రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 25, 2019

803 : ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు





బిగినింగ్ కథనం : బేబీ వృత్తి
       ట్లాంటా సిటీలో ఓ బ్యాంకు ముందు సరికొత్త రెడ్ హోండా సివిక్ కారొచ్చి ఆగుతుంది. కారులో వున్న యంగ్ డ్రైవర్ బేబీ, ఐ పాడ్ తీసి రాక్ ట్రాక్ ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. కారులోంచి బడ్డీ, గ్రిఫ్, డార్లింగ్ లు దిగి గన్స్ తీసుకుని బ్యాంకు వైపు దూసుకెళ్తారు. కారులో వున్న బేబీ హై వాల్యూం పెట్టి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూంటాడు. 

         
కొద్ది క్షణాల్లో దోచుకున్న డబ్బుతో పరుగెత్తుకొచ్చి కారెక్కేస్తారు ముగ్గురూ. ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్ట్ అవుతూంటే, కారుని ముందుకు దూకించి దూసుకుపోతాడు బేబీ. క్షణాల్లో పోలీసు కారు వచ్చి వెంటాడుతుంది...

          పూర్వం కార్ జాకర్ అయిన బేబీ, డాక్ కి బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి దోపిడీలకి గెటవే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డ్రైవింగ్ లో ఎక్స్ పర్ట్ అయిన ఇతను పోలీసులకి దొరక్కుండా సురక్షితంగా గ్యాంగ్ ని డాక్ దగ్గరికి చేరేస్తూంటాడు దోపిడీ సొమ్ము సహా. 

          ఇప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్ట్ అవుతూంటే పోలీసు కారుని తప్పించుకుంటూ నగరమంతా రాష్ డ్రైవింగ్ చేస్తాడు. తర్వాత ఒక కాఫీ షాపులో నాల్గు కప్పులు కాఫీలు తీసుకుని, గార్మెంట్ గోడౌన్ లోకెళ్తాడు. అక్కడ డాక్, బడ్డీ, గ్రిఫ్, డార్లింగ్ లు ఎదురు చూస్తూంటారు. వాళ్ళకి కాఫీలు అందిస్తాడు. 

          ఏంటి వీడెప్పుడూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వుంటాడు - అని బేబీని చూసి చిరాకుపడి డాక్ ని అడుగుతాడు గ్రిఫ్. వాడికి ఒక యాక్సిడెంట్ వల్ల చిన్నప్పుడు చెవులకి టినిటస్ వచ్చింది, ఉండుండి చెవుల్లో ఏమీ విన్పించదు. ఆ భయంకర నిశబ్దాన్ని వాడలా మ్యూజిక్ తో భర్తీ చేస్తూంటాడు - అని డాక్ వివరిస్తాడు. అయినా గ్రిఫ్ బేబీని ఇయర్ ఫోన్స్ లాగి, స్పెక్ట్స్ కూడా లాగి రెచ్చగొడతాడు. బేబీ రెచ్చిపోకుండా కూల్ గా కూర్చుని వుంటాడు. గ్యాంగ్ ముగ్గురూ వెళ్ళిపోతారు. ఈసారి డాక్ కాల్ చేస్తే రెస్పాండ్ అవకు - అని బేబీతో అని వెళ్ళిపోతాడు బడ్డీ. వాడి మాటలు పట్టించుకోవద్దంటాడు డాక్. బ్యాంకు దోపిడీ జాబ్ కి బేబీ కివ్వాల్సిన పేమెంట్ ఇచ్చేస్తాడు డాక్.

బేబీ జీవితం
        బేబీ ఓ ఫ్లాట్ లో ఎనభై ఏళ్ల పెంచిన  తండ్రి జోసెఫ్ తో వుంటాడు. ఇతను ఆఫ్రికన్ అమెరికన్. చెవిటి మూగ. పైగా పక్షవాతంతో వీల్ చైర్లో వుంటాడు. బేబీ ఫ్లోర్ మీద ప్లేటు లాగి, లోపల నోట్ల కట్ట పడేసి మూసేస్తాడు. ఆ ‘సీక్రెట్ లాకర్’ లో చాలానోట్ల కట్టలుంటాయి. వీడేదో ఇల్లీగల్ పని చేస్తున్నాడని జోసెఫ్ కి అనుమానం. ఇద్దరూ సైన్ లాంగ్వేజీలోనే మాట్లాడుకుంటారు.      

