల పాత్రల్లో కన్నడ నటులు వాళ్ళ ప్రతిభ చాటుకున్నారు. సంగీతం మైనస్సే గానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం ఈ మిక్స్డ్ జానర్ కి ఒకే లుక్ తో వున్నాయి - చారిత్రకం అన్నట్టు. ఈ తరహా సెట్టింగులు చారిత్రక సినిమాల్లోనే వుంటాయి. బార్ సెట్ మాత్రం డిజైనర్ కౌబాయ్ లుక్ తో చేశారు. యాక్షన్ సీన్స్ కౌబాయ్ తో సంబంధం లేదు. ఇక దర్శకుడే ఎడిటర్ అయినందు వల్ల 3 గంటల 6 నిమిషాలు తృప్తిగా నిడివి పెట్టుకున్నాడు. 
3 గంటల 6 నిమిషాల సినిమాకి 4 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్ కూడా కట్ చేసి ఔరా అన్పించుకున్నాడు అఖిల భారతీయంగా. 

చివరికేమిటి
        ఈ సినిమా చూస్తూంటే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకురాక మానదు. 2012 లో విడుదలైన పవన్  కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రివ్యూలో కొంత భాగాన్ని ఒకసారి చూద్దాం...

        స్టార్ సినిమాలంటే అవే ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలనే నమ్మి ఏ వైవిధ్యం లేకుండా వాటినే ఉత్పత్తి చేస్తూ, ముందుకు పోలేని ఒక ప్రతిష్టంభన నెదుర్కొంటున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ -  హరీష్ శంకర్ ల ‘గబ్బర్ సింగ్’ ఆగమనం ఓ ఆశా రేఖ. మనం గతంలో చాలా వెస్టర్న్ కౌబాయ్ సినిమాలు చూసే వుంటాం. అవి మన ఫ్యాక్షన్, మాఫియా సినిమాల్లాగా డార్క్ మూడ్ ని క్రియేట్ చేసేవి కావు. కౌబాయ్ పాత్రలు మన జానపద పాత్రల్లాంటివే. వినోదాన్ని అందించడానికే అవి పుట్టాయి. పైగా కౌబాయ్ పాత్రలు అమెరికన్లకి మిథికల్ (పౌరాణిక) పాత్రల్లాంటివి. అవి వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. రానురాను వీటికి కాలం చెల్లిపోవడంతో, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి మానవాతీత శక్తుల మిథికల్ పాత్రల్ని ప్రవేశపెట్టి అలరించ సాగారు. అయినా కౌబాయ్ చచ్చి పోలేదు. ముఖ్యంగా  భారతీయ ప్రేక్షకుల స్మృతి పథంలో నిలిచే వున్నాడు. మరీ తెలుగు ప్రేక్షకులనైతే ‘మోసగాళ్ళకు మోసగాడు’ నుంచీ ‘టక్కరి దొంగ’ వరకూ అడపా దడపా పలకరించి పోతూనే వున్నాడు. అయితే ఓ మారు వేషంలో రావడం మాత్రం ఇదే ప్రథమం. అసలు మొత్తం భారతీయ వెస్టర్న్ సినిమాల మీద రాజేంద్ర ప్రసాద్ తో తీసిన పేరడీ ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఓ హాస్య ప్రహసనం వుండగా, ఒక పోలీసు వేషంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ గా కౌబాయ్ రావడం పైన చెప్పుకున్న ప్రతిష్టంభనని బద్దలు చేసే ఒక అపూర్వ క్రియేటివిటీయే అయింది.


        హిందీ ‘దబంగ్’ లో సల్మాన్ ఖాన్ ది సాదా పోలీసు పాత్ర. అతడి వ్యవహార సరళి ప్రేక్షకులకి అలవాటయిన అతడి తీరులోనే వుంటుంది. దీని రీమేకైన ‘గబ్బర్ సింగ్’ లో పాత్ర భారీ రూపాంతరం చెందింది. ఒక ఏరియాని ఇష్టారాజ్యంగా ఏలుకునే వెస్టర్న్ సినిమాల్లోని కౌబాయ్ క్యారక్టర్ లా అతను ప్రవర్తిస్తాడు. ఇష్టం వచ్చినట్టు తుపాకులు పేలుస్తాడు. సిబ్బందిని గ్యాంగ్ లా వెంటేసుకు తిరుగుతాడు. వాళ్ళతో ‘గబ్బర్ సింగ్’ డైలాగులు కొడతాడు. ఫన్నీ డైలాగులతో ప్రత్యర్ధి ముఠాతో ఆడుకుంటాడు. వెస్టర్న్ సినిమాలని తలపించే ప్రదేశాల్లో గుర్రమెక్కి, బైకెక్కి, జీపెక్కి సంచరిస్తాడు. అలాంటి వొక ఎడారి మైదానంలో పోలీస్ స్టేషన్ కూడా వుంటుంది. దాని బోర్డుని గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మార్చేస్తాడు. కౌబాయ్ లా ఈ తన అడ్డా తనిష్టం. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడెక్కడ కూర్చుంటాడో తెలీదు. ఏ భంగిమలో కూర్చుంటాడో తెలీదు. తన వెంట వుండే సాంబా అనే ‘షోలే’ క్యారక్టర్ తో తను పలికే ఆణిముత్యాలని నోట్ చేసుకొమ్మని ఆర్డరేస్తూ, గిరీశంలా లిటరరీ టచ్ కూడా ఇస్తాడు. ‘దబంగ్’ మహారాష్ట్ర లోని రియల్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంటే, ‘గబ్బర్ సింగ్’ కోసం గ్రామం సహా, అన్ని లొకేషన్సూ సెట్సే వేశారు. దీంతో తెలుగు నేటివిటీకి భిన్నంగా ఒక డిజైనర్ లుక్ తో మోడరన్ వెస్టర్న్ వాతావరణ నేపధ్యం సమకూరినట్టయింది...

