రచన –
దర్శకత్వం : అట్లీ
తారాగణం: విజయ్ ( త్రిపతరాభినయం) సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, వడివేలు, ఎస్జెసూర్య, సత్యరాజ్, వడివేలు తదితరులు
సంగీతం: ఏఆర్.రెహమాన్. ఛాయాగ్రహణం: జి.కె.విష్ణు
బ్యానర్స్ : తెన్నాండాళ్ స్టూడియోస్ లిమిటెడ్, నార్త్స్టార్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: ఎన్.రామస్వామి, హేమరుక్మిణి
విడుదల : నవంబర్ 9 2017
***
ఓ నెలరోజులుగా విడదల వాయిదాలు పడుతూ చివరికి విడుదలైన విజయ్ – అట్లీ ల కాంబినేషన్ లో ఈ తెలుగు డబ్బింగ్ రెండో ఎంట్రీ. గత సంవత్సరం ఇద్దరూ ‘పోలీస్’ అనే థ్రిల్లర్ తో వచ్చారు. ఈ సారి సామాజిక సమస్య తీసుకుని వస్తూ, వివాదం కూడా రేపారు. దీంతో తెలుగు డబ్బింగ్ లో వివాద కారణమైన జీఎస్టీ మీద విసుర్లు సెన్సారై పోయాయి. అయితే ఆ విసుర్లేమిటో మనకి తెలిసిందే గనుక, మిగతా విషయం ఎలావుందో చూద్దాం...
తారాగణం: విజయ్ ( త్రిపతరాభినయం) సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, వడివేలు, ఎస్జెసూర్య, సత్యరాజ్, వడివేలు తదితరులు
సంగీతం: ఏఆర్.రెహమాన్. ఛాయాగ్రహణం: జి.కె.విష్ణు
బ్యానర్స్ : తెన్నాండాళ్ స్టూడియోస్ లిమిటెడ్, నార్త్స్టార్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: ఎన్.రామస్వామి, హేమరుక్మిణి
విడుదల : నవంబర్ 9 2017
***
ఓ నెలరోజులుగా విడదల వాయిదాలు పడుతూ చివరికి విడుదలైన విజయ్ – అట్లీ ల కాంబినేషన్ లో ఈ తెలుగు డబ్బింగ్ రెండో ఎంట్రీ. గత సంవత్సరం ఇద్దరూ ‘పోలీస్’ అనే థ్రిల్లర్ తో వచ్చారు. ఈ సారి సామాజిక సమస్య తీసుకుని వస్తూ, వివాదం కూడా రేపారు. దీంతో తెలుగు డబ్బింగ్ లో వివాద కారణమైన జీఎస్టీ మీద విసుర్లు సెన్సారై పోయాయి. అయితే ఆ విసుర్లేమిటో మనకి తెలిసిందే గనుక, మిగతా విషయం ఎలావుందో చూద్దాం...
కథ
డాక్టర్
భార్గవ్ (విజయ్) ఓ అయిదు రూపాయల డాక్టర్. వైద్యం చవకగా అందించాలన్న తన తండ్రి
ఆశయాన్నిఆచరిస్తూ, వైద్యుల అవినీతి మీద పోరాటం చేస్తూంటాడు. విజయ్ (విజయ్ -2) ఒక
మెజీషియన్. ఇతను కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూంటాడు.
భార్గవ్ తారా (సమంత) అనే యాంకర్ ని ప్రేమిస్తూంటే, విజయ్ పల్లవి (కాజల్) అనే డాక్టర్
ని ప్రేమిస్తూంటాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు. డానీ (ఎస్ జే
సూర్య), అర్జున్ (హరీష్ పరాడే) అనే ఇద్దర్లు చెడ్డ
డాక్టర్లు వుంటారు. వీళ్ళ మీద పగదీర్చుకోవడానికి అన్నదమ్ములిద్దరూ స్థానాలు మార్చుకుంటూ పోలీస్ అధికారి (సత్య రాజ్) ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. అసలు గతంలో ఏం జరిగింది, అందులో
చెడ్డ డాక్టర్ల పాత్రేమిటి, వీళ్ళ మీద అన్నదమ్ములు పగ ఎలా తీర్చుకోగలిగారు...అన్నది
మిగతా కథ.
ఎలావుంది కథ
పూర్తిగా
మాస్. సామాజిక సమస్యలతో శంకర్ తీసే సినిమాల తీరు తెన్నులకి ఇంకాస్తా దట్టించిన మసాలా.
