Sunday, December 18, 2022
1268 : సండే స్పెషల్ రివ్యూ!
1267 : రివ్యూ!
‘ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’ -సండే స్పెషల్ రివ్యూ!
ఈ రోజు సాయంత్రం
Friday, December 16, 2022
1266 : రివ్యూ!
దర్శకత్వం : జేమ్స్ కామెరూన్
స్క్రీన్ ప్లే : జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్
తారాగణం : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్, ఛాయాగ్రహణం : రస్సెల్
కార్పెంటర్
బ్యానర్స్ : లైట్‌స్టార్మ్ ఎంటర్టైన్మెంట్, టీఎస్జీ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు
: జేమ్స్ కామెరూన్, జోన్
లాండౌ
విడుదల : డిసెంబర్ 16, 2022
బడ్జెట్ : 350-400 మిలియన్ డాలర్లు
కథ
పై మొదటి ‘అవతార్’ కథకి కొనసాగింపుగా రెండో ‘అవతార్’. ఇందులో మొదటి ‘అవతార్’ లో చచ్చిపోయిన విలనే మెమరీని ఇంప్లాంట్ చేసుకుని అవతార్ గా తిరిగి వస్తాడు. ఈ కథని కేవలం దండెత్తి వచ్చిన మానవ జాతి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే సాధారణ హీరో కథగానే చూపించారు. మిగతా సహజ వనరుల ధ్వంసం, ప్రకృతీ, పర్యావరణాల నాశనం వంటి అంశాల జోలికి ఉద్దేశపూర్వకంగానే పోలేదని సినిమా చూస్తే తెలుస్తోంది.
దీంతో అవతార్ హీరో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగత కారణాలకి పరిమితమై, మొత్తం పండోరా గ్రహం శ్రేయస్సు కోసం పోరాడాలన్న విశాల దృక్పథాన్ని పక్కన బెట్టేశాడు. ఫలితంగా కథ డొల్లగా మారింది. కథ లేనందువల్లే కథ జోలికి పోలేదు. ఉద్దేశించిన భావజాలం నుంచి దృష్టిని మళ్ళించేందుకే కాబోలు- ఫాదర్ అనే వాడు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడన్న డైలాగు ప్రారంభంలో వేశారు, మళ్ళీ ముగింపులో వేశారు. ఇలా కథకి సంబంధించి ఫాదర్ మీదికే దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఫాదర్ తిరుగుతూంటే డైలాగుతో ఈ మెసేజ్ బాగానే వుంటుంది. మొదటి నుంచీ ఫాదర్ (హీరో) ని కుటుంబంతో అన్యోన్యంగా చూపిస్తూనే ఈ డైలాగు ఏమిటి? ‘మనం ఎక్కడున్నా మన కుటుంబం కోటలాంటిది’ అని భార్యతో అంటాడు. పండోరా గ్రహమే లేకపోతే పండంటి కోట ఎక్కడుంటుంది. ఇలా పర్యావరణం గురించి కాక కుటుంబం గురించి డైలాగు వచ్చిన ప్రతి సారీ భావజాలాన్ని దాచే కామెరూన్ తాపత్రయం బయటపడుతూంటుంది. కుటుంబం గురించి కాదు- తీయాల్సిన సినిమా వనరుల దోపిడీ గురించి! సముద్ర జీవుల్ని, తిమింగలాల్నీ కూడా విచ్చలవిడిగా చంపేస్తూ చూపించారు.
Thursday, December 15, 2022
1265 : న్యూస్
అయితే ఇది 1990 నాటి సూపర్ హిట్ ‘డ్యాన్సెస్ విత్ వోల్వ్స్’ కి కార్బన్ కాపీ అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టారు విమర్శకులు. ఇది 2009 నాటి ‘అవతార్’ విషయంలో జరిగింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా అప్పట్లో కాపీ చేశానని అంగీకరించాడు. అయితే ఆస్కార్-విజేత ‘డ్యాన్సెస్ విత్ వోల్వ్స్’ కథ భూమి మీద జరిగితే, ‘అవతార్’ కథ అంతరిక్షంలో జరుగుతుందని వివరించాడు.
'అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అత్యంత అందమైన అనుభవం. పెద్ద స్క్రీన్‌పై త్రీడీ లో చూడాల్సిన అనుభవం. నేను దీన్ని పూర్తిగా ఇష్టపడ్డాను. మళ్ళీ చూడాలనుకుంటున్నాను. సాంకేతిక మాయాజాలం పరంగా ఇది ఒక అద్భుతమైన, మనసుని కదిలించే చలన చిత్ర రాజం’ అంటూ ‘పెర్రీ నెమిరోఫ్ (కొలైడర్ పత్రిక) పేర్కొన్నాడు.