Monday, June 15, 2015
నాటి రహస్యం!
Monday, May 25, 2015
మూసగాళ్ళకు మరో పాఠం!
తారాగణం: సుధీర్ బాబు, నందిని రాయ్, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్, పంకజ్ కేసరి, ప్రవీణ్, చంద్రమోహన్, సప్తగిరి, ఫిష్ వెంకట్, దువ్వాసి మోహన్ తదితరులు
మాటలు: ప్రసాద్ వర్మ సంగీతం: మణికాంత్ ఖాద్రి ఛాయాగ్రహణం: యు. సాయిప్రకాష్‌బ్యానర్: లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత: చక్రి చిగురుపాటి
విడుదల : మే 22, 2015
*
హీరో సుధీర్ బాబు తాను పాపులర్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆశించే ముందు ఇలాటి పాసివ్ హీరో పాత్రల పట్ల అప్రమత్తత ప్రదర్శించడం మంచిది. ఏం హీరోయిజం వుందని ఈ ‘హీరో’ పాత్రకి అంగీకరించాడో తనకే తెలియాలి. తనకి తెల్సింది శిక్షణ పొందిన నటనే అయితే అది మాత్రమే చాలదు- తన నటనా వృత్తిలో భాగమే అయిన పాత్ర చిత్రణని కూడా కాస్త పట్టించుకోవాలి. కానీ దురదృష్టమే మిటంటే, ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ కూడా నటులు పాసివ్ పాత్రల్ని ఎలా ఏరిపారేసి యాక్టివ్ పాత్రల్ని ఎంపిక చేసుకోవాలో నేర్పే పాపాన పోవడం లేదు. ఇదంతా స్క్రీన్ ప్లే సబ్జెక్టులో భాగంగా బోధించే విషయంగా మాత్రమే చూస్తున్నాయి విచారకరంగా. ఇందుకే ఎడాపెడా చిన్న సినిమాలూ భారీ బడ్జట్ సినిమాలూ పాసివ్ పాత్రల్ని పోగేసుకుని అట్టర్ ఫ్లాపై చతికిలబడుతున్నాయి. దర్శకులకి పాసివ్- యాక్టివ్ పాత్రల గురించేమీ తెలీదని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఇలాటి వ్యాసాల్లో గత పదేళ్ళుగా వందల సార్లు రాసినా వాళ్ళ దారి వాళ్ళదే. హీరోయిజానికి అశాస్త్రీయంగా తమ తమ సొంత నమ్మకాలూ అభిప్రాయాలూ ఆపాదించుకుని తెచ్చి, పనికిరాని పాసివ్ పాత్రల్ని హీరోలకి అంటగడు తున్నారు శుభ్రంగా. ఇలా ‘మోసగాళ్ళకి మోసగాడు’ అన్పించుకుందామని అంచనా వేసుకున్న సుధీర్ బాబుకి కూడా ఈ ‘మోసమే’ జరిగిపోయింది నిలువెల్లా! సిడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పాలంటే, ఈ సినిమా కథలో తన క్యారెక్టర్ simply disappears off the page! ఇంత దారుణమన్న మాట.