కాకపోతే వైద్య రంగంలో అవినీతి మీద పోరాటం. దీన్ని కథానాయకుల కుటుంబానికి జరిగిన అన్యాయం
నేపధ్యంగా చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల మీద గతంలో సినిమా లొచ్చాయి. కొత్తగా మళ్ళీ
చెప్పడానికి సింగపూర్ ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్యం డిమాండ్ ని ముందుకు
తెచ్చారు. సింగపూర్ లో ఏడు శాతం జీఎస్టీకి ఉచిత వైద్యమే గానీ, ఉచిత విద్య, ఉచిత గృహాలు,
ఉచిత విద్యుత్, ఫించన్లు, రుణమాఫీలు, సబ్సిడీలు, రేషన్లు, ఆడపిల్లకి నిలువు
బంగారాలు, పెళ్లి పిల్లకి షాదీ ముబారక్ లు, సబ్ ప్లాన్లు, కలర్ టీవీలు, లాప్ టాప్
లు వంటి సవాలక్ష తాయిలాలతో ఓటు బ్యాంకులు తెరవడం
లేదు. ప్రభుత్వం కూడా జీఎస్టీ మీద తగిన సమాచారంతో తమిళ వెర్షన్ రేపిన వివాదాన్ని
ఎదుర్కోక సినిమా గొంతు నొక్కాలని చూసింది. నొక్కితే సినిమా చెప్పిందే నిజమనుకుంటారు
ప్రజలు. తమిళ డైలాగుల్లో జీఎస్టీని అలాగే వుంచి, తెలుగులో తీసేస్తే, దేశవ్యాప్తంగా
ఒకే జీఎస్టీని అమలు చేస్తున్నామని కూడా ఎలా చెప్పుకుంటారో తెలీదు. తెలుగులో
జీఎస్టీ డైలాగులు మ్యూట్ చేసినా, మఫ్టీలో వున్న ‘గోరఖ్ పూర్’ పరోక్ష ప్రస్తావన జోలికి
పోలేదు. అంబులెన్స్ ఇవ్వక పేదలు మైళ్ళకి
మైళ్ళు ఆస్పత్రుల నుంచి శవాల్ని మోసుకు
వెళ్తున్నఉదంతాల ప్రస్తావనకీ తెలుగులో కూడా కత్తెర పడలేదు. అలాగే మందిరం కాదు, మందిరం
కట్టే స్థలంలో ఆస్పత్రి కట్టాలని ఆస్పత్రిని కట్టి చూపించే దృశ్యాల పట్ల కూడా
ఎవరికీ అభ్యంతరం లేదు. ఉచిత వైద్యం గురించి ఈ కథ ఇచ్చే సందేశం ఆలోచనాత్మకమే గానీ
ఆచరణాత్మకం కాదు. ఐతే ఈ కాన్సెప్ట్ నంతా గజిబిజిగానో, నామమాత్రంగానో సినిమాకి వాడేసుకుని
వదిలిపారెయ్యడంగా గాక, ఆద్యంతం సీరియస్ గానే పట్టించుకోవడం కమర్షియల్ కథకి సంతోషం కల్గించే విషయం.
ఎవరెలా చేశారు
మూడు
పాత్రల్లో విజయ్ చేయాల్సిన మాస్ కమర్షియల్ హంగామా అంతా చేశాడు. డాక్టర్ గా,
మెజీషియన్ గా, ఫ్లాష్ బ్యాక్ లో మల్లయుద్ధ వీరుడిగా ప్రేక్షకులకి ఏమేం కావాలో
అవన్నీ అందించే
శాడు. గ్రామీణ వాతావరణంలో ఫ్లాష్ బ్యాక్ గ్రూప్ సాంగ్ లో విన్యాసాల్ని తారాస్థాయికి తీసికెళ్ళాడు. ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ అంతంతమాత్రమే. కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మూడో హీరోయిన్ నిత్యా మీనన్ తో రోమాన్స్ భిన్నం. దాని నిడివి కూడా ఎక్కువ. అయితే అన్నదమ్ముల పాత్రల్లో అన్నెవరో తమ్ముడెవరో గుర్తించడానికి పెద్ద తేడా చూపలేదు. ఇద్దరూ చేసే ఫైట్స్ థ్రిల్లింగ్ గానే వున్నాయి.
శాడు. గ్రామీణ వాతావరణంలో ఫ్లాష్ బ్యాక్ గ్రూప్ సాంగ్ లో విన్యాసాల్ని తారాస్థాయికి తీసికెళ్ళాడు. ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ అంతంతమాత్రమే. కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మూడో హీరోయిన్ నిత్యా మీనన్ తో రోమాన్స్ భిన్నం. దాని నిడివి కూడా ఎక్కువ. అయితే అన్నదమ్ముల పాత్రల్లో అన్నెవరో తమ్ముడెవరో గుర్తించడానికి పెద్ద తేడా చూపలేదు. ఇద్దరూ చేసే ఫైట్స్ థ్రిల్లింగ్ గానే వున్నాయి.