         ఇదీ జానర్ ని పది జానర్లతో కలిపి కషాయంలా చేయకపోవడంతో వున్న ప్రయోజనం. కౌబాయీకరణలో ‘గబ్బర్ సింగ్’ ఏకసూత్రత హీరోని దృష్టినాకర్షించే ఫోకస్ తో ప్రస్ఫుటంగా నిలబెట్టింది. రక్షిత్ శెట్టి కౌబాయ్ తనం, నేపథ్యవాతావరణం ఈ జల్లెడ పట్టలేక కథనీ, పాత్రనీ కలగాపులగం చేశాయి వివిధ జానర్ల తాపడంతో.

        ఇలావుంటే కథకి స్ట్రక్చర్ అనేది లేదు. పైగా కథనుంచి వెళ్ళిపోయి విన్యాసాలు. గంటన్నర ఫస్టాఫ్ అంతా కథలోకే వెళ్ళదు. ఒక పేలవమైన డైలాగుతో ఇంటర్వెల్ కూడా బలైంది. సెకండాఫ్ మొదలెడితే ఇంకా అవే డైలాగ్ కామెడీలు, వున్న చోటే డ్రామాలు. నిధికోసం వేటలో వుండాల్సిన పాత్రలు రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడేసిన గొంగళిలా వుంటాయి. ఇక క్లయిమాక్స్ అత్యంత పేలవం. ట్రెజర్ హంట్ జానర్ కథ అడ్వెంచర్ ప్రధానంగా వుంటుందనేది ప్రాథమిక జ్ఞానం. ఇది కూడా లేకపోతే ఎలా?

        సూపర్ స్టార్స్ తో ‘మెకన్నాస్ గోల్డ్’ (1969) అనే బృహత్తర సినిమా సాంతం ఔట్ డోర్ కౌబాయ్ అడ్వెంచరే. ఇందులో నిధి వున్న పర్వతాల్లో భూకంపం వచ్చే దృశ్యాల్లో ముఠాలు ఇరుక్కునే క్లయిమాక్స్ సినిమాకే తలమానికం. ఈ దృశ్యాలతోనే ఈ సినిమా ప్రసిద్ధి. ‘అతడే శ్రీమన్నారాయణ’ దేనికి ప్రసిద్ధి? భారీ పెట్టుబడులతో ఇలాటి బిగ్ కాన్వాస్ సినిమాలు తీసేప్పుడు హాలీవుడ్ లో ఇలాటి సినిమాల గురించి వచ్చిన రైటింగ్, మేకింగ్ సంబంధ పుస్తకాలు, దర్శకుల ఇంటర్వ్యూలూ చదవాల్సిన అవసరముంది. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ ల మీద పుస్తకాలు అద్భుత ద్వారాలు తెరుస్తాయి. పానిండియా అనుకునే ముందు పఠనం లేకపోతే పతనం పొంచి వుంటుంది. 

        నికొలస్ కేజ్ నటించిన ‘నేషనల్ ట్రెజర్’ (2004) మోడరన్ అడ్వెంచర్ కి ప్రతీక. ఇందులో కథ ఓ పది నిమిషాలకే ప్రారంభమైపోతుంది. గోల్ వచ్చేసి 1776 నాటి ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండెపెండెన్స్’ కళాకృతుల్ని చేజిక్కించుకోవడం. చరిత్రకారుడి పాత్రలో హీరోగా నికోలస్ కేజ్ కి ప్రత్యర్ధులుగా కిరాయి ముఠాలు. కేజ్ కి ఒక నైతికపరమైన సందిగ్ధత కూడా వుంటుంది. అతను ముందు కెళ్తే ఎఫ్బీఐ అతణ్ణి ప్రజాశత్రువు నెంబర్ -1 గా ప్రకటించే ప్రమాదముంది. దీనికి ఆస్కార్ నామినేషన్ వరకే దక్కవచ్చు. కానీ ఔట్ డోర్ అడ్వెంచర్ గా దీని వినోదాత్మక విలువ తీసివేయలేనిది.

        ‘అతడే శ్రీమన్నారాయణ’ మేకింగ్ లోనే తప్ప రైటింగ్ లో సత్తా చాటుకోలేక పోయిన పాక్షిక ప్రయత్నం. ఐతే 23 కోట్లే బడ్జెట్ అంటున్నప్పుడు ఓపెనింగ్స్ తో బయటపడే అదృష్టముంది.

సికిందర్