ఈ జులై 29 నే నసీరుద్దీన్ షా నటించిన ‘ఏ హోలీ కాన్ స్పిరెసీ’ విడుదలైంది. ఇందులో హేతువాదియైన క్రైస్తవ టీచర్ మతంతో సంఘర్షిస్తాడు. స్కూల్లో బైబిల్ ప్రకారం సృష్టి గురించి చెప్పకుండా, డార్విన్ సిద్ధాంతం భోదించి చర్చి ఆగ్రహానికి గురవుతాడు. ఆ కోర్టు కేసులో రాజకీయ శక్తులు జొరబడి ఎలా ఆడుకున్నాయో నిర్భయంగా, బలంగా చూపిస్తారు. మరి ఆర్టికల్ 19 తో దర్శకురాలు ఇంధూ వీఎస్ ఇంతే బలంగా, ధైర్యంగా చూపించిందా? ఇందులో ప్రాథమిక హక్కుల సమస్యా చిత్రణ ద్విగుణీకృత మవడానికి పేరున్న స్టార్స్ అయిన నిత్యామీనన్, విజయ్ సేతుపతిలు ఏ మేరకు తోడ్పడ్డారు?
Monday, August 1, 2022
1187 : మలయాళం రివ్యూ!
ఈ జులై 29 నే నసీరుద్దీన్ షా నటించిన ‘ఏ హోలీ కాన్ స్పిరెసీ’ విడుదలైంది. ఇందులో హేతువాదియైన క్రైస్తవ టీచర్ మతంతో సంఘర్షిస్తాడు. స్కూల్లో బైబిల్ ప్రకారం సృష్టి గురించి చెప్పకుండా, డార్విన్ సిద్ధాంతం భోదించి చర్చి ఆగ్రహానికి గురవుతాడు. ఆ కోర్టు కేసులో రాజకీయ శక్తులు జొరబడి ఎలా ఆడుకున్నాయో నిర్భయంగా, బలంగా చూపిస్తారు. మరి ఆర్టికల్ 19 తో దర్శకురాలు ఇంధూ వీఎస్ ఇంతే బలంగా, ధైర్యంగా చూపించిందా? ఇందులో ప్రాథమిక హక్కుల సమస్యా చిత్రణ ద్విగుణీకృత మవడానికి పేరున్న స్టార్స్ అయిన నిత్యామీనన్, విజయ్ సేతుపతిలు ఏ మేరకు తోడ్పడ్డారు?
Sunday, July 31, 2022
1186 : స్క్రీన్ ప్లే సంగతులు!
నాగ చైతన్య ‘థాంక్యూ’ లో ‘కథ’ కాక, కమర్షియల్ సినిమాని ఫ్లాప్ చేసే ‘గాథ’ దాగి వుందన్న విషయం తెలుసుకుని ముందుకు సాగుదాం. గాథల గాయాలతో విరాటపర్వం సహా రాధేశ్యామ్, బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, డియర్ కామ్రేడ్, జార్జిరెడ్డి, అంతరిక్షం, పైసా, మొగుడు, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్నతోబాటు, ఇంకెన్నో ఫ్లాపుల పక్కన ‘థాంక్యూ’ కూడా చేరిందిప్పుడు. దీన్నిబట్టి ఇంకా కథంటే ఏమిటో తెలియకుండా సినిమాలు తీస్తున్నారనుకోవచ్చు. లేదా ఒకరు మనకి చెప్పేదేంటిలే అనుకుని గాథలు తీస్తూండొచ్చు. కథంటే ఏమిటో తెలియకపోతే గాథంటే ఏమిటో కూడా తెలియదు. తీస్తున్నది కథ అనుకుంటూ తీస్తే అది సినిమాకి పనికి రాని గాథలా తేలిందన్న సంగతి, అందుకే ఫ్లాపయిందన్న సంగతీ గ్రహింపుకు రాదు. ఫ్లాప్ కి ఇంకేవో కారణాలు చెప్పుకుంటారు. చెప్పుకుని మళ్ళీ గాథే తీసుకుని ఫ్లాప్ చేసుకుంటారు. బివిఎస్ రవి ‘థాంక్యూ’ గాథని కథ అనుకుని రాసిస్తే, విక్రమ్ కుమార్ అది కథే అనుకుని తెరకెక్కించడం, దిల్ రాజు కూడా అది కథే అనుకుని నిర్మించడం విధివశాత్తూ జరిగి పోయిందేమో. ఇలా ఇంకా ఎవరెవరి దగ్గర కథ లనుకుంటూ ఇంకెన్ని గాథలున్నాయో, ఎన్ని శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయో తలుచుకుంటే టీ తాగలేం.
