సీను చేసే పనులు రెండు అని చెప్పుకున్నాం. ఒకటి, పాత్ర గురించి కొత్త విషయాలు చెప్పడం; రెండు,
సీనుని ముందుకి నడిపించడం. పాత్ర గురించి పది విషయాలు చెప్పినా ఫర్వాలేదు.
ఎందుకంటే వాటి బిజినెస్ సీనుని ముందుకి నడిపించడం
కాదు. సీనుని ముందుకి నడిపించడానికి కథకి సంబంధించిన సమాచారమే కావాలి. ఈ సమాచారం
సీను కొక్కటి మాత్రమే వుండాలి. రెండు మూడు సమాచారాలిస్తే సీను ఎటు పోవాలో అర్ధం
కాదు. సొనాలిక ఫోన్ చేసి మాయాంక్ తో- వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్లు పట్రా – అంటే, తర్వాతి సీన్లో మాయాంక్ సర్టిఫికేట్లతో రావడానికి ఇది లీడ్ లేదా సమాచారమవుతుంది.
తర్వాతి సీనులో సర్టిఫికెట్లతో వస్తే ఏం
జరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇలాకాక సర్టి ఫికెట్లు, కాఫీ పౌడరు, సపోటాలు
పట్రా అంటే, మర్చిపోయా- అగ్గిపెట్టె కూడా కావాలి- అంటే సర్టిఫికెట్ల ప్రాధాన్యం తగ్గిపోతుంది. తర్వాతి
సీను దేని గురించో కూడా స్పష్టత వుండక ఆసక్తి కల్గించదు. ఆసక్తి కల్గించే
దృష్టితోనే సమాచారమివ్వాలి, అదీ పాయింటెడ్ గా ఒకే సమాచార మిచ్చినప్పుడే ఆసక్తి పుట్టిస్తుంది. ఐతే ఒక్కోసారి సీనులో రెండేసి సమాచారాలు కూడా
వుంటాయి. ఈ రెండేసి సమాచారాలు సీను సాదాగా
వుండకుండా, మలుపులు (ట్విస్టులు) సృష్టించడానికి ఉపయోగ పడతాయి. అంతిమంగా బాబు
లాంటి ఒక్క సమాచారమే సీనుని ముందుకి నడిపిస్తుంది. అంటే మొదటి సమాచారాన్ని తలదన్నేట్టు
రెండో సమాచారం ట్విస్టు ఇవ్వాలన్న మాట. ఇది
‘బ్లడ్ సింపుల్’ లో ఎలా ప్లే
అయిందో చూద్దాం!
‘బ్లడ్ సింపుల్’ గత సీనులో విస్సర్ ఫోటోలనికాలుస్తున్నప్పుడు సిగార్ లైటర్ ని వెతుక్కుని కంగారు
పడ్డంలో పెద్ద బ్లండర్ వుంది గమనించారా? మనకి చూపించిన ప్రకారం అతను మార్టీ ని షూట్ చేసిప్పుడు లైటర్ ని ఆ నేర స్థలంలోనే టేబుల్ మీద మర్చిపోయాడు. అందుకే లైటర్ ఇప్పుడు జేబుల్లో లేదు. మరి ఇక్కడ ఫోటోలని ఎలా కాలుస్తున్నట్టు?
సరే, విస్సర్ కి లైటర్ లేదని తెలిసింది. పరుగెత్తాడు. ఈ సీనులో సమాచారమేమిటి? లైటర్ మిస్ కావడమే. అంటే తర్వాతి సీన్లో వెళ్ళాల్సిన చోటికి వెళ్లి వెతుక్కుంటాడన్న మాట. ఆ సీను మార్టీ ఆఫీసులో వుండదు, ఎందుకంటే లైటర్ అక్కడ మర్చిపోయాడని అతడికి తెలీదు. ఐతే ఈ లైటర్ లేకపోవడం గమనించడానికంటే ముందు, మార్టీ కవర్లో ఫోటో పెట్టకుండా చేసిన మోసం అతడికి తెలిసింది. ఇది ఈ సీనులో ముందు దొర్లిన సమాచారం. దీని ప్రకారం ఈ సీను అప్పుడే మార్టీ ఆఫీసులో ఫోటో వెతుక్కునే సీనుకి దారితీయాలి. అయితే అంతలో లైటర్ మిస్సయిందనే ఇంకో సమాచారం బయటపడింది. ఇది ముందు సమాచారాన్ని తలదన్నే రెండో సమాచారం. మొదటి సమాచారానికి ట్విస్టు ఇచ్చింది. ముందు సమాచారంతో ఫోటో ఎక్కడుందో విస్సర్ కి తెలుసు. మార్టీ ఆఫీసుకి వెళ్లి దాన్ని తొలగించగలడు. అది సమస్య కాదు. కానీ లైటర్... లైటర్ ఎబ్బీ బ్యాగులో పడిపోయి వుంటుంది! ఎబ్బీ బ్యాగులో తను రివాల్వర్ ని దొంగిలిసున్నప్పుడు పొరపాటున అందులో లైటర్ పడిపోయివుంటుంది. ఆమె గనుక చూస్తె కొంపలంటుకుంటాయి, బ్యాగులో రివాల్వర్ లేకపోవడం, లైటర్ వుండడం తన మెడకి చుట్టుకుంటాయి.
