రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

4, జనవరి 2020, శనివారం

905 : రివ్యూ



దర్శకత్వం : సచిన్ రవి
తారాగణం :
: క్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాత్స, అచ్యుత్ కుమార్, బాలాజీ నోహర్, ప్రమోద్ శెట్టి, రిషబ్ శెట్టి తదితరులు
‌: క్షిత్ శెట్టి, సంగీతం: అజనీష్ లోక్నాథ్, ణ్ రాజ్;  ఛాయాగ్రహణం : కర్మ చావ్లా, కూర్పు: క్షిత్ శెట్టి, చిన్ వి
బ్యాన
ర్‌: పుష్కర్ ఫిలింస్
నిర్మాతలు: హెచ్‌.కె.ప్రకాశ్, పుష్క ల్లిఖార్జునయ్య
విడుదల : జనవరి 1, 2020
      న్నడ నిర్మాతలు పానిండియా మార్కెట్ మీద దృష్టి పెట్టి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. 2018 లో ఇలా ఐదు భాషల్లో ‘కేజీఎఫ్’ తీసి భారీ విజయం సాధించాక, ఇప్పుడు ‘అవనే శ్రీమన్నారాయణ’ (అతడే శ్రీమన్నారాయణ) తో ఐదు భాషల బ్లాక్ బస్టర్ ని ఉద్దేశించారు. కొత్త దర్శకుడు సచిన్ రవి, హీరో రక్షిత్ శెట్టిలు ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ ని అఖిల భారత ప్రేక్షకులకి సగర్వంగా సమర్పించారు. పానిండియాలో నాల్గు భాషలు సౌతిండియావే వుంటున్నాయి. నార్త్ లో హిందీ ఒక్కటే. అయినా పానిండియా అంటున్నారు. సౌతిండియా నుంచి ఇలాటి పానిండియాలు ఇటీవల ‘సైరా’, ‘సాహో’ లు వచ్చాయి. వీటి ఫలితాలు చూడనే చూశాం. ఐతే 60 కోట్లతో తీసిన ‘కేజీఎఫ్’ పానిండియా - ఓవర్సీస్ బాక్సాఫీసు 250 కోట్లు దాటి అతిపెద్ద హిట్టయింది. కన్నడ నుంచే  వచ్చిన ఈ రెండో పానిండియా మాటేమిటి? ఇది చూద్దాం...

కథ
     1980 లలో అమరావతి అనే కల్పిత ప్రాంతం. అక్కడొక టూరింగ్ నాటకాలేసుకునే ట్రూప్ భారీగా దోపిడీలు చేసి సొత్తుని దాస్తూంటారు. ఈ ప్రాంతానికి దొరగా రామరామ అభీర (మధుసూదన రావు) వుంటాడు. ఓ రోజు అతను ఈ ముఠాని పట్టుకుని కొందర్ని చంపేస్తాడు. కానీ ఆ నిధి ఎక్కడ దాచారో రహస్యం తెలియదు. ఇంతలో తను కూడా చనిపోతాడు. అతడి ఇద్దరు కొడుకులు జయరాం, (బాలాజీ మనోహర్), తుకారాం (ప్రమోద్ శెట్టి) లు తండ్రి వారసత్వం కోసం పోటీ పడతారు. బలవంతుడైన జయరాం కోటలోంచి తుకారాం ని తరిమేస్తాడు. తుకారాం తర్వాతి కాలంలో అమరావతిలో రాజకీయ నాయకుడవుతాడు, జయరాం బందిపోటై నిధి వేటలో వుంటాడు. పదిహేనేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అమరావతికి కొత్త పోలీసు ఇన్స్ పెక్టర్ గా శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) వస్తాడు. అతడికి రిపోర్టర్ లక్ష్మి (శాన్వి) పరిచయమవుతుంది. శ్రీమన్నారాయణ కానిస్టేబుల్ అచ్యుత్ (అచ్యుత్ కుమార్) తో కలిసి నిధి రహస్యం కనుక్కునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో జయరాం, తుకారాంల నుంచి ఎలాటి ప్రతిఘటనలు ఎదురయ్యాయనేదే మిగతా కథ.  

ఎలావుంది కథ
      ట్రెజర్ హంట్ (నిధి వేట) జానర్ కథ. దీనికి ‘సదరన్ ఆడ్ ఫిక్షన్’ (southern odd fiction) అని పేరు పెట్టుకున్నారు ఈ మేకర్లు. ఆడ్ ఫిక్షన్ కాబట్టని కౌబాయ్, పౌరాణిక, గ్యాంగ్ స్టర్, బందిపోటు, ఫాంటసీ తదితర జానర్లన్నీ ఇష్టారాజ్యంగా కలిపేసి పాత్రల్నీ, కథనీ వండి వార్చేసి- ఏదీ ఫీల్ కాకుండా చేశారు. కళాత్మకం అనే పదానికి అర్ధం కూడా మార్చేశారు. కథాకథనాలు పక్కన బెట్టి, బ్రహ్మాండమైన మేకింగ్ తో ‘కళాత్మకం’ చేయబూనారు. కథాకథనాలతో బోలెడు కన్ఫ్యూజ్ చేశారు. రాయడానికీ తీయడానికీ మూడేళ్ళూ  శ్రమించామని చెప్పుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ చూస్తే ఐదు భాషల్లో పానిండియా మార్కెట్ కి సమకట్టారు. కానీ కన్నడ స్వాభిమానం ఎక్కువైపోయి కన్నడ నటీనటుల్నే మొత్తం తారాగణంగా పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కర్ణాటక దాటితే ప్రేక్షకులకి తెలియరు. పైపెచ్చు కన్నడ పైత్యాన్నేదృశ్య దృశ్యాలుగా పంచిపెట్టారు. ఈ పైత్యానికి రెండు గంటల సమయం చాల్లేదు. మూడు గంటలా ఆరు నిమిషాల సమయమంతా తీసుకుని వీరంగం వేశారు. పానిండియా థియేటర్లకి కరెంటు, ఏసీ ఛార్జీల అదనపు బిల్లులు వడ్డించి ఆనందించారు. పానిండియా ప్రయత్నం పెనం మీంచి పొయ్యిలో పడింది. ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ కన్నడిగలకే ఊడిగం చేసింది.


       ఇక కన్నడ సినిమాలు ‘అవనే శ్రీమన్నారాయణ’ కి ముందూ, తర్వాతా’ అంటూ చరిత్ర రాసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఒక ‘మెకన్నాస్ గోల్డ్’ లాగానో, ‘నేషనల్ ట్రెజర్’ లాగానో ఔట్ డోర్ అడ్వెంచర్ కి పూనుకోకుండా, డైలాగులే ఎక్కువ - యాక్షన్ తక్కువగా డ్రామెడీగా మార్చేశారు. నిధి వేట సినిమాలంటే పిల్లా పెద్దా అందరికీ అద్భుత రసంతో వినోదాల విందుగా, పసందుగా వుండే ఆచారాన్ని విడనాడి పెడదారి పట్టిపోయారు. ప్రేక్షక వర్గాల్ని బొటాబోటీ పిడికెడు మాత్రంగా తగ్గించుకుని ఉస్సూరన్పించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించేలా, రిపీట్ ఆడియెన్స్ కి నోచుకునేలా నిర్మించక పోతే,  రిటర్న్ ఎలా వస్తాయి? ‘సైరా’ తో ఈ పాఠం నేర్చుకునే వుండాలి. 


