Q: ఈ ప్రశ్న ఈ ఏడాది ఎలాగైనా దర్శకుడు/రచయిత అవ్వాలని కలలు కంటూ కథలు రాసుకుంటున్న
వారందరి
తరఫున.. ప్రస్తుత కరోన
పరిస్థితుల్ని బట్టి
చూస్తే
సినిమా
రంగం
పూర్వ
స్థితికి రావడానికి చాలా
సమయం
పట్టేలా
ఉంది. ఇక ఈ
పరిస్థితుల్లో కొత్త
వాళ్లకు
అవకాశాలంటే దాదాపు
అసాధ్యమనే అనిపిస్తుంది. అదే సమయం
లో
OTT ప్లాట్ ఫామ్స్ కొంత ఆశాజనకంగా
కనిపిస్తున్నాయి. వెబ్ సిరీస్ / వెబ్ ఫిల్మ్స్ కి
స్క్రిప్ట్స్ ని
ఆహ్వానిస్తున్నాయి. అయితే వెబ్
రైటింగ్
కి
సంబంధించిన గ్రామర్ తెలుగులో పెద్దగా
అందుబాటులో లేదు. వెబ్ కంటెంట్
ఎలా
ఉండాలో
బ్లాగ్
ద్వారా
వివరిస్తారా సర్.
లాక్
డౌన్ చాలా మందికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లోని కంటెంట్ ని పరిచయం చేసింది.
ఆ
స్థాయికి తగ్గకుండా రాయాలంటే ఎలాంటి
ఎక్సర్
సైజ్
చేయాలో, ఐడియా ఎలా ఉండాలో చెప్పండి.
వెబ్
అంటే
క్రైమ్, అడల్ట్ కంటెంట్ మాత్రమేనా? ఎందుకంటే మెజారిటీ కంటెంట్ వీటి చుట్టూనే తిరుగుతుంది.
వెబ్ సిరీస్
బాంగ్
ల
గురించి, తొంభై నిమిషాల వెబ్ మూవీ గురించి వీలైనంతగా
వివరించగలరు. దీనిమీద సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్
రాస్తే
మరింత
సంతోషం.
―ఏపీ, ఏడీ
―ఏపీ, ఏడీ
A: వెబ్ సిరీస్ ని సినిమా స్క్రీన్ ప్లే లాగా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో రాయలేరు. దీనికి పిసిఆర్ మెథడ్ అని అమెరికాలో అనుసరిస్తున్నారు. గత సంవత్సరం ఒకరికి ఈ మెథడ్ ని సూచించి రాసుకోమన్నాం. అతణ్ణి దర్శకత్వంలో కాక వేరే పనిలో పెట్టేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒక సినిమాకి దర్శకత్వం వహించిన వాళ్లకి ప్రవేశమంటున్నారు. కాబట్టి ఇటువైపు వెళ్ళాలనుకునే ఇతరులు ఆలోచించుకోవాలి. అసిస్టెంట్లు కంటెంట్ గురించి ఆలోచించడం గాక, అసిస్టెంట్ గా చేరేందుకు ప్రయత్నించుకుంటే మంచిదేమో ఆలోచించుకోవాలి. ఇక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించే దర్శకులు వెబ్ సిరీస్ తీసుకుంటూనే పోతున్నారు. వాళ్ళకి మెథడ్ అవసరం లేదు. కనుక వెబ్ సిరీస్ రాయడం గురించి ఆర్టికల్స్ అవసరమని భావించడం లేదు. ప్రాక్టికల్ అనుభవం లేకుండా రాయలేం కూడా. నెట్ లో బోలెడు కంటెంట్ వుంది. ఎత్తి రాయలేం. మీరే చదివి తెలుసుకోండి. వెబ్ సిరీస్ రైటింగ్ అని టైపు చేస్తే సైట్స్ వచ్చేస్తాయి. ఇక కరోనా వల్ల సినిమారంగం ఏమవుతుందోనన్న ఆందోళన పెట్టుకోవడం అనవసరం. ఆందోళన అనేది స్క్రీన్ ప్లేలో మిడిల్లో వచ్చే స్ట్రగుల్. ముందు బిగినింగే చూడకుండా మిడిల్ గురించి ఎందుకు ఆందోళన? లాక్ డౌన్ ఎత్తేశాక ముందు బిగినింగ్ ఎలా వుంటుందో చూడండి. ఆ బిగినింగ్ ని బట్టి మిడిల్, ఎండ్ వుంటాయి. వాటిని అప్పుడు చూసుకోవచ్చు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లెక్కల్లో ఆలోచిస్తే జీవితం హాయిగా వుంటుంది.