          ఫ్లాట్ లో బేబీ గది ఒక మ్యూజియంలా వుంటుంది రకరకాల మ్యూజిక్స్ తో, ప్లేయర్స్ తో. ఎల్పీ ప్లేయర్, వినైల్ ప్లేయర్, కేసెట్ డెక్ లు, సీడీ ప్లేయర్లు, వాక్ మాన్లు, డిక్టా ఫోన్లు, ఐ పాడ్ లు, ఇంకా ఇతర రికార్డర్లు; వీడియో, ఆడియో టేపులు, సీడీలు, ఎల్పీ రికార్డులు వంటి  ఫిజికల్ మీడియా... ఇవన్నీ ఏ కాలంలో ఎలా వస్తే అలా కొన్నట్టు వుంటాయి. చాలా ఏళ్లుగా  ఇతను మ్యూజిక్ తో జీవిస్తున్నట్టు తెలుస్తుంది. కంప్యూటర్ మాత్రం వుండదు.

      డాక్ తో జరిగే మీటింగ్స్ ని రహస్యంగా రికార్డు చేసి తెచ్చుకుని, ఆ సంభాషణలకి మ్యూజిక్ ని కలిపి రీమిక్స్ చేస్తూంటాడు. అరల్లో ఎన్నో టేపులు పేర్చి వుంటాయి. వాటిలో ప్రధానంగా కన్పించేది  ‘మామ్’ అని రాసివున్న టేప్.
          ఇప్పుడు డాక్, గ్రిఫ్ లు తన గురించి మాట్లాడుకున్న మాటల్ని రీమిక్స్ చేసి వింటాడు. నిద్రవస్తూంటే మొబైల్ లో ట్రాక్ ఆన్ చేస్తాడు. రకరకాల కాలర్ ట్యూన్స్ కలిపి తయారు చేసుకున్న ట్రాక్ అది. అలా చైర్లో కూర్చునే నిద్రలోకి జారుకుంటాడు. జారుకోగానే - ఫ్లాష్ బ్యాక్. 

          ఫ్లాష్ బ్యాక్ లో –
          ఇదే ఫ్లాట్ లో, ఇదే గదిలో, ఇదే టేబుల్ ముందు, ఇదే చైర్లో, ఏడేళ్ళ బేబీ భయం భయంగా కూర్చుని చూస్తూంటాడు. మొహం మీద గాయాలుంటాయి. తలెత్తి ఒకతన్ని చూస్తాడు. అతను శాండ్ విచ్ అందిస్తూ - నువ్వు ఓకేనా? - అంటాడు. 

          కారు పోతూంటుంది. వెనుక సీట్లో కూర్చున్న బేబీ తీవ్ర భయాందోళనలతో చూస్తూంటాడు. ఇయర్ ఫోన్స్ గట్టిగా పెట్టుకుని వుంటాడు. ఒకావిడ ఏడ్చేస్తూ డ్రైవింగ్ చేస్తూంటుంది. పక్క సీట్లో వున్నతను ఆమె మీద అరుస్తూంటాడు. వెళ్లి వెళ్లి కారు ముందున్న ఇంకో వాహనాన్ని బలంగా గుద్దేస్తుంది. పెద్ద శబ్దంతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్. 

          ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు బేబీ. కలలోకి వచ్చిన ఆ దృశ్యంతో వర్రీ అవుతాడు. చైర్లోంచి లేచిపోతాడు. టేబుల్ మీదున్న పాత ఐపాడ్ కేసి చూస్తాడు. అది 2001 నాటిది,  పగిలిపోయి వుంటుంది...

గర్ల్ ఫ్రెండ్ పరిచయం, కొత్త జాబ్ :
       మార్నింగ్ బేబీ ‘బో డైనర్’ కెళ్తాడు. అక్కడ వెయిటర్ గా పనిచేస్తున్న డెబొరా పరిచయంవుతుంది. ఆమె ‘బేబీ ...’ అంటూ సన్నగా పాటపాడుకుంటూ పనిచేయడం గమనిస్తాడు. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఆకర్షణలో పడతాడు. తను డ్రైవర్ నని పరిచయం చేసుకుంటాడు. తనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని వుందని అంటుంది. ఎప్పుడు వీలవుతుందో తెలియదంటుంది. ఆమె పాడుతున్న పాటేమిటో తెలుసుకుంటాడు. 