హీరోయిన్లు కాజల్, సమంతా లకి పెద్దగా పాత్రల్లేవు. డాక్టర్ గా కాజల్ వైద్యమే చేయదు. యాంకర్ గా సమంత హీరోతో ఒక ఇంటర్వ్యూ చేసి చేతులు దులుపుకుంటుంది. నిత్యా మీనన్ ది మాత్రం వూళ్ళో భర్త (విజయ్ – 3) తో కలిసి పోరాటం చేసి, మరణించే హోమ్లీగా వుండే బరువైన పాత్ర. కమెడియన్ వడివేలు విజయ్ -1 తో వుండి, సీక్రెట్ ఆపరేషన్స్ లో సహకరిస్తూంటాడు. పోలీస్ అధికారిగా సత్య రాజ్ ది వేళాకోళం పాత్ర. ఇక విలన్ గా ఎస్ జే దూర్య మరోసారి ఖతర్నాక్ గా వుంటాడు. చివర్లో హీరోల చేతుల్లో తన్నులు తిన్నాక, అతను కనబర్చే పరిస్థితి, చూసే చూపులు అతడికే చెల్లు.
మరోసారి అట్లీ తనబ్రాండ్ వెలుగు నీడల ఛాయాగ్రహణంతో రిచ్ మూడ్ తో చిత్రీకరణ చేశాడు ఈ కథని. కెమెరా మాన్ విష్ణు తీసిన కొన్ని షాట్స్ అనితరసాధ్యమైనవి. వూళ్ళో అగ్నిప్రమాద దృశ్యాల చిత్రణకి డౌన్ ప్లే చేసిన కలర్స్ తో క్లాసిక్ లుక్ తీసుకొచ్చాడు.
ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం చాలా హోరుగా వుంది. ఒక థీమ్ లేదు. పాటలు కూడా ఒక్క ముక్క అర్ధం కావు. ఒక్క ముక్క అర్ధం గాక పోయినా ఫ్లాష్ బ్యాక్ గ్రామీణ గ్రూప్ సాంగొక్కటే చెప్పుదగ్గ ట్యూనుతో వుంది.
చివరికేమిటి
చెప్పుకోదగ్గది ఫ్లాస్ బ్యాక్ క్రియేషన్. సెకండాఫ్ లో
సుదీర్ఘంగా సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడంలో ఒక సృజనాత్మక ప్రయోగం. స్పష్టమైన బిగినింగ్,
మిడిల్, ఎండ్ లతో, సీన్లకి స్మూత్ ట్రాన్సిషన్స్ తో, ఫ్యామిలీ – పొలిటికల్ డ్రామాల
కలబోతతో, నీటుగా కన్పించే ఒక ఆల్బం లాంటిదనొచ్చు.
ప్రారంభంలో ఒక సంబరాల పాటలోనే చాలా కథ చెప్పేస్తారు, కోరియోగ్రఫీ- మాంటేజెస్ ల
జుగల్ బందీతో. మిగతా కథంతా ఒకెత్తు, ఈ ప్లాష్ బ్యాక్ అంతా ఇంకో అద్భుత లోకంలోకి
తీసుకెళ్లడం ఒకెత్తు. ట్రాజడీతో ముగిసే ఈ ఫ్లాష్ బ్యాక్ కి మాస్టర్ స్ట్రోక్ లా,
చీకట్లో చెత్త కుప్పలో పారేసిన పసికందు ఆకాశంలోకి
లేపే చెయ్యి వొక హెచ్చరిక.
సుదీర్ఘమైన ఈ ఫ్లాష్ బ్యాక్ వల్లే సినిమా నిడివి పెరిగింది. అయినా ఈ ఫ్లాష్ బ్యాక్ బోరు కొట్టదు. దీని తర్వాత క్లయిమాక్స్ పన్నెండు నిమిషాల్లోనే పవర్ఫుల్ గా ముగిసిపోతుంది.
చెప్పొచ్చేదేమంటే, పచ్చి కమర్షియల్ మాస్ అయినా మీనింగ్ ఫుల్ గా తీయాలని. స్టార్ లకి ఇంకా మాసులు తీయడానికి కథల్లేవు. అవే మాసులు చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. జరుగుతున్న ఉదంతాలని మాస్ కి కలిపి కొత్త వాసనలు చూపించడానికి మనస్కరిస్తే, ఈ ‘మెర్సల్’ లా మెరవొచ్చు .
`