డాక్టర్ పోలీసుగా మారే రామ్ సినిమాలో వైద్యం చేయాల్సింది స్క్రిప్టుకి.
రామ్ కి కావాల్సింది మంచి స్క్రిప్టు డాక్టర్, విలన్ కి వైద్యం
చేసే పోలీస్ క్యారక్టర్ కాదు. దర్శకుడు లింగు స్వామి ఏనాటిదో పోలీసు- గూండా కాలం చెల్లిన
కథకి కాలం చెల్లిన టేకింగ్ చేసి బోరు అనే పదానికి పూర్తి న్యాయం చేశాడు. అవతల ‘విక్రమ్’ దర్శకుడు హై ఎండ్ టెక్నాలజీ మేకింగ్ కి, లో -గ్రేడ్ మాస్ క్యారక్టర్స్ ని జోడించి సరిక్రొత్త బిజినెస్ మోడల్ ని సృష్టిస్తే, రామ్- లింగుస్వామిలు
ఇంకా ఎక్కడో వుండిపోయి ఈ కాలపు సినిమా అంటే ‘వారియర్’ అనుకుంటున్నారు!