          పాత సీడీ షాపు కెళ్ళి ఆ ‘బేబీ’ పాట కొనుక్కుని ప్లాట్ కెళ్ళి,  ఆ పాట పెట్టుకుని డాన్స్ చేయడం మొదలెడతాడు. వీడికి పిల్ల దొరికినట్టుందని జోసెఫ్ అనుకుంటాడు.       డాక్ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్
కి వెళ్ళి  ఇంప్రెస్ చేయాలనీ, కొత్త డ్రెస్ వేసుకుని రమ్మనీ అంటాడు. కొత్త డ్రెస్ లో బెంజి కారు డ్రైవ్ చేస్తూ డాక్ ని రిచ్ రెస్టారెంట్ కి తీసికెళ్తాడు. ఎక్కువ టైం పట్టదు, లోపల ఫైరింగ్ జరిగితే గ్లోవ్ కంపార్ట్ మెంట్ ఓపెన్ చెయ్ - అని చెప్పి రెస్టారెంట్ లోకి వెళ్ళిపోతాడు డాక్. కారులో గ్లోవ్ కంపార్ట్ మెంట్ ఓపెన్ చేసి చూస్తాడు బేబీ. పిస్టల్ వుంటుంది. అద్దాల్లోంచి రెస్టారెంట్ లోపలికి  చూపు సారిస్తాడు. ముగ్గురు రిచ్ వ్యక్తులతో కూర్చుని వుంటాడు డాక్. పిస్టల్ గురించి మాట్లాడాడంటే వాళ్ళు క్రిమినల్స్ అయివుంటారని అనుకుంటాడు బేబీ. ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్టవుతూంటే,  లిప్ మూమెంట్స్ ని బట్టి వాళ్ళేం  మాట్లాడుకుంటున్నారో వూహిస్తాడు  బేబీ. మూతి వంకర్లు తిప్పుతూ వాళ్ళని మిమిక్రీ చేస్తాడు. 

       కొత్త జాబ్ ఓకే అయిందని వచ్చి చెప్తాడు డాక్. ఇంకో గోడౌన్ లోకి తీసికెళ్ళి కొత్త గ్యాంగ్ ని పరిచయం చేస్తాడు. ఎడ్డీ, జేడీ, బ్యాట్స్.  జేడీ బేబీ కేసి చూసి - ఈ మాటలు రాని మూగోడితో పని చేయాలా మేమూ - అంటాడు. ఏంటి నువ్వు మూగోడివేనా? -  అని బ్యాట్స్ అడుగుతాడు. నో - అంటాడు బేబీ ముక్తసరిగా. 

          ఈ కిడ్ నాకు నచ్చాడు, మ్యూజికల్ కిడ్ -  అంటాడు జేడీ. వీడిన్ని ఫోన్ కాల్స్ వింటూంటే పని మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాడని బ్యాట్స్ అడుగుతాడు. వాడి చెవులకి వస్తున్నవి ఫోన్ కాల్స్ కాదని డాక్ అంటాడు. డ్రైవర్ అన్నాకా కళ్ళతో పాటు చెవులు కూడా పని మీద వుండాలి కదా -  అంటాడు బ్యాట్స్. వీడు మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యడంటే చెయ్యడంతే -  అని ఫైనల్ గా అనేస్తాడు డాక్. 

          దోపిడీ జాబ్ ప్లాన్ చెప్పడం ప్రారంభిస్తాడు డాక్. బ్లాక్ బోర్డు మీద రూట్స్, టైమింగ్స్ వేసి చూపిస్తూ చాలా సేపు వివరిస్తాడు. ఇదేం పట్టించుకోకుండా మ్యూజిక్ వింటున్న బేబీ మీద మండి పడతాడు బ్యాట్స్. వీడేం వినకుండా కూర్చుంటే వీడితో మేమెందుకు వెళ్ళాలంటాడు. అప్పుడు బేబీ డాక్ వివరించిన ప్లాన్ ని పొల్లు పోకుండా మొత్తం చెప్పేస్తాడు. దటీజ్ మై బేబీ - అంటాడు డాక్.

