(కొన్ని ప్రశ్నలు
మిగిలిపోయాయి. అవి వచ్చే వారం)
―సికిందర్
(కొన్ని ప్రశ్నలు
మిగిలిపోయాయి. అవి వచ్చే వారం)
―సికిందర్
2016 లో ముంబాయిలో మీరా రోడ్ స్కామ్ అనే కాల్ సెంటర్ మోసం జరిగింది. కాల్ సెంటర్ ఉద్యోగులు అమెరికన్లని ఐఆర్ఎస్ అధికారులమని ఫోన్లు చేసి, ఆదాయపన్ను ఎగవేత దార్లు అంటూ వాళ్ళని బెదిరించి, రెండు వేల కోట్లు బకాయిల పేర దండుకున్నారు. దీని మాస్టర్ మైండ్ షాగీ రవీందర్ పశుహా అనే పాతికేళ్ళు నిండని వాడు. రెండేళ్ళూ ఇది సాగించాక పోలీసులకి దొరికిపోయాడు. ఈ కేసే ‘మోసగాళ్ళు’ కథ కాధారం. షాగీ పాత్ర విష్ణు పోషించాడు. షాగీకో అక్క వుంది. అక్క పాత్ర కాజల్ పోషించింది.
కాల్ సెంటర్ బాస్ నవదీప్ కి ఈ అక్కా తమ్ముళ్ళు సహకరించి, కాల్ సెంటర్ ఉద్యోగులతో కలిసి ఐఆర్ఎస్ పేరుతో అమెరికన్లని మోసం చేసి సంపన్నులై, ఎలా దొరికిపోయారన్నది కథ. ఈ ట్రూ క్రైమ్ (నిజంగా జరిగిన నేరం) జానర్ కథ ఐడియాలో లోడ్ అయివున్న శక్తివంతమైన బహుముఖ ప్రయోజనాల వైపు దృష్టి సారించకుండా, తెలిసిన, అలవాటయిన ఒకే ఒక మూస టెంప్లెట్ లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఎగ్జిక్యూషన్ కి అయిన ఖర్చు 50 కోట్లు. అన్ని మరణ శిక్షలకీ ఉరి కంబమే అన్నట్టు, అన్ని జానర్ల కథలకీ అదే టెంప్లెట్- మూస టెంప్లెట్. ఈ మూసలో ఆశ్చర్య కరంగా దీని అమెరికన్ దర్శకుడు వచ్చి కలిసిపోవడం కొసమెరుపు. కలిసిపోయేట్టు చేస్తుంది తెలుగు మూస. క్వెంటిన్ టరాంటినో ని తీసుకొచ్చినా చేస్తావా చస్తావా అన్న పరిస్థితే వుంటుంది. మా పద్ధతిలో మా బాక్సాఫీసు పనితీరు ప్లస్ 50% అయితే, మీ పద్ధతిలో మీ బాక్సాఫీసు మైనస్ 90% కదా అని టరాంటినో గనుక అంటే, మా పద్ధతిలో మాకు మైనస్ 90% మాత్రమే కావాలని విజయవంతమైన పట్టుదల.
జరిగిన ట్రూ క్రైమ్ ని పరిశోధన చేసి రాశామన్నారు. ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వున్నదే. డొమైన్లో వున్నది వున్నట్టు సినిమా తీస్తే పరిశోధన అవుతుందా? స్టోరీ ఐడియా అవుతుందా, ఎత్తి రాసిన వార్తా కథన మవుతుందా? డొమైన్లో వున్న విషయం కాక కొత్తగా ఏం చూపించారు, ఏం చెప్పారు?
స్కామ్ చేసి దొరికిపోయిన షాగీ డబ్బెక్కడుందో పోలీసులు కనుక్కోలేకపోయారు. స్కామ్ చేసి దొరికిపోయిన అక్కాతమ్ముళ్ళు డబ్బెక్కడ దాచారో తెలియదని సినిమాలో కూడా షాగీ కేసు ముగింపే ఇచ్చారు. ఇందులో పరిశోధన ఎక్కడుంది? స్టోరీ ఐడియా ఏముంది?