ఎవరెలా చేశారు
       రక్షిత్ శెట్టి కన్నడలో నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి హీరోతో బాటు రచయిత కూడా. పాత్ర ప్రకారం కామిక్ - ఫన్నీ నటన ఓకే. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కొన్ని యాక్షన్ సీన్లూ ఓకే. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ ఫైట్ సీను. అయితే ఇది నామ్ కే వాస్తే కౌబాయ్ క్యారక్టర్. ఆ క్యారక్టర్ లుక్కే వుండదు. ఎంట్రీ సీనుతో ఇచ్చిన బిల్డప్ తర్వాత క్యారక్టర్ తో వుండదు. పని తక్కువ, వాగుడు ఎక్కువ క్యారెక్టర్. ఈ అతి చలాకీతనం క్యారక్టర్ వల్ల కథ వున్న చోటే వుండి పోతుంది. మాటకారి తనం, రకరకాల ట్రిక్స్ ప్రయోగించడం ఇదే క్యారక్టరైజేషన్. ఈ ఇన్స్ పెక్టర్ నారాయణ ఎన్నో మంత్రాలు వేస్తాడు. ఏదీ పేలదు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అవ్వదు. ‘భక్త ప్రహ్లాద’ సినిమా ప్రదర్శనలో ఎంట్రీ ఇస్తాడు. హిరణ్య కశిపుడు స్తంభాన్ని బద్దలు కొడితే రావాల్సిన నరసింహుడి బదులు రక్షిత్ శెట్టి వచ్చేస్తాడు. బాగానే వుంది. కానీ పోనుపోను పాత్రా నటనా మొనాటనీ బారినపడి ఫస్టాఫ్ కే తేలిపోయింది. 36 నెలలూ 3 గంటల 6 నిముషాలూ తీస్తూపోతే డైనమిక్స్ కాపాడ్డం కష్టమే. 18 నెలలు అతిగా రాసి, 18 నెలలు అతిగా తీసినప్పుడు ఇలాగే అవుతుందని అనుకోవాలేమో. 


        హీరోయిన్ హీరోయిన్ లా లేదు. ఆమె కంటికే అనడం లేదు. సహాయ నటిలా వుంది. ఇక ఇద్దరు విలన్ల పాత్రల్లో కన్నడ నటులు వాళ్ళ ప్రతిభ చాటుకున్నారు. సంగీతం మైనస్సే గానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం ఈ మిక్స్డ్ జానర్ కి ఒకే లుక్ తో వున్నాయి - చారిత్రకం అన్నట్టు. ఈ తరహా సెట్టింగులు చారిత్రక సినిమాల్లోనే వుంటాయి. బార్ సెట్ మాత్రం డిజైనర్ కౌబాయ్ లుక్ తో చేశారు. యాక్షన్ సీన్స్ కౌబాయ్ తో సంబంధం లేదు. ఇక దర్శకుడే ఎడిటర్ అయినందు వల్ల 3 గంటల 6 నిమిషాలు తృప్తిగా నిడివి పెట్టుకున్నాడు. 
3 గంటల 6 నిమిషాల సినిమాకి 4 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్ కూడా కట్ చేసి ఔరా అన్పించుకున్నాడు అఖిల భారతీయంగా. 

చివరికేమిటి
        ఈ సినిమా చూస్తూంటే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకురాక మానదు. 2012 లో విడుదలైన పవన్  కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రివ్యూలో కొంత భాగాన్ని ఒకసారి చూద్దాం...

        స్టార్ సినిమాలంటే అవే ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలనే నమ్మి ఏ వైవిధ్యం లేకుండా వాటినే ఉత్పత్తి చేస్తూ, ముందుకు పోలేని ఒక ప్రతిష్టంభన నెదుర్కొంటున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ -  హరీష్ శంకర్ ల ‘గబ్బర్ సింగ్’ ఆగమనం ఓ ఆశా రేఖ. మనం గతంలో చాలా వెస్టర్న్ కౌబాయ్ సినిమాలు చూసే వుంటాం. అవి మన ఫ్యాక్షన్, మాఫియా సినిమాల్లాగా డార్క్ మూడ్ ని క్రియేట్ చేసేవి కావు. కౌబాయ్ పాత్రలు మన జానపద పాత్రల్లాంటివే. వినోదాన్ని అందించడానికే అవి పుట్టాయి. పైగా కౌబాయ్ పాత్రలు అమెరికన్లకి మిథికల్ (పౌరాణిక) పాత్రల్లాంటివి. అవి వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. రానురాను వీటికి కాలం చెల్లిపోవడంతో, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి మానవాతీత శక్తుల మిథికల్ పాత్రల్ని ప్రవేశపెట్టి అలరించ సాగారు. అయినా కౌబాయ్ చచ్చి పోలేదు. ముఖ్యంగా  భారతీయ ప్రేక్షకుల స్మృతి పథంలో నిలిచే వున్నాడు. మరీ తెలుగు ప్రేక్షకులనైతే ‘మోసగాళ్ళకు మోసగాడు’ నుంచీ ‘టక్కరి దొంగ’ వరకూ అడపా దడపా పలకరించి పోతూనే వున్నాడు. అయితే ఓ మారు వేషంలో రావడం మాత్రం ఇదే ప్రథమం. అసలు మొత్తం భారతీయ వెస్టర్న్ సినిమాల మీద రాజేంద్ర ప్రసాద్ తో తీసిన పేరడీ ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఓ హాస్య ప్రహసనం వుండగా, ఒక పోలీసు వేషంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ గా కౌబాయ్ రావడం పైన చెప్పుకున్న ప్రతిష్టంభనని బద్దలు చేసే ఒక అపూర్వ క్రియేటివిటీయే అయింది.


        హిందీ ‘దబంగ్’ లో సల్మాన్ ఖాన్ ది సాదా పోలీసు పాత్ర. అతడి వ్యవహార సరళి ప్రేక్షకులకి అలవాటయిన అతడి తీరులోనే వుంటుంది. దీని రీమేకైన ‘గబ్బర్ సింగ్’ లో పాత్ర భారీ రూపాంతరం చెందింది. ఒక ఏరియాని ఇష్టారాజ్యంగా ఏలుకునే వెస్టర్న్ సినిమాల్లోని కౌబాయ్ క్యారక్టర్ లా అతను ప్రవర్తిస్తాడు. ఇష్టం వచ్చినట్టు తుపాకులు పేలుస్తాడు. సిబ్బందిని గ్యాంగ్ లా వెంటేసుకు తిరుగుతాడు. వాళ్ళతో ‘గబ్బర్ సింగ్’ డైలాగులు కొడతాడు. ఫన్నీ డైలాగులతో ప్రత్యర్ధి ముఠాతో ఆడుకుంటాడు. వెస్టర్న్ సినిమాలని తలపించే ప్రదేశాల్లో గుర్రమెక్కి, బైకెక్కి, జీపెక్కి సంచరిస్తాడు. అలాంటి వొక ఎడారి మైదానంలో పోలీస్ స్టేషన్ కూడా వుంటుంది. దాని బోర్డుని గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మార్చేస్తాడు. కౌబాయ్ లా ఈ తన అడ్డా తనిష్టం. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడెక్కడ కూర్చుంటాడో తెలీదు. ఏ భంగిమలో కూర్చుంటాడో తెలీదు. తన వెంట వుండే సాంబా అనే ‘షోలే’ క్యారక్టర్ తో తను పలికే ఆణిముత్యాలని నోట్ చేసుకొమ్మని ఆర్డరేస్తూ, గిరీశంలా లిటరరీ టచ్ కూడా ఇస్తాడు. ‘దబంగ్’ మహారాష్ట్ర లోని రియల్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంటే, ‘గబ్బర్ సింగ్’ కోసం గ్రామం సహా, అన్ని లొకేషన్సూ సెట్సే వేశారు. దీంతో తెలుగు నేటివిటీకి భిన్నంగా ఒక డిజైనర్ లుక్ తో మోడరన్ వెస్టర్న్ వాతావరణ నేపధ్యం సమకూరినట్టయింది...