సినిమా చిట్ట చివర్న- దర్శకుడు తన పేర్న ఓ సూక్తి వేసుకున్నాడు. ఈ సూక్తి ఈ సినిమా కథ (?) లో ఒక చోట ఓ పాత్రతో అన్పించిందే- చెడు చేసేవాడు ఆలోచించాలి, మంచి చేసేవాడు చేసుకుంటూపోవాలి- అని! కానీ దర్శకుడు ఈ రెండూ చెయ్యక శుభ్రంగా మధ్యేమార్గంగా పలాయనవాదం పఠించాడు ‘కథ’ తో. ఆ ‘కథ’ ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఈ బుల్లి సినిమాలో హీరోయిన్ దీ ఇదేదో భారీ ఫార్ములా సినిమా అయినట్టూ ప్రేమలకీ, పాటలకీ మాత్రమే పరిమితమై పోయిన మరో కృతక పాత్ర. టాలెంటెడ్ నటులు జయప్రకాష్ రెడ్డి, దువ్వాసి మోహన్ లు కూడా మాత్రం ఏం చేయగలరు- కామెడీ పేరుతో దర్శకుడి చ్చిన అర్ధంపర్ధంలేని సెకండ్ గ్రేడ్ లౌడ్ కామెడీతో, ప్రేక్షకుల నరాలమీద సుత్తి మోతలు ప్రసాదించడం తప్ప? పరమ క్రూరుడుగా ఎంట్రీ ఇచ్చిన విలన్ పాత్ర అభిమన్యు సింగ్ కి మాత్రం దర్శకుడి చేతిలో ఏం మిగులుతుంది- డమ్మీ క్యారక్టర్ గా మారిపోవడం తప్ప? మొదట్నుంచీ కథే మిటన్నది దర్శకుడికే తేలనప్పుడు, క్లయిమాక్సులు ఎలా ఉంటాయో ఈ మధ్య చూస్తున్నదే- తానుగా కథ ముగించలేని హీరోని మాయం చేసేసి, కమెడియన్లతో వేరే ఎపిసోడు నడిపేసి ముగించడమే. ఈ కమెడియన్లు ఫిష్ వెంకట్, సప్తగిరి లు అయ్యారు. సినిమా అనేది నిరక్షరాస్యుల కోసం నిరక్షరాస్యులు తీసే వినోద సాధనమని ఎవరో మేధావి ఇందుకే అని వుంటాడు.
పాటలతో సహా సాంకేతికంగా ఎందులోనూ ఈ సినిమాలో క్వాలిటీ ఉండనవసరం లేదు- ఎందుకంటే అసలే ఇది నాటు కామెడీ! అన్నిటినీ చదును చేసేస్తుంది.
స్క్రీన్ ప్లే సంగతులు?
ఆ విగ్రహాలు హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతానికే తరలించడం దర్శకుడి ఇంకో అనాలోచితమైన చర్య. హీరో ఇక్కడే ఉంటున్నాడు గాబట్టి విగ్రహాలూ ఇక్కడికే రావాలన్నట్టుంది కథనం. హీరో ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయోధ్యలో అంత సంచలన నేరం జరిగితే ఇక్కడ మోసగాళ్ళకు అంత మోసగాడే అనుకుంటున్నా హీరోకి ఆ సంగతి తెలియకుండానే ఉంటుందా? మరి అతనెందుకు ఫస్టాఫ్ అంతా విసుగెత్తించే ప్రేమకథతో కాలక్షేపం చేశాడు?
ఒక బిల్డప్ తో అయోధ్యలో విగ్రహాల అపహరణ జరుగుతుంది. దీనితర్వాత కథేమిటో అర్ధంగాకుండా కొసరు ప్రేమకథే ఇంటర్వెల్ దాకా సాగుతుంది. ఈ రోజుల్లో సినిమా ప్రేమకథలు ఎవరు చూస్తారు. షార్ట్ ఫిలిమ్స్ ప్రేమకథలు ఇంతకన్నా వాస్తవికంగా- కాలీన స్పృహతో యూత్ ఫుల్ గా ఉంటున్నాయి. ఎస్టాబ్లిష్ చేసిన విగ్రహాల పాయింటుతో థ్రిల్లర్ కథా కమామీషు ప్రధాన కథ కావాలి ఈ సినిమాకి నిజానికి. ‘స్వామిరారా’ లో విగ్రహ స్మగ్లింగే ప్రధాన థ్రిల్లర్ కథ. అందులోంచి పుట్టి రేఖామాత్రంగా వుండీ లేనట్టు సాగేదే – సబ్ టెక్స్ట్ గా పరోక్షంగా సాగేదే ప్రేమ కథ. కానీ ఇక్కడ దర్శకుడు ప్రధాన కథని బహుశా డీల్ చేయలేక వదిలేసి- పలాయనవాదంతో పనికిరాని ప్రేమకథతో, ఇంకేదో ఛోటా విలన్ల (జయప్రకాష్ రెడ్డి- దువ్వాసి మోహన్) గోల కామెడీ తో కాలక్షేపం చేశాడు. ఏమాత్రం మార్కెట్ స్పృహ వున్నా, ఇవ్వాళ్ళ మార్కెట్ కేం కావాలో భిన్నంగా, పోటీతత్వంతో ఆలోచించి ఈ సినిమా తీసేవాడు.
