రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 8, 2022

1127 : రివ్యూ!


 

రచనదర్శకత్వం: తు.పా. శరవణన్
తారాగణం
 : విశాల్డింపుల్ హయతీరవీనా రాజ్తులసియోగిబాబుమారిముత్తుబాబూరాజ్ఇలంగో కుమారవేల్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం : కావిన్ రాజ్
నిర్మాత: విశాల్
విడుదల : ఫిబ్రవరి
 4, 2022
***

          తెలుగులో ఓ మోస్తరు మాస్ ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ విశాల్ గత సంవత్సరం నటించిన చక్ర’, ఎనిమీ తలుగులో విడుదలయ్యాయి. ఏమంత ఆదరణ పొందలేదు. తిరిగి ఈ సంవత్సరం తాజాగా ఈవారం సామాన్యుడు (తమిళంలో వీరమే వాగాయి సోదుమ్ ) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరసగా యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్న విశాల్ ఇంకో యాక్షన్ మూవీతో వచ్చాడు. ఈసారి యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర పోషిస్తూ. శరవణన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతూ. విజయవాడకి చెందిన తెలుగు అమ్మాయి డింపుల్ హయతీ హీరోయిన్. ఈమె తెలుగులో  గల్ఫ్’, యురేకా’, దేవీ2 లలో నటించింది. హిందీలో ఒక మూవీలో నటించాక తిరిగి తెలుగులో ఖిలాడీ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు విశాల్- శరవణన్- డింపుల్ ల కాంబినేషన్ లో సామాన్యుడు ఎలా వుంది? అసామాన్యంగా వుందా? ప్రేక్షకుల సహనానికి అసందర్భంగా వుందా? ఈ విషయాలు తెలుసుకుందాం...

కథ

    పోరస్ ( విశాల్) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడు. అతడికి పోలీస్ ఇన్స్ పెక్టర్ అవ్వాలని ఆశయం.  తండ్రి(మారిముత్తు) పోలీసే. తల్లి (తులసి)చెల్లెలు ద్వారకా (రవీనా రవి) వుంటారు.  ద్వారక  కాలేజీకి వెళ్తూ వుంటుంది. పోరస్ తన చుట్టూ జరిగే అన్యాయాల్ని సహించలేక పోతాడు. ఈ క్రమంలో హద్దు మీరిప్రవర్తిస్తూంటాడు. ఇలా చేస్తే రేపు పోలీసు ఉద్యోగం రావడం కష్టమని తండ్రి వారిస్తూంటాడు. ఇలావుండగా ద్వారకాని ఒకడు టీజ్ చేస్తూంటే పోరస్ వాణ్ని కొడతాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందుల గురించి పోరాటం చేస్తూంటాడు ఒక సామాజిక కార్యకర్త (ఇలాంగో కుమరవేల్). ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని నీలకంఠం(బాబూరాజ్) కి కోపం తెప్పిస్తుంది. దీంతో ఆ సామాజిక కార్యకర్తని హత్య చేస్తాడు నీలకంఠం. ఇది కళ్ళారా చూసిన ద్వారకా కూడా హత్యకి గురవుతుంది. దీంతో చెల్లెలి హంతకుల్ని పట్టుకోవడానికి ఒక సామాన్యుడుగా పోరస్ ఎలా ప్రయత్నించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం తాము చూసుకుని, చుట్టూ జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, అప్పుడు కాపాడే వాళ్ళెవరూ వుండరనీ ఈ కథ ద్వారా చెప్ప దల్చాడు దర్శకుడు. కాన్సెప్ట్ బాగానే వున్నా దానికి కథా రూపమివ్వడంలో విఫల విన్యాసాలు చేశాడు. ఇది వరకు సినిమాల్లో వచ్చిన పాత రొటీన్ మూస కథా కథనాలు, సన్నివేశాలు ఏర్చి కూర్చి తీర్చి దిద్దాడు. కుర్చీల్లో ప్రేక్షకులు కుర్చీల్లోనే పడుకునేట్టు. మలయాళం నుంచి, తమిళం నుంచీ కొత్త టాలెంట్స్ కొత్తదనం తీసుకు రావడాన్ని చూసే వాళ్ళం. ఈ మధ్య వరసగా కొత్త టాలెంట్స్ పాత చింతకాయ లేరుకుని వస్తున్నారు. చెల్లెలి హంతకులపై పగ దీర్చుకునే లాంటి పాత చింతకాయ రివెంజీ డ్రామా సినిమాలు ఇంకా చూపిస్తూ గర్వకారణంగా ఫీలవుతున్నారు.

        మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం తాము చూసుకుని, చుట్టూ జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, అప్పుడు కాపాడే వాళ్ళెవరూ వుండరనీ - అనే కాన్సెప్టు  తీసుకున్న కొత్త దర్శకుడికి దీని విలువ తెలియలేదు. దేశంలో ఏం జరిగినా మిడిల్ క్లాస్ మౌనంగా వుంటున్న సందర్భాలు చూస్తున్నాం. మార్టిన్ నిమోలర్ రాసిన ప్రసిద్ధ జర్మన్ కవితని గుర్తుకు తెచ్చే కాన్సెప్ట్...  

        First they came for the socialists, and I did not speak out—because I was not a socialist.
        Then they came for the trade unionists, and I did not speak out— because I was not a trade unionist.
        Then they came for the Jews, and I did not speak out—because I was not a Jew.
        Then they came for me—and there was no one left to speak for me.

        And Then There Were None’  అనే అగథా క్రిస్టీ నవల ఒకటి. ఈ రెంటినీ జ్ఞప్తికి తెచ్చే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాన్ని  ఆమేరకు నడిపించకుండా పాత రొటీన్ పగా ప్రతీకారాల కథగా చేసేశాడు. కాన్సెప్ట్ ఒకటైతే కథ ఇంకొకటి. చుట్టూ జరిగే వాటికి సైలెంట్ గా వుండమనే తండ్రి, మాట వినని కొడుకు, తీరా తన కూతురే హత్యకి గురైతే కొడుకు పగదీర్చుకోవడం- ఈ చావకబారు కథనంతో కాన్సెప్టు మాయమైపోయింది. దీనికి విశాల్ నటించడమే గాక నిర్మించడం కూడా!

నటనలు సాంకేతికాలు

    నిర్మాతగా, హీరోగా ఈ సినిమా ద్వారా విశాల్ అందించించిన కొత్తదనమేమీ లేదు. పాత్రలో విషయం లేకపోగా నటనలో జీవం లేదు. ఎమోషన్స్ లేవు. యాంగ్రీ యంగ్ మాన్ గా యాక్షన్ లోకి దిగడానికి కథలో తగిన విషయం లేదు. నటన, ఫైట్స్ కృత్రిమంగానే వుంటాయి. హీరోయిన్ డింపుల్ హయతీ కూడా ఈ సినిమా ఎందుకు నటించిందో అర్ధం గాదు. ఆమె రోమాన్స్ సీన్లు చాలా చీప్ గా వున్నాయి. ఇక యోగిబాబు కామెడీ ఎక్కడా పేలలేదు.

        ఇంటర్వెల్ కి ముందు పది నిమిషాలు తప్ప  ఫస్టాఫ్ భరించడం  చాలా కష్టం. కొత్త దర్శకుడికి సీన్లు తీయడం కూడా రాలేదు. బి, సి, గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సెకండాఫ్ లో విశాల్ చెల్లెలి హత్యని ఛేదించే ట్రాక్ ఒక్కటే బావున్నా అది అవసరానికి మించి సాగతీతగా వుంటుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో  ఒకే పాట వుంది. మత్తెక్కించే కళ్ళే…’ అనే ఈ మాంటేజ్ సాంగ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. కెవిన్ ఛాయాగ్రహణం కూడా ఫర్వా లేదు.

        మొత్తానికి విశాల్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమా రాలేదు. వరసగా ఇలాటి యాక్షన్ సినిమాలతో ఫ్లాపులు సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు వుంది.

సికిందర్

Saturday, February 5, 2022

1126 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సుధీర్ రాజు
తారాగణం : శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, చంద్రమోహన్, సుధ, హేమ, మురళీ శర్మ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు
మాటలు: విక్రమ్ రాజ్
, స్వామి మండేలా, సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : బుజ్జి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్
***

            1991 నుంచీ 120 కి పైగా సినిమాలు నటించి ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ 2022 లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ప్రయోగం చేశారు. పాత ఫ్యామిలీ సినిమాల హీరో అయిన తను, ఈ మధ్య విలన్ పాత్రలేస్తూ అఖండలో కూడా కన్పించారు. ఇప్పుడు పాత ఫ్యామిలీ సినిమా హీరోగా పాత టైటిల్ కోతల రాయుడు తో, పాత ఫ్యామిలీ సినిమా నటిస్తూ, కొత్త ప్రేక్షకుల మీద పాత ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేసిన కొత్త దర్శకుడు, నిర్మాతలు బహుశా పాత కాలం లోంచి వచ్చారు. అందరూ పాత కాలం లొంచే వస్తారు, కానీ పాతగానే వుండిపోరు. శ్రీకాంత్ సహా దర్శకుడు నిర్మాతలూ పాతగానే వుంటూ పాతదనంతో మక్కువ తీర్చుకున్నారు. ఈ మక్కువ ఎలా వుందో చూద్దాం...

