దర్శకత్వం
: రాజేష్ ఎం. సెల్వ
తారాగణం : కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్
కుమార్, కిషోర్, మధుశాలిని, అమన్ అబ్దుల్లా, ఆశా శరత్, సంతాన
భారతి తదితరులు
కథ : ఫ్రెడరిక్ జార్డిన్, నికోలస్ సాదా, స్క్రీన్ ప్లే : కమల్ హాసన్, మాటలు : అబ్బూరి రవి
సంగీతం ; జిబ్రాన్, ఛాయాగ్రహణం : సానూ జాన్ వర్గీస్
బ్యానర్ : రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్ నేషనల్
నిర్మాతలు : కమల్ హాసన్, ఎస్. చంద్రహాసన్, గోకులం గోపాలన్, విసి ప్రవీణ్, బిజు గోపాలన్

విడుదల : 20
నవంబర్ 2015
***
కమల్ హాసన్ నటించాలంటే ఏ భేషజాలూ వుండవు. సాధారణ
క్రైం థ్రిల్లర్స్ కూడా అవి ఇంటరెస్టింగ్ గా వుంటే నటించేస్తారు. 2011 లో
విడుదలైన ఫ్రెంచి థ్రిల్లర్ ‘స్లీప్ లెస్ నైట్’ ని రీమేక్
చేస్తూ తను నటించిన ‘చీకటి రాజ్యం’ ఈ
కోవలోనిదే. తెలుగు తమిళ ద్విభాషా చిత్రం గా నిర్మించిన దీన్ని తమిళంలో ‘తూంగవనం’ గా మొన్న దీపావళికి విడుదల చేశారు.
తెలుగులో ఈ వారం విడుదల చేశారు. ఇదొక సాధారణ థ్రిల్లరే అయినా పకడ్బందీగా
ఉండడానికి తారాగణ బలం కూడా సమకూర్చుకున్నారు. త్రిష, మధుశాలిని,
ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ల వంటి పాపులర్
నటీనటుల్ని తీసుకుని, కొత్త దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ
దర్శకత్వంలో విజయవంతంగా నిర్మించిన ఈ సినిమాలో అసలేముందో చూద్దాం..
ఒక రాత్రి - ఓ సంఘర్షణ
దివాకర్ ( కమల్ హాసన్ ) నార్కోటిక్ (మాదక ద్రవ్యాల) కంట్రోల్ బ్యూరో అధికారి. ఓ తెల్లారి పొద్దున్నే తన అసిస్టెంట్ మణి (యుగి సేతు) తో కలిసి నగరంలో జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ని విచ్చిన్నం చేస్తాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో గాయపడతాడు. విఠల్ రావ్ ( ప్రకాష్ రాజ్ ) అనే నైట్ క్లబ్ బాస్ డ్రగ్స్ రాకెట్ నడుపుతూంటాడు. దివాకర్ పట్టుకున్న పది కోట్ల విలువ జేసే డ్రగ్స్ విఠల్ రావ్ కి చెందినవే. దీంతో అతను కొడుకు వాసూ ( అమన్ అబ్దుల్లా) ని కిడ్నాప్ చేసి ఆ డ్రగ్స్ తెచ్చివ్వ మని బెదిరిస్తాడు. దివాకర్ కి డాక్టర్ అయిన భార్య ( ఆశా శరత్) తో విడాకులై వుంటాయి. కానీ అనునిత్యం ఆమె దివాకర్ దగ్గర వుండి చదువుకుంటున్న కొడుకు యోగ క్షేమాల గురించే దివాకర్ కి ఫోన్లు ప్రాణం తీస్తూంటుంది. కొడుకు కిడ్నాప్ అయ్యేసరికి భార్యతో ఇరకాటంలో పడ్డ దివాకర్ విధిలేక ఆ డ్రగ్స్ ని విఠల్ రావ్ కి అందించడానికి బయల్దేరతాడు. ఆ నైట్ క్లబ్ లోనే వుంటుంది మల్లికా ( త్రిష) అనే ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగి. ఈమె దివాకర్ అక్కడికి బ్యాగుతో రావడాన్ని చూసి, విఠల్ రావ్ తో ఇతను కుమ్మక్కయ్యాడనుకుని ఆ బ్యాగు కొట్టేసి తన అధికారి ( కిషోర్) ని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి దివాకర్ చర్యల మీద కన్నేస్తారు. కొడుకుని విడిపించుకోవడానికి వచ్చిన దివాకర్ తన బ్యాగు పోయినట్టు గుర్తించి ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం పెదబాబు ( సంపత్ రాజ్) అనే ఇంకో స్మగ్లర్ వచ్చి విఠల్ రావ్ దగ్గర కూర్చుంటాడు. దివాకర్ తెలివిగా ఆలోచించి మైదా పిండిని తీసికెళ్ళి డ్రగ్స్ గా వాళ్లకి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- దివాకర్ ని పట్టుకోవడానికి గ్యాన్స్ వెంట పడతారు. కొడుకుని కాపాడు కోవడానికి నైట్ క్లబ్ లోనే దివాకర్ దాగుడు మూతలాడతాడు. ఇక నైట్ క్లబ్ లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని దివాకర్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టే ఉంది. ఒరిజినల్ ఫ్రెంచి సినిమాకి పూర్తి అనుసరణ కాకపోయినా కమల్ హసన్ తన స్క్రీన్ ప్లే నేర్పుతో నేటివిటీ ని దృష్టిలో పెట్టుకుని పకడ్బందే కథనం చేశారు. కేవలం ఒక రాత్రి నైట్ క్లబ్ లో జరిగే యాక్షన్ కథ ఇది. చప్పున ముగిసిపోయే రెండుగంటల పది నిమిషాల నిడివితో, అక్కడక్కడా ఫన్నీ డైలాగులతో టైం పాస్ గ్యారంటీ థ్రిల్లర్ ఇది. ఎలాటి పాటలూ, ప్రత్యేకంగా కామెడీ ట్రాకులూ వంటి పక్క చూపులు చూడకుండా ఏక సూత్ర కార్యక్రమం అన్నట్టు ఈ థ్రిల్లర్ని రక్తి కట్టించారు.