‘థాంక్యూ’ గాథ బిగినింగ్ విభాగంలో విషయమిలా వుంది : న్యూయార్క్ లో వుంటున్న ప్రియా (రాశీ ఖన్నా) తాను గర్భవతని తెలుసుకుని, బాయ్ ఫ్రెండ్ అభిరామ్ (నాగచైతన్య) తో సమస్య గురించి ఆంటీ శైలజ (ఈశ్వరీ రావ్) కి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది.ఫ్లాష్ బ్యాక్ లో -2011లో న్యూయార్క్ లో రావుగారు (ప్రకాష్ రాజ్) నిర్వహించే కన్సల్టెన్సీ ద్వారా అభి, ఒక హెల్త్ యాప్ డెవలప్ చేసే కలతో వూర్నుంచి వచ్చి ఉద్యోగంలో చేరతాడు. అయితే రావుగారు ఈ యాప్ పక్కన బెట్టి ముందు ఉద్యోగం చేసుకోమంటాడు. ఇక్కడే ప్రియ పరిచయమవుతుంది. అభి పట్టుదలగా కొంతమంది పెట్టుబడిదారులని ఒప్పిస్తాడు. రావుగారు మాత్రం నిధులు ఇవ్వడు. ఆ డబ్బు ప్రియయే సర్దుతుంది. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ- ప్రేమాయణం- సహజీవనం సాగుతాయి. ఓ పదేళ్ళలో యాప్ తో అభి ప్రారంభించిన కంపెనీ, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారడంతో బిలియనీర్ అవతార మెత్తుతాడు.
పోతుంది. ఇంతలో గర్భవతవుతుంది. దీంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.
ఇప్పుడు ప్రస్తుతానికొస్తే, పిల్లలు పుడితే అభి మారతాడని డాక్టర్ ఆంటీ కౌన్సెలింగ్ చేయడంతో, అభికి ఇంకో అవకాశం ఇచ్చి చూద్దామని కంపెనీ కొస్తుంది ప్రియ. ఎలాగైనా పాత అభిరామ్ ని తీసుకు రావాలనుకుంటుంది. అటు రావుగారికి తన కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన 60 మందికి ఉద్యోగాలు ఇప్పించాల్సిన వొత్తిడి వుంటుంది. ఈ 60 మంది గొడవపెట్టుకుని వార్నింగ్ ఇస్తారు. దీంతో ఈ అరవై మందిని అభి కంపెనీలో చేర్చుకోమని అడిగితే తిరస్కరిస్తాడు అభి. దీంతో ఇతను ఇక మారడని ప్రియ గుడ్ బై చెప్పేస్తుంది. రావుగారు గుండెపోటుతో చనిపోతాడు.
అసలు రావుగారు ఆమోదిస్తేనే అభి యాప్ ని ప్రారంభించ గలిగాడని ఒక పెట్టుబడిదారు చెప్పడంతో, అభిలో సంఘర్షణ మొదలవుతుంది. అపరాధ భావంతో కుంగిపోతాడు. అప్పుడు అతడి మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. నీ అహంకారమే నీకు శత్రువని చెప్తుంది. ఇక నీ విజయనికి కారకులైన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆదేశిస్తుంది. దీంతో అభికి నారాయణపురంలో వున్న పార్వతి గుర్తొస్తుంది...దీంతో ఈ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.