         ఇదీ జానర్ ని పది జానర్లతో కలిపి కషాయంలా చేయకపోవడంతో వున్న ప్రయోజనం. కౌబాయీకరణలో ‘గబ్బర్ సింగ్’ ఏకసూత్రత హీరోని దృష్టినాకర్షించే ఫోకస్ తో ప్రస్ఫుటంగా నిలబెట్టింది. రక్షిత్ శెట్టి కౌబాయ్ తనం, నేపథ్యవాతావరణం ఈ జల్లెడ పట్టలేక కథనీ, పాత్రనీ కలగాపులగం చేశాయి వివిధ జానర్ల తాపడంతో.

        ఇలావుంటే కథకి స్ట్రక్చర్ అనేది లేదు. పైగా కథనుంచి వెళ్ళిపోయి విన్యాసాలు. గంటన్నర ఫస్టాఫ్ అంతా కథలోకే వెళ్ళదు. ఒక పేలవమైన డైలాగుతో ఇంటర్వెల్ కూడా బలైంది. సెకండాఫ్ మొదలెడితే ఇంకా అవే డైలాగ్ కామెడీలు, వున్న చోటే డ్రామాలు. నిధికోసం వేటలో వుండాల్సిన పాత్రలు రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడేసిన గొంగళిలా వుంటాయి. ఇక క్లయిమాక్స్ అత్యంత పేలవం. ట్రెజర్ హంట్ జానర్ కథ అడ్వెంచర్ ప్రధానంగా వుంటుందనేది ప్రాథమిక జ్ఞానం. ఇది కూడా లేకపోతే ఎలా?

        సూపర్ స్టార్స్ తో ‘మెకన్నాస్ గోల్డ్’ (1969) అనే బృహత్తర సినిమా సాంతం ఔట్ డోర్ కౌబాయ్ అడ్వెంచరే. ఇందులో నిధి వున్న పర్వతాల్లో భూకంపం వచ్చే దృశ్యాల్లో ముఠాలు ఇరుక్కునే క్లయిమాక్స్ సినిమాకే తలమానికం. ఈ దృశ్యాలతోనే ఈ సినిమా ప్రసిద్ధి. ‘అతడే శ్రీమన్నారాయణ’ దేనికి ప్రసిద్ధి? భారీ పెట్టుబడులతో ఇలాటి బిగ్ కాన్వాస్ సినిమాలు తీసేప్పుడు హాలీవుడ్ లో ఇలాటి సినిమాల గురించి వచ్చిన రైటింగ్, మేకింగ్ సంబంధ పుస్తకాలు, దర్శకుల ఇంటర్వ్యూలూ చదవాల్సిన అవసరముంది. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ ల మీద పుస్తకాలు అద్భుత ద్వారాలు తెరుస్తాయి. పానిండియా అనుకునే ముందు పఠనం లేకపోతే పతనం పొంచి వుంటుంది. 

        నికొలస్ కేజ్ నటించిన ‘నేషనల్ ట్రెజర్’ (2004) మోడరన్ అడ్వెంచర్ కి ప్రతీక. ఇందులో కథ ఓ పది నిమిషాలకే ప్రారంభమైపోతుంది. గోల్ వచ్చేసి 1776 నాటి ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండెపెండెన్స్’ కళాకృతుల్ని చేజిక్కించుకోవడం. చరిత్రకారుడి పాత్రలో హీరోగా నికోలస్ కేజ్ కి ప్రత్యర్ధులుగా కిరాయి ముఠాలు. కేజ్ కి ఒక నైతికపరమైన సందిగ్ధత కూడా వుంటుంది. అతను ముందు కెళ్తే ఎఫ్బీఐ అతణ్ణి ప్రజాశత్రువు నెంబర్ -1 గా ప్రకటించే ప్రమాదముంది. దీనికి ఆస్కార్ నామినేషన్ వరకే దక్కవచ్చు. కానీ ఔట్ డోర్ అడ్వెంచర్ గా దీని వినోదాత్మక విలువ తీసివేయలేనిది.

        ‘అతడే శ్రీమన్నారాయణ’ మేకింగ్ లోనే తప్ప రైటింగ్ లో సత్తా చాటుకోలేక పోయిన పాక్షిక ప్రయత్నం. ఐతే 23 కోట్లే బడ్జెట్ అంటున్నప్పుడు ఓపెనింగ్స్ తో బయటపడే అదృష్టముంది.

సికిందర్



6, అక్టోబర్ 2019, ఆదివారం

879 :


        వారం బాక్సాఫీసుకి ఇంకో స్టార్ మూవీ బలైంది. బాక్సాఫీసు లౌక్యం  లేక 'చాణక్య' బాక్సాఫీస్ రేసు మొదటి పావు గంకే ఓటమి గంట మోగించింది. కొన్ని సినిమాల జాతకం మొదటి పావు గంట సీన్లలోనే తెలిసిపోతుంది. అంటే స్క్రిప్టులో మొదటి పదిహేను పేజీల్లోనే దాని వెండితెర మర్యాద తెలిసి పోతుందన్నమాట. అలాటిది గంటో గంటన్నరో వింటున్నా కూడా గోపీచంద్ కి ఇంకేవో అద్భుతాలు కన్పించాయంటే అది యాక్షన్ సీన్లతో వలపు వల. హైటెక్ యాక్షన్ సీన్లు మెప్పిస్తే ఇంకే ‘విషయ’ మయినా ఓకే అన్పించడమే. కానీ ‘విషయం’ బాక్సాఫీసు ఫ్రెండ్లీగా, మార్కెట్ ఓరియెంటెడ్ గా లేక, కేవలం యాక్షన్ సీన్లే పెట్టుబడి అనుకుంటే, స్టార్ ఇమేజి పూర్ గా మారుతుంది, మార్కెటింగ్ రేటింగ్ పడిపోతుంది.

         
తెలుగు మార్కు కంటెంట్ ని నాలుగు భాషల్లో తీసి పాన్ ఇండియా మూవీ అనేకన్నా, పాన్ ఇండియా కంటెంట్ ని రెండు భాషల్లో తీసినప్పుడే తెలుగు మీసం తిప్పాలి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో యాక్షన్ సీన్లు తీసి ఇంటర్నేషనల్ రేంజి ఇచ్చామని చెప్పుకునే కన్నా, ఇండియన్ స్టంట్ మాస్టర్లతో ఆ ప్రయత్నం చేసి హాలీవుడ్ రేంజి ఇచ్చామని చెప్పుకోవాలి. బయటివాడే వచ్చి చేసిపోతే అది మన అంతర్జాతీయ స్థాయి ఎలా అవుతుంది.

