క్వింటా బ్రన్సన్ హిట్టయిన ఎబిసి టీవీ కామెడీ ‘అబట్ ఎలిమెంటరీ' రచయిత్రి. ఆమె పాత్రల ప్రవర్తన, వాస్తవిక వ్యక్తిగత అనుభవాలు మొదలైన వాటిపై దృష్టి సారించి స్క్రిప్ట్
రచన చేస్తుంది. ఫిలడెల్ఫియా ప్రభుత్వ
పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన తల్లి అనుభవాలు వంటి నిజ జీవిత సంఘటనల నుంచి నేరుగా
స్ఫూర్తి పొంది, వాస్తవికతతో కూడిన సంఘర్షణలని హాస్యభరితం
చేస్తూ, వినూత్న పరిష్కారాలతో కథల్ని అల్లుతుంది.
విస్తృత సాధారణ ప్రేక్షక
శ్రేణిని దృష్టిలో పెట్టుకుని కామెడీని, హృద్యమైన వాస్తవికతని, సందర్భోచిత హాస్యంతో బ్యాలెన్స్ చేస్తూ
ఆకట్టుకునేలా రూపొందిస్తుంది. కేవలం సంభాషణలతో కాకుండా, పాత్రల ప్రవర్తనలతో జీవం
పోయడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా ఫన్నీ
డైలాగ్స్ మీదే ఆధారపడకుండా, ఒక పరిస్థితిలో
వివిధ పాత్రలు ఎలా అలోచిస్తాయన్నమైండ్ సెట్ ని పట్టుకుని సీన్లు రాస్తుంది.
‘అబట్ ఎలిమెంటరీ' తో హాస్యంతో గొప్ప ఆలోచనల్ని
ఎలా ముందుకి తీసుకెళ్ళ వచ్చో, ప్రపంచాన్ని ఎలా మరింత మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చో ఆమె
చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె తను రాస్తున్న పాత్రల్ని అర్ధం జేసుకోవడానికి ఒక మైండ్
సెట్ టెస్ట్ ని ప్రయత్నిస్తోంది. అదేమిటో తెలుసుకుందాం...
1. నోటుతో
ఎవరేంటి?
కమెడియన్ లారీ విల్మోర్ నుంచి నేర్చుకున్న
ఈ టెక్నిక్ కి ‘5 డాలర్ టెస్ట్’ అని పేరుపెట్టింది. ఇదిలా వుంటుంది : రచయిత్రో రచయితో నేల మీద 5 డాలర్ల
నోటుని పడేసి చాటుకెళ్ళి గమనిస్తున్నారనుకుందాం-
అప్పుడు కథలో అనుకుంటున్న వివిధ పాత్రలు ఆ
నోటుని చూసి ఎలా రియాక్ట్ అవుతాయో అవే బయట పెట్టుకోవడం కనిపిస్తుంది. పాత్రల నైజాలు,
ప్రాధాన్యాలు, దృక్కోణాలూ అన్నీ వాస్తవికంగా సులభంగా అర్ధమవుతాయి.
తను రాస్తున్న పాత్రలు ఎలాంటివో, ప్రపంచాన్ని ఎలా చూస్తాయో తెలియజేయడానికి డబ్బు ఒక సరైన ఎర. ఈ డబ్బుని ఎలా చూస్తాయో, వాటి జీవితంలో దానికున్న అర్థమేమిటో చాటు నుంచి బాగా గమనించ వచ్చు.
అవి అటూ ఇటూ ఎవరో లేరని చూసి చటుక్కున్న ఆ నోటుని తీసి జేబులో పెట్టేసుకున్నాయా? ఈ నోటుని పడేసుకున్నదెవరా అని వెతుకుతున్నాయా? ఆ నోటుని చూసి ఆశ్చర్య పడ్డాయా? దానికి తాము పూర్తి అర్హులమని భావిస్తున్నాయా? మైండ్ సెట్ తవ్వి తీయడానికి ఇక్కడే వుంది అంతా. అయితే ఏ రెండు పాత్రలు ఆ నోటుతో ఒకే పని చేశాయంటే, వాటిలో ఒకటి స్క్రిప్టులో పేజీలోని ఓ విలువైన స్థలాన్ని దురాక్రమిస్తున్నట్టేనని ఆమె హెచ్చరిక.
‘అబట్ ఎలిమెంటరీ’ లో అత్యుత్తమ తారాగణ బలముంది. ఎన్నో పాత్రలున్నాయి, కానీ దారిలో దొరికిన డబ్బుని చూసే విషయంలో ప్రతి ఒక్కటీ ఎంత ప్రత్యేకంగా వున్నాయో చూపించడానికి ఆమె ఇలా రాసుకుంది :
జానైన్ : ఆ నోటు తీసుకుని తీవ్రంగా
కలత చెందుతుంది. దాని అసలైన యజమానిని వెతికి పట్టుకోవడానికి ఆమె ఒక పెద్ద పోరాటాన్నే
మొదలు పెడుతుంది.
అవా : దాన్ని జేబులో పెట్టుకుని ఒక్క
ప్రశ్న కూడా వేసుకోదు.