జాబ్ ఆపరేషన్ :
       బేబీకిది చివరి జాబ్. దీంతో డాక్ కి పడిన బాకీ తీరిపోతుంది. దీంతో మంచి జాబ్ లో చేరి, డెబొరాతో కారేసుకుని, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని అనుకుంటాడు. కొత్త కార్లో గ్యాంగ్ ని తీసుకుని స్పాట్ కొస్తాడు. అక్కడ ఏటీఎం నగదు డెలివరీ కొచ్చిన వ్యాను వుంటుంది. గ్యాంగ్ ముగ్గురూ డాక్ ఇచ్చిన మాస్కులు ధరిస్తారు. హెలోవీన్ మాస్కులు కొనుక్కోమని డాక్ అంటే, ఆస్టిన్ పవర్స్ కమెడియన్ మాస్కులు తెచ్చాడు జేడీ. అవి వేసుకుని ఆయుధాలతో వ్యాను మీద దాడి చేస్తారు. గార్డ్ చచ్చి పోతాడు. డబ్బు సంచులు  పట్టుకుని వచ్చేసి కారెక్కేస్తారు గ్యాంగ్. 

          మ్యూజిక్ వింటున్న బేబీ కారుని ముందుకి దూకిస్తాడు. కొంత దూరంలో నేవీ ఉద్యోగి కారుని గుద్దేస్తాడు.  నేవీ ఉద్యోగి ఫైరింగ్ చేస్తూ వెంటబడతాడు. చాలా ఛేజింగ్ జరిగి బేబీ ఆ కారునొదిలేసి, ఇంకో కారులో వున్నావిణ్ణి  బిడ్డతో సహా దింపేసి ఆ కారుని అపహరిస్తాడు. గ్యాంగుని డాక్ దగ్గరికి చేరేస్తాడు.

          గోడౌన్లో డాక్ గ్యాంగ్ ని మీటవుతాడు. బేబీ నాల్గు కాఫీలు తీసుకొస్తాడు. ఇక్కడ ముగ్గురే వుంటారు. జేడీ వుండడు. జేడీ ఎక్కడ? – అని డాక్ అడుగుతాడు. ఎక్కడా? -  అన్నట్టు బేబీనే చూస్తారు ఎడ్డీ, బ్యాట్స్. డాక్ వాళ్ళిద్దరికీ డబ్బు పంచేస్తాడు. 

          అండర్ గ్రౌండ్ పార్కింగ్ లోకెళ్లాక బేబీ పేమెంట్ ఇచ్చేస్తాడు డాక్.  అతడి కారు డిక్కీకి రక్తం కనబడుతుంది. ఇక నువ్వు ఫ్రీ అయిపోయావ్ పో బేబీ...ఐతే ఓ చిన్న పని - అని ఆగుతాడు డాక్. బేబీ డిక్కీ తెరుస్తాడు. జేడీ శవం వుంటుంది.

ప్లాట్ పాయింట్ వన్ :
         జంక్ యార్డ్ లో ఆ కారుని అప్పగిస్తాడు బేబీ. జేడీ శవం సహా అది హైడ్రాలిక్ మెషీన్ లో క్రష్ అవుతూంటే - కళ్ళు మూసుకుంటాడు బేబీ.
          ఫ్లాష్ బ్యాక్ –
          అదే కారు జంక్ యార్డ్ లో క్రష్ అవుతూంటుంది, చిన్నప్పుడు యాక్సిడెంట్ పాలైన తమ కారు...రివర్స్ లో వెనక్కి పోతే - అతనామె మీద అరుస్తూంతాడు. ఆమె ఏడ్చేస్తూ డ్రైవింగ్ చేస్తూంటుంది. రివర్స్ లో వెనక్కి వెళ్తే - ఫ్లాట్ లో ఏడేళ్ళ బేబీ కూర్చుని వుంటాడు. బెడ్రూంలోంచి అరుపులు విన్పిస్తూంటాయి. బేబీ తన ముందున్న గిఫ్ట్ ని ఓపెన్ చేస్తాడు. ఐ పాడ్ వుంటుంది. బెడ్రూం వైపు చూస్తాడు. ఇద్దరి అరుపులు తీవ్రతర మవుతాయి. బేబీ వంగిపోయి ఆ అరుపులు వినపడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఐ పాడ్ వింటూంటాడు. ఆమె గబగబా వచ్చేసి అతడి మీదికి వంగి చూస్తుంది. ఆమె మేకప్ అంతా చెదిరిపోయి వుంటుంది. బేబీ ఇయర్ ఫోన్స్ లాగి, ‘హేయ్ బేబీ...’ అంటుందామె. కళ్ళు  మూసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఎండ్.
          బేబీ తల్లి సింగర్, తండ్రి తాగుబోతు.
***
      ఇదీ బిగినింగ్ కథనం. 38 సీన్లతో 35 నిమిషాల నిడివితో వుండే ఈ బిగినింగ్ విభాగం కథనం, రొటీన్ గా వుండే సమస్యకి దారితీసే పరిస్థితుల కథనంతో లేకపోవడాన్ని గమనించాలి. దీనికి విరుద్ధంగా సమస్యని తీర్చేసి, గోల్ ని పూర్తి చేసేసే కథనంతో వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ అంటే సాధారణంగా అనుకునేది సమస్యని ఏర్పాటు చేసి, క్యారెక్టర్ కి ఒక గోల్ ని ఇవ్వడమని. ఇది రివర్స్ అయిందిక్కడ. అంటే సమస్యని తీర్చేసి, గోల్ ని పూర్తి చేసేసే ప్లాట్ పాయింట్ వన్ గా,  పాజిటివ్ నోట్ తో దర్శనమిచ్చింది. పై కథనంలో ఇది స్పష్టంగా గమనించవచ్చు. ఇదే దీని ప్రత్యేకత. ఇందుకే ఇది విజువల్ స్క్రిప్టు. ఏదైతే డిఫరెంట్ గా వుంటుందో అది విజువల్ స్క్రిప్టు. 

