‘గరుడవేగ’ టీమ్కి షాక్ ఇచ్చిన కోర్టు!
Updated : 12-Apr-2018 : 19:16
రాజశేఖర్
హీరోగా
నటించిన
‘పీఎస్వీ
గరుడవేగ’
చిత్రం
చాలా
కాలం
తర్వాత
రాజశేఖర్కి హిట్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లపరంగా
మాత్రం
ఈ
సినిమా
ఆకట్టుకోలేకపోయింది.
అయితేనేం
శాటిలైట్, డబ్బింగ్, రీమేక్
హక్కులకు
భారీ
రేటు
రావడంతో
ఈ
చిత్రం
సేఫ్
ప్రాజెక్ట్గానే బయటపడింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ‘గరుడవేగ’ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
విషయంలోకి వస్తే, మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను విన్న అనంతరం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార
కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి జరపకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో ఉందని, ఉన్నతాధికారులు
ఈ
కుంభకోణంలో
భాగస్వాములైనట్లు
ఈ
చిత్రంలో
చూపించారని, ఈ కుంభకోణాన్ని ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్ పాత్రలో హీరో రాజశేఖర్ వెలికితీసినట్లుగా చూపించారని పిటిషనర్ న్యాయవాది తన వాదనని వినిపించారు.
ఈ కేసుపై తదుపరి విచారణను 4 వారాల
పాటు
వాయిదా
వేసినట్లుగా
జడ్జి
తీర్పునిచ్చారు.
అయితే
సడెన్గా జరిగిన ఈ పరిణామంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమా విడుదలై, థియేటర్లలో
నుంచి
వెళ్లిపోయిన
తర్వాత
ఇటువంటి
ఉత్తర్వులు
రావడంతో
చిత్ర
యూనిట్
అయోమయానికి
గురవుతోంది.
(ఆంధ్రజ్యోతి, 12.4.17)
***
స్పెషల్ ఆర్టికల్ రేపు!