Monday, June 5, 2023
1340 : స్పెషల్ ఆర్టికల్
Sunday, June 4, 2023
1339 : రివ్యూ!
రచన- దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్
తారాగణం : తిరువీర్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న,
అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్,
పద్మ, వసంత తదితరులు
సంగీతం : యశ్వంత్ నాగ్, ఛాయాగ్రహణం : వాసు పెండమ్
సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
కథ లేనప్పుడు వున్న కథని కాంప్లికేట్ చేయాలన్నది హాలీవుడ్
పాటించే రూలు. పోను పోనూ కామెడీ కథని కామెడీతో పరమ సంక్లిష్టంగా మార్చేస్తూ, చివర్లో
చిక్కు ముడి విప్పుతారు. ఈ సంక్లిష్టతకి, చిక్కుముడి
సస్పెన్సుకి ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కామెడీని ఎంజాయ్ చేస్తారు. ‘హేపీ భాగ్ జాయేగీ’ అని హిందీలో కథలేని కామెడీ సినిమాని
ఇలాగే తీసి హిట్ చేశారు.
హీరోయిన్లు పావనీ కరణం, సాయి ప్రసన్నల పాత్రలు, నటనలు జీరో
అయినా వాళ్ళని తగినంత గ్లామరస్ గా చూపించడానికైనా ప్రొడక్షన్ విలువలు సరిపోలేదు.
కెమెరా వర్క్, సంగీతం విఫలమయ్యాయి.
Saturday, June 3, 2023
1338 : రివ్యూ!
అందుకే ఫస్టాఫ్ ఐఫోన్ పిచ్చితో, దానికి పేరు పెట్టుకుని పాల్పడే చాదస్తాలతో సాగతీత వ్యవహారంగా వుంటుంది. ఐఫోన్ ని పొందడం కోసం హీరోయిన్ తో సాగించే రోమాన్స్ కూడా సహన పరీక్షే. ఇంటర్వెల్ కి ముందు హత్యతో గానీ కథ ప్రారంభం కాదు.
సెకండాఫ్ హీరో హత్య కేసులోంచి బయటపడే – స్టూడెంట్ పవర్ చూపించే కమర్షియల్ ప్రయత్నాలు. ఇదైనా యూత్ అప్పీల్ తో వుండాల్సింది. సస్పెన్స్ థ్రిల్లర్ లో సస్పెన్స్, థ్రిల్, టెంపో, స్పీడ్, ట్విస్టులు కూడా మర్చిపోతే ఎలా? ఇలా కథ చేసుకోవడంలో ప్రొఫెషనలిజం కొరవడి, విసిగిస్తూ క్లయిమాక్స్ కి చేరి, విశ్వరూపమంతా అప్పుడు చూపించడం! మళ్ళీ దీంతో ముగింపు షరా మామూలు సిల్లీ వ్యవహారమే. ఇలా సినిమా సక్సెస్ అవుతుందా? అన్ క్లెయిమ్డ్ బ్యాంక్ అక్కౌంట్ల స్కామ్ ఎంత మందికి అర్ధమౌతుంది? దీనికెంత బాక్సాఫీసు అప్పీల్ వుంటుంది? ఇది వెబ్ సిరీస్ గా తీయాల్సిన పాయింటు కావచ్చు.
1337 : రివ్యూ!
తేజ తీసిన సినిమాలన్నిట్లో ఇదే అత్యంత తక్కువ రేటింగ్ గల సినిమా. చిత్రం, నువ్వు నేను, జయం లు తీసిన కాలంలోనే వుండి పోయి ఈ కాలంలో సినిమా తీసిన ఫలితమిది. పైగా ఆ సినిమాల్లోని సన్నివేశాలే చాలాసార్లు వాడేశారు. ఫస్టాఫ్ లో రోమాన్స్, కొంత, వినోదం కొంత ఫర్వాలేదన్పించినా, హీరోయిన్ మీద అత్యాచారంతో పాత రివెంజి కథగా ఫస్టాఫ్ లోనే తేలిపోయింది. ఇక బరి తెగించిన హింసతో సెకండాఫ్ దారుణం.
యూత్ కోసం తీసిన ఈ సినిమాలో యూత్ అప్పీల్ హీరో హీరోయిన్లతో లేదు, కథా కథనాలతోనూ లేదు. అంతా రొడ్డ కొట్టుడుగా చుట్టేశారు. కథని అడవుల్లోకీ తీసికెళ్ళడం తేజ ఇంకో రొటీన్ ఫార్ములా. మళ్ళీ కథని తీసికెళ్ళి అడవుల్లో పడేశారు. అభిరామ్ లాంచింగ్ ని ప్రశ్నార్ధకం చేశారు.
హీరోయిన్ గీతిక అందంగా వుంది. పాత్ర అంతంత మాత్రమే వుంది. ‘జయం’ హీరోయిన్ సదా లాయర్ పాత్రలో ఫర్వాలేదు. విలన్ గా రజత్ బేడీ కూడా ఫర్వాలేదు. పోలీసాఫీసర్ పాత్రలో కమల్ కామరాజు, ఇంకో పోలీసు పాత్రలో రవికాలే వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.
సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని పట్టుకుంది. ముఖ్యంగా ఫారెస్ట్ సీన్స్ లో. ఆర్పీ పట్నాయక్ సంగీతం క్రేజ్ ఏం క్రియేట్ చేయలేదుగానీ, ఇప్పటి స్టయిలు మ్యూజిక్ కి కాస్త దగ్గరగా వుంది. ఒకప్పటి తేజ సినిమాలు యువతని ఉర్రూత లూగించే మ్యూజికల్ హిట్స్. ఇప్పటి ఈ సినిమా వాటి దరిదాపుల్లో కూడా లేకపోవడం హైలైటయ్యే అంశం.
Wednesday, May 31, 2023
1336 : స్పెషల్ ఆర్టికల్
పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈరోజు 31 వ తేదీ విడుదలయింది. మే 31 హీరో కృష్ణ జయంతి సందర్భంగా నివాళిగా ఈ పునర్ విడుదల. 52 ఏళ్ళ క్రితం ఆగస్టు 27, 1971 న విడుదలైన, పద్మాలయా బ్యానర్ పై కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆనాడే పానిండియా కాదు, తొలి పాన్ వరల్డ్ మూవీగా పెను సంచలనం సృష్టించింది. జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో, కౌబాయ్ హీరోగా కృష్ణ నటించిన ఈ ఔట్ డోర్ యాక్షన్- ఇటు ఒకవైపు తెలుగు ప్రేక్షకుల్ని శత దినోత్సవం దాకా ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని అటు నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు సృష్టించింది! ఇదీ పాన్ వరల్డ్ దెబ్బ అంటే!
‘ఏక్ నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపిస్తే నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా, తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు.
అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు!
దురదృష్టవశాత్తూ ఇందులో నటించిన నటీనటులెవరూ జీవించి లేరు.. హీరో హీరోయిన్లు కృష్ణ, విజయనిర్మల సహా భారీగా కొలువుదీరిన తారాగణంలో గుమ్మడి, సత్యనారాయణ, ముక్కామల, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, రావు గోపాలరావు, త్యాగరాజు, జగ్గారావు, నగేష్ వంటి దివంగత నటీనటుల్ని మళ్ళీ ఒకసారి నిండుగా వెండి తెర మీద చూసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ రీరిలీజ్.
1966-2000 మధ్య 112 యాక్షన్ సినిమాలకి దర్శకత్వం వహించిన కె ఎస్ ఆర్ దాస్ టెక్నికల్ గా దీన్ని హాలీవుడ్ కి సమానా స్థాయిలో నిబట్టేందుకు కృషి చేశారు. సరికొత్త యాంగిల్స్ లో చిత్రీకరించిన వీఎస్ ఆర్ స్వామి కెమెరా వర్క్ ఆనాడు చర్చనీయాంశమైంది. పి. ఆదినారాయరావు సంగీతంలో 5 పాటలున్నాయి. కృష్ణని ఎడారిలో కట్టి పడేసి- నాగభూషణం ఎంజాయ్ చేసే- ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా సాంగ్ ఇప్పుడూ ఎంజాయ్ చేయవచ్చు.
పద్మాలయా బ్యానర్ పై కృష్ణ సోదరులు జి. ఆదిశేషగిరి రావు, జి. హనుమంతరావు నిర్మాతలు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో కూడా బుకింగ్స్ భారీగా వున్నాయి. ఇటీవల రీరిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ వసూళ్లని కూడా ‘మోసగాళ్లకు మోసగాడు’ క్రాస్ చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ స్వర్గం నుంచి కూడా సూపర్ స్టారే అన్నమాట!!
Monday, May 29, 2023
1335 : రివ్యూ!
My Story అనే మూడో చాప్టర్లో సినిమా రచయిత ఫణీంద్ర (విజయ్ వర్మ) తో సహజీవనం చేస్తున్న పార్వతి, ఆమె ఇద్దరు పిల్లల జీవితం వుంటుంది. ఆస్తి కోసం ఫణీంద్ర ఆమెని వేధిస్తూంటాడు. ఈ వేధింపులు భౌతిక దాడికి దారితీస్తాయి.
Krishna’s Story అనే నాల్గో చాప్టర్లో నరేంద్ర, పార్వతి ఇంటికెళ్ళి ఫణీంద్రకి బుద్ధి చెప్పి, ఇంట్లోంచి వెళ్ళ గొట్టిస్తాడు. పార్వతిని చేపడతాడు.
The Conflict అనే ఐదో చాప్టర్లో నరేంద్ర పార్వతితో కలిసి వుండడంతో భార్య సౌమ్య, ఫణీంద్రతో కలిసి ఓ కుట్రకి ప్లాన్ చేస్తుంది. బెంగుళూరు హోటల్లో పోలీసుల సాయంతో నరేంద్ర ఈ కుట్రని తిప్పికొట్టి, విజయగర్వంతో పార్వతిని తీసుకుని వెళ్ళిపోతాడు.
అయితే పత్రికల్లో వస్తూ వున్న చెత్త గాసిప్స్ కి ఇన్స్పైర్ అవకుండా, చోప్రా ఈ ట్రయాంగులర్ రిలేషన్ షిప్ కథని మనో విశ్లేషణతో, సున్నిత కథగా మంచి విలువలతో ఆవిష్కరించాడు. కానీ స్వయంగా పబ్లిక్ డోమైన్లో వున్న నరేష్ కి డీసెన్సీ ని ప్రదర్శించడం సినిమాలో సాధ్యం కాలేదు. మూడో భార్యని వెనుక నుంచి తన్నే సీను దగ్గర్నుంచీ, బెంగుళూరు హోటల్ సంఘటనలో చీప్ టేస్టు ప్రదర్శించడం వరకూ దూకుడుగా చిత్రీకరించుకున్నాడు. మొత్తం ఈ బయోపిక్ ని తన వైపు నుంచే చెప్పాడు తప్పితే అవతలి మూడో భార్య వైపు నుంచి విషయమేమిటో మనకి తెలీదు. కాబట్టి ఇది ఏకపక్షంగా చూపించిన బయోపిక్ అయింది. ఈ బయోపిక్ లో నరేష్ పోషించిన నరేంద్ర పాత్ర దక్షత కలిగిన పరిష్కర్తగా వుండాల్సింది వుండదు.
ఈ కథని ఎంఎస్ రాజు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని, స్టేక్ హోల్డర్స్ ముగ్గుర్నీ సమన్వయం చేసి సమగ్ర కథ చెప్పాల్సింది. ‘సిల్సిలా’ లోనైతే స్టేక్ హోల్డర్స్ ముగ్గురూ ప్రత్యక్ష్యంగా పాల్గొనడంతో ప్రేక్షకులకి సందేహాలు మిగల్లేదు.
పవిత్ర కూడా తానెంతో మంచి మనసుగల మనిషి అన్నట్టు లుక్కిస్తూ పాత్రకి తగ్గట్టు హూందాగా నటించింది. ఇక మూడో భార్యకి పెట్టాల్సిన అవలక్షణాలన్నీ పెట్టేశారు. పూర్తిగా సినిమాటిక్ విలనే. చివరి చాప్టర్లో వనితా విజయ్ కుమార్ ఈ పాత్రలో చాలా హంగామా చేస్తుంది. హీరో కృష్ణగా శరత్ బాబు, విజయనిర్మలగా జయసుధ నటించారు.
సాంకేతికంగా నరేష్ మంచి పెట్టుబడి పెట్టారు. చాలా రిచ్ లుక్ వచ్చింది. సంగీతమే ఈ రిచ్ లుక్ తో అంతగా పోటీ పడలేదు. దర్శకత్వంలో ఈ సారి ఎం ఎస్ రాజు ఓ మెట్టు పైకెక్కారు- అయితే చాప్టర్ల వారీ కథాకథనాల్లో అంతగా బలం లేదు. న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు వుంది.
—సికిందర్