          ప్లాట్ పాయింట్స్ మధ్య బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల్లో అవే సాంప్రదాయ బిజినెస్ తో కూడిన కథనాలు చేస్తూంటే కమర్షియల్ సినిమాలు ఒకే పోతలో పోసినట్టు యాంత్రికంగా, మూసగా వుంటున్నాయి. ప్రత్యాన్మాయంగా, ప్లాట్ పాయింట్స్ మధ్య  సాగే బిజినెస్ తో క్రియేటివిటీలకి పాల్పడితే, ఆయా విభాగాల కథనాలకి కొత్తదనం రావడమే గాక, ప్లాట్ పాయింట్స్ కూడా మొనాటనీని వదిలించుకుని, తేరుకుని నిటారుగా కూర్చుని చూసేలా చేస్తాయి. సినిమా చూసే పద్ధతినే మార్చే స్తాయి. దిసీజ్ విజువల్ రైటింగ్, విజువల్ స్క్రిప్టు. 

          స్ట్రక్చర్ లేకుండా సినిమాలు తీయడమెంతో,  స్ట్రక్చర్ తో ప్రయోగాలు చేయడమూ అంతే. ఫ్లాపుల్ని ప్రసాదించడం. ఐతే స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడవచ్చు. ఉత్త క్రియేటివిటీయే చాలనుకుని స్ట్రక్చర్ వద్దనుకున్నా, స్ట్రక్చర్ తో ప్రయోగాలూ చేసినా  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు, పాసివ్ హీరో పాత్రలు, సెకండాఫ్ సిండ్రోములు, మధ్యకి ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేలూ వగైరా జన్మ పోసుకుంటాయి; కథ గాకుండా గాథలు పుడతాయి. జరగాల్సిన  నష్టాలన్నీ జరిగిపోతాయి. స్ట్రక్చర్ రహిత క్రియేటివిటీ అంటే తెలియక చేసుకునే ఆత్మవంచనే. 

          ఉత్త క్రియేటివిటీలతోనే సినిమా కథలు తయారయ్యే మాటే నిజమైతే స్ట్రక్చర్ గురించి ఇన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలు వుండవు, స్క్రీన్ ప్లే వ్యాసాలుండవు, స్క్రీన్ ప్లే వెబ్ సైట్స్ వుండవు, ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో స్క్రీన్ ప్లే కోర్సులూ వుండవు. ఉండనివి ఉత్త క్రియేటివిటీతో కథ ఎలా తయారవుతుందో చెప్పేశాస్త్రాలే. క్రియేటివిటీ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని స్ట్రక్చర్ లోంచి పుడుతుంది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ అమ్మలేని అనాధ.        