          పాత రోజులెలా వుండేవో ఈ ఆదివారం సాయంత్రం హోరున దంచుతున్నవర్షానికి వెచ్చ వెచ్చగా తల్చుకుందాం...ఆయన హీరో కృష్ణ, ఇంకో ఆయన కవి / రచయిత ఆరుద్ర, మరింకో ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు కెఎస్ఆర్ దాస్. ఈ ముగ్గురూ కలిస్తే 1971 లో  పంచ రంగుల కౌబాయ్ ‘'మోసగాళ్ళకు మోసగాడు’ ట్రెండ్ సెట్టర్ అయింది - టెక్నికల్ గా, కంటెంట్ పరంగా. టెక్నికల్ గా కెమరామాన్ వీఎస్సార్ స్వామి లెజెండ్. ఆఫ్ కోర్స్, కంటెంట్ హాలీవుడ్ స్ఫూర్తే.  ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’, ‘మెకన్నాస్ గోల్డ్’ ల వంటి హాలీవుడ్స్ స్ఫూర్తేగానీ, ఒక్క కాపీ సీను లేదు. ఒక్క కాపీ యాక్షన్ సీను - షాటు లేవు. బయటి నటీనటులు లేరు, సాంకేతిక నిపుణులూ లేరు. అంతా తిప్పరా మీసం తెలుగుదనమంటూ అప్పుడే గ్లోబల్ మూవీ ఇచ్చేశారు కృష్ణ -  ఆరుద్ర - దాస్ త్రయం. ఇక తెలుగులో సూపర్ డూపర్ టాపర్ హిట్టయి, పాన్ ఇండియా కాదు- ఏకంగా ఇండియా దాటి 125 దేశాల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ మోత మోగించింది. ఎవ్వడూ ఇది మా నుంచి కాపీ అనలేదు. తెలుగు మీసానికి వందనం చేశారు. ఇప్పుడు తెలుగో కాదో అర్ధంగాని వేషం తప్ప మీసం లేదు.    

         
రాయడం మానేయడం కూడా రైటింగ్ ప్రణాళికలో భాగమవుతుందా? అంటే కొంత కాలం రాయడానికి ప్రయత్నించి, ఇక రాయలేమని అన్పిస్తే మానెయ్యాలని ముందే అనుకుని రాసే పనిలోకి దిగాలా? రాయడానికి ఆత్మ స్థైర్యం అత్యవసరం. ఇంకొకరిలా రాయాలని ప్రయత్నిస్తే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ‘ఇంకొకరిలా’ అనే ఆలోచన వుండకూడదు. అందుకని ‘రాయడం మానేయడం’ అనే క్లాజు ఈ సందర్భంలో రైటింగ్ ప్రణాళికలో వుండకూడదు. కాలం మారితే, మారిన  కాలానికి తగ్గట్టుగా రాయలేకపోతే అప్పుడు కొంత తగ్గ వచ్చు. ఈ క్లాజు మాత్రం రైటింగ్ ప్రణాళికలో పెట్టుకోవచ్చు. ఐతే ఈ క్లాజుని కూడా వర్కౌట్ చేస్తూండాలి. ఒకసారి రాయడం వచ్చేశాక, ఇక మనకి ఫర్వాలేదని అనుకోకుండా అప్డేట్ అవుతూంటేనే ఉనికిలో వుంటారు. అయినా ముఖం పాతబడి కొత్త ముఖాల్ని కోరుకునే తర్వాతి తరం ప్రేక్షకులతోనో / పాఠకులతోనో గ్యాప్ వస్తుంది. అయినా రాయడానికి మాధ్యమాలు విస్తరించాయి. విస్తరిస్తున్నకొద్దీ రాసే వాళ్ళ కొరత పెరుగుతోంది. కాబట్టి రాయడం నుంచి రిటైర్మెంటు లేదు. రైటర్ అన్నాక ఏ సమయంలోనూ బ్రేక్ వుండదు. విహార యాత్ర కెళ్ళినా రాసే ఆలోచనలే సుళ్ళు తిరుగుతూంటాయి.
సికిందర్

25, ఏప్రిల్ 2019, గురువారం

808 : ఫ్లాష్ బ్యాక్




ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
 యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘స్వామీరారా ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ్  కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు. 



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి. 

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ ఏం సుగంధాల్ని వెదజల్లుతుందని.  

-సికిందర్




3, అక్టోబర్ 2018, బుధవారం

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్


25, డిసెంబర్ 2017, సోమవారం

573 : రివ్యూ!





దర్శకత్వం: అలీ అబ్బాస్జాఫర్ 
తారాగణం
: సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్, అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగే, సజ్జాద్ డెల్ ప్ఫ్రూజ్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, కుముద్ మిశ్రా, అంగద్బేడి, నవాబ్ షా  తదితరులు
కథ: అలీ అబ్బాస్జాఫర్, నీలేశ్మిశ్రా, స్క్రీన్ ప్లే –మాటలు : అలీ అబ్బాస్ జాఫర్
సినిమాటోగ్రఫీ: మార్చిన్లస్కావీస్ , సంగీతం: విశాల్‌-శేఖర్, జులియస్పాకియమ్
బ్యానర్ : యశ్రాజ్ఫిల్మ్స్
విడుదల : 22 డిసెంబర్, 2017
***
2012 లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లతో ‘ఏక్ థా టైగర్’ (ఒక టైగర్ వుండేవాడు)
విడుదలైంది
. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు.  ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...

కథ 
ప్రేమలో పడి పెళ్ళిచేసుకుని, కొడుకుని కని,  ఆస్ట్రియా లోని ఆల్ప్స్ మంచుపర్వత శ్రేణుల్లో  అజ్ఞాతంగా జీవిస్తున్న మాజీ ఇండో- పాక్ ఏజంట్లు టైగర్ అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ (సల్మాన్),  జోయా (కత్రినా) ల కోసం ‘రా’ (రీసర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ - భారత గూఢచార సంస్థ) చీఫ్ షెనాయ్ (గిరీష్ కర్నాడ్) వెతుకుతూంటాడు. ఇరాక్ లోని టిక్రిట్  లో అబూ ఉస్మాన్ (సజ్జాద్ డెల్ ఫ్రూజ్) అనే అతను కరుడుగట్టిన  ఉగ్రవాద సంస్థ ఐఎస్సీ నాయకుడుగా ఎదిగాడు. అమెరికన్లు ఆగ్రహించి అతడి మీదా అతడి దళం మీదా వైమానిక దాడులు  జరిపితే, గాయపడి ఒక ఆస్పత్రి బస్సెక్కేశాడు. ఆ బస్సుల్లో నర్సులున్నారు. వాళ్ళని ఆస్పత్రికి తీసికెళ్ళి బందీలుగా పెట్టుకుని, సురక్షితంగా మకాం పెట్టాడు. అమెరికన్లు వెనుదీయక ఆస్పత్రి మీద దాడికీ  సిద్ధమయ్యారు. దీనికి వారంరోజులే  టైముంది. 

