Tuesday, March 2, 2021
Sunday, February 28, 2021
―సికిందర్
Thursday, February 25, 2021
1017 : రివ్యూ
***
2. సూర్య
ప్రకాష్ (నరేష్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తల్లి దండ్రులతో మధ్యతరగతి జీవితం.
ఉద్యోగంలో చేరాడని మీనాక్షి (నవమి) తో సంబంధం చూస్తారు. మీనాక్షితో ఎంజాయ్
చేస్తూంటే, దీంతో సంబంధం లేకుండా ఓ పౌర హక్కుల నేత
హత్య జరుగుతుంది. ఒక సీఐ కిషోర్ (హరీష్ ఉత్తమన్) వుంటాడు. హంతకుల్ని పట్టుకునేందుకు
పైనుంచి వొత్తిడి పెరగడంతో కొన్ని సీసీ టీవీ ఫుటేజీలు పోగేసి సూర్య ప్రకాష్ ని
అరెస్టు చేసి కేసు పెడతాడు. ఈ హత్య తను చేయలేదని గోల పెడుతూ బెయిలు కూడా రాక ఐదేళ్ళు
జైల్లో మగ్గుతాడు సూర్య ప్రకాష్. ఈ లోగా అతడి తల్లిదండ్రులు న్యూసెన్స్ గా తయారయ్యారని
వాళ్ళని చంపి, ఆత్మహత్యలుగా చిత్రిస్తాడు సీఐ. ఒక లాయర్ ఆద్య
(వరలక్ష్మీ శరత్ కుమార్) వుంటుంది. ఈమె వచ్చి, 211 చట్టం
గురించి సూర్యకి చెప్పి, అతడి మీద నడుపుతున్న కేసు బూటకమని
తేల్చి, సీఐ మీద 211 కేసు పెట్టిస్తుంది. పెట్టాక ఈ కేసుతో
ఎలా పోరాడారన్నది మిగతా కథ.
***
***
***
***
6. 211
తో పోరాటమెలా చేయాలి? పౌరుల మీద ఈ చట్టం పనికొఛ్చినప్పుడు, పోలీసుల మీద ఎందుకు పనికి రాదు? జడ్జీలు ఎందుకొప్పుకోరు? ప్రభుత్వం ఎందుకొప్పుకోదు? రాజకీయ వ్యవస్థ ఎందుకొప్పుకోదు? ఈ పోరాటంలో గెలవాలనే లేదు, ఓడిపోయినా సరే, ఈ ప్రశ్న ఒక్కటి దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది, తట్టి
లేపుతుంది. తెలుగు సినిమా వైరల్ అవుతుంది. జాతీయ అవార్డుకి పంపుకోవచ్చు. ఇందుకే మార్కెట్
యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్
కి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ వుండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని ఈ బ్లాగులో పదేపదే గుర్తు
చేసేది.
―సికిందర్
Monday, February 22, 2021
ఇంటర్వల్ సీన్లో ఆయిల్ ప్లాంట్ పేలిపోవడం -"This attack we won like crazy!” మూమెంట్ లాంటిది డానీకి అర్నాబ్ లాగా. దురదృష్టంలో అదృష్టాన్ని చూశాడు- పేలుడుతో కాళ్ళ కింద చమురు సముద్రాలున్నాయని తెలిసి! ఇదే సమయంలో ఇదే పేలుడు కొడుకు వినికిడి శక్తి పోగొట్టిందని బాధతో వుంటాడు ఇప్పుడు సెకండాఫ్ లో. డాక్టర్ కి చూపిస్తాడు. లాభం లేదని అంటాడు డాక్టర్ పరీక్షించి. ఏం చేయాలో అర్ధం గాదు. కంపెనీ విస్తరణ కార్యక్రమాలు చేపడతాడు. చుట్టు పక్కల భూముల్లో మరిన్ని ప్లాంట్లు నిర్మిస్తాడు. ఇదంతా చూసి ఇలై వస్తాడు. చర్చి చందా పదివేల్లో ఐదు వేలు బాకీ ఇమ్మంటాడు. డానీ రగిలిపోయి మీదపడి కొట్టడం మొదలెడతాడు. బురదలో తొక్కితొక్కి కొడతాడు. నీ మహిమలతో నా కొడుక్కి నయం చేయలేక పోయావ్, డబ్బులు కావాలా అని దారుణంగా కొడతాడు.
