అతను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయదల్చుకోలేదు, సినిమా రైటర్ అవదల్చు కోలేదు, నిర్మాతా అవ్వాలనుకోలేదు, హీరో అవ్వాలనుకోలేదు. పెద్ద స్టార్ మాత్రమే అవ్వాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆడిషన్స్ లో నటనకి పనికిరావు పొమ్మంటున్నారు. కారణం అతడి ముఖం ఎడమ భాగం కింది వైపు పక్షవాతం వల్ల ముఖ కవళికలు పలకవు. పురిట్లో డాక్టర్ పొరపాటువల్ల జరిగిన అనర్ధం. వెయ్యి ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాడు. ఒకవైపు పేదరికం, భార్యతో గొడవలు. చెప్పకుండా ఆమె నగలు తీసికెళ్ళి అమ్మేశాడు. ఆమె అతడ్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ పెంపుడు కుక్క వెళ్ళలేదు, విశ్వాసంతో తనతోనే వుంది. డబ్బుకోసం దాన్ని కూడా తీసికెళ్ళి పాతిక డాలర్లకి అమ్మేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఓ రోజు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మహ్మదాలీకీ, చక్ వెప్నర్ అనే జ్యూనియర్ కీ మ్యాచ్ జరుగుతోంటే వెళ్ళి చూశాడు. వెప్నర్ గెలిచే ప్రసక్తే లేదు. అయితే గెలిచి తీరతానన్న అతడి ఆత్మవిశ్వాసం కదిలించింది. అంతే, దీంతో మూడురోజుల్లో ఒక కథ సృష్టించి స్క్రిప్టు రాసేశాడు.
ఆ స్క్రిప్టు పట్టుకుని తిరగసాగాడు. ఎవరికీ నచ్చడం లేదు. నీకు రాయడం రాదు వేరే పని చూసుకో మనసాగారు. అలా తిరుగుతోంటే ఓ పేరున్న నిర్మాతకి నచ్చింది. దానికి లక్షాపాతిక వేల డాలర్లు ఆఫర్ చేశాడు. ఆ డబ్బుతో రిచ్ గా సెటిలై పోవచ్చనుకున్నాడు. అయితే నిర్మాత షరతు పెట్టాడు. ఇందులో హీరో రోల్ ఇవ్వనన్నాడు. స్క్రిప్టు అమ్మేసి వెళ్ళి పొమ్మన్నాడు. నేను స్టార్ ని అవ్వాలనే ఈ స్క్రిప్టు రాసుకున్నాను, నాకు డబ్బులెందుకు అని వెళ్ళిపోయాడతను.
కొన్ని రోజుల తర్వాత అదే నిర్మాత పిలిచి- ఒరే బాబూ, రెండున్నర లక్షల డాలర్లు తీసుకో, స్క్రిప్టు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. అస్సలు కుదరదన్నాడు. మరి కొన్ని రోజుల తర్వాత అదే నిర్మాత మళ్ళీ పిలిచి- బాబ్బాబూ, నీ మొహంతో స్టార్ వి కాలేవురా, మూడున్నర లక్షల డాలర్లకి స్క్రిప్టు ఇచ్చేసి వెళ్ళిపోరా అన్నాడు. అస్సలంటే అస్సలు కుదరదన్నాడు. నా స్క్రిప్టులో నేను స్టార్ గా యాక్ట్ చేయాల్సిందేనన్నాడు.
ఆఖరికి దిగి వచ్చాడు నిర్మాత- సరే అలాగే కానీయ్, కానీ 35వేల డాలర్లే నీకిస్తా నన్నాడు. దీనికి ఒప్పుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని వెంటనే పెంపుడు కుక్క కోసం వెళ్ళాడు. మూడురోజులు వెతికితే కొనుక్కున్న వ్యక్తి కనబడ్డాడు. పెంపుడు కుక్కని వెనక్కి ఇచ్చేయమని ఆ వ్యక్తికి 500 డాలర్లు ఆఫర్ చేశాడు. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. వెయ్యి డాలర్లకీ ఒప్పుకోలేదు. ఆఖరికి 15 వేల డాలర్లకి బేరం కుదిరింది. ఆ డబ్బు చెల్లించి పెంపుడు కుక్కని ఇంటికి తెచ్చేసుకున్నాడు. పాతిక డాలర్లకి అమ్మేసిన పెంపుడు కుక్కని, పారితోషికంగా తనకొచ్చిన 35 వేల డాలర్లలో 15 వేల డాలర్లు దానికే వెచ్చించేశాడు. భార్య తనని వదిలేసి వెళ్ళిపోయినా ఇది విశ్వాసంతో తనతోనే వుంది మరి!
