రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 14, 2017

531 : సందేహాలు - సమాధానాలు



Q : సర్,
          మీరు కథ వేరు, గాథ వేరు అని చాలా సార్లు రివ్యూలలో రాస్తున్నారు. అంటే ఏమిటి? వాటినెలా గుర్తించాలి?  గాథలు ఎందుకు సినిమాలకి పనికిరావు?
          -వి. సూర్యకాంత్, స్ట్రగ్లింగ్ రచయిత

A : ఒకసారి  ఇక్కడ క్లిక్ చేసి చదవండి, మీకు అన్నీ అర్ధమవుతాయి.









Q : సర్,
         
TFI  కి మీరు చేస్తున్న హెల్ప్ ఎవరూ చేసి వుండరు. ఏ ప్రతిఫలం  ఆశించకుండా ఇంత నాలెడ్జి షేర్ చేయడం awesome సర్. నాకు క్యారక్టర్ డెవలప్ మెంట్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుంది. కొంచెం డిటైల్డ్ గా చెప్తారా? కొన్ని కథల్లో హీరో క్యారక్టర్ మెచ్యూర్డ్ గా వుంటుంది. ‘శ్రీమంతుడు’ లో మహేష్ బాబు క్యారక్టర్ లాగా. ఇలాంటి క్యారక్టర్ వున్నప్పుడు గ్రోత్ వుండదు కదా? అప్పుడేం చేయాలి బోర్ కొట్టకుండా? ‘పెదరాయుడు’ టైపు క్యారక్టర్స్ కి గ్రోత్ వుండదు కదా? ఎలా మొదలైందో అలాగే ముగుస్తుంది కదా?
 - అశోక్ పొడపాటి, సహాయ దర్శకుడు

A :    TFI కి హెల్ప్ చేసేంత లేదుగానీ, ఈ వ్యాసకర్త తనని తానూ  ఎడ్యుకేట్ చేసుకునేందుకే ఇదంతా. కాకపోతే పనిలోపనిగా ఇలా రాసి నల్గురికీ  తెలియపర్చుకుంటూ ఎడ్యుకేట్ అవుతున్నానను కుంటున్నాడు. ప్రతిఫలం ఆశించడం వుంటుంది. వచ్చి కథల్ని రిపేరు చేయించుకుంటే డబ్బులు అడగడం వుంటుంది.
         ఇక  క్యారక్టర్ డెవలప్ మెంట్ గురించి :
మిడిల్ లో సంఘర్షిస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా అనుభవాల్లోంచి నేర్చుకోవడమే పాత్ర ఎదుగుదల. పాత్ర డెవలప్ అవ్వాలన్నా, ఎదగాలన్నా మిడిల్లో జరిగే సంఘర్షణలోంచే. అప్పుడే క్యారక్టర్ గ్రోత్ అంటారు. ఇది జరక్కపోతే  మిడిల్లో కథనం చప్పగా వుంటుంది. 
          ‘
శ్రీమంతుడు’ క్యారెక్టర్ గురించి :  హీరోయిన్ చెప్తేనే  తానేం చేయాలో గోల్ తెలుసుకున్న పాసివ్ క్యారక్టర్ అది.  ఇక్కడ్నుంచీ రియాక్టివ్ పాసివ్  క్యారక్టర్ గా కొనసాగుతుంది. దీని ఎదుగుదల కృత్రిమం. వివరంగా కావాలంటే ‘శ్రీమంతుడు’ స్క్రీన్ ప్లే సంగతులు చూడండి. 
          ఇక
క్యారక్టర్ మెచ్యూర్డ్ గా వుంటే చెప్పడానికి కథేముంటుంది? క్యారక్టర్ యాక్టివ్ గా  అనుభవాల్లోంచి నేర్చుకుంటూ వుంటేనే తగిన కథని సృష్టిస్తుంది. మంచి కథల్లో క్యారక్టర్ ప్రారంభం ఇగోతోనే  వుంటుంది. ఈ ఇగోని  చివరికి  మెచ్యూర్డ్ ఇగో వైపుగా నడిపించేదే  సరైన మంచి కథ.  
          ‘పెదరాయుడు’ కథకాదు, ట్రాజడీ గాథ. ట్రాజడీల్లో పాత్రలు ఎదిగే మాట వుండదు. ‘దేవదాసు’ ఎదిగాడా? రెండువేల ఏళ్ల నాడు అరిస్టాటిల్  ఏం చెప్పాడో,  అది ఇప్పుడూ ట్రా జడీలకి సంబంధించి జరుగుతూనే వుంది.

Q : Sir,
          Really, you are doing great  job. Your articles are very useful to those who are aspiring to become film makers like me. We are grateful to you. Sir, please answer me for this question : In Taxi Driver  why Travis Bickle  tries  to kill the presidential candidate? Because, Betsy has been working for that presidential candidate’s election campaign? Or just to  overcome his metaphysical emptiness?
-Dileep Kumar, ifl univ.

A :  Thanks for your compliment. I wish you all the success in your endeavourment. To your query, this is my suggestion  : it’s a pure form of jealousy. Angry that Betsy doesn’t respect him,  Travis sets to kill the presidential candidate, who is Betsy’s father figure, whom she looks up to and respects, admires, loves etc etc…

(స్క్రీన్ ప్లేలకి సంబంధించి మీ సందేహాలు మెసెంజర్ కి పంపినా, వాట్సాప్ కి పంపినా వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం కుదరదు. ఇతరులకి కూడా ఉపయోగపడేలా బ్లాగ్  లోనే  ప్రత్యక్షమవుతాయి)
-సికిందర్