దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
తారాగణం : అఖిల్ అక్కినేని, కళ్యాణీ ప్రియదర్శన్, రమ్య కృష్ణ, జగపతి బాబు, అజయ్,
అనీష్ కురువిల్లా, సత్య కృష్ణ, వెన్నెలకిషోర్, అజయ్, కృష్ణుడు తదితరులు
రచన : విక్రం కుమార్ – పాండే, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం:
పి.ఎస్.వినోద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్, మనం
విడుదల : డిసెంబర్ 22, 2017
***
అక్కినేని కుటుంబం - విక్రం కుమార్ మళ్ళీ కలిశారు. ‘మనం’ చివర్లో విక్రం కుమార్ కొసమెరుపుగా పరిచయం చేసిన అక్కినేని కొత్త వారసుడు అఖిల్ తో తొలిప్రయత్నం ‘అఖిల్’ అనేది తేలిపోయాక, ఇప్పుడు తిరిగి తనే పరిచయం చేస్తూ ‘హలో’ తీశారు. నాగచైతన్య కూడా యాక్షన్ (జోష్) తో ప్రవేశించి బాగుపడింది లేదు. అఖిల్ ఇప్పుడు పునః ప్రవేశం చేస్తూ రోమాన్స్ కి దిగడం ఎంతవరకు చెల్లింది? నిర్మాతగా నాగార్జున, దర్శకుడుగా విక్రం కుమార్ ల కృషి ఎంతవరకు సఫలమయ్యింది? ఒకసారి చూద్దాం....
తారాగణం : అఖిల్ అక్కినేని, కళ్యాణీ ప్రియదర్శన్, రమ్య కృష్ణ, జగపతి బాబు, అజయ్,
అనీష్ కురువిల్లా, సత్య కృష్ణ, వెన్నెలకిషోర్, అజయ్, కృష్ణుడు తదితరులు
రచన : విక్రం కుమార్ – పాండే, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం:
పి.ఎస్.వినోద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్, మనం
విడుదల : డిసెంబర్ 22, 2017
***
అక్కినేని కుటుంబం - విక్రం కుమార్ మళ్ళీ కలిశారు. ‘మనం’ చివర్లో విక్రం కుమార్ కొసమెరుపుగా పరిచయం చేసిన అక్కినేని కొత్త వారసుడు అఖిల్ తో తొలిప్రయత్నం ‘అఖిల్’ అనేది తేలిపోయాక, ఇప్పుడు తిరిగి తనే పరిచయం చేస్తూ ‘హలో’ తీశారు. నాగచైతన్య కూడా యాక్షన్ (జోష్) తో ప్రవేశించి బాగుపడింది లేదు. అఖిల్ ఇప్పుడు పునః ప్రవేశం చేస్తూ రోమాన్స్ కి దిగడం ఎంతవరకు చెల్లింది? నిర్మాతగా నాగార్జున, దర్శకుడుగా విక్రం కుమార్ ల కృషి ఎంతవరకు సఫలమయ్యింది? ఒకసారి చూద్దాం....
కథ
హైదరాబాద్
లో అవినాష్ (అఖిల్) – ప్రియ (కల్యాణీ ప్రియదర్శన్) లు చిన్నప్పుడు
విడిపోతారు. చిన్నప్పుడు వీధి బాలుడిగా అవినాష్ వాయించే ఏక్ తారా ధ్వనులు గొప్పింటి బాలికగా
ప్రియ బాగా ఇష్టపడుతుంది. ఆమె కుటుంబం ఢిల్లీకి వెళ్లి పోతున్నప్పుడు నోటు
మీద ఆమె ఫోన్ నెంబర్ రాసిస్తే ఆ నోటు పిల్ల దొంగ కొట్టేస్తాడు. అతన్నుంచి ఒక్క ఫోన్
కాల్ కోసం ఆమె పద్నాల్గేళ్ళూ ఎదురు చూస్తుంది. ఆమె ఢిల్లీ వెళ్ళిపోయిందని తెలీని అవినాష్, ఫోన్
నెంబర్ పోగొట్టుకుని, ప్రతిరోజూ ఆమె వచ్చే జంక్షన్ కి వెళ్లి చూస్తూంటాడు.