ఎవరెలా చేశారు
కమల్ హాసన్ చాలా రియలిస్టిక్ గా వున్న ఫైటింగ్ సీన్లలో ఈ వయసులోనూ చాలా సాహసించి నటించారు. కొడుకు కోసం ఫిజుకల్ యాక్షన్, భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా నటించడమెలాగో ఆయనకి వేరే నేర్పక్కర్లేదు. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర భార్య తోనో, ప్రియురాలితోనో ఒక సమస్య వుండడమనే హాలీవుడ్ సినిమాల్లో కన్పించే ఫార్ములా ని ఇక్కడా వర్కౌట్ చేశారు. త్రిష తో కమల్ చేసిన ఫైట్ ఇంకో ఎత్తు. ఈ రియలిస్టిక్ ఫైట్ లో త్రిష కొత్త కోణాన్ని ప్రదర్శిస్తుంది. కమల్ ని అపార్ధం జేసుకున్న పాత్రగా త్రిష ని నెగెటివ్ షేడ్స లో బాగా చూపించారు. ఆమె కెరీర్ లో ఇదొక విభిన్న పాత్ర. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ల విలనీ సున్నిత హాస్యంతో ఎంటర్ టైన్ చేస్తుంది. మొత్తం నైట్ క్లబ్ లో డ్రగ్స్ కోసం జరుగుతున్న ముసుగులో గుద్దులాట స్టాఫ్ కి అర్ధం గాక- ‘మైదా పిండి కోసం కొట్టేసుకుంటున్నారు’ - అనుకోవడం పెద్ద కామెడీ. ఇలాటి ఫన్నీ డైలాగ్స్ చాలా వున్నాయి ఎంటర్ టైన్ మెంట్ పార్టు మిస్సవ్వకుండా.

జిబ్రాన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సౌండ్
ఎఫెక్ట్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో వున్నాయి. ఇక సానూ జాన్ వర్గీస్
కెమెరా పనితనం క్లాస్ గా వుంది. ఎంత సేపూ నైట్ క్లబ్ లోనే జరిగే కథ బోరు
కొట్టకుండా, ఎప్పటికప్పుడు బ్లాకులు మార్చేస్తూ కొత్త ఫీల్ కలిగేట్టు చిత్రీకరణని ప్లాన్ చేయడం గొప్ప విషయం. అబ్బూరి
రవి మాటలు తమిళ డైలాగులకి అనుసరణే అయినా వాటిని కూర్చడంలో మంచి ఈజ్
చూపించారు.
చివరికేమిటి
మంచు విష్ణు నటించిన తమిళ రీమేక్ ‘డైన మైట్’ అనే థ్రిల్లర్ కంటే చాలా బెటరే ‘చీకటి రాజ్యం’. నసపెట్ట కుండా థ్రిల్లర్ ని కూడా సరదాగా తీసే విధానం తో ఇది సక్సెస్ అయింది. లాజికల్ గా, ఎమోషనల్ గా పకడ్బందీగా వున్న దీన్ని ఓసారి చూసేసి ఎంజాయ్ చేయవచ్చు.

-సికిందర్