పోనీ సెకండాఫ్ లో నైనా ప్రధాన కథని థ్రిల్లింగ్ గా చెప్తాడేమోనని చూస్తే, అక్కడా షరా మామూలు శ్రీను వైట్ల ఫార్ములాయే శిరోధార్యమైంది ఈ కొత్త దర్శకుడికి తన దగ్గర సొంత విషయమే లేనట్టు!
దుబాయ్ విలన్లూ, హైదరాబాద్ విలన్లూ సహా హీరో హీరోయిన్లూ ఒకే ఇంట్లో చేరి వూర కామెడీ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చూడాలిక్కడ. ఆఖరికి విలన్లు ఆ విగ్రహాల్ని అందుకోవడానికి ఇంకేదో రహస్య ప్రదేశమే దొరకనట్టు- రెండు కోట్లు ఖర్చు పెట్టి చిల్లర విలన్ ( ఫిష్ వెంకట్) పెళ్లి శుభాకార్యమంటూ పెళ్లి కూతురితో కలిపి అశ్లీల కామెడీ సృష్టించి ఆ సందట్లో ఎవరికీ తెలీకుండా పనులు చక్కబెట్టుకుంటారట! సినిమా లాజిక్ కైనా ఓ లాకింగ్ సిస్టం వుంటుంది- దాన్నికూడా విరిచిపారేస్తే ఇలాగే తయారవుతుంది.
పసలేని ప్రేమకథని అంత విరగబడి నడిపిన హీరో, అసలు కథ వచ్చేసరికి కన్పించడు. ఎవరెవరో విలన్లు, కమెడియన్లూ ‘కథ’ ని వదిలేసి ఇంకేవో గోలలు సృష్టించుకుంటూ పోతూంటారు. హీరో జస్ట్- disappears off the page!
ఇంతోటి హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా! తెలుగు రాష్ట్రాల్లో మగపుట్టుక పుట్టిన పాపానికి దిక్కులేని అనాధలుగా మిగిలిపోక తప్పదన్నట్టుగా, తెలుగు సినిమాల్లో కుప్ప తెప్పలుగా చూపించు కొస్తున్న అనాధ హీరో పాత్ర ఈసారి ఇక్కడ, చిన్నప్పుడు మేస్టారి పర్సు కొట్టేసి లారీ కింద పడితే, అదే మాస్టారు కాపాడాడు కాబట్టి, ఈ సత్తెకాలపు మాస్టారి అనాధ పిల్లల స్కూల్ని కార్పొరేట్ స్కూలోళ్ళు హైజాక్ చేయకుండా, ఆర్ధిక సాయం చేయడానికే మనవాడు ‘మోసగాడుగా’ గా మారాడట! ఏనాటి కథలివి- ఈనాటి సత్తెకాలపు కొత్త దర్శకులు తీరికూర్చుని చెబుతున్నారు?
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే లేదు, ఎందుకంటే- స్క్రీన్ ప్లే కి కనీసం ఓ హీరో వుండి- అతడి పరంగా కథ సాగి- అతడి క్యారక్టర్ ఆర్క్ ని సృష్టిస్తూ- టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేయాలి. పురాణ కథ తీసుకున్నా, అణ్వాయుధాల కథ తీసుకున్నా కన్పించేది ఈ బేసిక్సే. కానీ దర్శకుడి ఆలోచన ఎక్కడా పెరగదు. మొదలెట్టింది లగాయత్తూ చివరిదాకా అదే నేలబారు లెవెల్లో ఆలోచన వుండి పోతుంది. టెన్షన్- థ్రిల్- కాన్ఫ్లిక్ట్ లనేవి సినిమాకి అతి ముఖ్యమన్న అవగాహన ఏకోశానా కన్పించదు. ప్రధాన కథలోంచి ఫైట్ ని సృష్టించలేక కొసరు కథలో చిల్లర గ్యాంగ్ ని మళ్ళీ రప్పించి, సెకండాఫ్ లో ఎంత స్టయిలిష్ గా యాక్షన్ సీను సృష్టించినా, అది మృతదేహానికి అలంకరణ చేసిన చందాన్నే మిగిలిపోయింది.