ఇక తను స్టార్ గా నిర్మాత మొదలెట్టిన సినిమా నటించేశాడు. అది 1976 వ సంవత్సరం. ఆ సినిమా సర్ప్రైజ్ హిట్టయ్యింది. 200 మిలియన్ డాలర్ల కలెక్షన్లు. దీనికి ఆస్కార్ అవార్డులు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్ ఆస్కార్ అవార్డులు. బెస్ట్ యాక్టర్ గా, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గా రెండు నామినేషన్లు. దీంతో తనని స్టార్ గా ఫీలవుతూ ఎంట్రీ ఇచ్చిన సినిమాతో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టారే అయిపోయాడు. ఆ సినిమా ‘రాకీ’. ఆ స్టార్ ఇంకెవరో కాదు, సిల్వెస్టర్ స్టాలోనే! తర్వాత ‘రాకీ’, ‘రాంబో’ సిరీస్ సినిమాల ‘సిల్వెస్టార్’!
బిగ్ గోల్స్ రహస్యమిదే!
స్టాలోన్ గురించి ఇప్పుడెందుకంటే, లా ఆఫ్ ఎట్రాక్షన్ మానసిక స్ట్రక్చర్ లో సెల్ఫ్ ఇమేజి ప్రధాన పాత్ర వహిస్తుంది. జీవితంలో ఏం పాత్ర పోషించాలనుకుంటున్నామో, ఆ పాత్రలో మనల్ని మనం ఊహించుకోకపోతే ఎల్ ఓ ఏ పని చేయదు. లక్ష్యాన్ని సాధించలేం. అసలు లక్ష్యమంటూ ఏర్పడదు. ఇది కాసేపూ అది కాసేపూ అని మనసు నిలకడ లేకుండా వివిధ విషయాల మీదికి పోతుంది. వెరసి ఏమీ కాకుండా పోతాం. ఒక్కోసారి అధైర్యం, ఆత్మ న్యూనతా భావం, భయం వంటివి సెల్ఫ్ ఇమేజిని సృష్టించుకోవడానికి ప్రతిబంధకాలవుతాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే అతి పెద్ద గోల్ ని ప్లానింగ్ చేయాల్సిందే.
సిల్వెస్టర్ స్టాలోన్ తన ముఖంలో కుంగ
దీసే చిన్న లోపాన్ని చూసుకుని అధైర్య పడలేదు. అదెంత కుంగదీస్తోందో అంత ఆకాశాన్నంటే గోల్
ని సృష్టించుకుని, తనని ఏకంగా స్టార్ గా ఊహించుకుంటూ, నామరూపాల్లేకుండా లోపాన్ని పాతాళంలోకి తొక్కేశాడు. హాలీవుడ్
స్టార్ గా తన సెల్ఫ్ ఇమేజిని ముందే సృష్టించుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్
నెరసిన జుట్టునీ, బట్ట తలనీ పట్టించుకోలేదు. వాటిని గాలికొదిలేసి యాక్టర్ గా తనని
విభిన్నంగా ఊహించుకుంటూ, టాప్ లెవెల్ ఇమేజిని మనసులో సృష్టించుకున్నాడు. దీని వల్ల తను బయట ఎంత
అందవిహీనంగా కనిపించినా ప్రేక్షకుల అభిమానం తగ్గలేదు. అందాల నటుడు దివంగత శోభన్
బాబు రిటైరయ్యాక బయట కనిపించలేదు. ఎందుకంటే అందాల నటుడుగా ప్రేక్షకుల్లో తన గ్లామరస్
ఇమేజి ఎలా ముద్రించుకుందో, అదే ఇమేజితో వాళ్ళ జ్ఞాపకాల్లో మిగిలిపోవాలని,
గ్లామరున్నప్పుడే రిటరై పోయి వృద్ధాప్యంలో బయట ఎవరికీ కనిపించలేదు.