దీంతో ఇలై ఇంటికి వెళ్ళిపోయి తండ్రిని కొడతాడు. కిందపడేసి ఎలాపడితే అలా కొడతాడు. నీవల్లే వాడిక్కడ బలపడ్డాడని నోటి కొచ్చినట్టు తిడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి...హెన్రీ అనే అతను వచ్చి డానీ ఇంటి ముందుంటాడు. ఎవరు నువ్వంటే, మనం అన్నదమ్ముల మంటాడు. మన తల్లులు వేరైనా తండ్రి ఒకడే అంటాడు. మూడు నెలల క్రితం తండ్రి కూడా పోయేసరికి, ఎక్కడా సెటిల్ కాలేక వచ్చాననీ, ఇక్కడ పని ఇప్పిస్తే ఇక్కడే వుంటాననీ అంటాడు.
డానీ చాలా ప్రశ్నించి, గుర్తింపు పత్రాలు చూసి సరేనంటాడు. బిజినెస్ మీటింగుల్లో తన వెంట వుంచుకుంటాడు. సముద్రంలో ఈత కొడతారు. కలిసి సరదాగా గడుపుతారు. డానీ తన కలల గురించి చెప్తాడు. పెద్ద బంగాళా కొనుక్కుని, మనుషులకి దూరంగా ఒక్కడే గడపాలన్న కలలు.
జూనియర్ డానీ వీళ్ళని గమనిస్తూ వుంటాడు. ఓ రాత్రి ఇంటిని తగుల బెట్టేసి పారిపోతాడు. డానీ పట్టుకుని, వీడికి సైన్ లాంగ్వేజీ నేర్పించాలని తీసుకుని బయల్దేరతాడు, ట్రైన్ ఎక్కించి వదిలేసి వచ్చేస్తాడు.
ఆయిల్ కంపెనీతో మీటింగ్ కి వెళ్తాడు. వాళ్ళకి ఆయిల్ సరఫరా చేయాలంటే పైపు లైన్ వేయాలి. పైపు లైన్ వేయాలంటే మధ్యలో విలియం బాండీ భూములున్నాయి. విలియం బాండీ కోసం పోతే అతను ఇంటి దగ్గరుండడు. తిరిగి హెన్రీతో గడుపుతాడు. గడుపుతూంటే అనుమానం వేసి నిజం చెప్పమని బెదిరిస్తాడు. తను హెన్రీ కాదనీ, హెన్రీ క్షయ వ్యాధితో చనిపోయాడనీ, తను హెన్రీలా నటిస్తూ ఇక్కడ ఉపాధి పొందాననీ చెప్పేస్తాడు డూప్లికేట్ హెన్రీ. దీంతో అతణ్ణి చంపి పాతి పెట్టేస్తాడు డానీ.
చెట్టుకింద నిద్ర పోతూంటే వచ్చి లేపుతాడు విలియం బాండీ. నువ్వేం చేశావో నాకు తెలుసులే గానీ, అదలా వుంచితే, నీకు పైపు లైను వేయడానికి నా భూములు అవసరం. భూములు కావాలంటే చర్చికొచ్చి నువ్వు మతాన్ని ఒప్పుకోవాలి - అని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
***
***
3.
మిడిల్ 2
ప్రారంభం కొడుకు జూనియర్ డానీ వైద్యంతో వుంది. డాక్టర్ కూడా తేల్చేయడంతో చాలా
ఆందోళన పడ్డాడు డానీ. వీడేం తప్పు చేశాడనీ ఈ శిక్ష. ఇంటర్వెల్ పేలుడుతో చమురు సముద్రాలున్నాయనుకోవడం, మతం మీద తనదే గెలుపనుకోవడం విజయంతో ఉత్థానమైతే, ఇప్పుడు ఈ మిడిల్ 2 ప్రారంభంలో కొడుకు సమస్యతో అపజయంతో పతనం. చేసేదిలేక
ఇంటర్వెల్ పాయింటుని అందిపుచ్చుకుని, గాథని కొనసాగిస్తూ కంపెనీ
విస్తరణ కార్యక్రమాలు చేపట్టాడు. ఇక అందినంతా చమురు తోడుకుందామని.