Saturday, January 10, 2026
తెలుగు సినిమా
మలిస్వర్ణ యుగంలో ‘పాతాళభైరవి’ తర్వాత ‘దొంగరాముడు’ పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో
బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై డెబ్భై యేళ్ళు దాటింది. ఈ డెబ్భై
ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. సినిమాల్లో పదేళ్ళకో ధోరణి
(ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ
యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు.
దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి
తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. అప్పటి
దేశభక్తి ముందు ఇంకా అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత
జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది.
అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో, తొలివ్యాపార
యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం
లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి వ్యాపార యుగం గురించి చెప్పనవసరం
లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే పతనమైన విలువలు!
అయితే విలువలు
ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా
విలువలు తీసేస్తే? అప్పుడు ఇప్పటి మలి వ్యాపార యుగమైనా వ్యాపారంలా
వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరిగిపోతూ వుంటుంది.
నాటి మలిస్వర్ణ యుగం
సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా
సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో,
దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం.
పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి,
మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే;
మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి
గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా
అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక,
చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ
జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య,
ప్రేమ, వాస్తవిక, గూఢచారి,
కౌబాయ్, హార్రర్, క్రైం
థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు,
సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది
కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు,
తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ
కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే.
ఊత పదాలు సహా ఐటెం
సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక
పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’,
దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్
గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’ లాంటివి.
పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’ అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని
మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల
ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి,
సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక
ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే
చివరి అంకంలో.
'దొంగరాముడు' మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, చౌకబారు విలువల ప్రస్తుత మలి వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో - సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలుతోంది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు – ‘ఈ సర్కస్ అంతా ఓ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే...’ అంటూ పాట! ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.
‘రాజా సాబ్’ రాజ్ కపూర్ పాటలాగా మారేక కూడా, దర్శకుడు మారుతీ పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయని చెప్పుకుని ఆత్మవంచన చేసుకోకుండా, ఈ మలి వ్యాపార యుగపు దైన్యం గురించి సీరియస్ గా చింత చేయాల్సిన అవసరముందని గుర్తించాలి.
-సికిందర్
Monday, May 2, 2016
జానర్ మర్యాద గురించి మరొక్కసారి - 2
2015 లో తర్వాతి రేంజి హీరోలు 19 మంది - కల్యాణ్ రామ్, గోపీచంద్, రాజశేఖర్, రామ్, నాగచైతన్య, నాని, అఖిల్, శర్వానంద్, సుధీర్, వరుణ్ తేజ్, అల్లరి నరేష్, విష్ణు, నిఖిల్, సుమంత్ అశ్విన్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నాగశౌర్య, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సత్యకార్తీక్ లూ కలిసి, హీరోయిన్ అనూష్కా శెట్టి ని కలుపుకుని 36 సినిమాలిచ్చారు. ఇందులో తొమ్మిదింటిని మాత్రమే ఓకే చేశారు ప్రేక్షకులు. మిగతా ఇరవయ్యేడూ వాళ్లకి నచ్చలేదు.
2015 లో 27 మీడియం రేంజి సినిమాలూ, ప్రధానంగా జానర్ల పాలన సరీగ్గా లేకే పరాజయాల పాలయ్యాయి.
