ఒక ఉద్యోగానికి బయోడేటా పెట్టుకోవాలన్నా అందులో పరువుపోయే అంశాలు రాయకుండా జాగ్రత్త పడతారు. కానీ ఒక హీరో కోసం కథ రాయాలంటే మాత్రం ఆ హీరో పరువంతా తీసే స్క్రీన్
ప్లే సంగతులు దట్టించి మరీ రాస్తారు. ఈ దర్శకుడు వచ్చి ఉత్త పుణ్యానికి తన పరువంతా
తీస్తున్నాడని హీరో కి కూడా తెలుసుకునే పరిజ్ఞానం వుండదు. ఇద్దరు అజ్ఞానులు కలిసి
ఒక విజ్ఞానదాయక సినిమా తీస్తారు. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి (పాతవాళ్లు చచ్చినా
నేర్చుకోరు కాబట్టి) ఆ సినిమా ఒక విజ్ఞాన ఖనిలా ఉపయోగ పడుతుంది. ఆ సినిమాలు ప్రేక్షకుల కోసం కాక, నేర్చుకునే వాళ్ళకోసం స్కూలు పుస్తకాలుగా ఉపయోగపడతాయి.
నూటికి 90 శాతం ఫ్లాపవుతున్న సినిమాలన్నీ
నేర్చుకునే వాళ్ళ ప్రయోజనార్ధమే వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్నారు. ఇంత సేవ చేస్తూంటే
నిందించడం, విమర్శించడం తగునా?