ఇలా మొదటి సమాచారానికి రెండో సమాచారం ట్విస్టు ఇవ్వడంతో ఈ ఒక్క సమాచారంతో అతను పరిగెత్తాడు.
ఫోర్ గ్రౌండ్ లో చైర్ లో టెలిఫోన్ వొళ్ళో పెట్టుకుని, డో ర్ వైపు తిరిగి కూర్చుని వుంటాడు విస్సర్. డోర్ ఓపెనై వుంటుంది. టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడుంటాయి. ఆమె పర్సు వుండదు. ఒక క్షణం తర్వాత విస్సర్ లేచి ఆ వస్తువులన్నీ తిరిగి బ్యాగులో పడేస్తూ వుంటాడు.
సీను గమ్మత్తుగా భూతకాలంలో వుంది. సీను ఓపెనై విస్సర్ లైటర్ని వెతుక్కుంటూ కూర్చునే వర్తమాన కాలంలో లేదు. సీనులో జరగాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయింది. స్పిరిట్యువల్ మీనింగ్. కాలానికి కాలాల్లేవు. ఏకకాలంలో అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగినవీ, జరగాల్సినవీ అన్నీ ఆల్రెడీ ఏకకాలంలో జరిగిపోయి వుంటాయని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా అంటాడు.
సిడ్ ఫీల్డ్ కూడా అంటాడు, సీను చివర్లో ఎంటరై చప్పున బయటికి వచ్చేయమని. దెబ్బకి సీను ఖతం. సినిమా కళలో మనకి తెలియని కోణాలెన్నో వున్నాయి. ఇంకే కళ లోనూ ఇన్నిన్ని కోణాలుండవు.
ఈ సీనులో సమాచారం లైటర్ మీద ఇక ఆశ వదులుకున్నాడని. ఇది అతడి ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఇక వెనుక సీనులో సెకండరీ సమాచారం ప్రకారం ఫోటో కోసం మార్టీ బార్ కి వెళ్ళడమే మిగిలింది...

ఇలాటి
బ్లండర్ ఇంకొకటి, మార్టీ ‘చనిపోయాక’ రే బార్ కొచ్చి హెడ్ లైట్స్ ఆఫ్ చేయకుండా
కారుని పార్క్ చేసిన సందర్భంలో గమనించాం. సీనులో ఒక మిర్రర్ ఎఫెక్ట్ కోసం లాజిక్
ని అలా త్యాగం చేశారు. కారు హెడ్ లైట్స్ తో అంత బాహాటంగా కొట్టొచ్చినట్టూ వుంటే, అప్పుడు బార్ కొచ్చిన
మారీస్ అది చూడకుండా వుంటాడా? చూడనట్టే చూపించారు. ఇలాటి లాజికల్ బ్లండర్స్ మామూలు
ఫార్ములా థ్రిల్లర్స్ లో చెల్లిపోవచ్చు గానీ, ప్రొఫెషనల్ గా వుండాల్సిన డార్క్ మూవీస్ లో పంటికింద రాయిలా
వుంటాయి.
సరే, విస్సర్ కి లైటర్ లేదని తెలిసింది. పరుగెత్తాడు. ఈ సీనులో సమాచారమేమిటి? లైటర్ మిస్ కావడమే. అంటే తర్వాతి సీన్లో వెళ్ళాల్సిన చోటికి వెళ్లి వెతుక్కుంటాడన్న మాట. ఆ సీను మార్టీ ఆఫీసులో వుండదు, ఎందుకంటే లైటర్ అక్కడ మర్చిపోయాడని అతడికి తెలీదు. ఐతే ఈ లైటర్ లేకపోవడం గమనించడానికంటే ముందు, మార్టీ కవర్లో ఫోటో పెట్టకుండా చేసిన మోసం అతడికి తెలిసింది. ఇది ఈ సీనులో ముందు దొర్లిన సమాచారం. దీని ప్రకారం ఈ సీను అప్పుడే మార్టీ ఆఫీసులో ఫోటో వెతుక్కునే సీనుకి దారితీయాలి. అయితే అంతలో లైటర్ మిస్సయిందనే ఇంకో సమాచారం బయటపడింది. ఇది ముందు సమాచారాన్ని తలదన్నే రెండో సమాచారం. మొదటి సమాచారానికి ట్విస్టు ఇచ్చింది. ముందు సమాచారంతో ఫోటో ఎక్కడుందో విస్సర్ కి తెలుసు. మార్టీ ఆఫీసుకి వెళ్లి దాన్ని తొలగించగలడు. అది సమస్య కాదు. కానీ లైటర్... లైటర్ ఎబ్బీ బ్యాగులో పడిపోయి వుంటుంది! ఎబ్బీ బ్యాగులో తను రివాల్వర్ ని దొంగిలిసున్నప్పుడు పొరపాటున అందులో లైటర్ పడిపోయివుంటుంది. ఆమె గనుక చూస్తె కొంపలంటుకుంటాయి, బ్యాగులో రివాల్వర్ లేకపోవడం, లైటర్ వుండడం తన మెడకి చుట్టుకుంటాయి.
ఇలా మొదటి సమాచారానికి రెండో సమాచారం ట్విస్టు ఇవ్వడంతో ఈ ఒక్క సమాచారంతో అతను పరిగెత్తాడు.
30. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
ఇలా రాశారు : పైన లయబద్ధంగా తిరుగుతున్న సీలింగ్
ఫ్యాను శబ్దం. టిల్ట్ డౌన్ చేస్తే రే ఫ్లాట్ లో లివింగ్ రూమ్.
ఫోర్ గ్రౌండ్ లో చైర్ లో టెలిఫోన్ వొళ్ళో పెట్టుకుని, డో ర్ వైపు తిరిగి కూర్చుని వుంటాడు విస్సర్. డోర్ ఓపెనై వుంటుంది. టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడుంటాయి. ఆమె పర్సు వుండదు. ఒక క్షణం తర్వాత విస్సర్ లేచి ఆ వస్తువులన్నీ తిరిగి బ్యాగులో పడేస్తూ వుంటాడు.
ఇదీ సీను. పైన సీలింగ్ ఫ్యాను తిరుగుతూ వుండడం వెనుక సీనులో
ఫోనులో ఎబ్బీ విన్న శబ్దానికి అర్ధం. విస్సర్ వొళ్ళో టెలిఫోన్ అతనే ఫోన్ చేశాడనడానికి
నిదర్శనం. బ్యాగులో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి వుండడం అతను లైటర్ కోసం వెతికేశాడనడా
నికి తార్కాణం.
సీను గమ్మత్తుగా భూతకాలంలో వుంది. సీను ఓపెనై విస్సర్ లైటర్ని వెతుక్కుంటూ కూర్చునే వర్తమాన కాలంలో లేదు. సీనులో జరగాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయింది. స్పిరిట్యువల్ మీనింగ్. కాలానికి కాలాల్లేవు. ఏకకాలంలో అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగినవీ, జరగాల్సినవీ అన్నీ ఆల్రెడీ ఏకకాలంలో జరిగిపోయి వుంటాయని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా అంటాడు.
సిడ్ ఫీల్డ్ కూడా అంటాడు, సీను చివర్లో ఎంటరై చప్పున బయటికి వచ్చేయమని. దెబ్బకి సీను ఖతం. సినిమా కళలో మనకి తెలియని కోణాలెన్నో వున్నాయి. ఇంకే కళ లోనూ ఇన్నిన్ని కోణాలుండవు.
ఈ సీనులో సమాచారం లైటర్ మీద ఇక ఆశ వదులుకున్నాడని. ఇది అతడి ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఇక వెనుక సీనులో సెకండరీ సమాచారం ప్రకారం ఫోటో కోసం మార్టీ బార్ కి వెళ్ళడమే మిగిలింది...
(సశేషం)
(యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ స్కూల్
ప్రాజెక్టు కోసం విద్యార్ధులు ఎనాక్ట్ చేసిన ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ మార్టీని చంపే
దృశ్యం కోసం ఇక్కడ క్లిక్ చేయండి )
-సికిందర్
.