ట్రూ క్రైమ్ కేసు అంతు చిక్కకుండా వుంటే, దాన్ని పరిశోధించి సమాధానమిచ్చేది ట్రూ క్రైమ్ జానర్. సంచలనం సృష్టించిన జెస్సికా లాల్ హత్య కేసుతో తీసిన ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’ తో దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ పనే చేశాడు. మరో సంచలనాత్మక ఆరుషి హత్య కేసు గురించి ‘తల్వార్’ తీసి ఈ పనే చేసింది దర్శకురాలు మేఘనా గుల్జార్. వీళ్ళిద్దరూ తేలని ఈ కేసుల్లో ఇలా జరిగుండ వచ్చని పరిశోధనాత్మక అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ రెండు సినిమాలూ చర్చనీయాంశాలయ్యాయి. హాలీవుడ్ ‘బ్లాక్ ఢాలియా’, ‘జోడియాక్’ వంటి ట్రూ క్రైమ్స్ కూడా ఇలాటివే. ‘మోసగాళ్ళు’ తో ఇలా నోటెడ్ అయ్యే అవకాశాన్నికోల్పోయారు మూస టెంప్లెట్ తో. దీని ఐడియాలో దాగున్న మార్కెట్ యాస్పెక్ట్ లాభాలని పట్టించుకోలేదు. ఐడియా - ఐడియా విశ్లేషణతో మార్కెట్ యాస్పెక్ట్, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ - ఇవంటే పడక పోతే ఇలాగే వుంటుంది.
***
స్కామ్ ఆలస్యంగా అమెరికాలో ఐఆర్ఎస్ కి, ఎఫ్బీఐ కీ లీకై ముంబాయి పోలీసుల్ని ఎలర్ట్ చేశారు. ముంబాయి పోలీసులు పట్టుకోబోతే దుబాయి పారిపోయాడు షాగీ. దుబాయి నుంచి పట్టుకొచ్చి లోపలేస్తే, బెయిల్ మీద విడుదలై దర్జాగా తిరుగుతున్నాడు షాగీ. రూపాయి కూడా షాగీ నుంచి వసూలు చేయలేకపోయారు. స్కామ్ తో సంబంధమున్న అతడి అక్కని అరెస్ట్ చేశారు. 700 ఉద్యోగుల్నీ అదుపులోకి తీసుకుని చాలా మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో ఉద్యోగినులు కూడా వున్నారు.
3. ఇక వేల మంది అమెరికన్ బాధితుల పరిస్థితి... మీ ఇంటికి మా అఫీషియల్స్ వస్తారు, వీధిలో మీ పరువు తీస్తారు, మూడు నెలలు జైల్లో వేస్తారు, మీ కార్డులన్నీ రద్దు చేస్తారని బెదిరిస్తూంటే, ఏడ్చి అలా చేయవద్దని హీనంగా బతిలాడుకున్నారు అమెరికన్లు. ఈ బాధితుల పరిస్థితేమిటి? కథ లేమిటి? ఇలా ఫూల్స్ అవకుండా ఏం నేర్చుకోవాలిందులోంచి? ఇలాటి సైబర్ క్రైమ్స్ కి బకరాలవుతున్న వాళ్ళని చూసి ప్రేక్షకులేం నేర్చుకోవాలి? ‘మోసగాళ్ళు’ ని ఇంగ్లీషులో అమెరికాలో కూడా విడుదల చేస్తామన్నారు. ఇందులో దానికి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? మా వోడు మీ వాళ్ళని ఫూల్స్ చేసి దోచుకుంటే మీరేం చేయలేక పోయారనీ, వాణ్ణి అమెరికాకి లాక్కొచ్చి జైల్లో వెయ్యలేక పోయారనీ, అమెరికాకి చెబుతున్న అర్ధంలో సినిమా వుంటే, ఏమంత బావుండదేమో? అక్కడి ఇండియన్ల గురించి కూడా ఆలోచించాలేమో?
