ఇహ అంతా ఓకే అనుకుని కీ బోర్డు మీద మీరు ఫైనల్ గా సేవ్ కొడతారు. టేబుల్ మీద
అటు పక్క వున్న మగ్గులో పొగలు గక్కుతున్న కాఫీని ఇంకోసారి సిప్ చేసి, వర్డ్
డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తారు. ఆ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు ఇప్పుడిప్పుడే
ఫినిష్ చేసిన బ్లాక్ బస్టర్ స్క్రిప్టు వుంది. మీరు చాలా కాన్ఫిడెంట్ గా
ఫీలవుతారు. గర్వంగానూ ఫీలవుతారు. ఎందుకంటే- ఒక స్క్రిప్టు ని పట్టుబట్టి ఫినిష్ చేయడమంత గొప్ప పని లేదు! అయితే ఒకటే సమస్య- మీరా
స్క్రిప్టుని ప్రేమించకపోవడం, ఇంకా వరస్ట్ గా మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం!
షాకింగ్ గా వుందా? వుండొచ్చు. వుంటుంది కూడా. రైటర్ గా మీతో మీరే
ప్రేమలో పడితే, టాలెంట్ పరంగా మీరొక పెద్ద కొండనే ఢీకొంటారు. ఆ కొండని ఒక్క అంగుళం
కూడా కదిలించుకుని దాటలేరు. మీరు అట్టడుక్కి
జారుకుంటే తప్ప-మీ ఇగో కిందనుంచి మీరు కూర్చోబెట్టిన పీఠాన్ని లాగేస్తే తప్ప!
రైటర్స్ తో వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు సక్సెస్ ని ఫేమ్ గా చూస్తారు. ఫేమ్ కోసం రాస్తారు. రాయడం కోసం రాయరు. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నిండా ప్రపంచంలో తాము పొందబోయే పేరుప్రఖ్యాతుల వాసనలతో నింపేస్తారు. తాము రాసింది పబ్లిక్ లోకి వెళ్ళాలని గాక, రాసిందాంతో తామే పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనుకుంటారు. తమ పేరే కన్పించాలి, తాము రాసింది ఎలా వున్నా ఫర్వాలేదన్న పటాటోపంతో ప్రవర్తిస్తారు.
అప్పుడేం జరుగుతుంది? ఇలా మీ గురించి మీరు ఫీలైపోతే, మీరు రాసిందాంట్లో మీరే కన్పిస్తారు; మీ ఇగోయే కన్పిస్తుంది; పేరుతెచ్చుకోవాలన్న మీ యావే కన్పిస్తుంది. ఒక కంపెనీ తన ఉత్పత్తులకి ప్రజల్లో పేరురావాలన్న సంకల్పంతో నాణ్యమైన ఉత్పత్తిని చేస్తుంది, ఉత్పత్తిని వదిలేసి కంపెనీకే పేరురావాలని ప్రాకులాడదు.
రైటర్స్ తో వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు సక్సెస్ ని ఫేమ్ గా చూస్తారు. ఫేమ్ కోసం రాస్తారు. రాయడం కోసం రాయరు. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నిండా ప్రపంచంలో తాము పొందబోయే పేరుప్రఖ్యాతుల వాసనలతో నింపేస్తారు. తాము రాసింది పబ్లిక్ లోకి వెళ్ళాలని గాక, రాసిందాంతో తామే పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనుకుంటారు. తమ పేరే కన్పించాలి, తాము రాసింది ఎలా వున్నా ఫర్వాలేదన్న పటాటోపంతో ప్రవర్తిస్తారు.
అప్పుడేం జరుగుతుంది? ఇలా మీ గురించి మీరు ఫీలైపోతే, మీరు రాసిందాంట్లో మీరే కన్పిస్తారు; మీ ఇగోయే కన్పిస్తుంది; పేరుతెచ్చుకోవాలన్న మీ యావే కన్పిస్తుంది. ఒక కంపెనీ తన ఉత్పత్తులకి ప్రజల్లో పేరురావాలన్న సంకల్పంతో నాణ్యమైన ఉత్పత్తిని చేస్తుంది, ఉత్పత్తిని వదిలేసి కంపెనీకే పేరురావాలని ప్రాకులాడదు.