ఇప్పుడు ఇలై
వచ్చి బాకీ డబ్బులు అడిగాడు. అతడి మీద ఎటాక్ చేసి చిత్తుగా తన్నేశాడు డానీ. కొడుకు
చెవిటివాడైన కష్టంలో తనుంటే, మహిమలతో
బాగుచేయకుండా వచ్చి డబ్బులు అడుగుతాడా అని కొట్టేశాడు. పాస్టర్ అనికూడా చూడకుండా
కొట్టేశాడు. వూహించని షాకింగ్ దృశ్యానికి తెగబడ్డాడు. మిడిల్ 1 ప్రచ్ఛన్న యుద్ధంగా
వుంటున్నది కాస్తా, ఇప్పుడు మిడిల్ 2 తో ప్రత్యక్ష యుద్ధంగా
ఇలా మారిపోయింది. టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ కి న్యాయం చేస్తూ. స్క్రీన్ టైమ్
గడుస్తున్న కొద్దీ, టెన్షన్ పెరుగుతూ పోవాలన్న రూలు ప్రకారం.
ఇది డానీ
ఉత్థానమే. నైతికంగా కాదు, ఇగో పరంగా. నైతికంగా పాస్టర్ ని కొట్టి
పతనం. ఇలైకి ఇది ఇగో పరంగా ఇప్పుడు పతనం. మిడిల్ 1 చర్చి సీనులో అతను మతాన్ని
వదిలేసినట్టు సైతానుగా మారాడు. దానికి శిక్షగా డానీ చేతిలో ఇప్పుడు దెబ్బలు. ఎలా
చేసుకున్న ఇద్దరి కర్మలే అలా ఈ గాథని నడిపిస్తున్నాయి.
ఇక్కడ
దెబ్బలు తిన్న ఇలై వెళ్ళి రియాక్షన్ గా తండ్రిని కొట్టాడు. పాస్టర్ అయివుండి
తండ్రిని కొట్టాడు (పతనం). అతడి అంతం ఇక సమీపించింది...
ఈ మిడిల్ 2
కథనపు అల్లిక గమనించాలి. చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ గా దేనికదిగా నడుస్తోంది.
దీంతో ప్రతీ చాప్టర్ స్పష్టంగా వుంటూ, బలంగా
ముద్ర వేస్తోంది. మొదటి చాప్టర్ కొడుకు వైద్యం, రెండో
చాప్టర్ డానీ ఇలైని కొడితే ఇలై తండ్రిని కొట్టడం. ఇలా ఒక చాప్టర్ నడుస్తూండగా ఇంకో
చాప్టర్ సీను మధ్యలో వేయడం గానీ, ఇంకో రాబోయే చాప్టర్ లోని
పాత్రని తేవడం గానీ జరగలేదు. ఈ విధానం
కథకి పనిచేస్తుందా లేదా ఆలోచించాల్సిన విషయం. గాథకి మాత్రం బావుంది.
ఇలాగే
ఇప్పుడు మూడో చాప్టర్ లో డానీ తమ్ముడి నంటూ హెన్రీ రాక. ఇక వీళ్ళిద్దరితో వరసగా
సీన్లు వస్తాయి. అన్నదమ్ములుగా ఇద్దరి బాండింగ్. ఆయిల్ బిజినెస్. ఈ చాప్టర్
ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఉత్కంఠ. డానీ తన కలలు హెన్రీతో పంచుకుంటాడు. ఇది
జరుగుతూండగా మధ్యనుంచి ఇంకో చాప్టర్ లాగుతాడు దర్శకుడు. కొడుకు జూనియర్ డానీ
చాప్టర్.
డానీ
పట్టుకొచ్చి, సిటీలో వీడికి సైన్ లాంగ్వేజీ నేర్పేందుకు
జాయిన్ చేయాలని తీసుకు బయల్దేరతాడు. కొడుకుతో పాటు ట్రైనెక్కి కూర్చుంటాడు.