సెల్ఫ్ ఇమేజి ఎంత పనిచేస్తుందో విజువల్ గా చెప్పడానికి ఆలోచిస్తూంటే, ఎప్పుడో చదివిన స్టాలోన్ అనుభవం మెదిలి, దాన్ని వెతికి తెచ్చి ఇక్కడ పేర్కొన్నాం. ఐతే బిగ్ గోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే విశ్వం అనంత మైనది, పైగా ఇంకా విస్తరిస్తూ పోతోంది. దానికి ఎంతయినా పంచి పెట్టడానికి కొరతంటూ లేదు. మనుషుల మీద ఆధారపడితేనే గోల్స్ ని కురచ చేసుకుంటాం. మనుషులతో పోటీ పడితేనే అవకాశాల్ని పరిమితం చేసుకుంటాం. మార్కెట్ లో పోటీ ఎక్కువుంది, మన వస్తువు అమ్మకం కష్టమనుకోవడం విశ్వాన్ని అర్ధం జేసుకోక పోవడం వల్లే. పోటీ, పోటీ, అన్ని రంగాల్లోనూ పోటీ అనే మాట పెరిగిపోతోంది. పోటీ పరీక్షలని చెప్పి విద్యార్ధులని కూడా లేనిపోని వొత్తిళ్ళకి లోనుజేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోటీ అనే పదాన్ని నెగెటివ్ పదంగా ఎంచి నిషేధించాలి.
ఎవ్వరూ ఎవ్వరితోనూ పోటీ పడనవసరం లేదు- ఎంత కోరుకుంటే అంత సమృద్ధిగా అందించే వనరుగా అనంత విశ్వమే వుంటే ఏమిటి పోటీ? సిల్వెస్టర్ స్టాలోన్ స్టార్ గా అవకాశమిస్తేనే స్టోరీ ఇస్తానని రాజీ లేని బిగ్ గోల్ పెట్టుకుంటేనే కదా దాన్ని నిజం చేసి విశ్వం అందించింది? చాలా మంది కొత్త దర్శకులు తీసే చిన్నచిన్న సినిమాలకి కూడా ఎంత బిజినెస్ చేస్తుందో నిర్మాతకి వివరించి అంచనా ఇవ్వడానికి జంకుతారు. అది నిర్మాతకి వివరించడం కాదనీ, విశ్వానికి చెప్తున్నామనీ నమ్మితే, ఆ బిజినెస్ విశ్వమే తెచ్చి చూపిస్తుంది. ఏం కావాలో ఖచ్చితంగా కోరుకోవాలి, ఎంత కావాలో స్పష్టంగా తెలియజేయాలి- లేకపోతే నిజాయితీ లోపించి ఎల్ఓఏ పని చేయదు.
మానసిక
స్ట్రక్చర్ సంగతులు
అయితే వీటన్నిటికంటే ముందుగా మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. మానసికారోగ్యంతో లేకపోతే ఎల్ ఓ ఏ ప్రయత్నించడం వృధా. అందుకని ముందుగా మనసు గురించి తెలుసుకోవడం ముఖ్యం. దర్శకులు, రచయితలు మనసు గురించి తెలియకుండా పాత్ర చిత్రణలు చెయ్యరు. అయినా మనసు గురించి ఒకసారి తెలుసుకుందాం. మనసు రెండంచెలుగా వుంటుంది. 1. కాన్షస్ మైండ్, 2. సబ్ కాన్షస్ మైండ్. ఇవి కంటికి కనిపించే అవయవాలు కావు. మెదడుని హార్డ్ వేర్ అనుకుంటే అందులో ఇన్ స్టాల్ అయి వుండే సాఫ్ట్ వేర్లు ఈ రెండూ. కాన్షస్ మైండ్ బాహ్య ప్రపంచాన్ని స్కాన్ చేస్తూంటుంది. దాంతో మనం కళ్ళతో దృశ్యాలు చూస్తాం, చెవులతో శబ్దాలు వింటాం, నాలుకతో రుచి తెలుసుకుంటాం, నాసికతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ గ్రహిస్తాం. పంచేంద్రియాలతో ఈ కార్యకలాపాల్ని నిర్వహించే కాన్షస్ మైండ్ ఐదు శాతమే వుంటుంది. సబ్ కాన్షస్ మైండ్ అలా కాదు, ఇది 95 శాతమూ వుంటుంది.
ఇందులోనే పంచేంద్రియాలతో కాన్షస్ మైండ్ గ్రహించే సమాచారం జ్ఞాపకాలుగా నిల్వ వుంటుంది. ఈ జ్ఞాపకాలు విజువల్స్ గా నిల్వవుంటాయి. ఎప్పుడైనా మనం మన ఫ్లాష్ బ్యాక్స్ చూసుకోవడానికి వీలుగా. దీని నిల్వ సామర్ధ్యం ఎంతటిదంటే, మన జీవితకాలం పూర్తయినా ఇంకా స్పేస్ మిగిలే వుంటుంది. డిజిటల్ గా చెప్పుకుంటే, 2.5 పెటా బైట్లు వుంటుంది. అంటే 2.5 మిలియన్ల గిగా బైట్లు! మన జీవితంలో జరిగే ప్రతీదీ జ్ణాపకాలుగా స్టోర్ చేసుకుంటూ, మన శరీరం లోపల రక్త ప్రసరణ దగ్గర్నుంచీ హృదయ స్పందనల వరకూ, ఊపిరి తీసుకోవడం దగ్గర్నుంచీ నిద్ర తెప్పించడం వరకూ సమస్త జీవన క్రియలు అవిశ్రాంతంగా 24x7 నిర్వహిస్తూనే వుంటుంది సబ్ కాన్షస్ మైండ్.
ఈ భాండాగారంలో లేనిదంటూ లేదు. దీన్ని అంతరాత్మ అనికూడా అంటారు. ఇందులో శాశ్వత సత్యాలు, నగ్న సత్యాలూ, పుట్టిన దగ్గర్నుంచీ మనం అనుభవిస్తున్న, చేసిన- చేస్తున్న మంచీ చెడులు అన్నీ జ్ఞాపకాల రూపం లో నిల్వ వుండి, దైనందిన జీవితంలో ప్రశ్నిస్తూ వుంటాయి. ఈ ప్రశ్నలు కాన్షస్ మైండ్ లో వుండే మన ఇగోకి నచ్చవు. అందుకని సబ్ కాన్షస్ మైండ్ కి కాన్షస్ మైండ్ ప్రత్యర్ధిలా వుంటుంది. ఇది అంతరాత్మ గొంతు నొక్కి జల్సాగా బ్రతకాలనే చూస్తుంది. అంటే నిత్యం మన లోపల కాన్షస్ కీ, సబ్ కాన్షస్ కీ మధ్య ఘర్షణ జరుగుతూ వుంటుంది. ఈ సైకాలజీయే స్క్రీన్ ప్లేల్లో కాన్షస్ మైండ్ ఫస్ట్ యాక్ట్ గా, సబ్ కాన్షస్ మైండ్ సెకండ్ యాక్ట్ గా, ఇగో హీరోగా దర్శనమిస్తాయన్న విషయం కూడా తెలిసిందే.
స్వామి చిన్మయానంద పుస్తకం ఆధారంగా చెప్పుకుంటే- కురుక్షేత్రం మరెక్కడో జరగలేదు, మన మనస్సులోనే అనుక్షణం జరుగుతూ వుంటుంది. అంటే పంచ పాండవుల్లాంటి ఐదు పాజిటివ్ ఎమోషన్స్ వచ్చేసి, సబ్ కాన్షస్ మైండ్ లోని నూరుమంది కౌరవుల్లాంటి నెగెటివ్ ఎమోషన్ తో పాల్పడే సంఘర్షణ.
సబ్ కాన్షస్ లో పొంచి వుండే నెగెటివ్ ఎమోషన్స్ ఏమిటి? మన భయాలు, సందేహాలు, సంకోచాలు, చెడు అనుభవాలు, అవమానాలు, అణిచివేతలు, ఈర్ష్యాసూయలు, ప్రతీకారాలూ మొదలైన గతం తాలూకు నెగెటివ్ ఎమోషన్లు, భవిష్యత్తు గురించి ఆందోళనా...ఇలా మనల్ని బాధించే ప్రతీదీ నూరుమంది కౌరవుల్లాంటి నెగెటివ్ ఎమోషన్స్, లేదా జ్ఞాపకాలతో సమానం. ఎల్ ఓ ఏ పనిచేయాలంటే ముందు ఈ నెగెటివ్ ఎనర్జీని సంహరించాల్సిందే. సంహరించి పాజిటివ్ ఎనర్జీకి చోటివ్వాలి.అప్పుడే సెల్ఫ్ ఇమేజి సృష్టి సాధ్యమవుతుంది.