ఇప్పుడు ఢిల్లీలో వున్న ఆమె కుటుంబం అమెరికాకి తరలిపోయేందుకు సిద్ధమవుతూంటుంది. ఇక చివరి ఆశగా హైదరాబాద్ వెళ్లి వస్తానని బయల్దేరి వస్తుంది ఇప్పుడు ఎదిగిన ప్రియ. ఇలా వచ్చిన ఈమె ఒక మ్యూజిక్ షోలో వయోలిన్ వాయిస్తోంటే, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి అవినాష్ కి రాంగ్ కాల్ వస్తుంది. వింటూంటే బ్యాక్ గ్రౌండ్ లో వయోలిన్ విన్పిస్తుంది. అది చిన్నప్పుడు తను ప్రియకి విన్పించిన బాణీయే...ఆ స్థలం వివరాలు క్యాబ్ డ్రైవర్ని అడిగి తెలుసుకుంటూంటే, అదే చిన్నప్పటి దొంగ ఆ సెల్ ఫోన్ కొట్టేసి పారిపోతాడు. ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ కోసం ఆ దొంగోడి వెంట పడతాడు అవినాష్... అలా ఆ సెల్ ఫోన్ రకరకాల చేతులు మారి అవినాష్ దక్కిందా, దానికోసం అవినాష్ ఏం సాహసాలు చేశాడు, ఏ గ్యాంగుని ఎదుర్కొన్నాడు, చివరికి ప్రియని ఎలా కలుసుకోగలిగాడు - అన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
విన్ స్టన్ చర్చిలే చెప్పాడు – ఆధునికత అనే గొర్రెల మందని సాంప్రదాయపు పాత ములు గర్రతో పొడుస్తూ వుంటేనే, ఆ ఆధునికత అనే గొర్రెల మంద చెల్లాచెదురై పోకుండా వుంటుందనీ. ఈ కథ విషయంలో ఇది నిజమైంది. రోమాంటిక్ డ్రామా జానర్ లో ఈ ప్రేమకథ పురాతన కథనే ఆధునికంగా చెప్పారు. చిన్నప్పటి ప్రేమికులు విడిపోయారు, పెద్దయ్యాక మళ్ళీ కలుసుకున్నారనే పాతనే కొత్తగా చెప్పారు. కొత్తగా చెబున్నప్పుడు పాత సాంప్రదాయాల మీద ఆధారపడ్డారు. పాత సాంప్రదాయాల పునాది మీద కొత్త విన్యాసాలు చేశారు. అందుకని మూలంలో ఇలా బలంగా వున్న ఈ కథావస్తువు యూత్ అప్పీల్ కి కొదవలేకుండా కొత్త పుంతలు తొక్కడానికి కావాల్సిన స్వేచ్ఛంతా తీసుకుంది. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింటు.
తెలుగులో
రోమాంటిక్ కామెడీలంటూ చాలా లపాకీ కథలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అవి నిజానికి యూత్
అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే
రోమాంటిక్ డ్రామాలు. అంటే పాతకాలపు వీణ కథలు. పాతని అదే పాతలాగా కాపీ చేసి భ్రష్టు పట్టించే ప్రయత్నాలు
చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తూనే వుంటారు.
ప్రస్తుత విడిపోయే ప్రేమికుల రోమాంటిక్ డ్రామాని, యూత్ అప్పీల్ కి వ్యతిరేకమైన ఏడ్పించే వీణ కథగా చేయకపోవడమే వూరట. ఈ వూరట వారం వారం ఎంతో కొంత లపాకీ కథలకి అలవాటు పడిన ఆకతాయి ప్రియులకి ఖచ్చితంగా వెటకారంగా వుంటుంది. వాళ్ళ తప్పు కాదు. అభిరుచులు అపచారాలైపోతున్నాయి. వాళ్ళని పక్కన పెడదాం. ఇలా కొత్తా పాతల మేలు కలయికతో ఒక ‘వయోలిన్’ కథగా తయారు చేశారు. గిటార్ కథలుగా తీయాల్సిన రోమాంటిక్ కామెడీలే పాత వీణ కథలై పోతూంటే, వీణ కథగా వుండే రోమాంటిక్ డ్రామాని ఆధునీకీకరించి, ‘వయోలిన్’ కథగా మార్చడం గొప్ప విశేషమే. ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింటు.
విధి ఈ కథలో విలన్ పాత్ర వహిస్తుంది. ప్రేమ కోసం విధిని జయించే ప్రయత్నమే ఈ ప్రేమకథ. కర్మలతో విధిని ఎదుర్కోవచ్చనే చిన్న మెసేజ్ ఇస్తుంది. ఇది పూర్తిగా చకచక సాగే సంఘటనలతో అద్భుత రసప్రధానంగా సాగే కథ. కథకి అతికే రస పోషణతో, ఏకసూత్రత పాటించే నిర్మలమైన కథలు తెలుగులో రావడంలేదు, రావు కూడా. తమిళులు వచ్చి చూపించి పోవాల్సిందే.
ఎవరెలా చేశారు
1995
లో ఇంకా పారాడే పాపయిగా వున్నప్పుడు ‘సిసింద్రీ’ లో సోలో బేబీగా నటించి హిట్
కొట్టిన అక్కినేని అఖిల్, తీరా పెదబాబు అయ్యాక తొలి ప్రయత్నంగా 2015 లో ‘అఖిల్’
అనే యాక్షన్ మూవీతో దెబ్బతినిపోయాడు. యాక్షన్ మూవీ చేయలేక దెబ్బతినలేదు, యాక్షన్
మూవీ బాగాలేక దెబ్బతిన్నాడు. ఇప్పుడు మలిప్రయత్నంలో ఒడ్డున పడ్డాడు.
‘యే మాయ చేశావే’ లో నాగచైతన్య అక్కినేని లాగా అఖిల్ అక్కినేని తాజా పిల్లవాయువుల్ని మోసుకొచ్చాడు ఈ ప్రేమకథకి. సున్నిత ప్రేమకథకి వూపిరులూదాడు. సునాయాసంగా, సింపుల్ గా, భావోద్వేగ భరితం చేశాడు. నటనలో ఇప్పుడు బాగా ఇంప్రూవయాడు. రాకుమారుడిలాంటి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వెండి తెర మీద దివ్యంగా వెలుగులు నింపేశాడు. ఇప్పుడు కూడా తెలుగు భగ్నప్రేమికుడి పాత్రలు వెక్కి వెక్కి ఏడుస్తూంటాయి. ఎందుకో తెలీదు. యాసిడ్ బాటిల్ దొరకడం లేదనా? అఖిల్ అయితే ఏమాత్రం ఏడవలేదు. చిట్టచివరికి ప్రేక్షకులకే తను రక్తికట్టించే డ్రామాకి ఎలాగూ కళ్ళు చెమరుస్తాయి...