మెలిస్సా : ఇది ట్రాపేమో అనుకుని ముట్టుకోకుండా
జాగ్రత్తపడుతుంది.
బార్బరా : నిశ్శబ్దంగా నవ్వి, ఆ సర్వశక్తిమంతుడైన
దేవుడే ఆశీర్వదించాడని తీసి కళ్ళకద్దుకుంటుంది.
గ్రెగరీ : ఛీఛీ, దీన్ని ముట్టుకుంటే
నానా క్రిములూ అంటుకుంటాయని ఇగ్నోర్ చేస్తాడు.
జాకబ్ : చివరి దశ పెట్టుబడిదారీ
విధానంలోని భయానక పరిణామాలపై గంభీరమైన ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెడతాడు.
మిస్టర్ జాన్సన్: తాను యూఎస్ మింట్‌లో
పనిచేస్తున్నప్పుడు, సరిగ్గా ఇదే నోటుని ముద్రించడంలో
సాయం చేశానని చెప్పుకుంటాడు.
ఈ రియాక్షన్లలో దేనికీ పది పేజీల క్యారక్టర్ బయోగ్రఫీ అవసరం లేదని గమనించ వచ్చు. అంతా చేతల్లోనే వుంది. ఈ టెక్నిక్ ని సిట్‌కామ్, మరేదైనా జానర్ సినిమా, ఒక డ్రామా రాస్తున్నప్పటికీ కూడా ఉపయోగించవచ్చు.
పాత్రల ప్రపంచ దృక్పథాలు ఒక చిన్న కాగితం ముక్క విషయంలో కూడా ఘర్షణ పడేంత విభిన్నంగా వున్నప్పుడు, ఆ తర్వాత సంభాషణ సహజంగానే సాగాలి. తర్వాతిసారి, ఒక సీను ఎందుకు చప్పగా అనిపిస్తోందని ఆలోచిస్తూ ఖాళీ పేజీ ముందు కూర్చుండిపోక పోతే, నేల మీద ఒక ఐదు డాలర్ల నోటు పడేసి, దాన్ని ఎవరు తీస్తారో చూస్తే సీను వర్కౌటై పోతుంది.
ఈ రియాక్షన్లలో దేనికీ పది పేజీల క్యారక్టర్ బయోగ్రఫీ అవసరం లేదని గమనించ వచ్చు. అంతా చేతల్లోనే వుంది. ఈ టెక్నిక్ ని సిట్‌కామ్, మరేదైనా జానర్ సినిమా, ఒక డ్రామా రాస్తున్నప్పటికీ కూడా ఉపయోగించవచ్చు.
పాత్రల ప్రపంచ దృక్పథాలు ఒక చిన్న కాగితం ముక్క విషయంలో కూడా ఘర్షణ పడేంత విభిన్నంగా వున్నప్పుడు, ఆ తర్వాత సంభాషణ సహజంగానే సాగాలి. తర్వాతిసారి, ఒక సీను ఎందుకు చప్పగా అనిపిస్తోందని ఆలోచిస్తూ ఖాళీ పేజీ ముందు కూర్చుండిపోక పోతే, నేల మీద ఒక ఐదు డాలర్ల నోటు పడేసి, దాన్ని ఎవరు తీస్తారో చూస్తే సీను వర్కౌటై పోతుంది.
2. క్వింటా గురించి...
క్వింటా బ్రన్సన్ ‘అబట్
ఎలిమెంటరీ’ ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల
అంకితభావాన్ని, పట్టుదలని గౌరవించడానికి దశాబ్దాల
పాటు బోధించిన తన తల్లి నుంచి ప్రేరణ పొంది, అత్యంత తక్కువ జీతాలు పొందే వృత్తులలో ఒకటైన బోధన వృత్తి వెనకున్న హాస్యం, ఆప్యాయతలతో కూడిన
వాస్తవిక వ్యక్తులపై దృష్టి పెట్టానని చెబుతోంది. అదే సమయంలో, ప్రామాణికమైన, పాత్రల ఆధారిత కామెడీని
నెట్‌వర్క్ టెలివిజన్‌కి తిరిగి
తీసుకురావాలని కూడా ఆమె ఆకాంక్షిస్తోంది.
క్వింటా బ్రన్సన్ (36) అమెరికన్ నటి, హాస్యనటి, రచయిత్రి, నిర్మాత. ఆమె పోర్ట్ ఫోలియోలో 23 టీవీ సిరీస్, 7 సినిమాలూ వున్నాయి. ‘అబట్ ఎలిమెంటరీ’ లో రెండవ తరగతి ఉపాధ్యాయురాలు జానైన్ టీగ్స్‌గా నటించింది. ఆమె 2022 టైమ్ మేగజైన్ 100 అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాలో కూడా స్థానం సంపాదించింది .
-సికిందర్
(టాలీవుడ్ కి ఈ టెక్నిక్ ఎందుకవసరం? మూసలో
ఆలోచించుకుంటూ లేజీగా కూర్చుని రాయకుండా, బ్రెయిన్ కి కాస్త పని కల్పించి కొత్త పద్ధతులు
నేర్చుకుంటూ వుంటే, బాడీ గార్డులా
నిలబడుతుంది బాక్సాఫీసు)
