Q : నాదొక కఠిన సమస్య. జవాబు దొరకడం లేదు. కథలో నేను చెప్పాలనుకుంటున్న పాయింటు ఎప్పుడు స్పష్టం చేయాలి? ఇంటర్వెల్ ముందా, ఇంటర్వెల్ తర్వాతా? ముందు చెప్తే ఏం జరుగుతుంది? తర్వాత చెప్తే ఏం జరుగుతుంది? ఈ సమస్యని తీర్చగలరు.
―ఒక రచయిత
A : పాయింటు ఎప్పుడు చెప్తే అప్పుడు కథ ప్రారంభమవుతుంది. పాయింటు ఇంటర్వెల్ తర్వాత చెప్పి కథ ప్రారంభిస్తే, ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధంగాదు. ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధంగాకపోతే మంచిదేమో మీరే ఆలోచించండి. దాన్నిబట్టి కథ చేయండి. మీరు స్ట్రక్చర్ లో కథ ఆలోచిస్తే, సినిమా శ్రేయస్సు దృష్ట్యా ఇంటర్వెల్ లోపే కథ ప్రారంభిస్తారు. అసలు కథ ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించడానికి కథకుడెవరు? కథ అతడి సొత్తు కాదు, ప్రధాన పాత్ర సొత్తు, డైరీ. దాని డైరీ అది రాసుకోకుండా ఇంకెవరు రాస్తారు? కాబట్టి కథని పట్టుకుని ప్రధాన పాత్రని నడపడంగా గాకుండా, ప్రధాన పాత్రని పట్టుకుని అది నడిపే కథతో సాగిపోవాలి. ఎప్పుడేం చేయాలో ప్రధాన పాత్రకి తెలిసినంతగా కథకుడికి తెలియదు. ప్రధానపాత్ర ఆటోమేటిగ్గా స్ట్రక్చర్లో ప్రయాణిస్తుంది. కథకుడు స్ట్రక్చర్ వదిలేసి కథతో క్రియేటివిటీలు చేసుకుంటూ, మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటాడు.

సహకార దర్శకుడు రవి అడిగిన 4 ప్రశ్నలు :
Q: 1. రోమాంటిక్ కామెడీ సినిమాల్లో కొత్తగా ఏం చేయాలి? హీరో క్యారెక్టర్ లేదా హీరోయిన్ క్యారెక్టర్ వీటినే అటు ఇటు తిప్పుతూ హీరోకు ప్రేమంటే ఇష్టం లేదని, లేదా హీరోయిన్ కు ప్రేమ అంటే ఇష్టం లేదని తీసినవే మళ్లీ మళ్లీ తీస్తున్నారు. అందుకే అడుగుతున్నాను, వేరే భాషల్లో ఏవైనా డిఫరెంట్ సినిమాలు ఉంటే ఉదాహరణలుగా ఇవ్వగలరు.

A : నిన్న మొన్నటి వరకూ వారానికి నాల్గైదు వచ్చే రోమాంటిక్ కామెడీలు ఇప్పుడు తగ్గిపోయాయి. చూసేవాళ్ళు లేరు. ఏవైనా స్టార్ సినిమాలైతే తప్ప ప్రేమ సినిమా కథలకి ఆకర్షించే గ్లామర్ ఇక లేకుండా పోయింది. కొన్నాళ్ళ పాటు వీటిని మానుకుంటే మంచిది. హిందీలో వైవిధ్యంతో ప్రాణం పోస్తున్నారు. పట్టణ ప్రాంతాలకి ప్రేమ కథల్ని తీసికెళ్ళి పాత్రలు సహా ఆయా ప్రాంతాల నేటివిటీని భాగంగా చేసి, ఒక సహజత్వంతో కూడిన వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. ‘మన్మర్జియా’, ‘బరేలీకీ బర్ఫీ’, ‘లుక్కా ఛుప్పీ’ లాంటివి. ఈ వారం విడుదలైన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ లాంటి గే రోమాంటిక్ కామెడీలకి తెలుగులో చోటు లేదు. గేల గోల అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ఇంకోటి లేనట్టు ఒకటే రోమాంటిక్ కామెడీల వెల్లువ. దీంతో ఇతర జానర్లు ఎలా తీయాలో తెలుసుకోలేకపోయారు. ఇకనైనా ప్రేమ సినిమాలు చాలించి, ఇతర జానర్లు నేర్చుకోవడం మీద దృష్టి పెడితే మంచిదేమో ఆలోచించుకోవాలి.