కానీ కాన్షస్ మైండ్ లో ఇగో వీటిని సంహరించడానికి ఓ పట్టాన ఒప్పుకోదు. దానికి పాజిటివ్ శక్తులు వుండి కూడా వాటిని ప్రయోగించక, బాధ్యత నుంచి, క్రమశిక్షణ నుంచి తప్పించుకుంటూ వుంటుంది. కురుక్షేత్రంలో అర్జునుడు ఇలాటి కాన్షస్ ఇగో.ఇందుకే మొదట యుద్ధం (సబ్ కాన్షస్ మైండ్ తో) చేయనన్నాడు. యుద్ధంలో వున్న కౌరవులని చూసి నా బంధువుల్ని నేనెలా చంపుకోనూ అని వాపోయాడు. అంటే నెగెటివ్ ఎమోషన్స్ కి కాన్షస్ ఇగో అంతలా అలవాటు పడిపోతుందన్న మాట. ఇందుకే వాటి సంహారానికి ఓ పట్టాన ఒప్పుకోదు. సర్వాంతర్యామి అయిన సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకైన కృష్ణుడు ఎంతో నచ్చేజెప్పి అర్జునుడ్ని యుద్ధానికి దింపాల్సి వచ్చింది. మన కాన్షస్ ఇగో తో కూడా ఇంతే. ఇలా సబ్ కాన్షస్ లో పేరుకు పోయిన నానా చెత్త- నెగెటివ్ ఎనర్జీని ఖాళీ చేయించేందుకు ఒక టెక్నిక్ వుంది. అదే హో- ఒపోనోపోనో టెక్నిక్. ప్రాచీన కాలపు హవాయీ చికిత్సా విధానం.
దీని కథ ఏమిటి?
ఇలా కొన్ని వారాల పాటు ప్రార్ధన చేస్తూంటే
రోగుల్లో మార్పు కనిపించసాగింది. మరి కొన్ని రోజుల తర్వాత ఆ కరుడు గట్టిన 40 మంది
పిచ్చోళ్ళంతా ఆరోగ్యవంతులై ఆస్పత్రి ఖాళీచేసి వెళ్ళిపోయారు. ఇది 1980 లో జరిగిన
ఉదంతం. దీని మీద విస్తృతంగా పరిశోధనలు చేసి ఆధునిక కాలానికి అప్డేట్ చేస్తూ
డాక్టర్ జో విటాలేతో కలిసి ‘జీరో లిమిట్స్’ అన్న పుస్తకం రాశాడు 2007 లో డాక్టర్
హ్యూ లేన్. ఇలా ఈ టెక్నిక్ క్రమంగా పాపులర్ అవుతూ ఈ మధ్యకాలం లో మనదేశంలో
ప్రాకింది. కోకొల్లలుగా యూట్యూబ్ వీడియోలు. అయితే రీకీ హీలర్ డాక్టర్ పూరణ్ శర్మ
హో –ఒపోనోపోనో వీడియోలు డెప్త్ తో వుంటాయి.
నెగెటివ్ ఎనర్జీకి చెక్
ఇది శక్తివంతమైన ప్రార్ధనా విధానం. దీంతో అన్ని నెగెటివ్ ఎమోషన్స్ వైదొలగి మనసు తేటపడుతుంది. గత జ్ఞాపకాలుగా వున్న ఎమోషన్సే మన ప్రస్తుత పరిస్థితుల్లో రియాక్షన్స్ కి / రెస్పాన్స్ కి కారణమవుతాయి. ప్రస్థుత పరిస్థితులకి జ్ఞాపకాల్లోని నెగెటివ్ ఎమోషన్స్ యాక్టివేట్ అయితే ఆవేశంతో రియాక్ట్ అవుతాం. జ్ఞాపకాల్లోని పాజిటివ్ ఎమోషన్స్ యాక్టివేట్ అయితే రియాక్ట్ అవకుండా ప్రశాంతంగా రెస్పాండ్ అవుతాం. ఈ రెండో ఫలితంతో జీవితాన్ని సుఖమయంగా మార్చుకోవడానికి వీలు కల్పించేదే ఈ ప్రార్ధన. ఈ ప్రార్థన చేయాలంటే ముందుగా జీవితంలో జరిగిన ప్రతీ దానికీ బాధ్యత వహించాలి. వేరొకర్ని బ్లేమ్ చేయడం కాదు. అందుకని ‘నా జీవితంలో జరిగిన ప్రతి మంచికీ చెడుకీ అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను’ అని చెప్పి ప్రార్థన ప్రారంభించాలి.