శ్రద్ధ పెట్టని కథనం
సీను దేని గురించైతే వుందో దాని గురించే ఆ సీనైతే తప్పులో కాలేసినట్టే - అంటాడు రాబర్ట్ మెక్ కీ. పై 30 నిమిషాల బిగినింగ్ లో సీన్లు హడావిడి హడావిడిగా, ఏదీ సరీగ్గా ఎస్టాబ్లిష్ అవకుండా; పాత్రల్ని, విషయాల్నీ మనం ఫీలై ఫాలో అవడానికి ఆస్కారం లేకుండా, నిస్సారంగా వెళ్ళిపోతాయి. 30 కోట్ల రిచ్ సినిమాని ఇంత పూర్ గా తీయడమా అన్పిస్తాయి. ఈ స్క్రీన్ ప్లేలో ఒక్కో పేజీ విలువ ఎన్ని లక్షలుండొచ్చు? ఉజ్జాయింపుగా రెండున్నర లక్షలను కోవచ్చా? రెండున్నర లక్షల క్వాలిటీ ఏముంది ఒక్కో పేజీలో అన్పించక మానదు.
ప్రియా విఫల ప్రేమ చుట్టూ సాగే ఈ సీన్లలో పాత్రల మాటల్లో ఉపవచనం (సబ్ టెక్స్ట్- అంటే మాటల్లో అంతర్లీన భావం) అంటూ ఏమీ వుండదు. ‘బి’ గ్రేడ్ సినిమాల్లో లాగా డైరెక్టుగా మాట్లాడేసుకుంటారు. డైరెక్టుగా ఐలవ్యూ అనడానికీ, నీ షర్టు చాలా బావుందని అనడానికీ చాలా తేడా వుంది. ఐలవ్యూ అనడం ఏ ఫీలూ నివ్వని ఫ్లాట్ రైటింగ్. నీ షర్టు బావుందనడం అతడి షర్టు మీదికి దృష్టిని మళ్లించే, షర్టుని ప్రత్యేకాకర్షణ చేసే మనోహరమైన విజువల్ రైటింగ్. దృశ్య మాధ్యమమైన సినిమాకి కావాల్సింది మాటల్లో దృశ్యాన్నిపలికించే - మాటల్ని దృశ్యాత్మకం చేసే సచేతన విజువల్ రైటింగే. హీరోయిన్ ఫ్లాట్ గా ఐలవ్యూ అని చెప్పేసే సీన్లో హీరో లక్ష రూపాయల కాస్ట్యూమ్స్ వేసుకుని వుంటే సీనులో వుండే డ్రామాకేమీ ఉపయోగం లేదు. హీరోయిన్ నీ షర్టు చాలా బావుందనేసరికి, హీరో ఆటోమేటిగ్గా ఉబ్బితబ్బివడం, సీను చైతన్యం నింపుకుని రక్తి కట్టడమూ ప్రేక్షకుల్ని సంతోష పెడతాయి.
ఆమె షర్టు బావుందని అంటే ఆమె మాటల్లోని అంతర్లీన భావం (సబ్ టెక్స్ట్) అర్ధమైపోతుంది- ప్రేమని వ్యక్తం చేస్తోందని. అసలు నిజమైన ప్రేమకి మాటలెందు కుంటాయ్ - చేతలుంటాయి. మనుషులు మనసులో వున్నది ఒక పట్టాన ఉన్నదున్నట్టు పైకి చెప్పరు. ఇంకోటేదో అడ్డం పెట్టుకుని చెప్తారు.
అందుకే మనుషులే అయిన ఆర్టిస్టులు డైరెక్టు డైలాగులు నటించడానికి ఇబ్బంది పడతారు. ఇచ్చిన సీను ఉద్దేశ్యమేమిటో తెలీక, ఏ భావోద్వేగాలు పలికించాలో అర్ధం గాక. ఐ లవ్యూ అన్న డైలాగుకి భావోద్వేగం పలికించలేరు. నీ షర్టు చాలా బావుందంటే, దీనర్ధం ప్రేమని వెల్లడించడమని తెలుసుకుని ఆ ప్రేమోద్వేగాన్ని మొహం నిండా పలికించేసి సబ్ టెక్స్ట్ ని అందించేస్తారు.