మీరలా కాదు, మీరు మీకే పేరు
రావాలనుకుని రాస్తారు, రాసిందాని నాణ్యత పట్టించుకోరు. రాసిందాన్ని ఎప్పుడూ
నిష్పాక్షికంగా సరిచూసుకోవాలని కూడా ప్రయత్నించరు. మీ ఇగో మిమ్మల్ని మీరింతగా
ప్రేమించుకునేట్టు మాయ చేస్తుంది. మీ ఇగో మీకిచ్చిన కాన్ఫిడెన్స్ మీద ఈగని కూడా వలనివ్వదు. ఇగోయే
మీరు, మీరే ఇగో అన్నట్టుగా మీరుంటారు.
ఇలా
గాలికొట్టి ఉబ్బించుకున్న కాన్ఫిడెన్స్ తో మీరు స్క్రిప్టు ని సబ్మిట్ చేస్తారు.
ఇగో చేసే ఇంకో మాయ ఏమిటంటే అది అవతలివారికి కూడా ఇగో వుంటుందన్న స్పృహ మీకు
కలగనివ్వదు. మీ స్క్రిప్టు చదివే అవతలి వ్యక్తి
అందులో మీ ‘రైటింగ్ పవర్’ ని చూసి పడిపోతాడనుకుంటారు. కానీ అతడికీ ఇగో వుంటుందనీ,
ఆ ఇగోతో అతనూ రియాక్ట్ అవుతాడనీ అనుకోరు. మీ రైటింగ్ పవర్ లో మీ ఇగోని చూసిన అతను కూడా
వెంటనే తన ఇగోతో దాన్ని తిప్పికొట్టేస్తాడు.
రెండు ఇగోలూ ఒక
ఒరలో ఇమడవు. అవతలి వ్యక్తికి ఇగో లేకుండా మీరు చేయలేరు. ఎంతో కొంత అతడి ఇగోని
సంతృప్తిపర్చడమే మీరు చేయగలరు. అతడి ఇగోని సంతృప్తిపర్చాలంటే మీరు రాసిం దాంట్లో మీ ఇగో
కన్పించకూడదు, వినయపూర్వక రాతే కన్పించాలి. ఆ రాతలో ఆ రాతద్వారా ఆ కంపెనీకి వచ్చే
లాభాలే కన్పించాలి, మీ పేరుప్రఖ్యాతులు కాదు. కంపెనీకి మీ ఇగో నచ్చి నడిబజార్లో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని
అమ్మాలనుకోదు, మీరు రాసింది నచ్చితే దాన్ని అమ్మాలనుకుంటుంది.
రాసిందాంట్లో అంతా
మీ ఇగోయే నిండిపోయి వుంటే, దాన్ని రిజెక్ట్ చేస్తుంది, డీఫేమ్ చేస్తుంది, డస్ట్
బిన్ లో పడేస్తుంది. అప్పుడేమవుతుంది? ఇతరుల్నిఇంప్రెస్ చేయడంలో మీరు ఇలా ఫెయిలవడంతో
మీ ఇగో స్థానంలో మిమ్మల్ని అవమానభారం, నిరాశానిస్పృహలు, విరక్తి, వైరాగ్యం,
పిరికితనం ఇవన్నీ చుట్టుముడతాయి. మీ ఇగో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్తుందన్న
మాట.
అందుకని ఏంచేయాలి?