Q: 2. హిందీలో వచ్చిన ‘హిందీ మీడియం’ ఇప్పుడు లేటెస్ట్ గా ‘అంగ్రేజీ మీడియం’ లాంటి సినిమాలు మన దగ్గర పెద్ద హీరోలకి వర్కవుట్ అవుతాయి కదా? ఆ సినిమాల మీద మీ విశ్లేషణ ఏమైనా ఉంటే చెప్పండి.
A : ‘జెర్సీ’, ‘జాను’ లాంటివే వర్కౌట్ కాలేదు. ‘తెలుగు మీడియం’, ‘తెలుగింగ్లీషు మీడియం’ అంటూ తీస్తే అసలే వర్కౌట్ కావు. ఇక ‘ప్యాడ్ మాన్’, ‘టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథా’ లాంటివి తెలుగులో స్టార్స్ ని పెట్టి తీస్తే ఇంతే సంగతులు. హిందీ కాన్సెప్ట్స్ అన్నీ తెలుగుకి కుదరవు. ప్యాడ్ ని ప్రచారం చేస్తూ అక్షయ్ కుమార్ తో తీసిన యాడ్ ఫిలిం కూడా బాగా హిట్టయింది.
Q: 3. స్ట్రక్చర్ ఫాలో అవండి అంటారు కదా? ప్రతి జానర్ నుంచి ఒక గొప్ప సినిమా తీసుకుని అవెలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ‘కీ’ సీన్స్ ఎలా వచ్చాయి అన్న విషయాలు చెప్పగలరు.
A : జానర్ మాన మర్యాదల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా ప్రాక్టికల్ గా వచ్చేసరికి పరాభవాలే మిగులుతున్నాయి. జానర్స్ ని అర్ధం జేసుకోవడం దగ్గరే విఫల మవుతున్నారు, జానర్ మర్యాదల అమలు సంగతి తర్వాత. సీన్లలో తమకు తెలిసిన, అలవాటయిన అవే కథాకథనాలు కలిపేస్తున్నారు. కనీసం రియలిస్టిక్ కథనైనా మూస ఫార్ములా సీన్లతో, డైలాగులతో ఆలోచించకూడదని అర్ధం జేసుకోలేకపోతున్నారు. ఒక్కో జానర్ కి ఒక్కో శైలి వుంటుంది. ఓ రచనకి శైలి అంటే ఏమిటో ముందు తెలుసుకోగల్గితే జానర్లు తీయడం గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. జానర్ మర్యాదల గురించి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడండి : జానర్స్ గురించి...
Q: 4. మామూలుగా ఏ సినిమా కథలో అయినా ఆడియన్స్ పాత్ర వుంటుందనిఅంటారు. అయితేఆ పాత్రే ఆడియన్స్ ను రిప్రజెంట్ చేస్తుంది అన్న విషయం చాలా మంది రచయితలు, దర్శకులు, హీరోలు, నిర్మాతలు, నటులకు తెలియదు. అది సపోర్టింగ్ క్యారెక్టర్ లాగాను లేదా హీరో ఫ్రెండ్ లేదా మరొక పాత్ర రూపంలోనూ వుంటుంది. ఇలా లేనప్పుడు ఏం జరుగుతుంది?
A : కథనమంటేనే ప్రశ్నలు జవాబులు. ఒక సీన్లో ప్రశ్న రేకెత్తించి ఇంకో సీన్లో జవాబివ్వడమే కథనం. సినిమాల్ని సరీగ్గా చూస్తే ఈ సరళియే బయల్పడుతుంది. కథ నడపడానికి తోడ్పడే కాజ్ అండ్ ఎఫెక్ట్స్, లేదా పే ఆఫ్స్ అండ్ సెటప్స్ కూడా ప్రశ్నలు జవాబులే. ‘శివ’ లో నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టడం కాజ్ లేదా సెటప్ లేదా ప్రశ్న. కొట్టాక ఏమవుతుందో చూపడమే ఎఫెక్ట్ లేదా పే ఆఫ్ లేదా జవాబు. ఈ ప్రశ్నలు జవాబులు చర్యలతో వుండొచ్చు, లేదా సంభాషణలతో వుండొచ్చు. కొన్నిసార్లు పాత్ర ప్రవర్తనకి, లేదా ఏర్పడిన ఒక పరిస్థితికి సంబంధించి ప్రేక్షకులకి సందేహాలు రావచ్చు. ఈ సందేహాలు తీర్చడానికి ఇంకో పాత్ర పూనుకుని సదరు సందేహ కారకమైన పాత్రని అడిగి సమాధానం రాబడుతుంది. ఇంతమాత్రాన ఈ పాత్ర ఎప్పుడూ సందేహాలు అడిగే పనే పెట్టుకుంటే ఆ కథనం మంచిది కాదని అర్ధం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప కథనం అర్ధమైపోతూండాలి. ప్రత్యేక సందర్భం ఇలా వుండొచ్చు : ఒక తరహాలో సాగిపోతున్న పాత్ర, పంథా మార్చుకుని ఇంకో తరహాలో సాగిపోతూంటే, ఎందుకిలా మారిందనేది ప్రేక్షకులకి అర్ధంగాదు. అప్పుడు ఒక పాత్ర ఇంకో పాత్రని ఈ సందేహం అడిగి సమాధాన పడొచ్చు ప్రేక్షకుల తరపున.

ఏ సినిమా కథలో అయినా ఆడియన్స్ కి ప్రాతినిధ్యం వహించే పాత్ర వుంటుందనుకోవడం సరి కాదు. ఈ విషయం చాలా మంది రచయితలు, దర్శకులు, హీరోలు, నిర్మాతలు, నటులకి తెలియదని అనుకోవడం కూడా సరికాదు. ఇదొక విషయమే కాదు. ప్రేక్షకులకి ప్రాతినిధ్యం వహించేది ప్రధాన పాత్ర మాత్రమే తప్ప ఇంకోటి కాదు. తెరమీద రసపోషణకే వివిధ పాత్రలుంటాయి. రసాలు అంటే ఎమోషన్స్ తొమ్మిది రకాలు. ఇవే నవరసాలు. నవరసాల్లో సందేహాలు తీర్చే రసమేదీ లేదు. సందేహాలనేవి ఎమోషన్ కాదు.
Q : 'పారసైట్' సినిమా ఫై పూర్తి స్థాయి విశ్లేషణ మీ సమయం చూసుకుని ప్రచురించగలరు. ఇందులో క్లయిమాక్స్ పూర్తిగా డిస్సప్పాయింట్ చేసింది. ఇది నా ఒపీనియన్ కావచ్చు, కానీ ఒక ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ సినిమా మిగతా సినిమాలని పక్కకి తోసేసే అంత గొప్ప చిత్రం కాదనేది నా ఒపీనియన్. ప్రపంచానికి ఇది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది అనేదే నేను చూసిన కోణం. థ్రిల్లర్ కి కావాల్సిన ఎత్తుగడ అద్భుతంగా ఉన్నా క్లయిమాక్స్ లో బాస్ ని చంపాల్సినంత తప్పు బాస్ ఏమి చేసాడు? పేదవాళ్ల దగ్గర బ్యాడ్ స్మెల్ రావడమేనా? లేక పేదవాళ్లందరికి ధనవంతుల పై ఉండే ఈర్ష్యా? ఇంటి గేట్ బయట సిసి కెమెరా పెట్టిన ఓనర్ ఇంటి లోపల, గార్డెన్లో (లాన్లో) పెట్టలేడా? చైనాతో పోటీగా టెక్నాలజీలో అభివృద్ధి చెందిన కొరియాలో వీఆర్ కంపెనీ నడుపుతున్న ఓనర్ కి ఆ మాత్రం అవగాహన లేదా, అంత పెద్ద విల్లాని పనివాళ్లకు వదిలేసి వెళ్లాల్సి వస్తే కెమెరా లో వాళ్ళ ఆక్టివిటీ చూడొచ్చు అని? ప్రపంచ వ్యాప్తంగా ధనికo కంటే పేదరికo ఎక్కువ అని ఏ ఇండెక్స్ చూసినా కనిపిస్తుంది. వందల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఒక సినిమా గెలిచిన అవార్డుల్ని బేస్ చేసుకుని అవార్డ్స్ ఇచ్చింది అంతా ధనిక వర్గ ఆస్కార్ జ్యూరీ మెంబర్సా? పేదల దృష్టి కోణంలో నుండి కధ చెబుతున్నారా లేక ప్రపంచంలో పేదలందరు ఇంతే అనే జెనరలైజ్ స్టేట్మెంట్ ఇస్తున్నారా దర్శక రచయితలు? లేక ప్రస్తుత హాలీవుడ్ చేతగాని తనమా ఈ అవార్డుకి కారణం?
దీనికి ముందు అత్యంత గొప్ప ఫారిన్ కేటగిరీలో ఈ సినిమాను తలదన్నేస్థాయిలో వచ్చాయి. అవి చేయలేని కార్యం ఈ సినిమా చేసిందా? మీ పూర్తి స్థాయి విశ్లేషణలో తెలుసుకోవాలని ఉంది, సమయం చూసుకుని మీ ఎనాలిసిస్ ప్రచురించగలరు.
―విప్లవ్ జేకే, దర్శకత్వ శాఖ
―విప్లవ్ జేకే, దర్శకత్వ శాఖ
A : హాలీవుడ్ సినిమా రివ్యూలు రాయడం లేదు. ఎప్పుడోగానీ ‘ఈక్వలైకర్ 2’ లాంటి స్ట్రక్చర్ తో చేసిన ప్రయోగాల్లాంటివి వచ్చినప్పుడు దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రివ్యూలిస్తున్నాం. మొదటి అంకం సెకండాఫ్ లోవరకూ సాగదీస్తే ఏమవుతుంది - మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. అదే చివరి అంకాన్ని సెకండాఫ్ ముప్పాతిక భాగాన్నీ ఆక్రమించేలా చేస్తే ఏమవుతుంది - మూడంకాల స్క్రీన్ ప్లేల మొనాటనీ మటాష్ అవుతుంది. మూడంకాల కథా నిర్మాణానికి ఫ్రెష్ లుక్ వస్తుంది. ‘ఈక్వలైజర్ 2’ లో స్ఫూర్తి దాయకంగా ఇదే చూశాం.
ఇక ‘పారసైట్’ గురించి : డబ్బుపట్ల గల దృక్పథమే వ్యక్తి ఆర్ధిక జీవితాన్నినిర్ణయిస్తుంది. డబ్బున్న వాళ్ళని డబ్బున్న కారణంగా ద్వేషిస్తే డబ్బుని ద్వేషించడమే. ద్వేషించేది చెంతకు రాదు. డబ్బున్న వాడు పనివాడి దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తోందని ఫీలైతే, ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవడం పనివాడి సంస్కారం, బాధ్యత. దీనికి బదులు ద్వేషం పెంచుకుని యజమానిని పొడిచి చంపేస్తే, జీతం డబ్బులు సంపాదించుకోవడానికి కూడా వాడు అయోగ్యుడు. వాడు పేదరికంలో మగ్గే వాడే. రెండోది, ఇంత బిగ్ షాట్ యజమాని పనివాళ్ళని నియమించుకునేప్పుడే వాళ్ళ శుభ్రత, యూనిఫాం తప్పని సరి చేస్తారు. అంబానీ మహల్లో పని వాళ్ళు ఎలా వుంటారో చూడండి. అంటే ఈ బిగ్ షాట్ యజమాని కూడా యజమాని అవడానికి అయోగ్యుడు. ఇలా ఇది మ్యానర్స్ లేని పాత్రల కథ. ఇలా వుంటే వాడు చంపడం, వీడు చావడం తప్పవు మరి. సూక్ష్మంగా కాన్సెప్ట్ పరంగా ఇదొక కామన్ సెన్స్ లేని కథగా అన్పిస్తుంది. కానీ దీని అర్ధాలు ఇంకేవో వున్నాయి.
ఇక ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టకపోవడం, కనీసం ఇంట్లో సీసీ కెమెరాలుండచ్చన్న స్పృహగానీ, జాగ్రత్తగానీ లేకుండా పనివాడి కుటుంబం ఎంజాయ్ చేయడం కథా సౌలభ్యం కోసమే. ఇలా యజమాని చాటున ఎంజాయ్ చేసిన పనివాడు చివరికి యజమానినే చంపడం వాడి విశ్వాసరాహిత్యాన్నీ, నేర మనస్తత్వాన్ని కూడా పట్టిస్తోంది. ఇంట్లో సీనియర్ పని మనిషి మధ్యలో హఠాత్తుగా తిరిగొస్తుంది. ఈ వచ్చినప్పుడు తను వచ్చినట్టు యజమానికి తెలియకూడదని గేటు బయట కెమెరా తీగెలు కత్తిరించానని చెప్తుంది. ఈమెకున్న జ్ఞానమైనా పని వాడికి లేదు. తన కుటుంబాన్ని రహస్యంగా ఇంట్లో చేరేస్తున్నప్పుడు ఈ తీగెలు కత్తిరించే పని తనే చేయాలి. చేస్తే ఆ వచ్చిన సీనియర్ పనిమనిషికి బయటే అనుమానమొచ్చి కథే మారిపోతుంది. ఐతే దీని అర్ధాలు కూడా వేరే వున్నాయి.
ఇలా లాజికల్ గా కథ సవ్యంగా లేదు. మరి ఆస్కార్ ఎందుకిచ్చారు? కథా కథనాలెలా వున్నా, విస్తృతార్ధంలో ఆధిపత్య భావజాలాన్ని ప్రకటించడంతో బాటు, అగ్రరాజ్యాల సంతుష్టీకరణ జరగడం వల్లే ననుకోవచ్చు. కథలో ధనిక పేద వర్గాలే లేవు. భవనంలో నివసించే ధనికుడితో బాటు, సెల్లార్ లో బతికే పనివాడు, ఇంకా కింద బంకర్ లో దాక్కున్న ఇంకో వర్గం వాడు కూడా వున్నాడు. ప్రపంచం ధనిక దేశాలు, పేద దేశాలు అనే రెండుగా లేదు. ఉగ్రవాద దేశాలనే మూడుగా కూడా వుంది. ఈ బంకర్ లో దాక్కున్న వాడే ఉగ్రవాద దేశాలకి సింబల్ అయిన ఉన్మాది. అందుకే ధనికుడి కుటుంబం మీద (అంటే సింబాలిక్ గా ధనిక దేశం మీద) ఉన్మాదంగా దాడి జరిపాడు. పనివాడు బానిస మనస్తత్వంతో చంపేశాడు. ఈ రెండు వర్గాల (దేశాల) తో ధనికులూ (అగ్రరాజ్యాలు) తస్మాత్ జాగ్రత్తా అని చెప్పడమే గాక, పేదవాడు (పేద దేశాలు) ఎదగకుండా వుండాలంటే నేరాల వైపు, అశాంతి వైపూ మళ్ళించి, పేదరికమనే శ్లేష్మంలో అలాగే పడి వుండేట్టు చేయాలన్న అగ్రనీతిని ప్రకటించడం.
ఇంకోటేమిటంటే, బిగ్ షాట్ ఇంట్లో ఆడుకునే కొడుకు మెక్సికన్ సంస్కృతిని ఎంజాయ్ చేస్తూ, బాణాలేస్తూ కంగారు పెట్టేస్తూంటాడు. అంటే చొరబాటు దార్లయిన మెక్సికన్లు అంత ప్రమాదకారకులు కారని, చిన్న పిల్లల్లాంటి వారనీ చెప్పడం. ధనికుల జోలికి పేదలు వస్తే ప్రకృతి కూడా వూరుకోదన్నట్టు, భారీ వర్షాన్ని కురిపించి, పనివాడి సెల్లార్ ని నీట్లో ముంచెత్తి, వాడి కుటుంబాన్ని సహాయ శిబిరం పాల్జేశారు. ఇలా ఇన్ని నిగూఢార్ధాలతో ఇదొక కళా ఖండమైంది. ఇది గ్రహించక, వ్యాపారి అయిన ట్రంప్ ఈ సినిమాకి ఆస్కార్ అవార్డునివ్వడాన్ని వ్యాపార దృష్టితో చూసి, దక్షిణ కొరియా వాణిజ్యపరంగా మనల్ని ఇబ్బంది పెడుతోంటే, ఎలా అవార్డు ఇచ్చేశారో చూడండని మండిపడడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

‘అలీటా’ అనే సైన్స్ ఫిక్షన్లో ఊర్థ్వలోకం, అధోలోకమనే రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణ అన్నట్టుగా ఇలాటి కథనే సృష్టించారు.
A : హరీష్ అనే సహాయ దర్శకుడు ఒక ప్రముఖ దర్శకుడి సినిమాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించీ రాస్తే అందరికీ ఉపయోగకరంగా వుంటుందని రాశారు. ఈ బ్లాగు విషయ పట్టికకి కొన్ని పరిమితులున్నాయి. ఇలాటి వ్యాసాలు రాయడం కుదరదు. ‘నాటి సినిమా’, ‘ఆ ఒక్క సినిమా’, 'విస్మృత సినిమాలు' శీర్షికల కింద ఆయా దర్శకులు తీసిన సినిమాల విశ్లేషణలతో బాటు, దర్శకుల బయో డేటా క్లుప్తంగా ఇచ్చాం. అంతవరకే. అయినా ప్రముఖ దర్శకుల గురించి ఎవరైనా కొత్తగా ఇంకేం రాస్తారు. వీకీపీడియా సహా మార్కెట్ లో చాలా సమాచారం ఆల్రెడీ వుంది.
―సికిందర్