‘యే మాయ చేశావే’ లో నాగచైతన్య అక్కినేని లాగా అఖిల్ అక్కినేని తాజా పిల్లవాయువుల్ని మోసుకొచ్చాడు ఈ ప్రేమకథకి. సున్నిత ప్రేమకథకి వూపిరులూదాడు. సునాయాసంగా, సింపుల్ గా, భావోద్వేగ భరితం చేశాడు. నటనలో ఇప్పుడు బాగా ఇంప్రూవయాడు. రాకుమారుడిలాంటి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వెండి తెర మీద దివ్యంగా వెలుగులు నింపేశాడు. ఇప్పుడు కూడా తెలుగు భగ్నప్రేమికుడి పాత్రలు వెక్కి వెక్కి ఏడుస్తూంటాయి. ఎందుకో తెలీదు. యాసిడ్ బాటిల్ దొరకడం లేదనా? అఖిల్ అయితే ఏమాత్రం ఏడవలేదు. చిట్టచివరికి ప్రేక్షకులకే తను రక్తికట్టించే డ్రామాకి ఎలాగూ కళ్ళు చెమరుస్తాయి...
యాక్షన్ సైడు - ఇంకో ఫ్రెష్ నెస్. ఈ యాక్షన్ – ఛేజ్ సీన్సు తెలుగుకి కొత్త. మెట్రో ట్రైన్ లో యాక్షన్ సీన్లు ఇదే మొదటిది తెలుగు సినిమాకి. నీటుగా క్లాసుగా వుండే ఈ యాక్షన్ సీన్స్ ని సమకూర్చిన హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ బాబ్ బ్రౌన్ సౌజన్యం అఖిల్ కి ఒక ప్లస్. అఖిల్ లోని లేతదనాన్ని దృష్టిలో పెట్టుకునేమో ఇలాటి యాక్షన్ ని సమకూర్చాడు బ్రౌన్. ఏ కోశానా మాస్ వాసన వేయకపోవడం ఇంకో వూరట.
కొత్త హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ లేత ప్రేమకథకి పూతరేకులా వుంది. ఎప్పుడూ సినిమాల్లో హీరోయిన్లు ఫస్టాఫ్ లో యమ వూపేసి, సెకండాఫ్ లో ఐపు లేకుండా జంప్ అయి పోతారు. అలాటిది తను సెకండాఫ్ లోనే పనిపెట్టుకోవడం సెకండాఫ్ ని కూడా చూసేలా చేస్తుంది. హీరోకున్నంత పాత్ర చిత్రణ లేకపోయినా ( హీరో పాయింటాఫ్ వ్యూ కథ కాబట్టి), ఒక పరితపించే ప్రేమికగా మరీ మెలోడ్రామా లేకుండా సింపుల్ గా నటించుకొచ్చింది.
ఇంకో రెండు ఫ్రెష్ క్యారక్టర్లు జగపతి బాబు, రమ్యకృష్ణలవి. పేరెంటింగ్ అనే దాన్ని వీళ్ళు సెన్సి బుల్ గా పోషిస్తారు. హీరోతో విధివశాత్తూ ఆంటీ అంకుల్స్ గా బంధం ఏర్పడి, అది అమ్మా నాన్నా లనే పిలుపుగా మారాలని తపించే పిల్లల్లేని భార్యాభర్తలుగా వీళ్ళిద్దరి నటన ఒక ప్రత్యేకాకర్షణ. ఇక బాల నటులిద్దరూ తమ అరగంట నిడివి చందమామ కథలాంటి విషయంతో ఆకట్టుకుంటారు. విలన్ గా అజయ్ కి ఒక కామిక్ ముగింపు వుంటుంది.
పాటలు సరే, యాక్షన్ సీన్స్ కి అనూప్ రూబెన్స్ ఒకే థీమ్ మ్యూజిక్ ని రిపీట్ చేయడం డిఫరెంట్ పంథా. ఇంతవరకు ఇలాటిది చూడలేదు. ‘డంకర్క్’ ని గుర్తుకు తెస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ఇన్సర్ట్ చేసిన కొన్ని షాట్లు కథనానికి వూపు తెచ్చే విధంగా వున్నాయి. పి.ఎస్.వినోద్ కెమెరా వర్క్ ఫాంటసీ లుక్ తో వుంది.
చివరికేమిటి
చాలా
లాజిక్కులు ఎగేసి పాత కథనే కొత్తగా చెప్పారు. అయితే ఈ ప్రేమ కథకి ఫెయిరీ టేల్ లుక్
తీసుకురావడంతో లాజిక్కులతో తీసుకున్న సృజనాత్మక స్వేచ్ఛ కూడా స్వీట్ గానే
వుంటుంది. ఉదాహరణకి – హీరో సెల్ ఫోన్ పోతే వచ్చిన చివరి కాల్ నంబర్ కోసం
పరుగెత్తి, ప్రాణాలకి తెగించి పోరాడి, ఆ
సెల్ ఫోన్నే సాధించాల్సిన అవసరం లేదు. సులభంగా ఆ నెంబర్ తెలుసుకునే మార్గాలున్నాయి. ఏమో ఇలా
కూడా జరగవచ్చనే suspension of disbelief ని కాసేపు భరించి చూడాల్సిందే – ఆ పరమైన యాక్షన్
ఎపిసోడ్స్ మొత్తాన్నీ.