2. సౌఖ్యం : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : రీసైక్లింగ్ చేసిన అనేక కథలు
10. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ : జానర్ : లవ్, జరిగింది : కాలం చెల్లిన కథనం
11. మోసగాళ్ళకు మోసగాడు : జానర్ : క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా
13. బందిపోటు : జానర్ : క్రైం, కలిపింది : పల్లెటూరి రాజకీయాలు
15. మా. మంచు- అ. కంచు : జానర్ : ఫ్యామిలీ, జరిగింది : ఔట్ డేటెడ్ కామెడీ
16. డైనమైట్ : జానర్: యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
17. సూర్య వర్సెస్ సూర్య : జానర్ : సైన్స్ ఫిక్షన్, చూపించింది : మూస ప్రేమ
18. శంకరాభరణం : జానర్ : మల్టీ ప్లెక్స్, జరిగింది : సింగిల్ స్క్రీన్ కి విస్తరణ
19. కొలంబస్ : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
20. కేరింత : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
21. రేయ్ : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ తో ఔట్ డేటెడ్ అప్రోచ్
22. అసుర : జానర్ : క్రైం, జరిగింది : మూస ఫార్ములా అప్రోచ్
23. జాదూగాడు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
24. బీరువా : జానర్ : కామెడీ, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
25. టైగర్ : జానర్ : సామాజికం, జరిగింది : యాక్షన్ జానర్ కింద మార్చెయ్యడం
26. సైజ్ జీరో : జానర్ : హెల్త్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
27. టిప్పు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్
***
జానర్ మర్యాదని గనుక మర్యాదగా పాటిస్తే, మాస్ సినిమాలో ఒకలా వున్న హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇంకోలా రూపు దిద్దుకుంటుంది. మాస్ పాత్రకి మించిన కుశాగ్రబుద్ధితో, హేతుబద్ధ ఆలోచనలతో హేండ్ సమ్ గా వుండి, మాస్ పాత్ర కంటే ఎక్కువ ఆకట్టుకునే అవకాశముంటుంది. ఆవారా బంజారా మాస్ పాత్రని ‘సరైనోడు’ కి వచ్చేసరికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకుగా తయారు చేసే స్థితికి చేరుకున్నారు. రాష్ట్రపతి కొడుకుని కూడా ఆవారా తిరగుబోతుగా చూపించుకునే పూర్తి స్వేచ్చ తెలుగు సినిమా దర్శకులకి ఎంతైనా వుంది, కాదనం. కానీ జానర్ల పరంగా ఆలోచించినా, అన్ని జానర్లకీ కలిపి అవే రొడ్డ కొట్టుడు ఆవారా మాస్ పాత్రలే ఎలా వుంటాయి? 'రాజా చెయ్యేస్తే' లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సినిమా పాత్ర కూడా రొడ్డ కొట్టుడుగా ఎలావుంటుంది?
తెలుగు ప్రజలు పౌరులుగా మంచి నాగరికంగానూ, సినిమా ప్రేక్షకులుగా చంఢాలపు అనాగారికంగానూ ఉంటారని నమ్మడం వల్ల ఇలా పుడుతున్నాయా పాత్రలు? ? సత్యజిత్ రే జీవిత కథ రాసిన మేరీ సెటన్, భారతీయ సినిమాలు వీధి భాగోతాల స్థాయి దాటి రాలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల వరస చూస్తే, గుంటూరులో బాషా నాటకాలని ఆడేవి. ఆ నాటకాల్లో హీరోల పాత్రలూ ఆ కథల స్థాయీ దాటి రావడం లేదు తెలుగు సినిమాలు!
రొడ్డ కొట్టుడుకి అతీతంగా ఆలోచించాల్సింది ముందు జానర్ మర్యాద గురించి. ఇక్కడే సమస్య వస్తోంది. ఈ సమస్యని తొలగించుకుని సినిమాలు తీస్తే ఏ జానర్ సినిమా నైనా ఆదరించడానికి సిద్ధంగా వున్నారు ప్రేక్షకులు. పాత్ర దగ్గర్నుంచీ కథా కథనాల వరకూ; చిత్రీకరణ, మేకింగ్ అప్రోచ్ వరకూ ఏజానర్ మర్యాద ఆ జానర్ కిచ్చి కాపాడితే అది సినిమాల్నే కాపాడుతుంది- 2016 లోనైనా ఇది అమలయ్యే అదృష్టానికి నోచుకుంటోందా? ఒకసారి చూద్దాం...
ఇలాకాక, సోగ్గాడే చిన్నినాయనా ఫాంటసీ జానర్ నుంచి పక్కకి తొలగకుండా, ఊపిరి వరల్డ్ మూవీ జానర్ కి అన్యాయం చేయకుండా, విచ్చేస్తే అక్కున జేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే పనిగా వస్తున్న హార్రర్ కామెడీ జానర్ తో విసుగెత్తిన ప్రేక్షకులకి, సోగ్గాడే చిన్నినాయనా లోని ఆత్మఫాంటసీ పెద్ద ఉపశమనం. ఊపిరిలో కార్తీ పాత్ర ఇంటి కథతో కాలుష్యమున్నా, కొత్తగా వరల్డ్ మూవీ జానర్ ని చూస్తున్న అనుభూతి ముందు అది దిగదుడుపే అయింది ప్రేక్షకులకి.