          దీంతో ఇండియాలో  ‘రా’ చీఫ్ షెనాయ్ అప్రమత్తమయ్యాడు. ఆ నర్సుల్లో పాతికమంది భారత నర్సులే గాక, పదిహేను మంది పాక్ నర్సులు కూడా వున్నారు. ఈ సమయంలో రాజకీయం కాక మానవత్వమే ముఖ్యమని – వాళ్ళందర్నీ ప్రాణాలతో కాపాడాలని సమాయత్తమయ్యాడు. కానీ శత్రు దుర్బేధ్యమైన టిక్రిట్ లో ప్రవేశించే సాహసం చేయగల మొనగాడెవడూ లేడు - ఒక్క టైగర్ తప్ప. ఆఘమేఘాల మీద ఆ టైగర్ని  వెతకడం ప్రారంభించాడు...ఈ నేపధ్యంలోనే   ఆల్ప్స్ లో పండంటి కాపురం చేసుకుంటున్నటైగర్ దొరుకుతాడు. నీ దుంపతెగ రారా అంటే,  కచ్చితంగా రానంటాడు. భార్య జోయా నచ్చజెప్పి పంపుతుంది.

          ‘రా’ చీఫ్ ఇచ్చే టీముని కాదని, ఒక  షార్ప్ షూటర్, ఒక టెక్కీ, ఒక బాంబ్ డిఫ్యూజర్ లతో తన సొంత టీముని ఏర్పాటు చేసుకుని బయల్దేరతాడు. ఇక టైగర్ టిక్రిట్ లోకి ఎలా ప్రవేశించాడు, అక్కడెదురైన ప్రమాదాలేమిటి, టిక్రిట్ లో  జొరబడ్డాక ఆస్పత్రిలోకి ఎలా చొరబాటు చేశాడు, ఈ ఆపరేషన్ మధ్యలో పాక్ తరపున జోయా ఎలా వచ్చి తోడ్పడింది, ఆమెతో కలిసి నర్సుల్ని టైగర్ ఎలా బంధవిముక్తుల్ని చేశాడూ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      2014 లో ఇరాక్ లో జరిగిన యదార్ధ ఘటన అన్నారు. కానీ ఘటన జరిగిన తీరు వేరు. అల్ ఖైదా తానులో ముక్క ఐసిస్ ఇరాక్ లోని టిర్కిట్ లో ఇండియన్ నర్సుల్ని బందీలుగా పట్టుకున్నది నిజం. అయితే అది డబ్బుకోసం కాదు. డబ్బుకోసం అపహరణలకి పాల్పడడం వాళ్ళ పధ్ధతి కాదు. వాళ్ళ దగ్గరే బోల్డు డబ్బుంది. తాము పబ్లిసిటీలోకి రావడానికి ఆ పనిచేశారు. నర్సులకి ఏ హానీ తలపెట్టలేదు. పైగా చాలా మర్యాదగా చూసుకున్నారు. రేపు వాళ్ళ ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పడితే ఇండియా నుంచి చీప్ లేబర్ వాళ్ళకి అవసరం. కాబట్టి నర్సుల్ని అతిధులుగా చూసుకున్నారు. భారత ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి నర్సుల్ని విడిపించుకోగల్గింది. ఇదీ నిజంగా జరిగింది.

  దీని మీద మలయాళంలో తీసిన ‘టేకాఫ్’ గత మార్చిలోనే విడుదలయింది. దీన్ని యదార్థ సంఘటనలాగే  తీశారు. కాకపోతే ఫస్టాఫ్ వరకూ అక్కడి కెళ్ళిన నర్సుల జీవితాల్లో కుటుంబపరమైన సమస్యలు చూపించారు. ఆతర్వాత ఐసిస్ పాల్పడిన అపహరణ – విడుదల వగైరా యధాతధంగా చూపించారు. అయితే నర్సుల్ని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వ పాత్రకంటే అక్కడి మలయాళీ బిజినెస్ మాన్ పాత్రవుందని వార్తలొచ్చాయి. దీన్ని అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ ధృవీకరించారు కూడా. కానీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇలాటి బందీల, లేదా సంక్షోభంలో ఇరుక్కున్న సమూహాల తరలింపు ఉదంతాల్లో అదేమిటోగానీ బిజినెస్ మాన్లే భుజానవేసుకునే వైనాలు కనపడుతున్నాయి. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘హోటల్ రువాండా’ ల తర్వాత ‘ఏర్ లిఫ్ట్’, ఇప్పుడు ‘టేకాఫ్’ అనే ఇండియన్ సినిమాలు. కువైట్ సంక్షోభంలో మలయాళీ బిజినెస్ మాన్ ని హీరోగా చూపిస్తూ ‘ఏర్ లిఫ్ట్’ తీసినట్టే, ‘టేకాఫ్’ లోనూ  మలయాళీ బిజినెస్ మాన్ నే ప్రధానపాత్రగా చూపించారు. రెండూ వివాదాస్పదమయ్యాయి. కాకపోతే మొదటి దాని విషయంలో దర్శకుడు క్షమాపణ చెప్పుకున్నాడు. 

 ప్రస్తుత కథలో ‘ఇరాక్ లో భారత నర్సుల అపహరణ’ అనే వార్తని ఐడియాగా తీసుకుని, స్పై థ్రిల్లర్ గా యాక్షన్ కథ అల్లారు. ట్విస్టుగా పాక్ నర్సుల్ని కూడా చేర్చారు. ఇసిస్ బదులు ఐఎస్సీ అన్నారు. ఇరాక్ బదులు అబుదాభీ, మొరాకో లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ స్పై జానర్ కథని ‘దంగల్’ కోవలో హాస్యభరితం చేశారు. కష్టాల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో, అన్నిటా  పాత్రలు ఫన్నీగా మాట్లాడి తెగ నవ్వించడమనే వినోదాత్మక విలువని చక్కగా ఉపయోగించుకున్నారు.  ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ – 8’ లో హీ - మాన్ హీరోల విట్టీ డైలాగ్ పవర్ ఎలా మాస్ చేత కేరింతలు కొట్టించుకుందో,  ప్రేక్షకులతో అవే దృశ్యాలు  ప్రస్తుతం థియేటర్లలో కన్పిస్తున్నాయి. 