స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇక నావెల్టీ లేదు. ఇది చాలా అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ఇమ్రాన్ హాష్మి తో ‘వై చీట్ ఇండియా’ అనే ట్రూ క్రైమ్ వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని, తెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించి, డబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఇతణ్ణి ఎలా పట్టుకుంటారనేదే కథ. ఈ హీరోని పట్టుకుంటే ప్రేక్షకుల కేంటి, పట్టుకోకపోతే ఏంటి?
అన్ని నేరాలు చేసిన హీరో ఇంకా మారిపోయే టెంప్లెట్టా? జస్టిఫికేషన్ కోసం మార్పు అనే డ్రీమ్ వరల్డా? దేశంలో, బయటా అంత మందిని బాధించిన వాణ్ణి తీసి కెళ్ళి అమెరికా జైల్లో పడేసి ఇండియా పరువు నిలబెట్టక?
హీరో క్రిమినల్ పాత్ర వేస్తే క్రిమినలే. క్రిమినల్ గా మారితే ఏమేం జరుగుతాయో కఠిన శిక్ష సహా చూపిస్తే ఎక్కువ నమ్మి ఆలోచనలో పడతారు ప్రేక్షకులు. అలాటి పన్లు తాము చేయకుండా జాగ్రత్త పడతారు. అదే శిక్ష పొందిన క్రిమినల్ గా విలన్ పాత్రని చూపిస్తే ఏ ప్రభావమూ వుండదు. ఇలా ఈ వాస్తవ కథతో మంచు విష్ణు వాస్తవం కాని డ్రీమ్ వరల్డ్ లో బుజ్జగిస్తూ వుండిపోయాడు.
ఇక సినిమాలో ఏ సీన్లు ఎందుకొస్తున్నాయో, స్ట్రక్చర్ ఏమిటో అంతుబట్టకుండా, చప్పగా సాగుతుంది. కనీస స్థాయి థ్రిల్లర్ లక్షణాలు కూడా లేకుండా. డైలాగులు మాస్ సినిమా డైలాగులుగా వుంటాయి, జానర్ స్పెసిఫిక్ గా కాకుండా. అమెరికన్ దర్శకుడు విషయం లేని దీనికి కెమెరాతో చీకాకు పెట్టే టెక్నికల్ హంగామా చేస్తూ వుండి పోయాడు. మూస టెంప్లెట్ సినిమాలు బాక్సాఫీసు సినిమాలు కావు, అవిప్పుడు బి గ్రేడ్ సినిమాలవుతాయి.
―సికిందర్
―సికిందర్
‘జాతి రత్నాలు’ నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం బాక్సాఫీసు బరిలో జాక్ పాట్ కొడుతూ పోతున్నారు. 5 రోజుల్లో 19 కోట్ల వరకూ జాక్ పాట్ కొట్టేశారు. బాక్సాఫీసు రత్నాలు అన్పించుకున్నారు. అనుదీప్ కెవి అనే కొత్త దర్శకుడు స్వప్నా సినిమా ప్రొడక్షన్ బ్యానర్లో, ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో, ‘జాతి రత్నాలు’ రికార్డు కలెక్షన్లతో ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం ఓవర్సీస్ తో బాటు రెండు రాష్ట్రాల్లో, 5 వ రోజు 2.7 కోట్లు వచ్చాయి. 5 రోజుల్లో మొత్తం కలెక్షన్లు 19.02 కోట్లు. మొదటి రోజు 3.92 కోట్లు, రెండవ రోజు 2.9 కోట్లు, మూడవ రోజు 4.2 కోట్లు, నాల్గవ రోజు 5.3 కోట్లూ వచ్చాయి.
―సికిందర్
మిడిల్ 1 ఉద్రేకాలు పెరిగే ప్రచ్ఛన్న పోరాటంగా , మిడిల్ 2 లో బాహాబాహీకి దిగే ప్రత్యక్ష పోరాటంగా యాక్షన్ మూవీ వుంటే, మిడిల్ 1 మిడిల్ 2 ఒకేలా వుండే మోనాటానీ ఫీల్ వుండదు. ‘దేర్ విల్ బి బ్లడ్’ యాక్షన్ మూవీ కాకపోయినా ఈ వైవిధ్యాలతో వుంటుంది.
―సికిందర్