కథ
    ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథయితేగా ఎలావుందో చెప్పుకోవడానికి. కోతల రాయుడు పని కోతల రాయుడు పాత్ర చేయకుండా, కథకుడే కోతల రాయుడైతే ఎలా వుంటుందనడానికి శాంపిల్ ఈ సినిమా కథ. కథకుడు కథ వదిలేసి చాలా కోతలు కోశాడు. కథతో సంబంధంలేని కామెడీలు చేశాడు. డ్రామాలు చేశాడు. అసలు ధన లక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయిందో, ఈ సమస్యేంటో, పరిష్కారమేంటో చెప్పకుండా, ఏవేవో కోతలు సొరకాయల్లా తెగ కోస్తూ ఇదే కథ అనుకున్నాడు. పాతకాలంలో ఇలా వున్నాయా కథలు? పాత కాలపు కథకుడికి మతి మరుపు కూడా వున్నట్టుంది. కథలెలా వుంటాయో మర్చిపోయి, తలా తోకాలేని కథ పట్టుకుని, కోతల రాయుడులా తెలివైన కొత్త ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు.

నటనలు- సాంకేతికాలు

    ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ మరోసారి వెండి తెరమీద ఈ సినిమాతో ప్రకాశించాడు. ఈ ప్రకాశం వేషం, స్టయిలింగ్, నటనల వరకే. పాత్ర గురించీ, పాత్రకున్న కథ గురించీ చెప్పుకోకూడదు. ఇలా పాత శ్రీకాంత్ ని గుర్తుకు తెచ్చినప్పుడు, గుర్తుండే విషయంతో కూడా రావాలని ఎందుకు గుర్తుపెట్టుకో లేదో మరి. ఎలాపడితే అలా సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు నష్టపోవడానికి కారకుడు కాకూడదని జాగ్రత్తలు తీసుకునే తను,  ఈసారి ఎలా మోసపోయాడో తెలీదు. ఇలా హీరోగా ప్రయోగాలు చేసేకన్నా విలన్ గా స్థిరపడితే మేలు.

        హీరోయిన్లు నటాషా, డింపుల్ లు గ్లామర్ ని బాగానే ఆరబోశారు. ముక్కలు ముక్కలుగా వున్న కథని  గ్లామర్ తో కవర్ చేయడానికి శ్రమిస్తున్నట్టు కసరత్తులన్నీ చేశారు. ఎన్ని కసరత్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ కలిసి ఒక కామెడీ ఎపిసోడ్ వేసుకున్నారు. కథతో సంబంధం లేకుండా జబర్దస్తీగా ఒక కామెడీ షో. పోసాని, మురళి శర్మలు కథ లేని సినిమాకి విషయంలేని పాత్రలు. ఇంకా చాలా మంది నటీనటులూ వాళ్ళ పాత్రలూ వున్నాయి నిండైన కుటుంబ సినిమా అన్పించుకోవడానికి.

        కొత్త దర్శకుడు సుధీర్ రాజుకి కథాకథనాలూ దర్శకత్వమూ ఏదీ సాధ్యం కాలేదు. సినిమా పేరుతో ప్రేక్షకుల నెత్తిన ఓ తమాషాని రుద్ది చేతులు దులుపుకున్నాడు. పూర్తిగా లేని కథ, కథతో సంబంధంలేని, లాజిక్ లేని సీన్లు, పాత్రలు, కామెడీలూ ... ఇలా ప్రతి నిమిషమూ ప్రేక్షకుల్ని ముళ్ళ మీద కూర్చోబెట్టి ఆనందం తీర్చుకున్నాడు. దీని పాటల చిత్రీకరణ కోసం సిక్కిం కూడా వెళ్ళాడు. సునీల్ కశ్యప్ తో పాటలు మాత్రం సరిగ్గానే చేయించుకున్నాడు. కెమెరామాన్ బుజ్జి నుంచి కూడా టాలెంట్ ని పిండుకున్నాడు. పిండడానికి తనదగ్గరే ఏమీ లేకుండా పోయింది.

—సికిందర్

 

Friday, January 28, 2022

1125 : రివ్యూ!



రచన -దర్శకత్వం : నగేష్ కుకునూర్ 
తారాగణం : కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం :చిరంతాన్ దాస్
బ్యానర్ : వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
విడుదల : జనవరి 28, 2022

***


“You’ve  got to ask  yourself  one question:  ‘Do I feel lucky?’ Well, do ya, punk?”
—Clint Eastwood in ‘Dirty Harry’
“No, sir. Its fucky.”