ఈ సినిమాలోనే ఈ బిగినింగ్ విభాగం తర్వాత వచ్చే నారాయణపురం ఎపిసోడ్లో -‘నన్ను ప్రేమిస్తున్నావా?’ అంటాడు కిటికీ కావల వున్న అభిరామ్. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటుంది కిటికీ కీవల వున్న పార్వతి. ఇలా కాకుండా ‘కిటికీలోంచి వచ్చేస్తావా?’ అని అతనంటే, ‘నీతో ఎక్కడికైనా వచ్చేస్తా’ అని ఆమె అనడం ఎంత బావుంటుంది.
ఎందుకని? ఎందుకంటే ఏ సీను అయినా రెండే ఉద్దేశాలతో వుంటుంది : అయితే పాత్రల గురించి ఇంకేదో కొత్త విషయం వెల్లడించడానికి, లేదా కథని ముందుకు తీసికెళ్ళడానికి. పార్వతీ అభిరామ్ లు ఆల్రెడీ ప్రేమలో వున్నారని ప్రేక్షకులకి తెలుసు. ఇంకా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని నాగ చైతన్య లాంటి స్టార్ చేత చీప్ డైలాగు పలికించడం దేనికి?
ఈ సీను తర్వాత వాళ్ళిద్దరూ లేచిపో బోతున్నారు. అందుకని, ‘కిటికీలోంచి వచ్చేస్తావా?’ అని అతనంటే, ‘నీతో ఎక్కడికైనా వచ్చేస్తా’ అని ఆమె అనడం కథని ముందుకు తీసికెళ్ళే ఆపరేటింగ్ డైలాగులవుతాయి. దీంతో సస్పెన్సూ థ్రిల్లూ క్రియేటై సజీవ మవుతుంది సీను. ఆమె ‘నీతో ఎక్కడికైనా వచ్చేస్తా’ అనడం వాళ్ళ ప్రేమెంత బలమైనదో కూడా వ్యక్తమై రంజింపజేయడం అదనపు హంగు. ఈ సీన్లో సాహసం (అద్భుత రసం) తో కూడిన యూత్ అప్పీల్ లేకపోతే ఎలా? యూత్ అప్పీల్ కొద్దీ బాక్సాఫీసు అప్పీల్ కదా?
ఫ్లాష్ - బాకు?
సరే, విషయానికొద్దాం. విషయమేమిటంటే, ప్రియ తను గర్భవతని తెలుసుకుని ఆంటీకి చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ 15 నిమిషాలుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాకు నెలా ప్రారంభిస్తుంది ప్రియా? ‘ఇదంతా మొదలై చాలా ఏళ్ళయ్యింది’ అంటూ ప్రారంభిస్తుంది. దీంతో ఎత్తుగడే (ఫ్లాష్ బ్యాక్ కి లీడ్) చెడిపోయింది.
ఇదంతా మొదలై చాలా ఏళ్ళయ్యిందని, అభి తో మొదట్నుంచీ తన వ్యవహారం తెలిసిన ఆంటీకే ఎలా చెప్తుంది? అంటే ప్రేక్షకులకి తెలియాలని ఆంటీకి చెప్తున్నట్టు లేదూ అసహజంగా? ‘నీ ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు తెలుసమ్మా, నన్నడ్డం పెట్టుకుని ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేయకు. బోరు కొట్టించకుండా ఇప్పుడెందు కొచ్చావో అసలు విషయం చెప్పు’ అని ఆంటీ అనదా? ఆంటీకి చెప్తే గిప్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించే కొత్త విషయం చెప్పాలి కదా? దీనికామె సలహా తీసుకుని వెళ్ళి పోతూ, బాధాకర గతాన్ని నెమరేసుకుంటూ, ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాక్ వేసుకో వచ్చు కదా?
ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో 2011 లో హెల్త్ యాప్ డెవలప్ చేసే కలతో అభి న్యూయార్క్ వచ్చి, రావుగారి కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరడం, అక్కడే ప్రియ పరిచయమవడం, కాలక్రమంలో యాప్ కోసం అభి పెట్టుబడిదారులని ఒప్పించడం, రావుగారు పెట్టుబడి పెట్టడానికి తిరస్కరించడమూ జరిగి, సమస్యలో వున్న అభికి ఆ డబ్బు ప్రియా తనే సర్దుతాననే సీను వస్తుంది...
ఆ డబ్బు ఆమె సర్దగానే మొరటుగా మీద పడి (ఇప్పటికింకా గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు) గాఠ్ఠిగా కౌగిలించేసుకుంటాడు! ఆమె - పో ఛీ- అని దులిపేసుకోకుండా, వెంటనే లవ్, లవ్ సాంగ్, సహజీవనం కూడా. ఇలా వున్నాయి పాత్రలు! సినిమాని సినిమాలాగా చూపించాలి గానీ, సినిమా పేరుతో జూ చూపించకూడదు గా? చింపాంజీల్ని చూడాలనుకుంటే జూ కెళ్తారు ప్రేక్షకులు. ఎలా వుందంటే, డబ్బు సర్దితే అభి నా వల్లో పడ్డాడోచ్ అని ఎంజాయ్ చేస్తున్నట్టుంది ప్రియ!
ఇది పోయెటిక్ అలజడి
టైటిల్స్ అయ్యాక కొడుకుని స్కూలుకి, భర్త రిచర్డ్ గేర్ ని ఆఫీసుకీ పంపించేసి సరుకులు తెచ్చుకోవడానికి బయల్దేరుతుంది డయాన్. సరుకులు కొనుక్కున్నాక పెద్ద గాలి దుమారం రేగుతుంది. ఆ గాలి దుమారంలో కొట్టుకు పోయి ఇట్నుంచి తనూ - అట్నుంచి పుస్తకాల షాపు అతనూ (ఒలివియర్ మార్టినెజ్) డాష్ ఇచ్చుకుని పడిపోతారు. ఇక మొదలవుతుంది ఈ బై ఛాన్స్ ఎన్ కౌంటర్ తో, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం...
చైతూకే రాశీ అన్యాయం
అభి యాప్ ప్రారంభించిన పదేళ్ళలో బిలియనీర్ అవతార మెత్తుతాడు. ఎత్తగానే విజయ గర్వంతో స్వార్ధపరుడిగా మారతాడు. తన విజయానికి తానొక్కడే కారకుడనీ ఇగో పెంచుకుంటాడు. ఉద్యోగుల్నీ, ప్రియనీ ఈసడించుకుంటాడు. ఇలా ప్రియా ఫ్లాష్ బ్యాక్ లో అభిని ప్రొజెక్ట్ చేస్తుంది. పైపైన చెప్పడమే తప్ప అతనిలా మారడానికి మూల కారణం వుండదు.
కార్పొరేట్ల కన్ను, పోరాటం బయటే వుంటుంది తప్ప లోపల తమ ఉద్యోగుల్నీ, బంధువుల్నీ వేధిస్తూ కూర్చోరు. కోవర్ట్ లు, ఇన్ ఫార్మర్ లు పుడతారు. లోపల పీడించడంలో బిజీ అయిపోతే, బయటి కార్పొరేట్లు ఇదే అదును అనుకుని చావు దెబ్బ కొడతారు.
బిలియనీర్ కార్పొరేట్ అభి తన సక్సెస్ కి తనే కారణమని తన వాళ్ళ ముందు విర్రవీగడం ఇతర కార్పొరేట్లు చూస్తే నవ్వుకుంటారు. బయటి ప్రపంచంలో అభి ఏంటో చెప్పకుండా ఇన్ హౌస్ బ్యాడ్ చిత్రణలు చేసింది ప్రియా. ఆమె సరిగ్గా చిత్రిస్తే తన వాళ్ళతో అభి అలా ప్రవర్తించే అవకాశమే లేదు. అతనలా మారడానికి మూలకారణమేంటో కూడా చెప్పలేదు. ఇంకోటేమిటంటే, ప్రియాతో అభి ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. ఇతరుల మీద అతడి ప్రతాపం చూసి తన సోమ్మేదో పోతున్నట్టు కుమిలి పోతోంది సిల్లీగా. అతను పెళ్ళి కూడా చేసుకుంటానంటే, అతను రావుగారితో విశ్వాసంగా లేడని, ప్రెగ్నెంటై కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది! వాట్ నాన్సెన్స్.
