రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, డిసెంబర్ 2018, గురువారం

719 : స్క్రీన్ ప్లే అప్డేట్



            ప్పుడోగానీ స్క్రీన్ ప్లేల మీద వచ్చే ఆర్టికల్స్ నేను చదవను. నాకన్నీ తెలుసనీ కాదు, వాటిలో అవే సలహాలు రీసైక్లింగ్ అవుతూంటాయని. ఆ సలహా లేమిటంటే స్ట్రక్చర్ నేర్చుకోండి, జానర్ లో రాయండి, మూడు డైమెన్షన్ల క్యారెక్టర్లని డెవలప్ చేయండి...రూల్స్ పాటించండి, రూల్స్  పాటించండి, రూల్స్  పాటించండీ, ఇంతే! స్క్రీన్ ప్లేల మీద వెలువడే వేలాది ఆర్టికల్స్ అన్నిటినీ కలిపి విషయాన్ని వడబోస్తే ఓ రెండు పేజీలకి మించి వుండదు. ఇలా స్క్రిప్టు ఎలా రాయాలన్న దాని గురించి  ఘనీభవించిన, ఏకశిలాసదృశ సలహాల్ని రెండు కోణాల్లో చూడవచ్చు. ఒకటి, ప్రతీ ఒక్కరూ అవే  విషయాల్నిపదేపదే చెప్తున్నారంటే, ప్రొఫెషనల్ గా స్క్రిప్టు రాయడానికి ఆ ఒక్క మార్గమే వుందేమో అనేది. రెండోది, స్క్రీన్ ప్లే ఆర్టికల్స్ ఒకేలా వుంటున్నాయంటే, ఎవరూ సొంతంగా ఆలోచించి రాయకుండా, ఒకరు రాసిందాంట్లోంచి ఇంకొకరు ఎత్తి రాస్తున్నారని. ఈ రెండోదే నిజమయ్యే అవకాశాలున్నాయి.

          హంగామాలో రచయితలతో బాటు, చాలా మంది నిర్మాతల్ని కూడా బాధితులుగా చేర్చవచ్చు. రచయితల్లాగే నిర్మాతలు కూడా రెడీ మేడ్ సలహాలకి యిట్టే పడిపోయే బలహీనతతో వుంటారు. రచయితలూ, నిర్మాతలతో బాటు, ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్ లు ఈ రెడీ మేడ్ సలహాల సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని, ఒక నమ్మకంగా మార్చుకున్నారు. ఈ సలహాల్ని నమ్మితే నమ్మకంగా సక్సెస్సే అని.  

          ఇంత జరుగుతూంటే స్క్రీన్ ప్లేలు ఎంత చక్కగా తయారవ్వాలి. ఎంత గుణాత్మక మార్పు రావాలి. కానీ అలా లేదు. ఇన్నేసి స్క్రీన్ ప్లే ఆర్టికల్స్ తో స్క్రీన్ ప్లేలు ఎలా రాయాలో ప్రతి రోజూ ఇంత వూదరగొడుతున్నారా, అయినా రచయితలు రాస్తున్న స్క్రీన్ ప్లేలు దాదాపూ అన్నీ షాకింగ్ గా చాలా ఘోరంగా వుంటున్నాయి. ఇది వింత గొల్పే వ్యతిరేక దృశ్యం. ఆర్టికల్స్ లో వస్తున్న స్ట్రక్చర్, క్యారెక్టర్ డెవలప్ మెంట్, జానర్ రైటింగ్ మొదలైన వాటి స్క్రీన్ ప్లే సమాచారాన్నంతా ఓ చిన్ని ఈ – బుక్ కి కుదించి చేతి పక్కన పెట్టుకునే అవకాశమున్నప్పుడు, ఈపాటికి రచయితలందరూ తుచ తప్పకుండా ఆ రూల్స్ పాటించిన - అద్భుత స్క్రీన్ ప్లేలు రాసి సునామీలా ప్రపంచాన్ని ముంచెత్తాలి. ఎందుకిలా చేయడం లేదు. స్క్రీన్ ప్లేలు ఎలా రాయాలో ఇంత సమాచారం, ఉచిత సలహాలూ లభిస్తూంటే కూడా స్క్రీన్ ప్లేలు ఎందుకింత దారుణంగా రాస్తున్నారనే దానికి కారణం సులువుగానే వూహించ వచ్చు.