            స్ట్రక్చర్ లో ప్లాట్ పాయింట్స్ తో క్రియేటివిటీకి పాల్పడుతున్నప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ని ఎంత దూరంగా ఏర్పాటు చేస్తే అంత కథా ప్రారంభం ఆలస్యమవుతుంది. అంటే బిగినింగ్ అంత జీడిపాకంలా సాగుతుంది. అరగంటలో ప్లాట్ పయింట్ వన్ అంటే, సకాలంలో కథా ప్రారంభం. ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ అంటే, అంతవరకూ కథా ప్రారంభం వాయిదాపడి  బిగినింగ్ అనవసరంగా సాగుతూ పోవడం. సెకెండాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ అంటే, కథా ప్రారంభం నిరవధికంగా వాయిదాపడి - బిగినింగ్ జీడిపాకంలా సాగిసాగి విసిగించి -  చివరికి మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవడం. 

          కాబట్టి  ప్లాట్ పాయింట్ వన్ ని గరిష్టంగా ఇంటర్వెల్ వరకూ జరపవచ్చు. ఆ లోపే అరగంటలో అయితే శ్రేష్ఠం. కానీ ప్లాట్ పాయింట్ టూతో ఇలా కాదు - దీన్ని ఇంటర్వెల్ తర్వాత ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చు, ఎంత దగ్గరగానైనా దూరంగానైనా జరుపుకోవచ్చు. ‘ఈక్వలైజర్ -2’  లో ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ వచ్చేస్తుంది. అక్కడ్నించీ సుదీర్ఘంగా 40 నిమిషాల పాటూ క్లయిమాక్సే. ఇది సినిమా సెకండాఫ్ వీక్షణానుభవాన్నే మార్చేసింది. రొటీన్ గా సెకండాఫ్ ఎలా వుంటుంది? ఓ గంటో, ఇంకా పైనో మిడిల్ నడిచి, అప్పుడు ప్లాట్ పాయింట్ టూ వచ్చి, పావుగంట క్లయిమాక్స్ ప్రారంభమవుతుంది. ‘ఈక్వలైజర్ -2’ లో దీన్ని రివర్స్ చేశారు. మిడిల్ పది నిమిషాలే చూపించి, క్లయిమాక్స్ 40 నిమిషాలు చూపించేశారు ఇన్నోవేటివ్ గా! 

          స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే కథ. ఇది స్క్రీన్ ప్లేలో యాభై శాతం, అంటే కనీసం గంట సేపు వుండాలని శాస్త్రం చెప్పారు అనుభవజ్ఞులు. వాళ్ళనుభవించిన తీరుబడి కాలం వేరు. మనం వుంటున్న తీరిక లేని కాలం వేరు. ఇది విజువల్ ప్రపంచం, కలియుగం యాక్షన్ లో వున్న ప్రపంచం. కథ గురించని గంట సేపూ కూర్చోబెట్టకుండా, పది నిమిషాల్లో చప్పున కథ (మిడిల్) ముగించేసి - క్లయిమాక్స్ యాక్షన్ కెళ్ళిపోవడం ‘ఈక్వలైజర్ -2’ లో చేసిన సక్సెస్ ఫుల్ క్రేజీ థాట్! 

          ఇదే క్రేజీ థాట్ అనుకుంటే గతవారం  ‘కేసరి’ లో ఇంటర్వెల్ కే కథ ముగించేసి, సెకండాఫ్ స్టార్ట్ టు ఫినిష్ గంటన్నర పాటూ క్లయిమాక్స్ చూపించేశారు! అంటే ఫస్టాఫ్ ఇంటర్వెల్ లోపే బిగినింగ్, మిడిల్ అంతా  ముగించేసి, ఇంటర్వెల్ లోనే ప్లాట్ పాయింట్ టూ పెట్టేశారన్న మాట!

          స్ట్రక్చర్ తో ఇలా డిఫరెంట్ క్రియేటివిటీలు చేస్తే సినిమాలన్నీ ఒకేలా ఎందుకుంటాయి? ఒక్కోటీ ఒక్కో కొత్త అనుభవాన్నిస్తాయి. స్క్రీన్ ప్లేల్లో వుండే రెండు ప్లాట్ పాయింట్స్ తో కొత్తగా ఏం చేస్తారో అదే  నిజమైన క్రియేటివిటీకి మచ్చు తునక. సినిమా కథ ఆలోచించడమంటే ప్లాట్ పాయింట్స్ ఆలోచించడమే. స్క్రీన్ ప్లే అనే చదరంగంలో ప్లాట్ పాయింట్స్ అనే పావులతో ఆడుకునే ఆటే ఈ కాలపు సినిమా.

