రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 21, 2017

570 : రివ్యూ!



రచన - ర్శత్వం: శ్రీరామ్ వేణు
తారాగణం: నాని, సాయిపల్లవి, భూమిక, నరేష్ విజయ్, సీనియర్ రేష్, ఆమని దితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రణం: మీర్రెడ్డి
నిర్మాతలు: దిల్రాజు, శిరీష్, క్ష్మణ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
విడుదల : డిసెంబర్ 21, 2017

***
        తెలుగు ప్రేక్షకులు చూసిందే చూడరా...అని  అవే రొటీన్ సినిమాలకి బానిస
లైపోయారా కొకైన్ కొట్టినట్టు? సినిమాలు
ఇలా వుంటేనే  తప్ప ఇంకోలా వుంటే కొకైన్ కిక్కు వుండదనుకుంటున్నారా? ఇతరులకి వేర్వేరు రూట్లు వుంటే,  మా రొటీన్ రూటే సపరేట్ అనుకుంటున్నారా? ఇలా మా తెలుగు వాడు అఖిల భారత స్థాయిలో  చాలా భిన్నమైనోడు – చాలా బాగా తేడా గలోడు సుమా - అని చాటాలనుకుంటున్నారా? లేక సినిమాలు స్టార్ గ్లామర్ వల్ల అవే ఆడేస్తాయనీ, వెరైటీ అంటూ పెద్దగా పనులు పెట్టుకోవద్దనీ మేకర్లు రాజ్యాంగం రాసుకున్నారా? ఆడేదే బొటాబొటీ రెండు వారాలు, ఆ బొటాబొటీ వారాల్లోనే రిటర్న్స్ చూసుకోవాలి తప్ప, రీరన్స్ కి కాలమే కాని  ఈ రోజుల్లో బొటాబొటీ సరుకు ఏదైతేనేం అనుకుంటున్నారా? తెలుగు సినిమాల షెల్ఫ్ లైఫ్ ఇక రెండు వారాలేనా? అయితే ఇలా తీయడమే కరెక్టు. ప్రేక్షకులు ఇలా చూడడమే కరెక్టు. అనవసరంగా మేకింగ్ లో వున్నప్పుడు అంచనాలు, ఎక్స్ పెక్టేషన్స్, స్టామినా అంటూ ఏవేవో గొప్ప రొటీన్ మాటలు వల్లెవేసుకుని చూడబోయే అదే రొటీన్ కోసం బాకాలూదుకోవడం వృధా. రాం గోపాల్ వర్మ అన్నట్టు,  రేపటి సినిమా థియేటర్ లో వుండదు, నెట్ ఫ్లిక్స్ లో నెట్ లో వుంటుంది. అప్పుడే అవి ఈ రోటీన్ ని బ్రేక్ చేస్తాయి. అంతవరకూ థియాట్రికల్  రిలీజులే వుండబోని ఈ అంత్యకాలంలో సినిమా లిలాగే నామమాత్రంగా వస్తూంటాయి.

నేచురల్ స్టార్ నాని ప్రేమకథల తర్వాత ఒక ఫ్యామిలీ కథకి, అందులోనూ  వదిన సెంటిమెంటుకి ఆకర్షితుడయ్యాడు. హిందీలో అలనాటి జె. ఓంప్రకాష్ ని గుర్తుకు తెస్తున్న కుటుంబ సినిమాల అగ్ర నిర్మాత దిల్ రాజు నేచురల్ స్టార్ నానితో నేచురల్ గానే కుటుంబ సినిమా తీస్తున్నామనుకున్నారు. తను మొన్ననే ‘జవాన్’ తో కూడా ఇలాగే అనుకున్నారు. ‘జవాన్’ ఫ్యామిలీ ఎలావుందో అలాగే ఇప్పుడు ‘ఎంసిఏ’ అనే ఫ్యామిలీ కూడా తీశారు. ఇదీ రొటీన్ కి రొటీన్ అంటే! రొటీన్ కే రొటీన్ ని నేర్పగల  దిల్ రాజుగారు ‘ఫిదా’ పల్లవిని కూడా రిపీట్ చేశారు. 2011 లో ‘ఓ మై ఫ్రెండ్’ తో తనే పరిచయం చేసిన దర్శకుడు వేణూ శ్రీరాం కి ఇప్పుడు రెండో అవకాశం తనే ఇచ్చారు. ఇన్ని చేశాక ఇందులో విషయమెలా వుంది?