          రచయితలు అందుబాటులో వున్న రూల్స్ నీ, సలహాల్నీ నిర్లక్ష్యం చేస్తున్నారని కాదు. ఈ రూల్సు, సలహాలూ స్క్రీన్ ప్లేల్ని భంగపరుస్తున్న మౌలిక లోపాల్ని సరిదిద్దే లక్ష్యంతో వుండడం లేదు. ఎగ్జిక్యూటివ్ లు, నిర్మాతలు స్క్రీన్ ప్లేల్లో లోపాలు ఎత్తి చూపినప్పుడు వాటిని మరింత క్యారెక్టర్ డెవలప్ మెంట్ తోనో, స్ట్రక్చర్ ని అటూ ఇటూ మార్చడంతోనో సరిదిద్దడం సాధ్యం కాదు. ఎక్కువగా బోరు కొట్టే పాత్రలు, అర్ధంలేని కథనాలు వ్యర్ధ స్క్రీన్ ప్లేలకి కారణాలవుతాయి. కానీ తక్షణం పరిష్కరించుకోవాల్సిన ప్రధాన సమస్యలు మూడున్నాయి, అవి:
          * మృతప్రాయ కధనం
          * సినిమా లాంగ్వేజీ అవగాహనా రాహిత్యం
          * ఒరిజినాలిటీ స్థానే తెలివితేటల ప్రదర్శన  

మృతప్రాయ కధనం
          సినిమా చూసే ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతూంటాయి. ఎవరితను? వాళ్ళేంటి ఆ సూట్ కేసు మీద అంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారు? పారిస్ వీధుల్లో వాళ్ళెందుకు ఆ పంది వెంట అలా పడుతున్నారు?...ఇలా ప్రశ్నల పరంపర కొనసాగుతూనే వుంటుంది. సినిమాలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యే తీరిది. ప్రారంభం నుంచీ ముగింపు వరకూ కథన రీత్యా ప్రేక్షకులు ఈ ప్రశ్నోత్తరాల క్షణాల్ని అనుభవిస్తూనే వుంటారు. కథనం ఓ ప్రశ్నని సంధిస్తూ, అంతకి మునుపు ప్రశ్నకి జవాబునందిస్తూ ఉరుకులెత్తుతూంటుంది. ఈ కథనాన్ని కథ అంటారు. కథనమంటే పాత్ర జర్నీ కాదు, ప్రేక్షకుల జర్నీ. అందుకని పాత్ర  జర్నీ దృష్ట్యా స్క్రీన్ ప్లే సమస్యల్ని పరిష్కరించలేరు. కథని నిలబెట్టేందుకు స్ట్రక్చర్ ఎంత ముఖ్యమైనా, కథనాన్ని నిలబెట్టేందుకు క్యారెక్టర్ డెవలప్ మెంట్, క్యారెక్టర్ జర్నీ వంటి క్యారెక్టర్ సంబంధిత పరికరాలు పనిచెయ్యవు. ఆడియెన్స్ జర్నీతోనే కధన లోపాల్ని తీర్చాలి. ఆడియెన్స్ జర్నీలో పాత్ర ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోందనే ప్రశ్నలు తలెత్తాలి. ఈ ప్రశ్నోత్తర పారంపర్య కథనాన్ని పట్టించుకోకుండా - ఉదాహరణకి, ఇంటర్వెల్ పాయింట్లో పాత్ర అకస్మాత్తుగా విపత్తులో పడ్డట్టు చూపిస్తే, ఆ మలుపు ప్రేక్షకుల పరంగా దారుణంగా విఫలమవుతుంది (‘సవ్యసాచి’ లో ఇలాగే వుంటుంది - సి).

         
చాలా స్క్రిప్టు సమస్యలు కథనంలో అనుక్షణ యాక్షన్ మీద - అంటే ప్రశ్నోత్తరాల మీద - దృష్టి పెట్టడం ద్వారా పరిష్కార మవుతాయి. అనుక్షణ యాక్షన్ కథనమంటే ఏమిటో అర్ధమవడానికి ఈ రెండు ప్రశ్నలేసుకోవాలి :
          * ఈ యాక్షన్ లేదా ఈ డైలాగు, ప్రేక్షకులు ఏ ప్రశ్నవేసుకోవడానికి ప్రేరేపిస్తోంది?
          * ఈ సమాచారం వెనుకటి సీన్లో  వేసుకున్న ప్రశ్నకి ఎలా సమాధానమిస్తోంది?                               
           సింపుల్ గా ఇలా చెప్పుకోవచ్చు :
          సీనులో ప్రశ్న : ఆ తలుపు వెనకాల ఏముంది?
          జవాబు : రక్తం కారుతున్న గొడ్డలి పట్టుకుని నన్ వుంది.
          దీన్నుంచి ప్రేక్షకులకి మెదిలే ప్రశ్నలు : ఈమె నిజమైన నన్నేనా? గొడ్డలితో ఏం చేయబోతోంది? గొడ్డలికి రక్త మెక్కడిది? ఈమె మంచిదేనా, చెడ్డదా?