ఇలాటి ప్లాట్ పాయింట్ వన్లు ‘జవాన్’ లోనూ, ‘ఎంసీఏ’ లోనూ చూడలేదా? చూశాం. కానీ మాట్లాడుకోలేదు. ‘జవాన్’ లో అదేదో రక్షణాయుధం కోసం మాఫియా హీరో కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూంటే, ఆ రక్షణ శాఖలోనే పనిచేసే హీరో అధికారులకి చెప్పాలి కదా? చెబితే తను కుటుంబాన్ని కాపాడుకోవడమనే హీరోయిజం వుండదుగా? ‘ఎంసీఏ’ లో ఆర్టీవో అయిన వదిన మీదికి మాఫియా దాడికొస్తే, ఆమె పోలీసుఅకి చెప్పొచ్చు గా? చెబితే ఆమెని కాపాడుకునే హీరోయిజం హీరోకి వుండదుగా? తేడా ఏమిటంటే, విక్రం కుమార్ ఈ లోపాన్ని ఫెయిరీ టేల్ ఫార్మాట్ తో చెల్లిపోయేలా కవర్ చేసుకున్నాడు.
మరొకటేమిటంటే, ప్రజల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసి భారీ ఎత్తున బయటి రాష్ట్రానికి కంటెయినర్ లో, అదీ ఫైరింగ్ స్క్వాడ్ నిచ్చి తరలించే మాఫియాని కూడా వాస్తవంలో ఎక్కడా చూడం. దీన్ని కూడా ప్రేమకథ లాగే ఫాంటసీలా తీసుకోవాలన్నట్టుంది దర్శకుడి ఉద్దేశం. నగరంలో వందల వేల సెల్ ఫోన్లు జనం దగ్గర కొట్టేస్తూంటే, అదో సంచలనం అవుతుంది నిజానికి. వెంటనే జెండా ఎత్తేస్తారు దొంగలు. పెద్ద పెద్ద గోడున్లు పెట్టి పర్మనెంట్ పరిశ్రమలా చేయరు దందాని.
విధి చుట్టూ కథ కాబట్టి అనేక కాకతాళీయాలున్నాయి. క్యాబ్ వాలా హీరోకి రాంగ్ కాల్ చేయడం, చిన్నప్పుడు హీరోయిన్ నెంబర్ రాసిచ్చిన నోట్ పదిహేనేళ్ళ తర్వాత హీరోకి దొరకడం, చిన్నప్పుడు ఆ నోటు కోసం దొంగని వెంటాడుతున్నప్పుడు హీరో రమ్య కృష్ణ కారుకింద పడి ఆమె ఇంట్లో సభ్యుడిగా మారడం, మళ్ళీ పెద్దయ్యాక ఆమెని కారు ప్రమాదం నుంచి తప్పించడం, చిన్నప్పుడు నోటు కొట్టేసిన దొంగే పెద్దయ్యాక మళ్ళీ హీరోయిన్తో కలపగల హీరో సెల్ ఫోన్ ని కొట్టేయడం...ఇంకా, హీరో కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ హీరోని వెతకాలంటే, చిన్నప్పుడు తాము కలుసుకునే పానీ పూరీ బండి వాడి కోసం వెతుక్కోవాలి నిజానికి. ఎక్కడో మ్యూజిక్ ఫెస్టివల్ లో వయోలిన్ వాయిస్తే ఎక్కడ వింటాడు హీరో? ఆ పానీ పూరీ వాణ్ణి తర్వాతెప్పుడో కాకతాళీయంగా చూస్తుంది. ఇన్ని కాకతాళీయాలున్నా ఇవి అతిగా అన్పించవు. పైగా ఎక్కడికక్కడ డ్రామాని సృష్టించే, మెలోడ్రామాని అనుభవించేలా చేసే, కథనాన్ని కొత్తగా మార్చేసే డైనమిక్స్ గా వుంటాయి. విధిని ఆధారంగా చేసుకున్న ఈ కథా ప్రారంభంలోనే దర్శకుడే క్వాంటం ఫిజిక్స్ థియరీ చెప్తాడు నాగార్జున వాయిసోవర్ తో – మనందరం కంటికి కన్పించని సన్నటి దారాలతో అల్లుకుని వున్నామని. అందుకే ఇలాటి కాకతాళీయాలు. నియర్ మిస్సులు. సింక్రో డెస్టినీ తాలూకు చిత్రణలు.
హీరో
హీరోయిన్లు కలవడానికి ఏ సోషల్ మీడియా పనికిరాదా? ఇతనో ఆమెనో వైరల్ అయ్యేలా ఒక్క వీడియో
పోస్ట్ చేస్తే సరిపోయే దానికి, ఈ సెల్ ఫోన్ గొడవంతా అవసరమా – ఆమె హైదరాబాద్ వచ్చ్ వయోలిన్
వాయించుకోవడం అవసరమా అంటే, అదంతే. ఫెయిరీ టేల్ అనే షరతులు వర్తిస్తున్నాయి
కాబట్టి. అన్ని అసంగతాల్నీ జయించడానికి చిత్రీకరణపరంగా, సంగీతపరంగా, కళాదర్శకత్వం
పరంగా సమ్మోహనపరుస్తూనే, కృతకం కాని, ఎక్కడికక్కడ కథనంలోంచి సహేతుకంగా ఉట్టి పడే
సహజ అనుభూతుల్నీ, భావోద్వేగాల్నీ అస్త్రాలుగా చేసుకున్నారు.