          ఇలా పై రెండు సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ కీ,  ప్లాట్ పాయింట్ టూకీ మధ్య మిడిల్ బిజినెస్ ని తగ్గించేసే క్రియేటివ్ ప్రయోగాలూ చేసినట్టూ, ప్లాట్ పాయింట్ వన్ వరకూ కూడా బిగినింగ్ బిజినెస్ తో క్రియేటివిటీ చూపిస్తే? ఆదుగో, దొంగరాముడు, ది మేయర్, బ్రిక్, ఇట్సె వండర్ఫుల్ లైఫ్ వంటివి  కొన్ని చూశాం ఎలా భిన్నంగా మారిపోతాయో. ఇప్పుడు బేబీ డ్రైవర్ వచ్చి చేరింది. బేబీ డ్రైవర్ బిగినింగ్ బిజినెస్ కీ, ఇట్సె వండర్ఫుల్ లైఫ్ బిగినింగ్ బిజినెస్ కీ పరస్పర వ్యతిరేక దగ్గరి పోలికలుంటాయి. ఇట్సె వండర్ఫుల్ లైఫ్ లో అతను విదేశాలకి వెళ్లి బిల్డర్ నవ్వాలన్న కలలతో ఆ మేరకు కృషి చేస్తూంటాడు. తీరా విదేశానికి ప్రయాణం కడుతున్న ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తండ్రి మరణంతో కల చెదిరి, గోల్ కుప్పకూలి ఇష్టంలేని తండ్రి బిజినెస్ ని చేపట్టే అగత్య మేర్పడుతుంది. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ రివర్స్ అయింది. బేబీ డ్రైవర్ లో ఇతను డాక్ తో రుణ విముక్తుడై, వేరే మంచి పని చూసుకుని గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్న కోరికతో వుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అలాగే రుణవిముక్తుడైపోతాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ సక్సెస్ తో వుంది. ఇదీ తేడా.

***
      ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడడం సాంప్రదాయ కథనం. అంటే క్యారెక్టర్ కి ప్లాట్ పాయింట్ వన్ వరకూ గోల్ ఏమిటో తెలిసి వుండదు. అక్కడ పుట్టే సమస్య వల్లే తెలుస్తుంది. ఇలా ఈ గోల్ ని ఇకముందెప్పుడో సాధిస్తాడు. కాబట్టి ఈ గోల్ ని పోస్ట్ పెయిడ్ గోల్ అనుకుందాం. అన్ని సినిమాల్లో ఈ పోస్ట్ పెయిడ్ గోలే కదా వుంటుంది. మరి ప్రీ పెయిడ్ గోల్ కూడా వుంటే?  బేబీ డ్రైవర్ లో వుంది. ఇందులో సాంప్రదాయేతర కథనంతో ప్లాట్ పాయింట్ వన్ కల్లా గోల్ పూర్తయిపోయింది. అంటే ఈ  గోల్ గురించి ముందునుంచే తెలిసి వుంది బేబీకి. డాక్ తో రుణ విముక్తుడవాలన్న గోల్ ముందు నుంచి తెలిసే వుంది బేబీకి. అది ప్లాట్ పాయింట్ వన్ కల్లా నెరవేర్చుకున్నాడు. కాబట్టి ఈ గోల్  ప్రీ పెయిడ్ గోల్ అయింది. ప్రీ పెయిడ్ గోల్ లో గోల్ ముందే తెలిసి వుంటుందన్నమాట.

          మరి ఇలా గోల్ పూర్తయ్యాక ఇక కథే ముంటుంది? అందుకని కథ పుట్టేందుకు అయిపోయిన ఈ ప్రీ పెయిడ్  గోల్ రీచార్జికి ఒక లీడ్ ని పెట్టుకున్నారు. ప్లాట్ పాయింట్ వన్ కల్లా గోల్ రీచ్ అవడంతో ప్రీ పెయిడ్ కనెక్షన్ ఛార్జింగ్ అయిపోయినట్టే. మళ్ళీ రీచార్జి చేసుకుంటేనే కథ.  
       
          సినిమాల్లో ఇంటర్వెల్లో కథ ఒక దగ్గరికి వచ్చి ఆగుతుంది. దాని కంటిన్యుటీ కోసం, సెకండాఫ్ కొనసాగేందు కోసం ఒక లీడ్ ఏదో ఇస్తారు. ఈ లీడ్ లేకపోతే  ఇంటర్వెల్లో కథ తెగిపోయినట్టు వుంటుంది. ఇలాగే  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా ప్రీ పెయిడ్ గోల్ పూర్తయిపోతే, కథ అయిపోయిందన్న భావమేర్పడకుండా, ప్రీ పెయిడ్ గోల్ లో ఇన్ బిల్ట్ గా – అంతర్లీనంగా లీడ్ ఇచ్చారు బేబీ డ్రైవర్ లో. 

