ఇవి అప్పుడప్పుడూ
రాసుకుంటూ పోయిన డైలాగ్ రైటింగ్ టిప్స్.
డేటా బ్యాంక్ లో వుంటే తీసి అందిస్తున్నాం. ఇది నాల్గవ భాగం. పని కొస్తాయనుకంటే
ప్రయత్నించవచ్చు.
1. ‘ప్రతి డైలాగు ఒక ఆయుధం
పాత్రలు మాట్లాడడం
కోసం మాట్లాడవు. ప్రతి మాటతో ఎదుటి పాత్ర మీద ప్రభావం చూపాలని చూస్తాయి.
ఉదాహరణ:
‘నీకు కోపం వస్తోందా?’
“లేదు’
‘మరెందుకు వణుకుతున్నావు?’
ఇక్కడ ఈ చివరి లైన్ ప్రత్యర్థిని బలహీనపర్చే ఉద్దేశంతో వుంది.
2. పాత్రలకి ఒక ఫిలాసఫీ ఇవ్వాలి
గుర్తుండిపోయే పాత్రలు జీవితంపై ఒక నమ్మకంతో వుంటాయి :
ఉదాహరణ:
హీరో: ‘మనిషిని డబ్బు కాదు... మాట నిలబెడుతుంది’
విలన్: ‘మాటతో తలుపులు తెరుచుకోవు,డబ్బుతో తెరుచుకుంటాయి’
ఈ ఫైలాసఫీలు పాత్రల్లో స్థిరంగా కనిపిస్తే, డైలాగులు బలంగా వుంటాయి.
2. పాత్రలకి ఒక ఫిలాసఫీ ఇవ్వాలి
గుర్తుండిపోయే పాత్రలు జీవితంపై ఒక నమ్మకంతో వుంటాయి :
ఉదాహరణ:
హీరో: ‘మనిషిని డబ్బు కాదు... మాట నిలబెడుతుంది’
విలన్: ‘మాటతో తలుపులు తెరుచుకోవు,డబ్బుతో తెరుచుకుంటాయి’
ఈ ఫైలాసఫీలు పాత్రల్లో స్థిరంగా కనిపిస్తే, డైలాగులు బలంగా వుంటాయి.
3. ఒకే డైలాగు వేర్వేరు అర్ధాలతో వుండాలి
ఒక డైలాగ్ ని మొదట ఒక అర్థంలో, చివర్లో మరో
అర్థంలో వాడాలి :
మొదట: ‘నువ్వు ఎప్పటికీ గెలవలేవు’
క్లయిమాక్స్‌లో: ‘గెలుపు అంటే ఎదుటివాడిని ఓడించడం కాదు... నన్ను నేను
ఓడిపోనివ్వకపోవడం’
అదే డైలాగుకి ఇది కొత్త అర్థం.
4. మాటల వెనుక చరిత్ర వుండాలి
ఉదాహరణ:
‘ఆ గడియారం ఇంకా నీ దగ్గరే వుందా?’
ఈ ఒక్క లైన్‌తో ప్రేక్షకులు ఆ గడియారం వెనుక ఒక కథ వుందని ఊహించడం మొదలుపెడతారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ లో ఒక డైలాగు :
5. ప్రతి పాత్రకూ ఒక సిగ్నేచర్ స్టైల్ వుండాలి
కొంతమంది ప్రశ్నలతో మాట్లాడతారు.
‘ఎందుకు?’
‘ఎవరు?’
‘ఎప్పుడు?’
మరికొందరు సామెతలతో :
‘మంటని దాచినా పొగ దాగదు’
ఇంకొందరు వ్యంగ్యంగా :
‘చాల్లే, చాలా గొప్ప పనే చేశావ్!’
6. ఈ ప్రత్యేకతలు పాత్రల్ని గుర్తుండేలా చేస్తాయి
డైలాగులో రిథమ్ వుండాలి
మంచి డైలాగు సంగీతంలా వినిపిస్తుంది :
‘వచ్చావు’
‘చూశావు’
‘ఓడిపోయావు’
చిన్న లైన్లు టెన్షన్ ని పెంచుతాయి.
7. చెప్పొద్దు - చూపించాలి
బలహీనం:
‘నేను చాలా ధైర్యవంతుడిని’
బలమైనది:
‘ముందు పిల్లల్ని బయటికీ పంపండి...’
‘నేను చివరిగా వస్తాను’
అతడి ధైర్యాన్ని ప్రేక్షకులు చూస్తారు.
8. ప్రేమ డైలాగులు
ప్రేమలో నేరుగా ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అనడం కంటే, శ్రద్ధ చూపే మాటలు ఎక్కువ
ప్రభావం చూపుతాయి:
ఉదాహరణ :
‘వర్షం పడుతోంది’
‘గొడుగు తీసికెళ్ళు’
ఈ మాటల్లోనే ప్రేమ వుంది.
9. క్లయిమాక్స్ డైలాగ్
క్లయిమాక్స్‌లో హీరో కొత్త విషయాలు చెప్పకూడదు. సినిమా మొత్తం చెప్పిన భావానికి
ముగింపు ఇవ్వాలి :
ఉదాహరణ:
సినిమా మొత్తం భావం :
‘భయం మనసులో వుంటుంది’
క్లయిమాక్స్:
‘ఈ రోజు నా భయం చచ్చి పోయింది’
10. గొప్ప డైలాగ్ రాసే ఫార్ములా
ఒక మంచి డైలాగ్‌లో ఈ ఐదు ప్రశ్నలకి సమాధానం వుండాలి :
ఈ పాత్ర ఎందుకు ఇప్పుడు ఈ మాట చెబుతోంది?
ఈ మాట వల్ల ఏం మారుతుంది?
ఇంకెవరైనా ఇదే మాట చెప్పగలరా?
(అవును అయితే, ఇది ప్రత్యేకమైన డైలాగ్
కాదు)
ఈ మాటని ఇంకా చిన్నగా చెప్పవచ్చా?
ఈ మాట వినగానే ప్రేక్షకులు ఏ భావంతో వుండాలి?
11. చివరిగా ప్రముఖ రచయిత ఒక చెప్పే రహస్యం
చాలా మంది కొత్త రచయితలు ప్రేక్షకులు వినాలనుకునే డైలాగు రాస్తారు.
మంచి రచయితలు పాత్ర తప్పకుండా చెప్పే డైలాగు రాస్తారు.
ఈ రెండింటి మధ్యే సాధారణ డైలాగ్‌కి, గొప్ప డైలాగ్‌కి తేడా వుంటుంది.
(మరికొన్ని మరోసారి)
-సికిందర్