ప్రార్ధనలో మొదటి లైను ‘ఐయాం సారీ’. సారీ ఎవరికి చెప్తున్నట్టు? సబ్ కాన్షస్ మైండ్ కి చెప్తున్నట్టు. ఎందుకంటే మన నానా నెగెటివ్ ఎమోషన్స్ తో దాన్ని నింపేసి బాధపెడుతున్నాం కాబట్టి. దాని దైవత్వాన్ని దెబ్బ తీస్తున్నాం కాబట్టి- ‘ఐయాం సారీ’ అని చెప్పాలి. రెండవ లైను- ‘ప్లీజ్ ఫర్గివ్ మీ’- ఐయాం సారీ అంటూ విచారం వ్యక్తం చేశాక, క్షమించమని అడగాలి. మూడవ లైను- ‘థాంక్యూ’- క్షమించినందుకు థాంక్స్ చెప్పాలి. అది క్షమించిందని ఏమిటి నమ్మకం? మనమేం చెప్తే దాన్ని ఆజ్ఞగా తీసుకుంటుంది సబ్ కాన్షస్. నాల్గవ లైను- ‘ఐ లవ్యూ’- ఇక నిన్నుబాధించే ప్రసక్తే లేదు, నిన్ను బేషరతుగా ప్రేమిస్తూ వుంటాను -అని కమిటవడం.
ఈ ప్రార్థన- ‘ఐయాం సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్యూ, ఐలవ్యూ’- సూర్యోదయానికి ముందు 108 సార్లు చేయాలి. పైకి ఉచ్చరించలేకపోతే మనసులో స్మరించుకోవచ్చు. 21 రోజుల పాటు వరసగా క్రమం తప్పకుండా చేయాలి. మధ్యలో మిస్ చేస్తే మళ్ళీ మొదట్నుంచీ చేయాలి. రోజుకి 108 సార్లు, 21 రోజులు ఎందుకంటే -ఇన్ని సార్లు ఇన్ని రోజులు చేస్తేనే సబ్ కాన్షస్ లో, ఇంకాతర్వాత శరీరం అణువణువులో ఇంకుతుంది ప్రార్ధన. డ్రైవింగ్ నేర్చుకోవడమంటే సబ్ కాన్షస్ కి అలవాటు చేయడమే. ఆ తర్వాత మనం ఏటో ఆలోచిస్తూ బండి నడుపుతున్నా సబ్ కాన్షస్ మైండ్ దానికదే డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. ఈ ప్రార్ధనతో మనసుతో బాటు శరీరంలోంచి కూడా నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి శారీరక మానసికా రోగ్యాలు చక్కబడతాయి.
ఎప్పుడైతే నెగెటివిటీ వెళ్ళిపోతుందో అప్పుడు పాజిటివ్ సంఘటనలు ఎదురవుతూంటాయి, పాజిటివ్ వ్యక్తులు కలుస్తూంటారు, పాజిటివ్ అవకాశాలు వస్తూంటాయి. ఇక నెగెటివ్ ఆలోచన, మాట, చర్య కట్టిపెట్టాలి. ఇది ప్రార్ధన వల్ల ఆటోమేటిగ్గా కట్టడి అయిపోతుంది. అయినా ఎప్పుడైనా దేనికో ఆందోళన కలగ వచ్చు. అప్పుడు దైవనామ స్మరణ చేసుకోవచ్చు. క్రమంగా దేనికీ ఆందోళన చెందని శక్తి వచ్చేస్తుంది. సబ్ కాన్షస్ లో తులసి తోటలు తప్ప గంజాయి కలుపు వుండదు.
ఈ ప్రార్ధన అవకాశాలు పొందడానికి సంనద్దులవదనికే కాదు, మనవ సంబంధాల ఆరోగ్యానికి, అర్దికారోగ్యనికీ పని చేస్తుంది. కాకపోతే డబ్బు కోసమైతే ప్రార్ధనలో మొదట డబ్బు కి ఐయాం సారీ చెప్పాలి.
దర్శకత్వ అవకాశల కోసం ఇలా మానసిక శారీరక శుద్ధి చేఉకున్నాయి తర్వాతి ఎల్ ఓ ఏ అభ్యాస ప్రక్రియ రేపు చూద్దాం.
-సికిందర్