ఇలా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఏర్పడ్డప్పుడు కథ పుట్టకుండా గాథ పుట్టింది. రావుగారు ఎప్పుడైతే చనిపోయాడో, అప్పుడే కథని కూడా చంపి, గాథని పుట్టించారు. అభికి రావుగారు ప్రత్యర్థిగా వుంటే సంఘర్షణ పుట్టి అది కథ. అభికి రావుగారు లేక మెసేజిలిచ్చే మనస్సాక్షి వుంటే సంఘర్షణ లేక ఒట్టి థాంక్యూ చెప్పుకుంటూ తిరిగే నేలబారు గాథ!
సినిమా పూర్తిగా చూడనవసంలేదు, ఈ అరగంట దగ్గరే ఫ్లాప్ అయింది. ఇక మిడిల్, ఎండ్ గాథ ఎలా సాగిందో మంగళవారం చూద్దాం. ఈలోగా సోమవారం మలయాళం ‘19 (1) (a )’ రివ్యూ చూద్దాం!
—సికిందర్
Wednesday, July 27, 2022
1185 : రైటర్స్ కార్నర్
మన
దర్శకులు, రచయితలు సినిమా కళ గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే, లేదా రాస్తే వర్ధమాన రచయితలు, దర్శకులు నేర్చుకునే అవకాశముంటుందిగా? ... ఇదీ ఇటీవల టాప్ దర్శకుడి దగ్గర పనిచేసే సీనియర్
రచయిత ఫోన్ సంభాషణలో వ్యక్తం చేసిన విచారం. దీనికి మన దగ్గర సమాధానమేముంటుంది? ఈ ప్రశ్న మనకి ఎప్పట్నుంచో వుంది. సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాల రైటింగ్, మేకింగ్ ల గురించి అడిగి తెలుసుకుని ఈ బ్లాగులో నలుగురికి అందుబాటులో వుంచుదామని
గతంలో ఓ ముగ్గురు దర్శకుల్ని ప్రయత్నిస్తే అవకాశమివ్వలేదు. విషయ పరిజ్ఞానం లేకనో మరెందుకనో తెలీదు.
మన దేశంలో కమర్షియల్ సరోగసీని నిషేధిస్తూ 2015 లో బిల్లు ఆమోదించారు. మేము సినిమాలో తప్పుగా ఏమీ చూపించలేదు. మా సినిమా కథా కాలం 2013. ఇది సరోగసీ బిల్లు ఆమోదించడానికి చాలా ముందు. ప్రారంభ సన్నివేశంలో సరోగసీ క్లినిక్‌ని చూపించాం. అక్కడ 10-15 మంది సరోగేట్‌లని ఒకే పైకప్పు క్రింద వుంచాం. కాబట్టి 2015 కి ముందు అక్షరాలా ‘సరోగసీ కర్మాగారాలు’ వుండేవన్నది స్పష్టం చేశాం. మీరు గూగుల్‌లో వెతికితే, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సామూహిక సరోగేట్ కేంద్రాలని చూపించే అనేక వీడియోలు మీకు కనిపిస్తాయి. విదేశీయులు ఈ సరోగసీ కర్మాగారాల్ని సందర్శించేవారు. అక్కడ తమ బిడ్డని కనడానికి తగిన యువతిని ఎంచుకునేవారు. ఈ యువతులు 9 నెలలు అక్కడే వుండి, బిడ్డని ప్రసవించి, 2 నెలలు విశ్రాంతి తీసుకుని, మళ్ళీ బిడ్డని కనేవారు. ఇలా వారి సంపాదన వుండేది. ‘మిమీ’ మొదటి సన్నివేశంలో మేము సరిగ్గా అదే చూపించాం.
—ఏజెన్సీస్
‘లుకా ఛుప్పీ’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి