హిందీ ఆర్ట్ సినిమాలైనా కమర్షియల్ సినిమా
ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడానికి కారణం ఒకటే కన్పిస్తుంది : అవి శిలా సదృశంగా
ఒకే ధోరణిలో సీరియస్ స్వభావంతో వుంటూ, సగటు
ప్రేక్షకులకి దూరంగా, ప్రధాన స్రవంతిలో లేకపోవడమే.
మారిన కాలానికి వుంటున్న తీరులో హిందీ ఆర్ట్ సినిమాలకిక ప్రేక్షకుల్లేరని
గుర్తించిన శ్యామ్ బెనెగళ్, ఒక కొత్త ఒరవడికి తెర
లేపారు. 2000 నుంచి హిందీ ఆర్ట్ సినిమాలని ప్రధాన స్రవంతి బాలీవుడ్ స్టార్స్ తో
తీయడం మొదలెట్టారు. దాంతో అవి ప్రధాన స్రవంతి లోకొచ్చేసి, కొత్త తరం ప్రేక్షకుల అండదండలతో వాణిజ్య పరంగానూ విజయాలు సాధించడం
మొదలెట్టాయి.
ట్రైలర్
ట్రైలర్
ఇక ఇతర ప్రాంతీయ భాషల
సినిమాల వైపు చూస్తే అవి ఇంకా అవే కాలం చెల్లిన ఆర్ట్ సినిమాల ధోరణుల్లోనే వుంటూ, ప్రాంతీయంగానే
ప్రేక్షకుల్లేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలతో సరిపెట్టుకో సాగాయి. ఈ సినిమా లెక్కడున్నాయో
చూడడానికి వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త
దర్శకుడు రాంరెడ్డి, ప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా
తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చో, అలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయ, అంతర్జాతీయ
అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.
శ్యామ్ బెనెగళ్ హిందీ ఆర్ట్ సినిమా తీరు తెన్నుల్ని మార్చి స్టార్స్ తో ఆధునీకరిస్తే, రాంరెడ్డి తిరిగి అదే పాత రోజుల్లో కెళ్లి అక్కడున్న పాతతోనే, స్టార్స్ అవసరం లేకుండానే సాహసం చేశాడు. స్థానిక ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి స్టార్స్ అవసరం లేని సాహసం. ఆర్ట్ సినిమా కథల్లో ఏదైనా సమస్యని సీరియస్ గానే చర్చించనవసరం లేదనీ, వినోద భరితంగానూ ముచ్చటించుకో వచ్చనీ ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఇలా ఇది ఆర్ట్ సినిమా కథని పూర్తి వినోదాత్మకంగా మార్చిన ఇంకో నూతన కల్పన అయింది. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కర్ణాటక మాండ్యా
జిల్లా నోడెకొప్పలు అనే పల్లెటూరు. రైలు కట్ట వారగా వూరు. ఆ రైలు కట్ట నానుకుని
మంచి ధర పలికే అయిదెకరాల మాగాణి. దాని ఆసామి బడుగు జీవి, కాటికి
కాళ్ళు జాపుకున్న, నిండు 101 సంవత్సరాల సెంచురీ గౌడ అనే
బూతుల వీరుడు. పనేం వుండదు. దారి పక్కన
కూర్చుని, వచ్చే పోయేవాళ్ళని బండ బూతులు తిట్టడమే పని. అమ్మనా
బూతులు కూడా తిడతాడు. తిట్టించుకుంటున్న వాళ్ళకి అది నిత్య కార్యక్రమమే కాబట్టి, జీవితంలో విడదీయలేని భాగంగా చేసుకుని సాగి పోతూంటారు. సెంచురీ గౌడని
పోలీసులు వచ్చి పట్టుకోవడానికి అవి సోషల్ మీడియాలో తిట్లు కావు, సొసైటీలో లైవ్ గా తేట తేనియల తిట్లు. ఇక్కడ అందరికీ ముద్దొస్తున్నాయి.
ఇలాటి సెంచురీ గౌడకి ఒకానొక డెబ్బయి ఏళ్ళ కొడుకు గడ్డప్ప. ఇతను గడ్డాలూ మీసాలు పెరిగిపోయి నడుచుకుంటూ వెళ్ళి పోతూంటాడు. ఎక్కడికి వెళ్ళి పోతూంటాడో అతడికే తెలీదు. నడకే అతడి నినాదం. ఎక్కడో ఆగి, క్వార్టర్ బాటిల్ తీసి ఒక గుక్క లిక్కర్ పట్టిస్తాడు. ఇంకెక్కడో చెట్టు కింద కూర్చుని పులి జూదం ఆడతాడు. ఇతడికి తమ్మన్న అని కొడుకు. ఇతను తండ్రిని వెతికి పట్టుకొచ్చి అన్నం పెడతాడు. ఇతడికో కొడుకు అభి. వీడికి కావేరీ అని గొర్రెల పెంపకం అమ్మాయికి వల వేయడం పని. ఇతడికో తల్లి. ఈ మగ మేధావులకి వండి పెట్టడం ఈమె పని.
ఇలా నాల్గు తరాల నిండు కుటుంబం వూరిని సముచితంగా ఉద్ధరిస్తున్న వేళ, ఓ రోజు సెంచురీ గౌడ తిట్లతో విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి పోతాడు. పోతూ దారిలో మూత్రం పోయడానికి కూర్చుంటాడు. కూర్చుని అలా వొరిగి పోయి తనువు చాలిస్తాడు.
విషాదం అలుముకుంటుంది. అయితే పెద్ద కర్మలోగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. సెంచురీ గౌడ కొడుకు, మనవడు, ముని మనవడు ముగ్గురూ పాల్పడే వింతలు. కుటుంబంలో ఒక మరణంతో ఒక స్వేచ్ఛ, ఇంకో స్వార్ధం మనుషుల్లో పుట్టుకు రావొచ్చు. ఒక మరణం ఒక మంచో చెడో పుట్టుకకి కారణమవుతుంది. అదే సమయంలో ఇంకో గాయాన్ని మాన్పలేని వైఫల్యం కూడా మరణానికుంటుంది. కొన్ని గాయాల్ని మరణాలు మాన్పలేవు. ఏమిటా గాయం? ఎవరా జీవితకాల క్షత గాత్రుడు? దీని గురించే మిగతా కథ.
వూళ్ళో కనుగొన్న కథ

ఇదే నోడెకొప్పలు గ్రామంలో
దర్శకుడు రాంరెడ్డి కనుగొన్న కథ ఇది. ఇది రచయిత ఎరెగౌడ స్వగ్రామం. ఒకసారి ఎరెగౌడని
కలవడానికి రాంరెడ్డి వచ్చినప్పుడు, ఇదొక కొత్త ప్రపంచంలా
అన్పించింది. గ్రామం తీరుతెన్నులు, మనుషుల ధోరణి చూస్తే
వెంటనే ఈ గ్రామాన్ని పాత్రగా చేసి సినిమా తీయాలన్పించింది. దీంతో జెకెస్లోవేకియా
వెళ్ళి ఫ్రాగ్ ఫిలిమ్ స్కూల్లో ఏడాది పాటు దర్శకత్వం, రచనల్లో
శిక్షణ పొందాడు. అక్కడ పరిచయైన డొరోన్ టెంపర్ట్ ని ఛాయాగ్రాహకుడిగా
నియమించకున్నాడు. ఎరెగౌడతో కలిసి కథ రాసుకుని సినిమా తీయడం మొదలెట్టాడు.
ఇది పూర్తిగా హాస్య ప్రధాన కథ. ఈ కథలో ప్రతిఫలించే అంశాలు మరణం, పేదరికంలో పుట్టే స్వార్ధం, దాంతో మోసం, కుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్ విషయాలు. వీటిని నెగెటివ్ ప్రవర్తనలతో నవ్వొచ్చేట్టు చూపిస్తాడు. నవ్వించుకుంటూ వెళ్ళి వెళ్ళి చివర్లో విషాదాంతం చేస్తాడు. కఠిన వాస్తవాలతో కళ్ళు తెరిపిస్తాడు. ఇలా ఇదొక ఆధునిక హాస్య విషాదంలా వుంటుంది.

ఈ వాస్తవిక
సినిమాలోని హాస్య కథ నిండు 101 ఏళ్ళ సెంచురీ గౌడ మరణాన్ని కూడా హాస్యం పట్టిస్తుంది.
పల్లెలో భేషజాలుండవు, పచ్చి వాస్తవా లాధారంగా జీవితాలుంటాయి.
ఎంత అట్టడుగు వర్గాల జీవితాలుంటే అంత నగ్నసత్యాల నాట్యముంటుంది. తమ్మన్న తండ్రి
గడ్డప్పని వెతుక్కుంటూ వెళ్ళి- తాత చచ్చిపోయాడు, కార్యక్రమాలున్నాయి
రమ్మంటే, చచ్చి పోయినవాడికి కార్యక్రమాలు తెలుస్తాయా, రానంటాడు గడ్డప్ప.
ఇంకోసారి నువ్వు ఇంట్లో కూర్చోక ఎందుకిలా తిరుగుతావంటే, కూర్చుని చచ్చే కన్నా తిరిగి చావడం మిన్న అంటాడు గడ్డప్ప. నిజానికి తిరుగుతున్నవి అతడి కాళ్ళు కాదు, మనసులోనే ఏదో సుళ్ళు తిగుగుతోంది. ఆ పోటుకి కూర్చుని వుంటే చచ్చిపోతాడు. అందుకని ఇలా నిత్య సంచారి. మనసులో ఏమిటా పోటు అనేది సస్పెన్స్. పైకి చెప్పుకోలేడు. ఈ చీకటి కోణమే కథకి బలమైన వెన్నెముక.
లిక్కర్ తాగడం మరుపు కోసం, పులిజూదం ఆడడం మనస్సుని గెలవాలన్న ఆరాటంతో. ఒకవైపు మర్చిపోవాలని, ఇంకో వైపు గెలవాలని. క్షమిస్తే మనస్సుని గెలవగలడు. కానీ తండ్రి సెంచురీ గౌడ తనతో చేసింది క్షమించరానిది. అది పైకి కూడా చెప్పుకోలేనిది>
వంద దాటిన సెంచురీ గౌడ మరణం వూళ్ళో కూడా ఎవరికీ పట్టదు. చాలా పాత సరుకని ముని మనవడు అభి కూడా పట్టించుకోడు. పెద్ద కర్మకి సరుకులు తేవడానికి వెళ్ళి ప్రేమిస్తున్న కావేరీ కనపడగానే ఆమె వెంటపడి వెళ్ళిపోతాడు. ఇటు తండ్రి తమ్మన్న కూడా పెద్ద కర్మని పట్టించుకోకుండా, వేరే అర్జెంటు పని మీద వుంటాడు. ముందు తండ్రి గడ్డప్పని ఓ మాట అడుగుతాడు- నీ అయ్య వంద దాటి బతికాడు, నువ్వెప్పుడు చస్తావో ఏమో, ఈలోగా నీ తమ్ముళ్ళు పొలం పంచమని వచ్చేస్తారు, అందుకని అయ్యనుంచి నీకొచ్చిన అయిదెకరాలు నాకు రాసేయ్- అని వెంటపడతాడు. గడ్డప్ప ఒకటే మాటంటాడు - నేను చచ్చాకే, నీ కొచ్చేది అని.
సెంచురీ గౌడ చితాభస్మం సేకరించబోయి అక్కడ కెలుకుతూ- ప్రక్కటెకముకలు మిగిలేవున్నాయి, వీడు మామూలోడు కాదనుకుంటారు. అందుకే వూళ్ళో ప్లే బాయ్ లా వెలిగి అలాటి పన్లు చేశాడని అనుకుంటారు. ఇలా సెంచురీ గౌడ గురించి కొత్త విషయం మనకి తెలుస్తుంది. బూతుల వీరుడెందుకయ్యాడో పాత్ర అర్ధమవుతుంది.
పొలం రాయడానికి తండ్రి నిరాకరించడంతో తమ్మన్న టౌను కెళ్ళిపోయి, టింబర్ డిపో ఆసామికి పొలం బేరం పెట్టేస్తాడు. ఇరవై లక్షలకి బేరం కుదురుతుంది. ఆసామీ పత్రాలు పరిశీలించి గడ్డప్ప పేరు మీద వున్నాయే అంటే, తన తండ్రి గడ్డప్ప చచ్చిపోయాడని తమ్మన్న అనేస్తాడు. అయితే డెత్ సర్టిఫికేట్ పట్రమ్మంటాడు ఆసామీ. తమ్మన్న రెవిన్యూ అధికారికి లంచమిచ్చి డెత్ సర్టిఫికేట్ సంపాదిస్తాడు. ఇక నీ తండ్రి గడ్డప్ప ఈ చుట్టుపక్కల కనిపించకూడదని రెవిన్యూ అధికారి హెచ్చరిస్తాడు.
తమ్మన్న తిరిగి వచ్చి, ఒక వడ్డీల రౌడీ రాణి దగ్గర తెగించి భారీ వడ్డీకి రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు. ఆ డబ్బు గడ్డప్ప కిచ్చి, నీకు తిరగడం అలవాటు కదా, ఇక అలా ఓసారి దేశాటన చేసి ఆర్నెల్ల తర్వాత రమ్మని బస్సెక్కించి పంపించేస్తాడు. ఇక చట్టం దృష్టిలో గడ్డప్ప చచ్చిపోయాడు! తాత పెద్దకర్మ లోగా తండ్రి మాయం, అస్తమయం!
అయితే తాత చితి దగ్గర మిగిలిన కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ జనం మధ్య గడ్డప్ప ప్రత్యక్షమై పోతాడు. బస్సెక్కించి పంపించేస్తే ఎలా వచ్చాడు? ఎందుకొచ్చాడు? నిజం తెలిసిపోయిందా? కొడుకు తమ్మన్నకి పీక్కోలేని కక్కలేని పరిస్థితి!
ఇక్కడ్నించీ గడ్డప్ప అటు తండ్రే నీచుడు అనుకుంటే ఇప్పుడు కొడుకు విశ్వాస ఘాతుకానికీ మతిచలించిన వాడవుతాడు. అయినా చేతికొచ్చిన పొలం డబ్బులు పోతున్నాయన్న కసి తమ్మన్నకి... రక్తసంబంధాలు రిక్త హస్తాల్ని మిగిల్చాయన్న ఆక్రోశంతో తండ్రిని దూషించడాలు. అటు తండ్రి, ఇటు కొడుకూ గుండెల్లో గునపాలు దింపిన వాళ్ళైపోతే, గడ్డప్పకి ఏ దిక్కూ తోచని స్థితి.
చీకట్లో చలిమంటేసుకుంటున్న గడ్డప్ప క్లోజింగ్ ఇమేజితో కదిలించే విధంగా ముగింపు. ఈ సహజ కథ కథ నడిపిన తమ్మన్నది కాదనీ, కథకి కారకుడైన మౌన బాధితుడు గడ్డప్ప దనీ చిట్ట చివర్లో తేలి గడ్డప్ప చాలా గొప్పగా కన్పిస్తాడు. పాత్ర చిత్రణంటే ఇదీ కదా అన్పించేలా. ఆ రెండు లక్షలు పట్టుకెళ్ళిన గడ్డప్ప తాగితందానా లాడెయ్యడు, పరోపకారానికి వాడేస్తాడు. కాస్త కుదురుగా అతను గడిపేది గొర్రెల పెంపకం వాళ్లతోనే. ఈ గడ్డప్ప విషాదానికి హాస్యంతో ఇచ్చిన షుగర్ కోటింగే జీవం పోసింది. ఈ హాస్యం వూరికే హాస్యం కోసం అన్నట్టు లేదు. వివిధ ఆచారాలూ, ప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలివి.

స్థానిక పాత్రలకి స్థానికులే నటులు
సెంచురీ గౌడ, గడ్డప్ప, తమ్మన్న పాత్రల్లో
సింగ్రి గౌడ, చన్నే గౌడ, తమ్మే
గౌడ వృత్తి నటులు కారు. నటన తెలీని ఆ వూరి సగటు మనుషులే. అభి, కావేరీ యువ పాత్రల్లో అభిషేక్, పూజ సైతం
స్థానికులే. ఇంకా అన్ని సహాయ పాత్రలూ, మిగతా అందరూ
స్థానిక ప్రజలే. వీళ్ళకి 80 రోజుల పాటు శిక్షణ నిచ్చాడు దర్శకుడు. ఆ వూరి ఆత్మని
అక్కడే వుంటూ రాసుకుంటూ, తీసుకుంటూ ఆవాహన చేసుకుని ఒక
యజ్ఞంలా పూర్తి చేశాడు.
ముఖ్య పాత్రల్లో సింగ్రి గౌడ, చన్నే
గౌడ, తమ్మే గౌడ వృత్తి నటులే అన్నంత సహజ మెథడ్
యాక్టింగ్ చేసి బలమైన ముద్ర వేస్తారు. పాత్రల్ని మర్చిపోలేని విధంగా ప్రేక్షకుల
మనో ఫలకాల మీద ముద్రించి వదుల్తారు. ఎక్కడా కమర్షియల్ యాక్టింగ్ వుండదు.
ఈ తరం దర్శకుడు
రాంరెడ్డి, రచయిత ఎరెగౌడ జీవితం పట్ల లోతైన అవగాహన గల
వాళ్ళుగా అన్పిస్తారు. హైలైట్ చేయాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఆర్ట్ సినిమాకి నూతన కల్పన చేస్తూ కథా నిర్మాణం వుండని పాసివ్ పాత్రల
ఆర్ట్ సినిమా తీయలేదు. సగటు ప్రేక్షకుల అనుభవంలోకి కూడా ఆర్ట్ సినిమాని తీసుకొస్తూ, ప్రధాన స్రవంతి సినిమా తరహా మూడంకాల (త్రీయాక్ట్ స్ట్రక్చర్) నిర్మాణం
చేశారు. కథ స్ట్రక్చర్ లో వుందంటే పాసివ్ పాత్రలుండవు. దృశ్య మాధ్యమమైన సినిమాకి
కావాల్సిందిదే. అయితే ఈ సినిమాని వివిధ దేశ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీలో
వుంచాల్సింది. జాతీయంగా, అంతర్జాతీయంగా రికార్డు
స్థాయిలో ఇరవై అవార్డులు పొందిన ఈ సృజనాత్మకత వివిధ భాషల్లోకి వెళ్ళాలి.
ఇంతకీ కొడుకు గడ్డప్ప
పట్ల తండ్రి సెంచురీ గౌడ పాల్పడిన చెప్పుకోలేని నీచ కార్య మేమిటి? ఇదిక్కడ చెప్పేకన్నా నెట్ ఫ్లిక్స్ లో చూస్తేనే బావుంటుంది.
—సికిందర్