కథ 
       నాని (నాని) ని అన్న రాజీవ్ (రాజీవ్ కనకాల) పెంచి పెద్ద చేస్తాడు. ఇద్దరి బ్రోమాన్స్ విడదీయలేని బంధం లాగా వుంటుంది. అన్నకి పెళ్ళయి వదిన జ్యోతి (భూమిక) రావడంతో నానికి అన్న దృష్టిలో ప్రాధాన్యం తగ్గిపోతుంది. దీంతో వెళ్లి బాబాయ్ (నరేష్) దగ్గరుంటాడు. ఆర్టీవో గా పనిచేసే వదినకి వరంగల్ బదిలీ అవడంతో అన్న పిల్చి వరంగల్లో వదినకి తోడుండ మంటాడు. తను ఢిల్లీకి  ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు. వదినతో వరంగల్ లో మకాం పెట్టిన నానిని ఆమె పనివాడిలా చూస్తుంది. ఇంటి పనులన్నీ చేస్తూంటాడు.అదే సమయంలో బీటెక్ చదివే పల్లవి (సాయిపల్లవి) ఇతణ్ణి  చూసి లైనేస్తుంది. ఈమె వదిన చెల్లెలని ముందు తెలీక ప్రేమలో పడతాడు నాని. ఆ తర్వాత ఇద్దరూ వదిన కళ్ళల్లో పడతారు. 

          ఇంతలో వదిన కి శివ (నరేష్
విజయ్) అనే ఒక ప్రైవేట్ బస్సుల ఓనర్ తో సమస్య వస్తుంది. చట్ట విరుద్ధంగా తిరుగుతున్న అతడి బస్సుల్ని సీజ్ చేసిన ఆమెని చంపే ప్రయత్నం చేస్తాడు. నాని అడ్డుకుంటాడు. ఇక పది  రోజుల్లో నీ వదినని చంపేస్తా కాచుకో – అంటాడు శివ. ఇప్పుడు నాని వదినని  కాపాడుకోగలిగాడా? అందుకేం చేశాడు? ... అన్నది మిగతా కథ.  

ఎలా వుంది కథ 
       పైనే చెప్పుకున్నాం. ‘జవాన్’ కూడా చూశామని చెప్పుకున్నాం. నీ కుటుంబాన్ని కాపాడుకో -  అనే విలన్ తో హోరాహోరీ. దీన్ని కుటుంబ కథ అనడానికి లేదు. ఇదో రొటీన్ యాక్షన్ కథ. పదేపదే చెప్పుకున్నట్టు, టీవీ సీరియళ్ళకి వెళ్ళిపోయిన కుటుంబ కథల్ని,  ఇక పెద్ద తెరకి తీయలేమని, ఫ్యాక్షన్ కుటుంబాల యాక్షన్ గా ఫ్యామిలీ సినిమాలు తీసే మార్గం కనిపెట్టారు. ఫ్యాక్షన్ పాత బడ్డాక  కుటుంబ కథల్ని మాఫియాలకి అప్పజెప్పారు. హింస లేకుండా కుటుంబ సినిమాలు తీయలేని నిస్సహాయత. ప్రస్తుతం కూడా ఇదే. వదినకి మాఫియాతో ప్రమాదం రావడం, హీరో ఆమెని కాపాడుకోవడం. ఈ రెండిటి మధ్య హింస. టీవీ సీరియళ్ళని తలదన్నే ఒక అచ్చమైన కుటుంబ సినిమాని కుటుంబ సినిమాల దిల్ రాజే తీయలేక వాటిని దిగజారిస్తే ఇంకెవరు బాగా తీస్తారు? ఒక అగ్ర నిర్మాతగా అగ్రతారలతో తనెలా తీస్తూంటే ఆ బాటలో ఇతరులూ అలాగే  తీస్తారు. తను ఎటువైపు  దారి తీయిస్తున్నారో దిల్ రాజు గారే ప్రశ్నించుకోవాలి. 