ఇప్పుడే వస్తాను, ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి ట్రైను
దిగుతాడు. అంతే, మళ్ళీ ఇక రాడు. ట్రైన్ కదులుతూంటే కంగారుగా
దిగిపోబోతాడు కొడుకు. ఎవరో వెనక్కి లాగి కాపాతారు. ట్రైన్ వెళ్లిపోతుంది. డానీ
కారెక్కి ఇంటికెళ్ళి పోతాడు. కొడుకుని ఇలా వదిలించుకున్నాడన్న మాట. హృదయ విదారకంగా
వుండే ఈ ఫ్యామిలీ డ్రామాలో డానీ ఇగోకి మరో విజయం, నైతికంగా
పరాజయం. ఇలా కొడుకు చాప్టర్ మరో చాప్టర్ సీను అడ్డురాకుండా,
ఏకధాటిగా నడుస్తూ, బ్రేక్ అవని భావోద్వేగాల్ని తారాస్థాయికి
తీసేకెళ్ళి ముగుస్తుంది.
***
ఇంతకీ గాథలో హెన్రీ ప్రవేశం దేనికి? లేకపోతే వచ్చే నష్టమేమిటి? మధ్యలో టైమ్ పాస్ లాగా అన్పించే ఈ చాప్టర్ తో గాథకి ఇంకేదైనా ఉపయోగముందా? వుంది. డానీ బయోగ్రఫీ కోసం, డానీ అధోగతి కోసం. ఈ గాథ మొదట్నుంచీ ఇప్పటి వరకూ డానీ ఎవరో, పుట్టుపూర్వోత్తరా లేమిటో, ఎక్కడ్నించి వచ్చాడో ఏమీ తెలియదు. ఇదెక్కడో చెప్పక పోతే పాత్ర సమగ్రంగా వుండదు. ఎక్కడ చెప్పాలి? ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయ క్రమంలో చెప్పేయాలా? సర్వ సాధారణంగా చెప్పేస్తారు తెలుగు సినిమాల్లో. ఇలా చెప్పేస్తే పాత్రతో సస్పెన్స్ పోతుందంటే అర్ధం జేసుకోరు. పాత్ర ఎవరో తెలియక పోతే తెలుసుకోవాలన్న త్రెడ్ తో పాత్రని ఫాలో అవుతూంటారు ప్రేక్షకులు. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలన్న ధ్యాస వుండాలిగా ముందు కథకుడికి.
ఆఫ్ కోర్స్, కథతో ఫాలో అవుతారు ప్రేక్షకులు. అయితే ఒక్క కథతో ఫాలో అయితే సరిపోదు. పాత్ర ఎవరో తెలుసుకోవాలన్న సస్పెన్స్ తో కూడా ఫాలో అయితే కథకి డైమెన్షన్ వస్తుంది. ఎప్పటిదాకా ఫాలో అవాలనేది కథని బట్టి వుంటుంది. ఈ గాథలో సెకండాఫ్ లో ఆ టైమింగ్ వచ్చింది.
హెన్రీ చాప్టర్ ఇందుకే. అతనొస్తేనే డానీ బయోగ్రఫీ వస్తుంది. ఇలాగాక, డానీ ఎక్కడో తాగుతూ ఎవరికో తన బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవచ్చు. అది పాత్రకి కథకుడు బయటి నుంచి తన వంతుగా అతికించి నట్టవుతుంది. మాట్లు వేసే వాడిలా అతికింపులు అతికించే కథకుడు చీడపురుగు కథకీ పాత్రకీ. వెంటనే కథకుడి మీద ఎండో సల్ఫాన్ స్ప్రే కొట్టాలి. దోమల మందు పెట్టినా సరే.
హెన్రీ రాకతో డానీ తన గతాన్ని స్మరించుకునే వీలయ్యింది. అతడికో తండ్రీ, ఆ తండ్రికో ఇద్దరు భార్యలూ వుండే వాళ్ళని మనకి తెలిసింది. తను ఎప్పుడు ఇల్లొదిలేసి వచ్చేశాడో తెలియదు. ఆర్కియాలజీ చేశాడు. అలా అలా ఒక గమ్యం కోసం తిరుగుతూ, వెండి గనులతో ప్రయత్నం చేసి చమురు దాకా వచ్చాడు. తండ్రి ఇటీవలే చనిపోయాడని ఇప్పుడు హెన్రీ చెప్పేదాకా తెలీదు.