ఎవరెలా చేశారు
సల్మాన్ ఖాన్ ని చూపించి ఎలా చప్పట్లు కొట్టించాలో, ఎలా ఈలలు వేయించాలో ఆ విన్యాసాలన్నీ ప్రదర్శించారు. ఆ డైలగులన్నీ పలికించారు. మంచు కొండల్లో సల్మాన్ ఎంట్రీలో చెయ్యి చూపిస్తే ఈలలు, కాలు చూపిస్తే ఈలలు, తోడేళ్ళతో పోరాటం చూపిస్తే కేరింతలు – అందరూ వేటాడగలరు,  టైగర్ లా వేటాడలేరు  - అని డైలాగు కొట్టిస్తే చప్పట్లూ ఈలలూ. ఎడారిలో క్వాడ్ బైక్ మీద దూసుకొస్తూంటే, ఇరాక్ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూంటే, ఒక పెద్ద మెషీన్ గన్ మోసుకొస్తూంటే, షర్టు విప్పి కండలు చూపిస్తే...ఒకటేమిటి, అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు.  విచిత్రమేమిటంటే ఇవన్నీ పక్కా లోకల్ మాస్ గా వుంటూనే ఇంటర్నేషనల్ సినిమాలా అన్పించడం. సల్మాన్ డైలాగులు పలికే తీరువల్ల డైలాగ్ రైటర్ల పని సులువై పోతుంది - పై వాడు నిన్ను క్షమిస్తాడో లేదో, నా పని నిన్ను పై వాడి దగ్గరకి పంపించడం (పాత డైలాగే)... మన పని కేవలం నర్సుల్ని రక్షించడమే కాదు - శాంతి కోసం మనం నిలబడ్డామని ప్రపంచానికి చూపించడం కూడా... నీకు దమ్ముంటే నన్నాపి చూడరా ఉస్మాన్ (పాత మూస డైలాగు)... దేశ ప్రతిష్టకే సవాలు (టెంప్లెట్ డైలాగు)...ఇలా రాసేస్తే సరిపోతుంది, వాటి ఎఫెక్టు సంగతి సల్మాన్ చూసుకుంటాడు. అయితే చాలాసార్లు తగ్గాల్సిన చోట్ల తగ్గి, ఇతర పాత్రల బలిమికి అవకాశం కూడా ఇచ్చాడు. 

 ఈ స్పై థ్రిల్లర్ లో జోసెఫ్  క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ తో బాటు, జేమ్స్ బానెట్ పాత్రల పొందిక కన్పిస్తాయి. ఒకప్పటి కొన్ని పాత్రలు కనుమరుగైపోయాయి. అలాటి ఒక పాత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ పాత్ర. ఇది వెనుకాడే హీరోపాత్రని ముందుకు తోసే ‘థ్రెషోల్డ్ క్యారక్టర్’.  జేమ్స్ బానెట్ ప్రకారం మన మానసికలోకంలో జడప్రాయమైన అవస్థ వుంటే దాన్ని విడుదల చేసే కవాటం లాంటిది ఇది. కత్రినా పాత్ర కథలో ఈ పని చూసుకుంటుంది. ఆమె ఎంట్రీ సీను సూపర్ మార్కెట్ లో వుంటుంది. అక్కడ  జొరబడిన ముగ్గురు దొంగల్ని సీసీ కెమెరా ఒక చుట్టు  తిరిగే లోపు కొట్టి పడేస్తుంది. ‘దిసీజ్ విమెన్ ఎంపవర్ మెంట్’ అని ఓనర్ మెచ్చుకుంటుంది ( అంటే విమెన్ ఎంపవర్ మెంటుకి తన్నాలనా? తంతే తప్ప మగలోకం దారికి రాదనేమో). 

          కత్రినాకి ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వున్నాయి. సల్మాన్ తన టీముతో అపాయంలో వుండీ స్తబ్దుగా వుంటే, హెడ్ లైట్లు పడతాయి – ఆఁ ... వచ్చేసిందిరో మీ వదిన – అంటాడు సల్మాన్. ఆమె వచ్చేసి ఫటా ఫటా లేపెస్తుంది టెర్రరిస్టుల్ని. కథంటే ఓడిడుకుల మన మానసిక స్థితే. వివిధ పరిస్థితులకి లోనయ్యే స్థితుల్ని చూపిస్తూ పాత్రలతో చక్క దిద్దుతూంటారు.

          ఈ టీముతో సంబంధం లేకుండా కత్రినా సొంతంగా వేరే  ఆపరేషన్ ఒకటి చేస్తుంది కథకి అడ్డం వస్తూ. మెడికల్ కాలేజీ అమ్మాయిల్ని చదవకుండా ఎత్తుకొచ్చి,  రేపులు  చేస్తూ చాకిరీ చేయించుకుంటూ వుంటారు ఐఎస్సీ ఉగ్రవాదులు. వాళ్ళతో సోలోగా స్వోర్డ్ ఫైట్ చేసి అమ్మాయిల్ని విడిపిస్తుంది కత్రినా. ఒకవైపు కథకి నర్సుల్ని విడిపించే పాయింటు వుండగా మళ్ళీ ఇదెందుకు సృష్టించారో అర్ధం గాదు. కత్రినా యాక్షన్ సీన్లు డబల్ ధమకాలా ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించేవే. 

    వెండి తెర మీద నుంచి ఇంకో కనుమరుగైపోయిన జేమ్స్ బానెట్ చెప్పిన పాత్ర - ట్రిక్ స్టర్. అంటే మాయగాడు. మన మనసుకి  మనతో ట్రిక్కుల్ని ప్లే చేసే గుణం వుంటుంది. ఆ మాయలో మనం పక్కదోవ పట్టిపోతాం. ఆ  కాసేపు, లేదా ఎంత కాలమైనా ఆడుకుని తిరిగి మనల్ని ట్రాకులో పెడుతుంది మన మనసు మనల్ని. ఈ పాత్రే  పరేష్ రావల్ అద్భుతంగా పోషించిన ఫిర్దోస్ అలియాస్ తోబాఁ ( అరబిక్ లోపాము). ఇతను పాతికేళ్ళ క్రితం ఇరాక్ లో స్థిరపడి యజమానులకి, అధికారులకీ తొత్తులా వుంటూ కార్మికుల మీద పడి బతుకుతూంటాడు. హీరో టీముని ముప్పు తిప్పలు పెడతాడు. చివరికి నీతి  వైపు నిల్చి సహాయపడతాడు. పరేష్ రావల్ మ్యానరిజమ్స్, మాట తీరూ, నటనా ఎంతో కన్నింగ్ గానూ ఫన్నీగానూ  వుంటాయి. ఇలాటి పాత్రనే ‘మ్యాడ్ మాక్స్ టూ’ లో బ్రూస్ స్పెన్స్ పోషించడాన్ని చూడొచ్చు. కొంచెం తేడాతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో నాగభూషణాన్ని కూడా చూడొచ్చు. ఆరుద్ర లాంటి ఆనాటి రచయితలకి ఇది బాగా తెల్సు. 

 ఐఎస్సీ లీడర్ గా ఇరానియన్ నటుడు సజ్జాద్ డల్ఫ్రోజ్ నటించాడు. ఈ లోకంలో ఒకటే మతముంది,  మానవత్వం - అనే కలికాలంలో ప్రాక్టికల్ గా పనిచెయ్యని ఐడియాలజీతో హీరోకి పేలవమైన రొటీన్ డైలాగే  వుంటుంది. దీనికంటే కళ్ళు తెరిపించే డైలాగు సజ్జాద్ పలుకుతాడు – ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎక్కడ్నించి వస్తున్నాయి? ఉగ్రవాదం ఒక బిజినెస్, దీంట్లో లోకమంతా కలిసి వుంది – అని.  ఉగ్రవాదం అనే కాష్టంలో ఎవరి లాభం కోసం వాళ్ళు ఆజ్యం పోస్తున్నారనే అర్ధంలో. సజ్జాద్ ని ఖాకీ యూనిఫాంలో గడ్డంతో, ఎర్ర టోపీతో చూపిస్తే  కల్నల్ గడాఫీ, ఫిడెల్ కాస్ట్రో, కమ్యూనిజంలని  కలగలిపి చూపినట్టుంది. ఈ మిక్స్చర్ పోట్లంతో ఐసిస్ కి ఏమైనా మెసేజి బహుమానంగా ఇవ్వాలనుకున్నారేమో తెలీదు. 