ఎవరెలా చేశారు 
      నేచురల్ స్టార్ నాని గురించి ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకోవా
ల్సిందేమీ లేదు. చెప్పాల్సింది  కాస్త ఆలోచించి సినిమాల్ని ఎంచుకో
మనే. ఒక ఫస్టాఫ్ ఫ్యామిలీ కథ సెకండాఫ్ హింసతో యాక్షన్ కథలా మారిపోవడం ఎలా నేచురల్ అవుతుంది. నేచురల్ అవకపోతే తనెలా నేచురల్ అవుతాడు. చూసే ప్రేక్షకుల నేచరే ఇంతనుకుంటే చెప్పేదేమీ లేదు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఫస్టాఫ్ లోనే తను నేచురల్. వదినతో, హీరోయిన్ తో సీన్లు లాగించడం వరకూ ఓకే. కానీ వదినతో వున్న ఉద్రిక్తత భావోద్వేగాల పరంగానే,  కుటుంబ డ్రామాతోనే చల్లబడాల్నింది పోయి, ఎవరో విలన్ వచ్చి అలజడి సృష్టిస్తే – ఈ అవకాశంతో పరిష్కరించుకోవడమనే పాసివ్ పాత్రోచిత కృత్రిమ కథాకథనాలే అతకలేదు. విలన్ వచ్చి వుండకపోతే నాని పాత్ర ఏం చేసి వుండేది? ఇదీ వేసుకోవాల్సిన అసలు ప్రశ్న, చేయాల్సిన  అసలు చిత్రణ. 

          ‘ఫిదా’తో తెలిసిన హీరోయినే కావడంతో ఆమెతో నాని ఫన్నీ సీన్లకి మంచి రెస్పాన్సే  వచ్చింది ప్రేక్షకుల్లోంచి. పాటలతోనూ హుషారిక్కించగల్గాడు తను. సెకండాఫ్ లోనే  విలన్తో కథగా మారడంతో సీరియస్ యాక్షన్లోకి వెళ్ళిపోయాడు తను. ఆ పరంగా ఫైట్లు వచ్చినప్పుడే ప్రేక్షకుల్లో స్పందన. విలన్ మరీ టీనేజర్ లా వుండడంతో అతడితో తన సీన్లకి ఏ మాత్రం మజా లేదు ప్రేక్షకులకి. ఫ్యామిలీ వైపు ప్రత్యర్ధి వదిన అంత  వెయిట్ కూడా లేదు విలన్ కి.  నానికిది ఓ అంతంత మాత్రపు పాత్రే తప్ప ఎంతో వూహించుకున్నంత  మాత్రంది కాదు. పైగా మిడిల్ క్లాస్ అబ్బాయి అనడమేగానీ, ఆ మనస్తత్వం ఏమిటో చూపించే సీన్లు లేవు. ఎప్పుడో విలన్తో మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా వుంటాం, అలా వుంటామని చెప్తే సరిపోదు- అది విజువల్  గా సీన్లు వేసి బిహేవియర్ ద్వారా చూపించాలి. 

          ‘ఫిదా’ పల్లవి ఎంట్రీ సీన్లో ఎందుకని క్లోజప్స్  లేవో తర్వాత అర్ధమవుతుంది మనకి.  క్లోజప్స్ లో ఆమె ‘ఫిదా’లో వున్నంత అందంగా లేదెందుకనో. అందం సంగతలా వుంచితే నటనకి పెట్టింది పేరు. కానీ నటించడానికి పాత్రే సరిగా లేదు. సెకండాఫ్ లో పూరీ జగన్నాథ్ టెంప్లెట్ లో లాగా పాటలకే పరిమిత మయింది. అయితే స్లిమ్ బాడీ తో పాటల్లో ఆమె ఇచ్చిన  ఝట్కాలు,  కాటికి కాళ్ళు జాపుకున్నోణ్ణి కూడా లేపి కూర్చోబెడతాయి. ఝట్కా రాణి తో  జట్కా ఎక్కినంత కిక్కు- బసంతి తో వీరూకి లాగా. 

          చాలా కాలం తర్వాత సీనియర్ పాత్రలో భూమిక చక్కగా వుంది. పాత్రకి తగ్గ ఈమె సున్నితత్వాన్ని సరిగ్గా మల్చుకోలేకపోయాడు దర్శకుడు. యాక్షన్ హింసతో కలిపేసి ఏదోగా మార్చేశాడు. ఇతర పాత్రల్లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడిగా  ప్రియదర్శి పరిమితంగా కన్పించి, పరిమిత కామెడీ చేస్తాడు. మార్కెట్ సీన్లో వెన్నెల కిషోర్ మంచి కామెడీ చేస్తాడు. బాబాయ్ పాత్రలో పోసాని తన రొటీన్ ట్రేడ్ మార్కు నటనని పక్కన బెట్టి బుద్ధిగా కన్పిస్తాడు. నరేష్ ఓ మాదిరి. రాజీవ్ కనకాల ఇంకో  మాదిరి. ఇంకేదో  మాదిరిగా కన్పించే వాడే టీనేజర్ లా  వుండే విలన్ నరేష్ విజయ్. సెకండాఫే బలహీనమనుకుంటే ఈ టీనేజర్ విలన్తో ఇంకా బలహీనం. సో చైల్డిష్. 