చిన్నప్పటి వయోలిన్, నోటు, చేతి గాజు అనే మూడు ప్లాట్ డివైసులు మళ్ళీ ఇద్దర్నీ కలపడానికి చివర్లో పాత్ర వహిస్తాయి. ప్లాట్ డివైసులు ఎంతైనా చైతన్యం తీసుకొస్తాయి దృశ్యాల్లో. ఇదంతా పాత మెలోడ్రామానే. ఇలాటి చిన్నప్పటి కథలకి మన్మోహన్ దేశాయ్ మాస్టర్. ఇదంతా ఈ తరహా మేకింగ్ కి సరిపోయింది. అలాగే ‘మనం’ లో గడియార స్థంభం అనే కథా స్థలి వున్నట్టే, ఇక్కడా ట్రాఫిక్ సిగ్నలనే కథా స్థలి వుంది. విధి, కాలం, స్థలాలు, కాకతాళీయాలు దర్శకుడి అభిమాన సబ్జెక్టులుగా వున్నట్టున్నాయి ‘మనం’ దగ్గర్నుంచీ.
హీరో మొదటి పాట అంతా చరణం చరణానికీ మారే వివిధ చిన్న పిల్లలతో వుంటుంది. ఇదొక పజిల్ మనకి. హలో ఎక్కడున్నా హలో, ఏమయ్యావ్ హలో... అంటూ టీనేజి అమ్మాయిలతో పాటేసుకుని గిచ్చి గిచ్చి నానా రచ్చ చేస్తాడు మన ఏ తెలుగు స్టార్ అయినా. లేకపోతే అది టూరిజంలాంటి స్టారిజం కాదనుకుంటాడు. ఇలాకాక, చినబాబు అఖిల్ చిన్నపిల్లలతో పాడుకుంటాడేమిటని మనకి పజిల్ లా వుంటుంది. . ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది దీని అంతరార్ధం, చిన్నప్పుడు తెలిసిన హీరోయిన్ కథతో... అందుకని చిన్నపిల్లల్లోనే వెతుక్కుంటున్నాడు ఇప్పుడు హీరోయిన్ని. ఇలా ఆమెకి హీరో ఎంత బలంగా, ఏ మూలాల్నుంచి కమిట్ అయివున్నాడో ఈ పాటలోనే మనస్తత్వం బయటపడే గొప్ప చిత్రణ అనుకోవాలిది. ఇదే పాటలో ఒక షాట్ లో చెరో వైపు రెండు దీపాలు మసగ్గా వెలుగుతూంటాయి. ఇవి సోల్ మేట్స్ కి ప్రతీకాలంకారాలన్న మాట.
ఇక వీధి బాలుడు పాటగాడుగానూ, గొప్పింటి బాలిక ప్రేమలో పడేది గానూ ఎప్పుడో ‘డిస్కో డాన్సర్’ కాలంలోనే చూశాం. అందులో మనోడు ‘గోరోకీ నా కాలోకీ దునియా హై దిల్ వాలోకీ’ అని పాడితే, ఇందులో మనోడు – ‘హోగయాహై తుజ్కో తో ప్యార్ సజనా (దిల్ వాలే దుల్హనియా లేజాయింగే) వాయిస్తాడు. ఇదంతా పాత మూస వాసనేయదా? వేయదు. ఇప్పటి కాలానికి తగ్గట్టు చూపించే విధానంలో చూపిస్తే చాలా నాస్టాల్జియా! అతీతమైన క్రియేటివ్ పరిజ్ఞానం లేకుండా పాతా కొత్తా కళల్ని ఫ్యూజన్ చేయలేరు.
ఇక చాలా చోట్ల బోరు కొట్టే రొటీన్ దృశ్యాల్ని నివారించడానికి క్లోజప్స్ తో క్లుప్తతని పాటించారు. రెండు ప్యాకెట్ల మీద క్లోజప్స్ లో బార్ కోడ్స్ ని స్కాన్ చేస్తూంటే ఏమిటా అని ఆసక్తిగా చూస్తాం. కట్ చేస్తే హీరో, రమ్య కృష్ణ రోడ్డు మీద నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూంటారు షాపింగ్ పూర్తయ్యిందని! షాపింగ్ సీనుని షాపులో సోదిలా చూపిస్తూ మనల్ని పాసివ్ గా, బోరు కొట్టేలా చూసేలా చేయకుండా, కేవలం బార్ కోడ్స్ స్కానింగ్స్ క్లోజప్స్ తో అటెన్షన్ లోకి తీసుకొచ్చి- యాక్టివ్ వ్యూవింగ్ ఎక్స్ పీరియెన్స్ ని పంచారు (తెలుగులో దీన్నేమంటారో తర్వాత ఆలోచిద్దాం).
ఐతే ఈ సభ్యత గల చిత్రీకరణల్లో ఒక అసభ్యత కూడా వుంది. హీరో సిగరెట్లు కాల్చ వద్దన్నప్పుడు, జగపతి బాబు తాగుతున్న సిగరెట్ ని కారులోంచి బయటికి విసిరేయడం లాంటిది. ఆ సిగరెట్ తో బాటు కారులో వున్న మరిన్ని ప్యాకెట్ లని బయట సిటీ నడి రోడ్డు మీదికి విసిరేయడం లాంటిది. ఆయన ఎంచక్కా కారు దిగి వెళ్లి, ఆ కార్యక్రమం డస్ట్ బిన్ లో కానిచ్చి వచ్చి వుంటే పాత్ర చాలా ఉన్నతంగా అన్పించేది. సీను దానికదే ఎడ్యుకేటివ్ గా వుండేది సివిక్ సెన్సుతో. జగపతిది మొరటు పాత్రేం కాదు సిగరెట్లు అలా పారేయడానికి, హూందాతనం గల పాత్రే.
ఇంతకీ స్క్రీన్ ప్లే సంగతులేమిటి?
ఈ
స్క్రీన్ ప్లేలో హీరో సెల్ ఫోన్ని పోగొట్టుకోవడం వరకూ బిగినింగ్, దాన్ని
దొరికించుకుని విలన్ తో తలపడి బందీ అవడం వరకూ మిడిల్, సెల్ ఫోన్ తో తప్పించుకుని
హీరోయిన్ కి కాల్ చేసి ఎట్టకేలకు కలుసుకోగల్గడం ఎండ్ - ఇదే ప్రధాన కథ. చాలా పొట్టి కథ. మిగిలినదంతా రెండు
ఫ్లాష్ బ్యాకుల సుదీర్ఘ అంతర్గత కథ. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కాదు.
ప్రధాన కథలో సెల్ ఫోన్ని పోగొట్టుకునే సంఘటన ప్లాట్ పాయింట్ వన్, సెల్ ఫోన్ని దొరికించుకోవడం మిడ్ పాయింట్ (ఇంటర్వెల్), హీరోయిన్ చేతి గాజు హీరో చేతిలో చితికిపోవడం ప్లాట్ పాయింట్ టూ.
మొదటి పది నిమిషాల్లోనే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. మిడ్ పాయింట్ గంటకల్లా వచ్చేస్తుంది. సెకండాఫ్ మరోగంట వుంటుంది. మొత్తం కలిపి రెండు గంటల నిడివి. కానీ ఎంతో చూసినట్టు వుంటుంది.
ఇటీవల ‘మళ్ళీరావా’ లో ప్రధాన కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల రెండు కాలాల అంతర్గత కథలతో, హీరోహీరోయిన్ల దృక్కోణాలు కలిపేస్తూ, చైతన్య స్రవంతి ( స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్) శిల్పంతో చూపించారు. ఇదంతా ప్రధాన కథని గుర్తుపట్టకుండా గజిబిజి చేసింది. చైతన్య స్రవంతి శిల్పం సాహిత్యంలోనే తప్ప (నవీన్ ‘అంపశయ్య’) హాలీవుడ్ కమర్షియల్ సినిమాలకి ఎవరూ వాడలేదు. కేవలం జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళని హాలీవుడ్ లో ఫిలిం నోయర్, నియో నోయర్ థ్రిల్లర్స్ కి విజయంతంగా మల్చుకున్నారు. చైతన్య స్రవంతి శిల్పాన్ని రష్యన్, జర్మన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోకమర్షియలేతర సినిమాలకి వాడుతున్నారు. ఆ ‘వరల్డ్ సినిమాలు’ ప్రపంచమంతా ఆడవు. మాస్ మీడియా సెక్షన్ కావు. వరల్డ్ సినిమా పండితులది, కమర్షియల్ సినిమా పామరులది. ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో కూడా వరల్డ్ సినిమా టెక్నిక్ వాడి విఫలమయ్యారు. కమర్షియల్ సినిమాల ప్రపంచంలో వుండే వాళ్ళు వరల్డ్ సినిమాలు చూడ వద్దనేది ఇందుకే. ఆ మాటకొస్తే కమర్షియల్ సినిమాలకి రివ్యూలు రాసే వాళ్ళు కూడా వరల్డ్ సినిమాలు చూడకూడదు. భావకవిత్వాన్ని విప్లవ కవిత్వ దృష్టితో చూసినట్టు వుంటుంది.
‘హలో’ లో ఇలా కాకుండా చూపించే పిల్లల కథంతా ఒకే ఫ్లాష్ బ్యాక్ గా చూపించేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ కి ప్రేరణ సంఘటనే. ప్రధాన కథగానీ, అంతర్గత కథగానీ సంఘటనలతోనే నడపడ మనేది, సంఘటనల ద్వారానే విషయాన్ని తెలియజెప్పడ మన్నది విజువల్ మీడియా అయిన సినిమా సూత్రమే. ఇదిక్కడ పూర్తిగా కన్పిస్తుంది.
హీరో సెల్ ఫోన్ని దొంగోడు కొట్టేయడం ప్లాట్ పాయిట్ వన్ అని చెప్పుకున్నాం. ఆ సెల్ ఫోన్ కోసం దొంగోడ్ని వెంటాడి పట్టుకుంటే, వాడు చిన్నప్పటి తెలిసిన దొంగే కావడం, దాంతో హీరోకి గతం గుర్తుకు రావడం, ఫ్లాష్ బ్యాక్ మొదలవడం జరగిపోతాయి. చిన్నప్పటి దొంగోడ్ని చూస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడమెందుకు? ఎందుకంటే, అప్పట్లో చిన్న హీరోయిన్ ఫోన్ నెంబర్ రాసిచ్చిన నోటుని వీడే కొట్టేశాడు. అప్పుడూ వీడే, ఇప్పుడూ వీడే. ఇలా ఇది ఫ్లాష్ బ్యాకుతో కనెక్షన్ ని ఏర్పాటు చేసింది.
ఈ మొదటి ఫ్లాష్ బ్యాకులో చిన్నప్పటి హీరో హీరోయిన్లని చూస్తాం. ఇందులో ప్రధానకథకి అవసరమైన ప్లాట్ డివైసుల్ని ఉత్పత్తి చేశారు. వాళ్ళిద్దరి అనుబంధం, చేతి గాజు, నోటు, వయోలిన్ బాణీ, దొంగోడు, పానీ పూరీ వాడు, హీరో ని పెంచుకున్న తల్లిదండ్రులూ వగైరా. ఈ ఫ్లాష్ బ్యాక్ 25 నిమిషాల పాటు సాగుతూ సాగుతూ, నవంబర్ 14 న మిస్సయిన వాళ్ళకోసం బాలల చలన చిత్రం ప్రదర్శిస్తున్నట్టు వుంటుంది. ‘మళ్ళీ రావా’ కూడా డిటో. రెండు బాలల చలన చిత్రాలు.
ఇప్పుడు అఖిల్ పునరాగమన ప్రయత్నం ఎలా వుందో చూడ్డానికి పోయే ప్రేక్షకులకి, వున్న గంట ఫస్టాఫ్ లో అరగంట బాలలే కన్పిస్తారు. ఈ అరగంట లోనే రెండు పాటలు కూడా వేసుకుంటారు! చినబాబు మీద పాటలకోసం ఎదురు చూసేవాళ్ళకి బుల్లిబాబు మీద పాటలు దర్శకుడి బడాయే. ఈ బాలల కథ పూర్తవగానే ఇదే ఫ్లాష్ బ్యాక్ జగపతి-రమ్యకృష్ణ
ల పేరెంటింగ్ కథగా మారి సాగుతుంది.
ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే దొంగోడ్ని పట్టుకోవడం దగ్గరాగిన మిడిల్ తిరిగి అందుకుంటుంది. వాడితో గోడౌన్ కెళ్ళడం, ఫైట్ చేయడం, కంటెయినర్ ని ఛేజ్ చేయడం, సెల్ ఫోన్ని దొరికించుకోవడం, దీంతో ఇంటర్వెల్ రావడం పూర్తవుతాయి. ఈ ఇంటర్వెల్ సీనుకి బ్యాంగ్ వుండదు. హాలీవుడ్ టైపు లో కథని మధ్యకి ఆపారంతే.
ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ ప్రారంభం. సెల్ ఫోన్ మాఫియా గా అజయ్ పాత్ర పరిచయమవడం, హీరోని వెతికి పట్టుకోవడం, ఫైట్, హీరోని స్పృహ తప్పేలా కొట్టి పడెయ్యడం, దీంతో మిడిల్ టూ కి బ్రేక్.
ఈ కొట్టి పడెయ్యడమనే చర్యే రెండో ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపిస్తుంది. రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఏముంది? హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ తో తన హీరోయినే అని తెలీనక సాగే కథ. దీన్ని హీరోని కొట్టి పడెయ్యమనే చర్య ఎలా ప్రేరేపిస్తుంది? తల మీద దెబ్బ పడగానే ఇప్పుడామే గుర్తొస్తుంది గనుక.
ఈ రెండో ఫ్లాష్ బ్యాక్ లో ఆమెతో తనకి నియర్ మిస్సులు జరుగుతాయి. తెలియకుండానే ఆమె వున్న కారు టైరు మార్చడం, రమ్యకృష్ణ బ్యాగులో డిమాండ్ రింగు పడెయ్యడం లాంటి సంఘటనలు ఇద్దర్నీ సన్నిహితం చేస్తాయి. దీని తర్వాత రమ్యకృష్ణ హీరో ని చేసుకోమని హీరోయిన్ని అడగడం, ఆమె హర్ట్ అవడం జరిగి, హీరో తనకా ఉద్దేశం లేదని క్లియర్ చేయడం, హీరోయిన్ ఫ్రెండ్ పెళ్లి సంబరం, అక్కడ హీరోయిన్ చేతి గాజు హీరో వల్ల విరగడం మొదలైనవి జరుగుతాయి.
ఆ చేతి గాజు విరిగితే హీరోయిన్ ఎందుకంత బాధ పడుతోందో హీరో అడుగుతాడేమో ననీ, అడిగేస్తే ఆమె చెప్పేస్తే కథ ముగిసిపోతుందనీ మనం కంగారు పడతాం. అలా జరగదు. మనకి తెలిసిపోయిన నిజం వాళ్ళిద్దరూ తెలుసుకోరు. ఇదీ పాత్రలతో మన కేర్పడుతున్న సస్పెన్స్. ఈ మొత్తం రోమాంటిక్ డ్రామానీ ఇలా సస్పెన్సే కట్టి పడేస్తూంటుంది.
ఇక హీరో స్పృహలోకి రావడంతో రెండో ఫ్లాష్ బ్యాక్ ముగిసి, బ్రేక్ ఇచ్చిన మిడిల్ టూ తిరిగి ప్రారంభమవుతుంది. బందీగా వున్న హీరో విలన్ సహా మొత్తం గ్యాంగుని చిత్తు చేసి సెల్ ఫోన్ తో పారిపోతాడు. ఇది ప్లాట్ పాయింట్ టూ. దీంతో మిడిల్ టూ ముగుస్తుంది. ప్లాట్ పాయింట్ టూ అంటే సమస్యకి – దాని తాలూకు సంఘర్షణకి - పరిష్కార మార్గం చూపే మలుపే కాబట్టి - ఫైనల్ గా సమస్యని పరిష్కరించే సెల్ ఫోన్ చేజిక్కించుకుని హీరో పారిపోతున్నాడు.
ఇప్పుడు ఈ ఎండ్ విభాగంలో మళ్ళీ సినిమా మొదట్లో చూపిన క్యాబ్ వాలాకి కాల్ చేస్తాడు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రదేశం తెలుసుకుని అక్కడి కెళ్ళిపోతాడు. వయోలిన్ మీద ఆ బాణీ వినపడిం దంటే, అది తన చిన్ననాటి హీరోయినే అనీ, ఆమె ఇక్కడే వుంటుందనీ పాత ఫార్ములాతో కూడిన నమ్మకం హీరోకి. మనమైతే చిన్నప్పుడు ఏం విన్నామో ఎప్పుడో మర్చిపోయి ఇంకేదో దానిమీది కెళ్ళిపోతాం. చిన్నప్పటి పోరీ పోరడూ ఛత్తేరి అనుకుంటాం. హీరో హీరోయిన్లు ఈ బాణీని విడిపోయిన పద్నాల్గేళ్ళనాడే సోషల్ మీడియాలో వాయించి పరివ్యాప్తం చేసుకుని వుంటే ఆనాడే కలుసుకునే వాళ్ళేమో.
ఇదంతా కాదు, దర్శకుడికి పరీక్ష- ఇంత ఉద్వేగభరిత డ్రామా నడిపాక, వాళ్ళిద్దరూ గుర్తు పట్టుకుంటే సీనేమి టన్నది. ఆ పతాక సన్నివేశాన్ని ఎలా చూపిస్తాడన్నది. కలిసే తిరిగారు, కానీ తెలియక తిరిగారు, ఇప్పుడు తెలిసిపోతే ఎలావుంటుంది పరిస్థితి? దీన్ని చూపించడమే దర్శకుడికి పరీక్ష.
ఇక్కడే హీరోకి ఆ నెంబరున్న నోటు దొరకడం- [ప్రకృతి (సబ్ కాన్షస్ మైండ్)ఇంతే, మనం ప్రయత్నం చేస్తే అదే వెతికి పట్టుకొచ్చి ఆఫర్ చేస్తుంది, నీకు టైం రాలేదని మాయం చేసేది కూడా అదే] - దానిమీద నెంబర్ తో చిట్టచివరికి కాల్ చేయడం, అక్కడే వున్న హీరోయిన్ దాన్ని రిసీవ్ చేసుకోడం...ఆ తర్వాత ...ఇక తెరపై చూడాల్సిందే.
ఈ పొట్టి ప్రధాన కథ చూస్తే ఇది ఒక రోజులోనే జరిగే కథ. అలాగని టైం లాక్ లేదు. ఫలానా ఇన్ని గంటల్లోనే సెల్ ఫోన్ని సాధించుకోవాలనే షరతు లేదు. ఇందువల్ల ఒక ఫ్రేములో మనల్ని కట్టేసిన ఇరుకు ఫీల్ కాం. ఒకరోజులో జరుగుతున్న కథ అనీ, ఒక రోజులోనే ముగుస్తుందనీ చెప్పకుండా ఆప్షన్ లాక్ తో నడపడం వల్ల మనం ఫ్రీగా ఫీలై ఎంజాయ్ చేయగల్గుతాం.
***
(ps : నిన్న ‘ఎంసీఏ’ చూసిం దగ్గర్నుంచీ ఒకటి
వేధిస్తోంది. విలన్ తో వదినకి సమస్య వుంటే వుంది, దాన్నే ఎందుకు ప్రధాన వయొలెంట్
యాక్షన్ కథగా చెయ్యాలి. వదినకి హీరోకీ మధ్య వున్న సమస్యని వ్యక్తిగతంగానే తీరుస్తూ, ప్రేక్షకులకి ఫ్యామిలీ సినిమా చూడగల్గే స్పేస్
నిస్తూ, ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే
విలన్ ని యాక్టివేట్ చేసి ఎందుకు ముగించకూడదని. ఇలా చేయవచ్చని ఇప్పుడు ‘హలో’ లో తేట తెల్లమైంది. ఇందులో విలన్ వున్నాడు
కానీ ప్రేమ కథతో సంబంధం లేదు, సెల్ ఫోన్ తోనే సంబంధం. దీంతో మొత్తం మూడు నాల్గు
సీన్లకి మించి లేవు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర అతణ్ణి ఓడించి వెళ్ళిపోయాక, అక్కడే
అతడి ట్రాకు ముగుస్తుంది. అక్కడ్నించీ ఎండ్ విభాగం తో మళ్ళీ మొదలయ్యే ప్రధాన కథలోకి
అతను రాడు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాన కథలో హీరోయిన్ వుంటుంది. ఇప్పుడు హీరోయిన్ని
యేసుకు పోదామని విలన్ వచ్చాడా? రాలేదు (
టాలీవుడ్ లోనైతే ఇందుకు తయారు). యాక్షన్ కథ యాక్షన్ కథే. ప్రేమకథతో సంబంధం లేదు.
కానీ ప్రధాన కథగా వున్న ఈ పొట్టి యాక్షన్ కథే, చివరికి సబ్ ప్లాట్ గా ముగుస్తుంది. అవును, ప్రేమ కథకి ముందే ముగిసిపోతే విలన్తో ఇది సబ్ ప్లాటే.
అంటే సబ్ ప్లాట్ గా మార్చి విలన్ కథ ముగించారు. ‘మరోచరిత్ర’ లో మనం వూహించే స్టోరీ
క్లైమాక్స్ కాస్తా రివర్స్ లో ప్లాట్ క్లయిమాక్స్
తో ముగిసినట్టు.
‘హలో’
లో ఈ విలన్ ముగింపు కూడా ఫన్నీగా వుంటుంది. అతణ్ణి చంపాల్సినంత సీను లేదు, ఈ ప్రేమ
కథలో చావులుండ కూడదు. ‘ఎంసీఏ’ వయొలెంట్ యాక్షన్లో చంపేంత సీనున్నా చావడు. ఒకటి నిజం,
ప్రేక్షకులకి ఏది ప్రధానమో తెలియకపోతే ఏదీ నిలబడదు)
―సికిందర్