ఇలా డానీ బ్యాక్
గ్రౌండ్ తెలియడానికి ఈ చాప్టర్ ఉపయోగపడింది. ఇంకా డానీ గురించి ఇంకో పార్శ్వం తెలియకుండా
వుండిపోయింది : అతడి ఇన్నర్ డ్రీమ్ వరల్డ్ ఏమిటో మనకి తెలియదు. అది తమ్ముడికేగా వెల్లడించుకో
గలడు. ఎక్కడో పెద్ద బంగళా, మనుషులకి దూరంగా ఏకాంతంలో జీవితం...అయితే ఒక
లోటు వుందని కూడా చెప్తాడు. బంగాళాలో ఆడుకుంటూ తన పిల్లలు...అంటే అతడికి పెళ్ళి చేసుకోవాలని
వుంది. కానీ సంపన్నుడుగా ఎదగాలన్న కోరిక పెట్టుకుని పెళ్ళిని తెగ నిర్లక్ష్యం చేశాడన్న
మాట.
అతడి లోపలి మనిషిని
మనమిలా చూశాక, అతడ్ని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియదు మనకిప్పుడు.
లోలోపల దాచుకునీ కల లు చూస్తే అలా వున్నాయి, వాటి కోసం చేసే పనులు
చూస్తే ఇలా వున్నాయి....
ఇప్పుడు హెన్రీని
చంపి హంతకుడు కూడా అయ్యాడు. ఇలై లాగే ఇతడి అంతం కూడా సమీపించింది ఈ మిడిల్ 2 లో. ప్రత్యర్ధులిద్దరి
క్యారెక్టర్స్ జర్నీ సమాంతరంగా సాగుతున్నట్టు గమనించాలి. మిడిల్ 2 సంఘర్షణ అంటే మిడిల్
1 కంటే హై డిగ్రీ సంఘర్షణ. మర్డర్ అంత పతాకస్థాయికి తీసికెళ్ళే అంతటి సంఘర్షణ ఇంకోటి
వుండదు. ఇలా డానీని హంతకుడుగా అథోగతిన పడేయడం కోసం కూడా హెన్రీ రాక, అతడి చాప్టర్ తప్పవు.
***
5. ఈ హత్య కనిపెట్టిన విలియం బాండీ వచ్చి, డానీని
బ్లాక్ మెయిల్ చేయడం డానీకి పీక్కోలేని ఇరకాటం. మతానికి ముడిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు
బాండీ. దొరికావురా మతాన్ని అవమానిస్తావురా, ఇప్పుడొచ్చి మతాన్ని ఒప్పుకుని, పాపినాని క్షమించమని
వేడుకో- అనే టైపులో బాండీకి చిక్కాడు డానీ. ఇప్పుడేం చేస్తాడు? మతానికి లొంగిపోతాడా? బద్ధశత్రువు ఇలై చేతుల మీదుగా? ఇది ఎండ్ విభాగంలో చూద్దాం.
―సికిందర్
Sunday, February 21, 2021
1015 : స్క్రీన్ ప్లే సంగతులు
Q : ఎంతసేపూ కథలేనా, గాథలు కూడా అద్భుతంగా చెప్పొచ్చు
అన్న విషయం మీరు రాస్తున్న ‘దేర్ విల్ బి బ్లడ్’ అనే సినిమా విశ్లేషణ ద్వారా అర్థం అయ్యింది. కానీ మన తెలుగు సినిమాలకు గాథలు
పనికి రావు అని మీరు ఎప్పుడో చెప్పారు. కానీ ఇక్కడ బాధాకరమైన
విషయం ఏమిటంటే, మన తెలుగులో వచ్చే సినిమాలన్నీ గాథలే. ఇప్పుడు
కొత్తగా మీరు విశ్లేషిస్తున్న ‘దేర్ విల్ బి బ్లడ్’ సినిమా లాగా తెలుగుకి గాథలు చేయొచ్చా? ఒకవేళ చేస్తే పెద్ద హీరోల కోసం చేసుకోవచ్చా? లేదా మీడియం లేదా చిన్న హీరోల కోసం కూడా చేసుకోవచ్చా? మన దగ్గర వచ్చే సినిమాలన్నీ గాథలే కానీ ఇలా కళాత్మకంగా, రస సిద్ధితో
ఎమోషన్స్ హైలైట్ చేస్తూ, మీరే చెప్పినట్టు భారీ యాక్షన్ కి సింపుల్
స్టోరీ లాగా తెలుగు కోసం గాథలు చేసుకోవచ్చా? కొంచెం
వివరించగలరు.