Q: ఒక పెద్ద రిక్వెస్ట్.. సీన్స్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క దర్శకుడి ట్రీట్మెంట్ ఒక్కోలా ఉంటుంది. దీనికి సంబంధించి మీయొక్క పూర్తి విశ్లేషణ, ఉదాహారణలతో వరల్డ్ వైడ్ గా పేరున్న దర్శకులు సీన్స్ ను ఎలా ట్రీట్ చేస్తారు, తరవాత ఆ సీన్స్ ఆడియన్స్ మీద ఎంతవరకు ప్రభావం చూపాయీ, మరియు మీ దృష్టిలో బెస్ట్ ట్రీటెడ్ సీన్ అనిపించిన సీన్స్ ను, మీ యొక్క వీలు చూసుకుని తెలపగలరు.
―జేకే విప్లవ్, దర్శకత్వ శాఖ
A: ట్రీట్మెంట్ అంటే పేపరు మీద వుండేది. అది స్క్రీన్
ప్లే. వెండితెర మీద కన్పించేది ఆ ట్రీట్మెంట్ కి
చిత్రీకరణ. ట్రీట్మెంట్ కి కెమెరా షాట్స్ కలిస్తే చిత్రీకరణ. కాబట్టి ఒక సీనుని షాట్స్
తో దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేశాడన్నదే పాయింటు అవుతుంది. ట్రీట్మెంట్ ఎలా రాశాడ న్నది
కాదు. ట్రీట్మెంట్ ఎలా రాశాడన్నది స్క్రీన్ ప్లే విశ్లేషణ మాత్రమే అవుతుంది. మేకింగ్
విశేషాలు కాదు. మీరడుగుతున్నది మేకింగ్ విశేషాలు కావచ్చు. ఉదాహరణకి 924 వ ఆర్టికల్లో
ఇచ్చిన శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’ లో ఒక సీను షాట్ డివిజన్ లాగా. గొప్ప దర్శకుల షాట్
డివిజన్లు రాయాలంటే ఆ షాట్ ని పది సార్లు చూసి, ఈ షాట్ ని ఇలా ఎందుకు పెట్టాడబ్బా అని
అర్ధాలు వెతుక్కోవడంతోనే సరిపోతుంది. కోయెన్ బ్రదర్స్ తీసిన నియోనోయర్ జానర్ ‘బ్లడ్
సింపుల్’ లో ప్రతీ షాటూ ఒక చిత్రీకరణ పాఠమే. ఈ పాఠాలు ఆల్రెడీ బ్లాగులో రాశాం. బ్లాగు
సెర్చి బటన్ లో ‘బ్లడ్ సింపుల్’ అని తెలుగులో టైపు చేయండి, ఆ ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఇందులో ఒక సీనులో హీరో ఎదుట నిలబడ్డ హీరోయిన్ని టాప్ యాంగిల్లో చూపించినప్పుడు, ఆ సీనులో
హీరోయిను లోనైన బానిస మనస్తత్వమంతా పట్టుబడిపోతుంది. షాట్ అంటే పాత్ర మానసిక స్థితి
తప్ప మరేం కాదు. పదిహేనేళ్ళ క్రితం దర్శకుడు దశరథ్ ‘హౌ టు రీడ్ ఏ ఫిలిం’ అనే జేమ్స్
మొనాకో రాసిన పుస్తకమిచ్చారు. అది చదివితే కదిలే బొమ్మల అంతరార్ధం తెలుస్తుంది. ఈ పుస్తకం
అమెజాన్ లో దొరుకుతుంది. లేదంటే దర్శకుల సంఘం లైబ్రరీలో వుండొచ్చు. తీసుకుని చదవండి.
కానీ తీసే సినిమాల చిత్రీకరణ ఇలా వొక సైన్సు ప్రకారం లేనప్పుడు చదివి ఏం లాభం. మనం
రాసి ఏం భోగం. అయినా మీరన్నట్టు వీలు చూసుకుని రాసే ప్రయత్నం
చేద్దాం.
Q: ‘హిట్’ సినిమా పోస్టుమార్టంలో మీ విశ్వరూపం చూపించారు, మీరు అనలైజ్ చేసిన ప్రతి పాయింట్ లాజికల్ గా ఉంది. మీ విశ్లేషణలు సినిమా తీయబోయేవారికి పాఠాలు, తీసిన వారికి ఖచ్చితంగా గుణపాఠాలు.
―పేరు రాయలేదు
A: విశ్వరూపం కాదు, విశ్వ ప్రయత్నం. పోతే, పాఠాలూ గుణపాఠాలూ అంత సీనేం లేదు.
బ్లాగులో రాయాలి కాబట్టి రాయడం తప్ప వేరే యేం లేదు.
Q: నైస్ బ్లాగ్ అండి. కీప్ వర్కింగ్ ఔట్. ఎలా వస్తాయండీ ఈ ఆలోచనలు, హ్యాట్సాఫ్.
―సహస్ర
A: మీ అభిమానానికి కృతజ్ఞతలు. అలవాటు చొప్పున
వస్తాయేమో ఆలోచనలు.
Q: మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతున్నాను. మామూలు కథానికలు రాయాలనుకునే నాకూ ఉపయోగపడుతున్నాయి మీ ఆర్టికల్స్.
―వైతరణి
A: థాంక్స్. సినిమా కథల్లా రాయకండి.
―సికిందర్