          ఇక హీరో టీం మెంబర్లుగా కుముద్ మిశ్రా, అంగద్ బేడీ, నవాబ్ షా కన్పిస్తారు. పాకిస్తాన్ ఐఎస్సై టీం లీడర్ గా సుదీప్ కన్పిస్తాడు. ఈ రెండు టీముల్లో  తెలిసిన క్రేజీ స్టార్లుంటే ఇంకా మజా వచ్చేది. ఐఎస్సై  టీములో తర్వాత మాజీ ఏజెంట్ కత్రినా వచ్చి కలుస్తుంది.  ఇరు దేశాల నర్సులు బందీలై వున్నా, రెండు దేశాల టీములు కలిసి పనిచేయడం అంత వాస్తవికంగా అన్పించదు. శాంతి కోసం పనిచేద్దాం రమ్మంటే పాక్ వచ్చే అవకాశంలేదు. తమ నర్సులకోసం పాక్ ఆపరేషన్ నిర్వహించే అవసరమే రాకపోవచ్చు. ఐసిస్ కి కాశ్మీర్ లోకి ఆహ్వానం పలుకుతున్న పాక్ తో  - ఐసిస్ భాయ్ భాయే కాబట్టి – మీరు పట్టుకున్న వాళ్ళల్లో మా అమ్మాయిలున్నార్రా బాబూ వదిలిపెట్టండంటే సరిపోతుంది. కానీ సినిమాలో ఉగ్రవాది ఒక పాక్ నర్సుని కాల్చేసినట్టు చూపించారు. 

గూఢచార సినిమా అనగానే దేశభక్తి ధారాళంగా ప్రవహించేలా చిత్రీకరిస్తారు ( దేశాన్ని రక్షించే సైన్యం ఎక్కడో సైలెంట్ గా వుంటుంది - మిగతా అన్ని రంగాలూ వర్గాలూ దేశభక్తిని పులుముకుని, ఫ్రీగా దేశభక్తిని అనుభవిస్తూ  చిందులేస్తూంటాయి). హాలీవుడ్ సినిమాల్లో ఈ జానరేతర దేశభక్తి ఎలిమెంట్ కన్పించదు. ఇండో- పాక్ టీములు వాళ్ళ వాళ్ళ జెండాలు దాచుకుని తెచ్చుకోవడం, స్నేహపూర్వకంగా ఎవరి దేశభక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, చివరికి ఇండియా మెంబరు చనిపోతూ పాక్ మెంబర్ కి తన జెండా ఇచ్చి మోయించడం...ఆఖరికి  శుభం సీనులో నర్సులున్న బస్సుకి రెండు దేశాల జెండాలూ  రెపరెప లాడడం సిల్లీగానే వుంటుంది. నర్సులు భుక్తి కోసం వెళ్ళారా, లేక దేశభక్తితో దేశం కోసం వెళ్ళారా? 

          దేశభక్తి కాకుండా,  ఇలాంటప్పుడు వాస్తవంగా ఏం జరుగవచ్చో అది చూపిస్తే ఈ స్పై జానర్ మర్యాద నిలబడేది. ‘రా’ ఏజెంట్ నేతృత్వంలో ఐఎస్సై ఏజెంట్లు పనిచేయడం వింతే. నిజానికి వాళ్ళు కలవకుండా సపరేట్ ఆపరేషన్ నిర్వహించి,  క్రెడిట్ తాము కొట్టెయ్యాలని ‘రా’ ఏజెంట్లకి అడ్డుతగులుతూండాలి. వాళ్ళ మీద హత్యాప్రయత్నాలు కూడా చెయ్యాలి. వాళ్ళ తీరు వల్ల నర్సుల ప్రాణాలకే ఎసరు రావాలి. హీరోకి అటు ఐఎస్సీతో బహిర్గతంగా ఫిజికల్ యాక్షనే కాకుండా, ఇటు ఐఎస్సై ఏజెంట్లతో అంతర్గతంగా ఎమోషనల్ యాక్షన్ కూడా వుండాల్సింది. అప్పుడే పాత్రకి ద్వంద్వాలేర్పడి పాత్రచిత్రణ కరెక్టుగా వుండి, మరింత ఎఫెక్టివ్ గా మారే   అవకాశంవుండేది. ఇది లేకపోవడంతో ఫ్లాట్ గా,  ఏకోన్ముఖంగా యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హీరో పాత్ర. ఈ ద్వంద్వాలుంటే హీరో భార్యగా,  ఐఎస్సై ఏజెంటుగా హీరోయిన్ పాత్ర కూడా మానసిక సంఘర్షణకి లోనై, ద్వంద్వాలు ఏర్పాటై ఎంతో రక్తికట్టించేది. చివరికి సమన్వయ కర్త తనే అయ్యేది - పైన చెప్పుకున్నట్టు ఒక  థ్రెషోల్డ్ పాత్రగా. పాత్ర స్వభావాన్ని మొదట్లో చూపించి తర్వాత మర్చిపోతే ఎట్లా? ఒకే ఆపరేషన్  గురించి రెండు దేశాల ఏజెంట్లు ఘర్షణపడే  ఎజెండా అవసరం ఈ కథకి. దీంట్లోకి దేశభక్తి  కోణం రానవసరం లేదు. కథలో దాని పాత్ర సబ్ టెక్స్ట్ గా మాత్రమే, ఆ ఫీల్ ని ఆడియెన్సు చూసుకుంటారు.  

          నర్సు పాత్రల్లో
అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగేలు ప్రధానంగా కన్పిస్తారు. ‘రా’ చీఫ్ గా  గిరీష్ కర్నాడ్ ఆదేశాలిస్తూ వుండే పాత్ర. మేకింగ్ ఉన్నత ప్రమాణాలతో వుంది (నూట  యాభై కోట్లు అంటున్నారు, యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఇదే తొలి ఖరీదైన ప్రొడక్షనట). పోలెండ్ ఛాయాగ్రాహకుడు మార్చిన్లస్కావీస్ కెమెరా వర్క్ ఒక కళా ప్రయోగం. దీనికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టామ్ స్టూథర్స్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు స్టన్నింగ్ గా వున్నాయి. నిడివి రెండు గంటలా 40 నిమిషాలనేది ఎక్కువే. 

చివరికేమిటి 
హాస్యం ఈ స్పై థ్రిల్లర్ని అపహాస్యం పాలుకాకుండా కాపాడింది. హాస్యం లేకుండా సీరియస్ మూడ్ లో చూడాలంటే భరించే కాలం కాదిది. ఈ రోజుల్లో – పెరిగిపోతున్న వివిధ దృశ్య మాధ్యమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో - సినిమాలకి  ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూఎస్పీ) వుండాల్సిందే. ఆ యూఎస్పీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసి  ప్రేక్షకుల్ని ఆకర్షించాల్సిందే. ఆ యూఎస్పీయే ఈ స్పై థ్రిల్లర్ కి హాస్యమనే షుగర్ కోటింగ్.  సినిమాలంటే కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ తో తీసేది కాదు, మార్కెట్ యాస్పెక్ట్ నికూడా కలుపుకోకపోతే తీసి దండగ. టాలీవుడ్ లో ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఇంకా అలవడాల్సి వుంది. వుంటే లో కేటగిరీలో కాలం చెల్లిన పద్ధతిలో వుండకుండా హిందీ, హాలీవుడ్ సినిమాలు చూసి  అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది.  