        తెలుగు వాడైన నగేష్ కుకునూర్ 1998 లో కొత్తగా వచ్చి, ఉండీ లేని టాలెంట్ తో హైదరాబాద్ బ్లూస్ తీసి ఫేమస్ అయిపోయాడు. అప్పట్నుంచీ వరుసగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 15 సమాంతర సినిమాలు తీసి రెండు జాతీయ అవార్డులూ, 7 అంతర్జాతీయ అవార్డులూ సాధించాడు. ఇంత పేరు ప్రఖ్యాతులు గడించాక, తెలుగులో తన మొదటి సినిమా తీయాలన్పించి కీర్తీ సురేష్ తో గుడ్ లక్ సఖీ తీశాడు. దీన్ని ప్రప్రథమంగా స్పోర్ట్స్ రోమెడీ (స్పోర్ట్స్ + రోమాన్స్ + కామెడీ) జానర్ లో తీస్తున్నానని చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎందుకో ఇతర భాషల్లో విడుదల చేయకుండా, తెలుగు ప్రేక్షకులకే ప్రత్యేకం చేసి వారి పాదాల ముందుంచాడు. మరి ఈ సినిమా చూస్తూంటే పాదాలు కుదురుగా వుంటాయా, మధ్యలో లేచి పరిగెడతాయా?

        కీర్తీ సురేష్ నటించిన మిస్ ఇండియా చూసి స్క్రిప్టులు కాస్త చూసి సెలెక్టు చేసుకోవమ్మా అని ట్విట్టర్ లో ప్రేక్షకులు ఆల్రెడీ ఆర్తనాదాలు చేసి వున్నారు. మళ్ళీ ఆమె అదే పని చేసింది. కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు. స్క్రిప్టులిచ్చి చదువుకోమంటాడు. అలా కుకునూర్ నుంచి మంచి బరువైన బౌండెడ్ స్క్రిప్టు అందుకుంది కీర్తీ సురేష్. అది చదివింది. అందులో లిఖించిన సువర్ణాక్షర కథ ఇలా వుంది...

కథ

    అది రాయల సీమలోని ఒక గ్రామం. అక్కడో లంబాడీ తండా. ఆ తండాలో సఖి (కీర్తీ  సురేష్) అనే లంబాడీ యువతి. ఈమె దురదృష్ట జాతకురాలని అందరి నమ్మకం. ఈమె ఎదురొస్తే కీడే జరుగుతుందని చిన్న చూపు. ఈ కారణంగా ఈమెకి పెళ్ళి కూడా కుదరదు. ఈ బ్యాడ్ లక్ సఖీకి గోలీలన్నా, గురి చూసి కొట్టాలన్నా బలే ఉత్సాహం. ఇలాటి ఈమెకి గోలి రాజు (ఆది పినిశెట్టి) అనే నాటక నటుడితో స్నేహం. సూరి (రాహుల్ రామకృష్ణ) అనే ఇంకో దోస్తు కూడా వుంటాడు గానీ, ఇతనంటే పడదు.

        ఇలా వుండగా, ఒక రిటైర్డ్ కల్నల్ (జగపతి బాబు) గ్రామాని కొస్తాడు. షూటింగ్ గేమ్స్ లో కొందర్ని తయారు చేయాలని ఆశయం పెట్టుకుని వస్తాడు. తయారు చేసి నేషనల్ గేమ్స్ కి పంపాలని లక్ష్యం. ఈ కల్నల్ కి సఖిని తీసికెళ్ళి పరిచయం చేస్తాడు రాజు. గురి చూసి కొట్టే ఆమె టాలెంట్ చూసి ట్రైనింగులో చేర్చుకుంటాడు కల్నల్. తీరా ఆ ట్రైనింగ్ తో గేమ్స్ పంపాలనుకుంటే ఆమె దృష్టి షూటింగ్ మీద వుండదు. అపార్ధంజేసుకుని విడిపోయిన గోలిరాజు మీద వుంటుంది. మరోవైపు ఆమెని ప్రేమిస్తూ సూరి వుంటాడు. ఇలా గాడి తప్పిన ఈమెని లక్ష్యం వైపుకి కల్నల్ ఎలా నడిపించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

    ముందే చెప్పుకున్నట్టు ఇది ప్రప్రథమ స్పోర్ట్స్ రోమెడీ దర్శకుడి పరిభాషలో. పూర్వ మెప్పుడో పేపర్లో ఒక వార్త చదివాడు. ఒక గ్రామీణ యువతికి ఆటల్లో వున్న ఆసక్తి గురించి. ఐతే స్పోర్ట్స్ కథని  ఒక గ్రామీణ యువతి ప్రధాన పాత్రగా తీద్దామని ఈ కథ రాశాడు. దీనికి ప్రేమని, కామెడీనీ జోడిస్తే స్పోర్ట్స్ రోమెడీ ఐపోతుందని బౌండెడ్ స్క్రిప్టు తయారు చేసి కీర్తీ సురేష్ కరకమలాలలో వుంచాడు. ఆమె ఆ స్క్రిప్టుని షోమాన్ రాజ్ కపూర్ ఎంత పవిత్రంగా భావించి స్క్రిప్టులు చదివేవాడో, అంత భక్తి శ్రద్దలతో చదివింది కుకునూర్ ఇంటర్నేషనల్ ఫేమస్ కాబట్టి. అందుకని ఇది మిస్ ఇండియా ని మించిన మాగ్నమ్ ఓపస్ అవుతుందని తప్పకుండా భావించడంలో ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. హీరోయిన్లని తెలివిలేని గ్లామర్ డాల్స్ గా, కరివేపాకు పాత్రలుగా సినిమాల్లో చూపిస్తారని విమర్శిస్తారు గానీ, ఎడ్యుకేటెడ్ హీరోయిన్లు చదివి ఓకే చేసే  స్క్రిప్టులు అంతకన్నా ఘోరంగా వుంటాయని తెలుసుకోవడం మంచిది. కీర్తీ సురేష్ సువర్ణాక్షరాలతో కుకునూర్ అందించిన సింగిల్ స్టార్ రేటింగ్ స్క్రిప్టు ని భక్తి శ్రద్దలతో కళ్ళకద్దుకుంది.

        కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు, కీర్తీకి స్క్రిప్టు రీడింగ్ రాదు. ఇంకేం కావాలి ఇద్దరి జోడీ కలవడానికి? ఇద్దరూ కలిస్తే అది రాంబో కాంబో. గన్ పట్టుకుని కీర్తీ, పెన్ పట్టుకుని కుకునూర్ రాంబో కాంబో. ఈ స్పోర్ట్స్ రోమేడీలో స్పోర్ట్స్ లేదు, రోమాన్స్ లేదు, కామెడీ లేదు. కీర్తిని ప్రత్యేకంగా లంబాడీ పాత్రలో చూపించడంలో ఉద్దేశమేమిటో తెలీదు. వూరికే అలా చూపిస్తే ముందు పబ్లిసిటీ వస్తుంనదనుకున్నట్టుంది. ఈ సినిమా చూస్తూంటే ఎవరికైనా కామన్ సెన్సు దొలుస్తూ వుంటుంది- తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన బ్యాడ్ లక్ సఖి, వాటి మీద తిరుగుబాటు చేయడం ఈ కథవుతుంది కదాని...

నటనలు - సాంకేతికాలు

    తండా అందాల బాలగా కీర్తీ సురేష్ అలనాటి పల్లెటూరి ఆడే పాడే హీరోయిన్లని గుర్తుకు తెస్తుంది. కాకపోతే విజయ నిర్మల లా అట్లతద్ది పాట పాడలేదు ఉయ్యాలెక్కి. జమునలా కట్టె తుపాకెత్తుకుని... అని కూడా పాడలేదు. కుకునూర్ ఆ సినిమాలు చూసివుండడు. కానీ తెలుగు నేలతో తన సంబంధాలు తెగిపోయి దశాబ్దాలు గడిచాక, ఇప్పుడు కూడా తెలుగు నేల అదే తను చూసిన నేలలాగే వుంటుందని ఫీలైపోయి సఖిని ఆహార్యం సహా అలా ఆడించాడు. పాత్రకి క్రీడలో, ప్రేమలో, కామెడీలో ఎక్కడా ఫీల్ లేదు. నటన కూడా పేలవం. 

        జగపతి బాబు పాజిటివ్ పాత్రలో బాగానే కనిపిస్తాడు. కానీ ఎందుకని క్రీడా కారుల్ని తయారు చేయాలనుకుంటాడో తెలియదు. నాటక నటుడి పాత్రలో ఆది పెనిశెట్టికి ఈ సినిమా వృధా. డిటో రాహుల్ రామకృష్ణ.

        ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం గురించి అసలు పట్టించుకోలేదు. కథ విని ఇంతకంటే అవసరం లేదనుకున్నాడేమో, పాటలు ఏదో సర్దేశాడు. కెమెరా వర్క్ సహా ప్రొడక్షన్ విలువలు మాత్రం టాప్ హీరోయిన్ కాబట్టేమో బావుండేట్టు చూసుకున్నారు.

చివరి కేమిటి

     గుడ్ లక్ సఖీ  అని టైటిల్ పెట్టేంత గుడ్ లక్కేమీ లేదు కుకునూర్ ప్రయత్నంలో.  బేసిగ్గా కథ ఎలా చేసుకోవాలో కూడా తెలియలేదు. ఈ కథని కీ శే హృషీకేశ్ ముఖర్జీతో కొలాబరేట్ అయి తీద్దామనుకున్నాట్ట. ఆ పని చేసినా బావుండేది. హృషికేశ్ చేతిలో కడుపుబ్బా నవ్వించే స్పోర్ట్స్ కామెడీ అయ్యేది. ఆయన నవ్వించడం మొదలెడితే ఇంకెలాటి నాన్సెన్స్ పెట్టుకోడు. బ్యాడ్ లక్ తెస్తుందని వూరంతా అనుకునే హీరోయిన్ లక్కీ ఛార్మ్ గా ఎలా మారుతుందో కథ చెప్పకుండా- స్పోర్ట్స్, రోమాన్స్, కామెడీలతో ఏం చెప్పాడో కుకునూర్ అర్ధం గాదు. స్పోర్ట్స్ కీ, రోమాన్స్ కీ అసలు కనెక్షనే లేదు. ప్రారంభ దృశ్యాలే కథ క్వాలిటీని చెప్పేస్తాయి. మనకి తెలియకుండా పాదాలు అప్పట్నించే ఎలాగో అన్పిస్తూంటాయి. ఏమిటా అని చూసుకుంటే పరారీకి తయారీ చేసుకుంటున్నాయన్న మాట. పరారైతే రివ్యూ ఎలా? అందుకని చివరి దాకా పాదాల్ని గట్టిగా పట్టుకుని కూర్చోవడం. సినిమాలు ఇలా తీసి, టికెట్ల ధరలు పెంచేస్తే చిన్న సినిమాలు బతకవని గొడవ చేయడంలో అర్ధముందా? రెండు మూడొందలు పెట్టి ఇలాటి సినిమాలెవరైనా చూస్తారా?

        ఇంకా అవే టెంప్లెట్ స్పోర్ట్స్ సినిమాలేమిటి? తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన సఖి, గన్ షూటింగ్ ట్రైనింగుతో కలిసొచ్చిన అవకాశాన్నంది పుచ్చుకుని, ట్రైనింగ్ పూర్తవగానే గన్ తో జంపై- మూఢ నమ్మకాలనే మూర్ఖత్వం మీదా, మూఢ నమ్మకాలతో తనకి పెళ్ళవకుండా చేస్తున్న మూర్ఖుల మీదా తిరుగుబాటు ఫన్ డ్రామా క్రియేట్ చేయకుండా?        

గ్రామీణ పేద యువతులు స్పోర్ట్స్ కెళ్ళాలంటే చాలా సమస్యలుంటాయి. కట్టడి
, అణిచివేత, వివక్షా వగైరా. స్పోర్ట్స్ లో నారీ విజయమనే అరిగిపోయిన పాత ఫార్ములా తర్వాత - ముందు బ్యాక్ గ్రౌండ్ లో క్లీనప్ చేయాల్సిన అడ్డుపడే సామాజిక చెత్త చాలా వుంది. సమాజాన్ని చదివి, సమాజంలోంచి కథలు తీసి సమాంతర సినిమాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్న నగేష్  కుకునూర్ తీయాల్సిన సినిమా మాత్రం కాదిది.

—సికిందర్

 

1124 : మలయాళం రివ్యూ!


 

బ్రోడాడీ (మలయాళం)
రచన -
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
తారాగణం: మోహన్‌లాల్
, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, లాలూ అలెక్స్, కళ్యాణీ  ప్రియదర్శన్, నీహా, సౌబిన్ సాహిర్, ఉన్ని ముకుందన్ తదితరులు
స్క్రీన్ ప్లే: బిబిన్ మాలికల్
, శ్రీజిత్, సంగీతం: దీపక్ దేవ్, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
బ్యానర్ : ఆశీర్వాద్ సినిమాస్
నిర్మా
: ఆంటోని పెరుంబవూర్
విడుదల : జనవరి 26, 2022 (డిస్నీ+హాట్‌స్టార్)
***

            టీవల అయ్యప్పనుమ్ కోషియమ్’, కోల్డ్ కేస్ భ్రమరం వంటి సినిమాల్లో నటించిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో లూసిఫర్ కి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తిరిగి మోహన్ లాల్ తో ఇప్పుడు బ్రో డాడీ అనే  కామెడీకి దర్శకత్వం వహిస్తూ, మోహన్ లాల్ సరసన కొడుకు పాత్ర వేశాడు. ‘బ్రోడాడీ కి హిందీ కామెడీ బధాయీ హో (2018) లోని తల్లిదండ్రుల లేట్ ప్రెగ్నెన్సీ అనే సమస్యకి, సహజీవనంతో ఇంకో ప్రెగ్నెన్సీని కౌంటర్ గా పెట్టి ఫ్యామిలీ డ్రామా కామెడీ తీశాడు. ఒక ఐడియాని ఇంకో ఐడియాతో    సంకరం చేసి కొత్త కథ సృష్టించాలనుకోవడం దర్శకుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ తలపెట్టిన మంచి ప్రయత్నం. 2011 లో  డేనియల్ క్రేగ్, హారిసన్ ఫోర్డ్, ఒలీవియా వైల్డ్ లతో దర్శకుడు జాన్ ఫెవ్రూ కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ అని కౌబాయ్ లకీ, గ్రహాంతర జీవులకీ పోరాటం పెట్టి, ఇది వరకు రాని వినూత్న అనుభూతినిచ్చే కొత్త కౌబాయ్ మూవీని సృష్టించాడు. ఐడియాల్ని సంకరం చేయొచ్చు, అయితే అది బెడిసి కొట్టకుండ కూడానూ చూసుకోవాలి... 

కథ

కేరళలో బిజినెస్ మాన్ జాన్ కట్టాడి (మోహన్ లాల్) కి భార్య అన్నమ్మ (మీనా),  కుమారుడు యేషూ (పృధ్వీరాజ్ సుకుమారన్) వుంటారు. యేషూ బెంగుళూరు లో  యాడ్ కంపెనీలో పనిచేస్తూంటాడు. ఇంకో వైపు జాన్ స్నేహితుడు కురియన్ (లాలూ అలెక్స్) కుటుంబం వుంటుంది. కురియన్ కి భార్య ఎల్సీ (కనిహా), కూతురు అన్నా (కళ్యాణీ ప్రియదర్శన్) వుంటారు. కూతురు అన్నా కూడా బెంగుళూరులో జాబ్ చేస్తూంటుంది. ఈ కొడుకూ కూతుళ్ళతో పరస్పరం వియ్యమొందడం మంచిదని రెండు కుటుంబాలూ ఆలోచిస్తూంటాయి. బెంగుళూరులో వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలీదు. సమయం చూసి ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకుందామనుకుంటారు వాళ్ళు. ఇంతలో అన్నా అనుకోకుండా గర్భవతవుతుంది. యేషూ కంగారుపడతాడు. ఇలావుండగా వెంటనే వూరికి వచ్చేయమంటూ  తండ్రి జాన్ నుంచి కాల్ వస్తుంది. వూరికెళ్ళిన యేషూకి తండ్రి జాన్, తల్లి అన్నమ్మ ఏదో చెప్పాలని చెప్పలేక పోతూంటారు. మీ అమ్మ తల్లి కాబోతోందని జాన్ కొడుక్కెలా చెప్పాలి? జాన్ సమస్య ఇదైతే, కొడుకు యేషూ సమస్య-  తన కాబోయే పెళ్ళాం తల్లి కాబోతోందని తల్లిదండ్రుల కెలా చెప్పాలి? ఇదీ కథ.

ఎలావుంది కథ

దాసరి 'తూర్పు పడమర' లో ఇలాటిదే రక్త సంబంధాల్ని ప్రశ్నార్ధకం చేసే కథ. 1973 లో హాలీవుడ్ లో ‘40 క్యారట్స్అనే సినిమా వచ్చింది. ఇది బేతాళ కథలా వుంటుంది. దీన్ని తమిళంలో కె బాలచందర్ కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ, మేజర్ సౌందరరాజన్, రజనీ కాంత్ లతో 1975 లో అపూర్వ రాగంగళ్గా తీశారు. దీన్నే దాసరి నారాయణరావు 1976 లో నరసింహ రాజు, శ్రీవిద్య, జయసుధ, సత్యనారాయణ, మురళీమోహన్ లతో తూర్పు పడమరగా తీశారు.

          ఇందులో నరసింహ రాజు, శ్రీవిద్యలు ప్రేమించుకుంటారు, జయసుధ, సత్యనారాయణలు ప్రేమించుకుంటారు. జయసుధ శ్రీవిద్య కూతురని, నరసింహరాజు సత్యనారాయణ కొడుకని కథ మధ్యలో తెలిసి షాక్ తింటారు. ఇప్పుడేం చేయాలి? చిక్కు ముడి నెలా విప్పాలి? తండ్రీ కొడుకులు తల్లీ కూతుళ్ళని ప్రేమించారు. తండ్రి తెలియక ఓ కూతుర్ని ప్రేమిస్తే, కొడుకు ఆ కూతురి తల్లి అని తెలీక ఆ తల్లిని ప్రేమించాడు. ఇప్పుడు ఎవరికెవరు ఏమవుతారు?