          తర్వాతి కథనంలో ఈ ప్రశ్నల్లో కనీసం ఒక దానికి సమాధానం దొరకాలి. లేకపోతే కథతో ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ తెగిపోతుంది. స్క్రిప్టులతో వచ్చే చాలా సమస్యలు తెగిపోయిన కథనంతోనే వస్తాయి. అందించిన సమాచారం ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవడం వల్ల, లేదా ఆల్రెడీ ఇచ్చిన సమాచారంతో కనెక్ట్ కాకపోవడం వల్లా కథనం సమస్యల బారిన పడుతుంది. ఒక విచిత్రమేమిటంటే, ప్రశ్నోత్తరాల కథనమే బలంగా వుంటుందని గాక, అక్కడక్కడా ప్రేక్షకులు ముందే సమాధానాలూహించేసే కథనమూ బలంగానే వుండడం. ఒక్కటే మంత్రం : సినిమాల వినోదాత్మక విలువంతా ప్రేక్షకులు తమ ముందున్న పజిల్ ని తామే పరిష్కరించుకోవడంలోనే వుంది. చేయాల్సిందల్లా  ఆ పజిల్ ప్రేక్షకులకి సులువుగా వుండేట్టు చూడ్డమే. 

సినిమా లాంగ్వేజీ అవగాహనా రాహిత్యం
          రైటింగ్ కీ ఎడిటింగ్ కీ బలమైన సంబంధం ముంది. అందుకని రైటింగ్ తో కథనం, ఎడిటింగ్ తో కథనంతో జతకలవాలి. ఎడిటర్లు సినిమాని దాని మౌలిక రూపంలో చూస్తారు. షాట్స్ అన్నిటినీ క్లిప్పింగ్స్ పరంపరగానే చూస్తారు. డైలాగులు, యాక్షన్ వేర్వేరు అన్న దృష్టితో చూడకూడదన్న నియమంతో వుంటారు. కథనంలో తర్వాతి క్లిప్పింగ్ మూవ్ మెంట్ ఏమిటన్నదే  చూస్తారు. డైలాగ్ సీక్వెన్సులో ఎవరు మాట్లాడుతున్నారనేది ముఖ్యం కాదు – డైలాగు చెబుతున్న నటుడి మొహం ముఖ్యమా, అది వింటున్న ఎదుటి నటుడి రియాక్షన్ ముఖ్యమా అన్నదే చూస్తారు. రెండూగాక, ఇంకా మోగని ఫోన్ క్లిప్పింగ్ ముఖ్యమేమో నని కూడా చూడొచ్చు. అప్పుడు నటుడి డైలాగులు రావాల్సిన ఫోన్ కాల్ గురించైతే అతన్నీ, ఎదుటి నటుడి రియాక్షన్ నీ – ఈ రెండు క్లిప్పింగ్స్ నీ క్యాన్సిల్ చేసి, మొత్తం ఫోన్ కాల్ గురించిన డైలాగుల్ని, ఫోన్ క్లోజప్ మీద (క్లిప్పింగ్ మీద) మీద పోస్ట్ చేయవచ్చు. డైలాగులు ఆ వచ్చే కాల్ తో ఏర్పడగల పరిణామాలని సూచిస్తూంటే,  టెన్షన్ కోసం పోన్ క్లిప్పింగ్ నే వేస్తారు.

          అంటే దీనర్ధం, నిజమైన సినిమా లాంగ్వేజీ ఎవరేం మాట్లాడారు, ఎవరేం చేశారన్నది కాదని. విజువల్స్ తో, సౌండ్ తో, మ్యూజిక్ తో ఆడియెన్స్ దృక్కోణాన్ని నియంత్రిస్తూ, వాళ్ళని కథలోకి లాక్కెళ్ళడం నిజమైన సినిమా లాంగ్వేజీ  అవుతుందన్న మాట. ఈ లాంగ్వేజీని నూరు సంవత్సరాల సుదీర్ఘ సినిమా చరిత్రలో అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఇందుకే మంచి సినిమా రచయిత కావాలంటే మంచి సినిమా చరిత్ర జ్ఞాని అయివుండాలని చెప్పేది ( సినిమా లాంగ్వేజీ పక్కన బెట్టి, 1920 లనుంచీ అసలు తెలుగులో సినిమా కథలు ఎలాగెలా అభివృద్ధి చెందుతూ వచ్చాయో ఆ చరిత్ర – చరిత్ర లోంచి ఏమేం నేర్చుకోవచ్చో, తిరిగి ఏమేం అన్వయించుకుని కథన రీతుల్ని  అభివృద్ది చేసుకోవచ్చో జ్ఞానం కూడా శూన్యమే ఇప్పుడు  – సి).