          ‘దంగల్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని  హాస్యయుతమైన పాత్రలతో వినోదాత్మకం చేయపోతే వెంటనే ఫ్లాపయ్యేది. ఆ పాత్రలుకూడా ఎవరికీ గుర్తుండేవి కాదు. పాత్రలు కామెడీ చేయడం పాత పధ్ధతి, హాస్యంగా మాట్లాడ్డం ఇప్పటి పధ్ధతి. కథలు సీరియస్ గానే వుంటాయి, పాత్రలు ఛలోక్తుతో రియాక్ట్ అవుతూంటాయి. కష్టాల్ని,  పనిని ఆటలాగా తీసుకోవడమే వీటి కార్యాచరణ. ఇలా ఇవి మనల్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతాయి. 

          ప్రస్తుత స్పై థ్రిల్లర్ లో పాత్ర చావుతప్పి కన్ను లొట్టబోయి బయట పడి - యమ రాజ్ టచ్ కర్కే  నికల్ గయా ( యముడు టచ్ చేసి వెళ్ళిపోయాడు) - అంటే అంత సీరియస్ సీనులో ప్రేక్షకులు ఘోల్లున నవ్వకుండా వుంటారా? ఎంట్రీ సీన్లో సల్మాన్ కొడుకుతో తోడేళ్ళతో తలపడే యాక్షన్ ఎపిసోడ్ ఎంత గుర్పాటు కల్గిస్తుందో, ఫన్నీ డైలాగులతో అంత రిలీఫ్ నిస్తూంటుంది – ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ కబుర్లలో పెట్టినట్టు. ఈ ఎపిసోడ్ లో కొడుకు భయపడిపోయి కేకలు పెట్టేట్టుగా, సల్మాన్ వాణ్ణి కాపాడేట్టుగా  – పిచ్చిగా ఫాదర్ సెంటి మెంటు,  చైల్డ్ సెంటిమెంటు అంటూ  వెలగబెట్టకుండా - చైల్డ్ ఎంపవర్ మెంట్ ని చూపించడం బావుంటుంది ఇద్దరి ఫన్నీ డైలాగ్స్ తో. తను తోడేళ్ళ గుంపుని  ఎదుర్కొంటూనే,  వాడికి తప్పించుకునే  కళలు నేర్పుతూంటాడు. తప్పించుకుంటున్న వాడి వెంట తోడేళ్ళు పడ్డా కేకలు వేయడు. ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఒక్క తోడేలుని కూడా చంపకుండా, మీద పడేటప్పుడు పక్కకి తప్పుకోవడం, వాటిని పక్క దోవ పట్టించడం లాంటి ట్రిక్కులు ప్లే చేస్తాడు. హాస్యాన్ని యూఎస్పీ అస్త్రం చేసుకుని ప్రయోగించడమే దీని ఘన విజయానికి కారణం. 

ఇక స్పై జానర్ కథలో హీరో పాత్ర ప్రయాణం భిన్నంగా వుంటుంది. పరిష్కరించాల్సిన సమస్య అతడికి వ్యక్తి గతంగా ఎదురుకాదు. ఎక్కడో ఏదో సమస్య ముందే ఏర్పాటయి వుంటుంది. ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో వెతికి పట్టుకొచ్చి అతణ్ణి  ఆ సమస్యలోకి తోస్తారు.  జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ హీరో పాత్రకి సొంత బాధలుండవు. కవిలాగా ప్రపంచ బాధే  తన బాధ. ఆ ప్రపంచ బాధలు తీర్చడమే తనకొచ్చిన బాధ. ఇదంతా స్పై జానర్ కొక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోనే ఈ కథలుంటాయి. కాకపోతే స్పై సినిమాలు ఎప్పుడో గానీ రావు గనుక  ప్రేక్షకులకి అదేపనిగా విసుగు పుట్టించవు, బతికిపోతారు.  ఇలాకాక, టాలీవుడ్ సినిమాలు వారంవారం  టెంప్లెట్ అనే ఒకే టెంపుల్ లో గంట వాయించుకుంటూ బిలబిలమంటూ అలాగే వచ్చే స్తూంటే,  విసుగు సూచీ వసూళ్ళ సూచీ కంటే బాగా పై స్థాయిలోనే ఎగదన్ని వుంటోంది. మార్కెట్ యాస్పెక్ట్ అంటే మనకి అర్ధంగాని అరబ్బీ పదం కదా. అందుకే ఎవరో ఆకతాయిలు తప్ప,  ప్రేక్షకులు బతికివుండే  అవకాశం బొత్తిగా లభించడం లేదు. 

          దర్శకుడు అలీఅబ్బాస్ జాఫర్, నీలేష్ మిశ్రాలు  కలిసి ఈ కథ రాశారు. ఐదేళ్ళ క్రితం ‘ఏక్ థా టైగర్’ తర్వాత ఈ సీక్వెల్ తో నీలేష్ కిది రెండో అవకాశం. తీవ్రవాద / ఉగ్రవాద డెస్కు జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవముంది. దీనివల్ల కథ ఆపరేటింగ్ పార్టు ఆథెంటిగ్గా వచ్చింది. అబ్బాస్ సమకూర్చుకున్న స్క్రీన్ ప్లేలో జోసెప్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే పురాణ కథల కథాక్రమం కనపడుతుంది (పై పటం చూడండి). ఆన్ని మతాల పురాణాల్లోంచి జోసెప్ క్యాంప్ బెల్ కనుగొన్న మిథికల్ స్ట్రక్చర్,  ‘స్టార్ వార్స్’  మొదలుకొని ఎన్నో హాలీవుడ్ సినిమాలకి ఒక గైడ్ లా వుంటోంది.

          ఈ స్ట్రక్చర్ లో పై పటంలో కన్పించే దశలన్నీ ఈ స్పై థ్రిల్లర్ లో కన్పిస్తాయి. స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్పై జానర్ కథల్లో  ప్లాట్ పాయింట్ వన్ సమస్య తలెత్తినప్పుడు రాదు, ఆ సమస్య  ని హీరో చేపట్టినప్పుడే వస్తుంది. ఐఎస్సీ నాయకుడి మీద అమెరికా వైమానిక దాడులు, అతను నర్సుల్ని బందీలుగా పట్టుకోవడం, ‘రా’ చీఫ్ కి సమాచారం తెలియడం, ఇలా  ఇది బిగినింగ్ విభాగంలో ముందే ఏర్పాటయిన సమస్యే. కానీ ఇదే  ప్లాట్ పాయింట్ వన్ మాత్రం కాదు . ఇప్పుడు హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చూపించి,  ‘రా’  చీఫ్ వెళ్లి సమస్య చెప్పాక, నర్సుల్ని విడిపించడానికి హీరో అంగీకరించడమే ప్లాట్ పాయిట్ వన్ అవుతుంది.  బిగినింగ్ విభాగానికి ఇదే ముగింపుగా వుంటుంది.


సికిందర్
         
         
         











         




























.