          దేవీశ్రీ ప్రసాద్ మొత్తం మీద క్యాచీ ట్యూన్లతో అలరించగల్గాడు. రెండు వారాలే జీవిత కాలం వుంటున్న సినిమాలకి ఇంకంటే సంగీతం అక్కర్లేదు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణంలో వరంగల్ దృశ్యాలు పెద్దగా హైలైట్ కావు. వరంగల్ జీవితాన్ని గానీ, ప్రత్యేకతని గానీ పట్టుకోలేదు. ఆ తీసిన గుర్తింపు లేని లొకేషన్స్ వరంగల్ లో తీయకపోయినా తేడా రాదు. 

చివరికేమిటి 
       టెంప్లెట్ సినిమా కేరాఫ్ పూరీ జగన్నాథ్. శ్రీను వైట్ల దెబ్బతిని వదిలేసిన సింగిల్ విండో స్కీముని తెలీక  ఇంకా కొందరు తెచ్చుకుని వాడుతున్నట్టు, పూరీజగన్నాథ్ వదిలేయడానికి ప్రయత్నిస్తున్న టెంప్లెట్ ని మరికొందరు ఇలా వాడేస్తున్నారు. గత సంవత్సరం నుంచీ పెద్ద హీరోలతో సైతం తీస్తున్న టెంప్లెట్ సినిమాలన్నీ ఫ్లాపవుతున్నా,  మళ్ళీ దీన్నీ  తీశారంటే ఆ ప్లాప్స్ కి కారణం తెలీకే తీశారనుకోవాలి. హిట్స్ కి ఫ్లాప్స్ కి కారణాలు తెలుసుకునేంత తీరుబడి ఎవరికుంటుంది. ఒకవేళ తెలుసుకున్నా మౌలిక కారణాలు తెలీకుండానే వుండిపోతారు. ఆ మౌలిక కారణాలే తాము తీసే వాటిలో కూడా చేరిపోతాయి. ఇందుకే మౌలిక కారణాలు తెలుసుకోలేక పోయిన ఇన్ని టెంప్లెట్ సినిమాలు వరసబెట్టి ఫ్లాపవడం. 

          ఫస్టాఫ్ లో ఖాళీగా తిరిగే హీరో, వదినతో వరంగల్లో మకాం, హీరోయిన్తో ప్రేమ, ఇవన్నీ బాగానే వుంటాయి. ఒక సాధారణ మధ్యతరగతి జీవితంలోకి కల్లోలం (ప్లాట్ పాయింట్ వన్) ఎలా వస్తుందా ఆని గట్టి ప్రశ్న  తగుల్తూంటుంది  మనకి. అస్సలు వూహించలేకుండా వుంటాం. ఏర్పాటు చేసిన ఈ బిగినింగ్ విభాగంలోని సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనలో  వదిన – హీరో ఈ ఇద్దరే ప్రత్యర్ధులుగా కన్పిస్తారు. అందుకని, వదిన హీరోని ఎలా ఇరకాటంలో పెట్టి, లేదా హీరోవల్ల ఏ పొరపాటు జరిగి కల్లోలం పుడుతుందా అని ఎదురు చూస్తూంటాం. పాయింటు ఏదో బలంగానే వుంటుందనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫాలోయింగ్ వున్న నాని హీరో. కుటుంబ సమస్య తుఫాను రేపేలా వుండాలి. కానీ రెండో పాట అయ్యేసరికి ఉస్సూరంటుంది ప్రాణం. విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఇది టెంప్లెట్ అని అర్ధమైపోయి పాత క్లాసు పాఠాలే దిల్ రాజు గారు మనకి చెప్పబోతున్నారని తెలిసిపోతుంది. 

          వదినా మరుదుల మధ్య టెన్షన్ ని డెవలప్ చేస్తూంటే బయటినుంచి ఈ మాఫియా విలనెవడు పానకంలో పుడకలా? ఇక్కడ రసభంగమైంది. టెక్నికల్ గా  చెప్పాలంటే, సినిమాలకి పని చెయ్యని  స్టార్ట్ అండ్ స్టాప్ కథనం పాలబడింది. ఇక మొత్తం కథ ఇక్కడే అర్ధమైపోతుంది. ఈ మాఫియాతో వదినకి ముప్పు వస్తుందనీ, హీరో ఆ ముప్పు తొలగించి ఆమెకి దగ్గరవుతాడనీ. అనుకున్నట్టే ఇంటర్వెల్లో విలన్ వదినని చంపబోతే హీరో వచ్చేస్తాడు. ఫైట్ చేసి విలన్ ని అవతల పడేస్తాడు. అయినా ఈ ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. ఎందుకంటే ఇదిక మనం ఆశించిన వదిన - హీరోల మధ్య కథగా కాక, పరమ రొటీన్ టెంప్లెట్ లో హీరో - విలన్ ల మధ్య కథగా రంగు మార్చు కుంటున్నాక, ఈ ఇద్దరి మధ్య పాయింటేమిటో చెప్పకుండా విశ్రాంతికి  తెర దించారు. 

          సెకండాఫ్ మూడో సీను తర్వాత పాయింటు వస్తుంది. పది  రోజుల్లో వదినని లేపేస్తాను కాచుకో- అని విలన్ అనడంతో. ఇదీ ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఇంతాలస్యంగా ఇప్పుడు వచ్చింది. ఇక్కడా బిగినింగ్ ముగిసింది సెకండాఫ్ లో. దీన్ని స్క్రీన్ ప్లే అందామా?  ఇప్పుడు ఇక్కడ కథ ప్రారంభమయ్యింది మిడిల్ తో. ఇంతవరకూ చూపించిందంతా - దాదాపు గంటన్నర సేపు -కథేమిటో తెలీని ఉపోద్ఘాతమే. ఇప్పుడు మాత్రం  కథేమిటి? వదినని చంపడానికి విలన్ ప్రయత్నాలు, హీరో ఆపడాలు. చాలా విచిత్రమైన విషయమేమిటంటే,  ‘జవాన్’ లో నైనా, ఇప్పుడు ‘ఎం సి ఏ’ లోనైనా,  విలన్ తో గొడవలకి హీరోలు తమ కుటుంబాల్ని లాగి ఎందుకు వాళ్ళని రొష్టు పెడతారనేది. రేయ్, నా కుటుంబం ఎందుకురా, నా వదినెందుకురా, నాతో తేల్చుకో రారా - అనాల్సింది పోయి – వదినని ఇరవై రోజుల్లో చంపేస్తానని విలన్ గడువు పెడితే, కాదు పది రోజులు పెట్టుకుందామని హీరో సవాలు చేయడం, వదిన పందెం కోడి అయినట్టు. పోయేది తన ప్రాణాలు కాదుగా?

          ఇలా ఒక అర్ధంలేని పాత్రచిత్రణతో నడుస్తుంది సెకండాఫ్. ఆ వదినకి పాపం చివరికి చచ్చే దాకా వస్తుంది హీరో తెలివితక్కువ పందెం  వల్ల. ఇదీ కథ, అసలు కథ ఇదీ. వదిన పాత్రతో హీరో విలన్ల చెలగాటాలు. ఇది ఫ్యామిలీ కథ ఎలా అవుతుంది?  కనీసం విలన్ కుటుంబ సభ్యుడు కూడా కాదు. ఈ టెంప్లెట్ లో విలన్ వచ్చాక రొటీన్ గానే హీరోయిన్ మాయమై పోతుంది. ఇంతా చేసి చివరికి విలన్ చావనే చావడు! 

          అతకదు. ఫ్యామిలీతో – ఫ్యామిలీలో వుండాల్సిన కష్ట సుఖాలు, కోపతాపాలు, అప్యాయతానురాగాలు, అత్మీయతానుబంధాలు, వియోగ సంయోగాలు, ఆ పరమైన భావోద్వేగాలు – వీటిన్నిటినీ పూర్వ పక్షం చేసే హింసాత్మక మాఫియా విలనీ చొరబెట్టి,  ఫ్యామిలీ కథని అతికించలేరు. తేలేది వికృత రూపంలో రొటీన్ పాత మూస ఫార్ములా యాక్షన్ కథే!


సికిందర్