        'బ్రో డాడీ'లో అత్తాకోడళ్ళు గర్భవతులయ్యారు. ఇది ఇబ్బందికర పరిస్థితే. దర్శకుడు ఈ పరిస్థితిని సృష్టించి బాగానే షాకిచ్చాడు ప్రేక్షకులకి, బావుంది, దీనితర్వాత కథ ఎలా నడపాలో తెలియక చేతులెత్తేశాడు. తండ్రీ కొడుకులు తమ కెదురైన పరిస్థితిని  ఎలా చెప్పాలో తెలియక పడే తిప్పలతో ఫస్టాఫ్ వరకే కామెడీ చేసి కథ నడపగలిగాడు. ఆ తర్వాత సెకండాఫ్ లో ఈ సంకరం చేసిన రెండు ఐడియాలతో ఏమీ చేయలేక వదిలేశాడు.

        సంకరం చేసిన ఐడియాల్లోంచి లేట్ ప్రెగ్నెన్సీని పక్కన బెట్టేసి, సహజీవనంతో గర్భం సమస్య ఒకటే తీసుకుని సెకండాఫ్ రోటీన్ లవ్ స్టోరీగా మార్చేశాడు. కూతురు అన్నాని గర్భవతి యేషూ మీద అన్నాతండ్రి కురియన్ కోపం, పగసాధింపు డ్రామాగా, రెండు కుటుంబాల మద్య సంఘర్షణగా మార్చేశాడు. ఈ సంఘర్షణ కూడా కుదరక హడావిడిగా ముగించేశాడు.

నటనలు - సాంకేతికాలు

తండ్రి పాత్రలో మోహన్ లాల్ కొడుక్కి తన విషయం చెప్పుకోలేని సున్నిత పరిస్థితిని నటించడంలో నీటైన పాత్ర పోషణే చేశాడు అనుభవంతో. అలాగే తల్లి పాత్రలో మీనా కూడా.  కొడుకుగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తండ్రి తో చేసే బ్రోమాన్స్ కామెడీ బాగానే నటించాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వుండే బ్రోమాన్స్ అలాటి పరిస్థితులతో తండ్రితో బ్రో డాడీగా మారిందంతే. ఇక హీరోయిన్ తండ్రి కురియన్ గా లాలూ అలెక్స్, తల్లిగా నీహా, కూతురుగా హీరోయిన్ కళ్యాణీ  ప్రియదర్శన్ డీసెంట్ గా నటించారు. అందరి నటనలూ అద్భుతం. కానీ నటించింది ఏం కథ! నటనలొక్కటే  సినిమాని నిలబెడతాయా? ఇందుకనే థియేటర్ రిలీజ్ కి నిలబడదని జాగ్రత్తపడి ఓటీటీకి అమ్మేశారు.  

        కనులకింపైన లొకేషన్స్ తో కెమెరా వర్క్ వుంది, వీనుల విందుగా సంగీతముంది. సుకుమారన్ దర్శకత్వమూ బావుంది. కానీ దర్శకత్వం వహించింది ఏం కథ!

చివరికేమిటి?

కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ కి సహ నిర్మాతైన స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో దర్శకుడ్ని, రచయితల్ని కలిసి స్క్రిప్ట్ వర్క్ ని, ఆర్ట్ వర్క్ ని పరిశీలించాడు. పరిశీలించి, దర్శకుడు జాన్ ఫెవ్రూ కి కొన్ని క్లాసిక్ కౌబాయ్ సినిమాలు అందించాడు. అంతేగాక వాళ్ళని ప్రైవేట్ స్క్రీనింగ్ కి ఆహ్వానించి కౌబాయ్ సినిమాలు వేసి చూపిస్తూ, ప్రాపర్ గా కౌబాయ్ ఎలా తీయాలో వివరించాడు. అలాగే ఎలియన్స్ తో సైన్స్ ఫిక్షన్ కథగా కౌబాయ్ ని ఎలా తీయాలో కూడా సూచనలిచ్చాడు.

        హైబ్రిడ్ ఐడియాతో ప్రాపర్ గా సినిమా ఎలా తీయాలో అనుభవజ్ఞుల సలహా తీసుకుని వుండాల్సింది పృథ్వీరాజ్ సుకుమారన్.

—సికిందర్