         
అందుకని, రాస్తున్న సీనులో ప్రతీ క్లిప్పింగ్ నీ మనోఫలకం మీద ఎంత చూసుకోగలిగితే, అంత ఆడియెన్స్ జర్నీని రసవత్తరం చేయగల్గుతారు. పాత్రల గురించి తర్జనభర్జనలు తెగక డైలాగులతో, రొటీన్ రియాక్షన్లతో కథనాల్ని కుంటుపర్చకుండా వుంటారు. 

 
ఒరిజినాలిటీ స్థానే తెలివితేటల ప్రదర్శన 
           చాలామంది రచయితలు ఒరిజినాలిటీ అంటే తెలివితేటల్ని ప్రదర్శించడమనుకుంటారు. ఎక్కడో ఏదో పేలేలా రాశామని తాము చంకలు గుద్దుకున్నదే తడవు, ఓ పంచ్ డైలాగు పడేసి - చూశారా నేనెంత ఇంటలిజెంట్ నో - అని బాకా వూదుకుంటారు. ఇంకేమైనా అంటే ఓ గొప్ప వ్యక్తి ప్రస్తావన తెచ్చో, ఇంకేదో సినిమాని ప్రస్తావించో ఆనందిస్తారు. ఈ తెలివితేటల ప్రదర్శనా చాపల్యాల  అసలు ఉద్దేశమేమిటంటే, ప్రేక్షకుల దృష్టిని కథమీంచి తమ మీదికి మళ్ళించుకోవడం. సినిమాల్లో ఈ ఘట్టాన్ని రచయిత ఇగో మూమెంట్స్ అంటారు (తెలుగు సినిమాల్లో  ‘స్క్రీన్ ప్లే అదిరిందిరా’ అనో, ఇంకేదో అనో పాత్ర చేత అన్పించే ఇలాటి ఇగో మూమెంట్స్ ఎన్నో- పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పేర్ల ప్రస్తావనలతో తమ తెలివితేటల మీదికి దృష్టిని మళ్ళించుకునే పాట్లెన్నో - సి). 

         
సమస్యల్లా ఏమిటంటే, ప్రతీ రచయితా ఇంకో రచయితకంటే ఎక్కువ తెలివి గలవాడన్పించుకోవాలని స్వోత్కర్షకి పోవడం. రచయితలుగా తాము చేయాల్సిందల్లా  కేవలం ఓ ఆసక్తికర కథని ప్రభావశీలంగా చెప్పడమేనని మర్చిపోతారు. ఆసక్తికర కథకి సరళత్వం, స్పష్టత పట్టుగొమ్మలు. తెలివి తేటల్ని ప్రదర్శించుకోబోతే ప్రేక్షకుల ఏకాగ్రత, వీక్షణాసక్తీ దెబ్బతింటాయి. కథా లోకంలోంచి ఇతర విషయాల మీదికి దృష్టిని మళ్ళించడం – తెరవెనక జరిగే రైటింగ్, ప్రొడక్షన్ ప్రాసెస్ లని సినిమా చూస్తున్న ప్రేక్షకుల మధ్యకి లాక్కురావడం ఒరిజినాలిటీకాదు, తెలివితేటలు. వాటితో రసభంగం.

          ఒరిజినాలిటీ అంటే భావోద్వేగాల పారదర్శక ప్రదర్శన. సినిమా రచనకి ఇదే గుండెకాయ. ఏ జానర్ కైనా ఇదే వర్తిస్తుంది. గొప్ప కామెడీల మూలంలో మానవ బలహీనతల నిజానిజాల ప్రజ్వలనమే వుంటుంది.  ఒరిజినాలిటీ ఈ మూలాల్ని తాకడంలో వుంటుంది. 

          స్క్రీన్ ప్లే రచనలో పై మూడు బలహీనతల్ని జయిస్తే రచయితగా రాణించే అవకాశముంటుంది. స్క్రీన్ ప్లే ఆర్టికల్స్ కేవలం స్ట్రక్చర్ చెప్తాయి. కథనం కథని బట్టి వుంటుంది. అందుకని కేవలం ఆర్టికల్స్ చదివి స్క్రీన్ ప్లేలు రాయలేరు. కథనంలో వచ్చే సమస్యల్ని ఆర్టికల్స్ తీర్చలేవు. ఎందుకేంటే ఒక్కో కథకి ఒక్కో కథనముంటుంది. ఈ కథనం నేర్చుకోవాలంటే సినిమాలు చూస్తూండాల్సిందే. కథన సమస్యలకి పరిష్కారాలు సినిమాల్లోనే దొరుకుతాయి. అందుకని సినిమా విశ్లేషణల్ని కూడా పరిశీలించడం రచయితల కవసరం.

క్లైవ్  డేవిస్
(రచయిత, నిర్మాత, దర్శకుడు)