మీతో మీరు ప్రేమలో పడకండి, మీ రాతతో ప్రేమలో పడండి. మీ రాతపట్ల కమిట్ మెంట్, నిజాయితీ
ఉట్టి పడేట్టు రాయండి. ఆ రాత ద్వారా మీరేదో సాధించాలన్న ఆశలు పెట్టుకున్నట్టు గాక,
మీ రాత ఏం సాధించగలతో ద్యోతకమయ్యేట్టు రాయండి. అప్పుడు నెగెటివ్ ఫీడ్ బ్యాక్
మిమ్మల్ని దెబ్బ తీయదు, ఇంకోచోట సబ్మిట్ చేసుకుంటారు. రిజెక్షన్స్ మిమ్మల్ని బాధించవు, అదికాక పోతే
ఇంకోటి రాయడానికి సిద్ధమవుతారు. రాసిందే శాశ్వతమని భావించరు, ఇంప్రూవ్ మెంట్
ఎప్పటికీ వుంటుందని కరెక్షన్స్ చేస్తూంటారు. ఎన్ని కరెక్షన్స్ తో ఎంత పర్ఫెక్షన్
మీరు సాధిస్తూంటే, అంత ఒప్పించడానికి మీరు దగ్గరవుతూంటారు. మార్కెట్లో డబ్బే మాటాడుతుందని
గుర్తు పెట్టుకోండి, రాత కాదు.
అంటే మీకంటూ ఏమీ
ఆశించకుండా రాయాలా? అవునంతే, ఆశించకూడదు. అది రాస్తే మీకింత పేరొస్తుందని
రాయకూడదు, అది రాస్తే మీకింత డబ్బొస్తుందని రాయకూడదు, అది రాస్తే మరెన్నో ఆఫర్స్ వస్తాయనీ రాయకూడదు. వస్తాయీ అన్నది వూహ,
వూహలు చేయకూడదు. వూహించడంటే భవిష్యత్తులో వుండడమే. కానీ మీరు వర్తమానంలో వుండాలి.
మీరు భవిష్యత్తుని కలలు గంటూంటే, అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికీ, ఆ
ప్రేమతో మిమ్మల్ని మీరేదో వూహించుకోవడానికీ, పగటి కలలు కనడానికీ, ఫలితంగా ఇగో
వచ్చి ఆక్రమించడానికీ, ఆ ఇగోయే మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోవడానికీ, ఆ సెల్ఫ్
లవ్ తో వర్తమానంలో మిమ్మల్ని నడిపించడానికీ దారి తీస్తుంది. మీ చేతిలో వున్న పనిని
సరిగా జరగనివ్వదు, డిస్టర్బ్ చేస్తూంటుంది.
ఏదో రావాలని, ఏదో
కావాలని మీరు వూహాజనితమైన భవిష్యత్తులోకి వెళ్ళిపోయే కంటే, వాస్తవికమైన
వర్తమానాన్ని నమ్ముకుంటేనే పనిని నమ్ముకున్నట్టు. వర్తమానంలో దృష్టి పెట్టి మీరు
సరిగా రాయకపోతే మిమ్మల్ని మీరెలా
నమ్ముకోగలరు. అందుకని పనిని నమ్ముకోవాలి, మిమ్మల్ని కాదు. పనివల్లే మీమీద మీకు
నమ్మకం ఏర్పడుతుంది, వూహలవల్ల కాదు. పనిని నమ్ముకున్నప్పుడే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా వుంటారు. ఎందుకంటే
వాస్తవంలో లేదా వర్తమానంలో- ఈ క్షణంలో- మీరు చేయాల్సిన పనే మీ ముందుంటుంది. ఆపని తనని ప్రేమించమంటుంది. అందుకని మీ రాతపనిని
మాత్రమే మీరు ప్రేమించాలి, అది నిర్దుష్టంగా వుంటే, అదే మీ భవిష్యత్తుని కావలసినంత
గొప్పగా తీర్చిదిద్దుతుంది. సరైన వస్తువు నివ్వకుండా మీరే వస్తువూ పొందలేరు,
భవిష్యత్తు బంగారమవ్వాలంటే వస్తువే సమాధానం! ఇగోని భవిష్యత్తు వికర్షిస్తుంది,
ఒకవేళ ఆకర్షిస్తే అది తాత్కాలికమే.
-ఏజెన్సీస్