―వి. రాజేష్, అసోషియేట్
A : ముందుగా, తెలుగులో వచ్చేవన్నీ గాథలు కూడా కావు. కథకీ గాథకీ తేడా తెలియక, లేదా ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా, కథ అనుకుంటూ తీసేస్తే అవి ఎటూ గాకుండా అవుతున్నాయి. గాథకి ఆలోచింపజేసే విషయం, పాత్ర చిత్రణలు, నటనలు, సంభాషణలు, టెక్నికల్ హంగామా లేని క్వాలిటీ చిత్రీకరణ, ఫిలాసఫీ ఇవీ అవసరం. గాథ తీయాలంటే మూసఫార్ములా ప్రపంచంలోంచి పూర్తిగా వేరే ఉన్నత ప్రపంచంలోకి వెళ్లిపోవాలి. దీనికి స్టార్స్ ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. మీడియం లేదా చిన్న హీరోల మీద ఉదాత్త గాథలు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అవి ఆర్ట్ సినిమాలుగా అన్పించవచ్చు.
సమస్య ప్రేమతో రాదు, ఇద్దరి మద్య వుండేది ప్రేమ కాదు కాబట్టి. ఇద్దర్నీ కలిపింది
అవసరాలు కాబట్టి, ఆ అవసరాలతో సమస్య వచ్చినప్పుడు మొదలవుతాయి
సమస్యలు. అవసరాల కోసం కలిసి, వాటి కారణంగానే విడిపోయాక, మరో చోట వెతుక్కునేది ప్రేమ కాదు, మళ్ళీ అవసరాలే. కానీ
ఏ అవసరాలు తీర్చుకుందామని, ఎదుటి వ్యక్తిలో ఏది ఆకర్షించి, ఏం బాసలు చేసి కలిశారో, ఆ మూలకారణానికి వాళ్ళు కట్టుబడి
వుండకపోతే, ఇంకెక్కడా కట్టుబడి వుండలేరు. గాలి వాటం
జీవితమైపోతుంది. ఇదే రామ్ చరణ్ పాత్ర జీవితం, సమస్య.
మూలకారణం పట్ల విధేయత, దాన్ని వృద్ధి చేసుకుని పరస్పరం ఫలాలు పొందే సహిష్ణుత, సంబంధాన్ని శాశ్వతం చేస్తుంది. అప్పుడా సంబంధానికి కావాలనుకుంటే ప్రేమ, ప్రేమ కావ్యం, ప్రేమ పురాణం, లెజండరీ
లవ్, బాక్సాఫీసు లవ్, ఇంకేదైనా బంపర్ పేరు
పెట్టుకుని తృప్తి పడితే పడచ్చు. మూలకారణం పట్ల జీవితకాల విధేయత లేని సంబంధానికి ప్రేమనుకోవడం
పెద్ద జోక్ అవుతుంది.
‘ఆరెంజ్’ స్క్రీన్ ప్లే సంగతులు ఇప్పుడవసరం లేదు. అప్పట్లో రివ్యూ రాశాం. పాత్ర కరెక్ట్
గా వుంటే స్క్రీన్ ప్లే కరెక్ట్ గా వుంటుంది. స్క్రీన్ ప్లేకి రచయిత కథకుడో, దర్శకుడో కాదు - పాత్రే. స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ మైండ్ + సబ్ కాన్షస్
మైండ్ + ఇగో. ఈ మూడిటి ధర్మాలతో పాత్ర వుంటే
స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. మేకర్ గా సినిమాల్నిఈ దృష్టితో చూస్తే తప్పొప్పులు
తెలిసి పోతాయి. ప్రతీ దానికీ స్క్రీన్ ప్లే సంగతుల పాఠాలు అవసరం లేదు.