ఇక ఈ జనవరి - ఏప్రెల్ మధ్య, మధ్య తరహా సినిమాలు 18 విడుదలైతే, 14 ఫ్లాప్ అయ్యాయి. ఈ రేంజి హీరోలైన రామ్, నాని, శర్వానంద్, అడివి శేష్, సందీప్ కిషన్, శ్రీకాంత్, విష్ణు, మంచు మనోజ్, సునీల్, నారా రోహిత్, ఆది, రాజ్ తరుణ్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్, సత్య కార్తీక్ మొత్తం 15 మందీ కలిసి 18 సినిమాలిస్తే ఒక్కటే నచ్చింది ప్రేక్షకులకి. ఇంకో ఓ మూడింటిని మాత్రం ఏవరేజిగా సరిపెట్టేశారు.
క్షణం, నేనూ శైలజ, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణగాడి వీర ప్రేమ గాథ...వీటిలో ‘క్షణం’ క్రైం జానర్ ని కాపాడుతూ ఇంటెలిజెంట్ రైటింగ్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి హిట్టయితే, నేనూ శైలజ జానర్ వచ్చేసి ఓల్డ్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్. వీటిని అప్ డేట్ చేసివుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఎక్స్ ప్రెస్ రాజా ఇంటర్వెల్ కి అయిపోయిన మల్టీ ప్లెక్స్ జానర్ కథని, అతికించిన వేరే కథతో సింగిల్ స్క్రీన్ కి పెంచారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఏ జానర్ కీ చెందని అన్ని జానర్ల సినిమా. అందుకే ఏం చూశామో అర్ధం గాలేదని కామెంట్లు వచ్చాయి.
ఫ్లాపయిన 14 సినిమాల జానర్ల తీరుని పరిశీలిస్తే...
1. రన్ : జానర్ : ఇండీ ఫిలిం, జరిగింది : ఇండీ ఫిలిం ని రీమేక్ చేసే చోద్యం
2. టెర్రర్ : జానర్ : క్రైం లో టెర్రర్ సబ్ జానర్, జరిగింది : అప్డేట్ కాని అప్రోచ్
3. ఈడో రకం- ఆడో రకం : జానర్ : కామెడీ, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్
4. శౌర్య : జానర్ : క్రైంలో థ్రిల్లర్ సబ్ జానర్, జరిగింది : సబ్ జానర్ ఖూనీ
5. ఎటాక్ : జానర్ : గ్యాంగ్ స్టర్ సబ్ జానర్, జరిగింది : నిర్వహణలో ఒక లోపం
6. కృష్ణాష్టమి : జానర్ : ఫ్యామిలీ, యాక్షన్, జరిగింది : జానర్ల ఔట్ డేటెడ్ నిర్వహణ
7. తుంటరి : జానర్ : స్పోర్ట్స్, జరిగింది : రాంగ్ కాస్టింగ్
8. సావిత్రి : జానర్ : లవ్, జరిగింది : అప్డేట్ చేసుకోని కథ
9. రాజా చెయ్యేస్తే : జానర్ : క్రైం, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
10. గరం : జానర్ : మాస్, జరిగింది : ఔట్ డేటెడ్ అప్రోచ్
11. సీ. అందాలు-రా. సిత్రాలు : జానర్ ; లవ్, జరిగింది : ఔట్ డేటెడ్ అప్రోచ్
12. క. వైభోగమే : జానర్ : ట్రెండీ లవ్, జరిగింది : సెకండాఫ్ లో ఔట్ డేటెడ్ అప్రోచ్
13. స్పీడున్నోడు : జానర్ : రియలిస్టిక్ లవ్, జరిగింది : మాస్ యాక్షన్
14. పడేసావే : జానర్ : లవ్, జరిగింది : కాలం చెల్లిన ముక్కోణ ప్రేమ


