          బేబీ రెండు పెట్టుకున్నాడు : రుణ విముక్తుడవడం, అయ్యాకా ఇంకో మంచి పని చూసుకుని గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళడం. వీటిలో ముందు రుణ విముక్తుడవడమే గోల్. ఇది పూర్తయితేనే రెండోది సాధ్యమవుతుంది. కాబట్టి మొదటి దాన్నే ఆపరేషనల్ గోల్ గా  పెట్టుకుని దాంతో కొనసాగాడు. రెండోది బఫర్ గోల్ గా పెట్టుకున్నాడు. ఆపరేషనల్ గోల్ పూర్తయితే అప్పుడు బఫర్ గోల్ బయటికి తీస్తాడు. దాన్ని ఆపరేషనల్ గోల్ గా  మార్చుకుని తిరిగి కొత్త ప్రయాణం కొనసాగిస్తాడు. 

           ఇదీ ప్లాట్ పాయింట్ వన్ లో కథని అందుకోవడానికి చేసిన ఇంజనీరింగ్. లీడ్ గా బేబీ క్యారెక్టర్ కి బఫర్ గోల్ నిచ్చారు. ఆ బఫర్ గోల్ నిప్పుడు పైకి తీసి రీచార్జి చేసుకుంటాడు బేబీ. ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథేమిటంటే, మంచి పనిచూసుకుని, పిల్లనేసుకుని షికారు వెళ్ళడం. ఇప్పుడేం జరుగుతుందో ఇక మిడిల్లో చూడాలి. ఆల్రెడీ ఒక అభిప్రాయమందింది ఒక దర్శకుడి నుంచి - బేబీ డ్రైవర్ మిడిల్ కథనం మనం ఎదురు చూసే రెగ్యులర్ రొటీన్ గా లేకుండా ఫ్రెష్ గా వుందని.  

***
        బిగినింగ్ కథనాన్ని ఐదుగా విభజిస్తే ఇలా వుంటుంది :  బేబీ వృత్తి, జీవితం, గర్ల్ ఫ్రెండ్ పరిచయం - కొత్త జాబ్, జాబ్ ఆపరేషన్, ప్లాట్ పాయింట్ వన్. ఈ బిగినింగ్ కథనాన్ని నిలబెట్టడానికి ప్రారంభంలో ఒక దోపిడీ యాక్షన్, ముగింపులో ఇంకో దోపిడీ యాక్షన్ అనే రెండు పిల్లర్స్ తో మధ్య కథనానికి దడి కట్టారు. రెండు దోపిడీ యాక్షన్స్ లో మొదటి గ్యాంగే రెండోసారి కూడా లేకుండా కొత్త గ్యాంగ్ తో ఫ్రెషప్ చేశారు. ఈ డైనమిక్స్ తో కూడిన ఫ్రేమింగ్ బిగినింగ్ కెంతో వన్నె తెచ్చింది.

          బిగినింగ్ బిజినెస్ లో  1. కథ ఏ కోవకి చెందిదో నేపథ్యంలో తెలిసిపోతూనే వుంది, 2. బేబీ, అతడి పెంచిన తండ్రి, గర్ల్ ఫ్రెండ్, బాస్ పాత్రలు పరిచయమయ్యాయి, 3. ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఇక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యనేర్పాటు చేసి, గోల్ నిచ్చే కథనం కాదిది. గోల్ ని పూర్తి చేసే కథనం. బాస్ బాకీ తీర్చి వెళ్ళిపోవడమే గోల్.  4. గోల్ పూర్తయ్యాక ఏం చేద్దామని? ఇది బేబీకి తెలీదు. ఎప్పటిదాకా తెలీదు? గర్ల్ ఫ్రెండ్ పరిచయమయ్యేదాకా తెలీదు. ఆమె పరిచయమయ్యాకే, వేరే మంచి పని చూసుకోవాలనుకున్నాడు. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుందని ఆమె అన్నాకే ఆమెతో లాంగ్ డ్రైవ్ వెళ్ళే ఆలోచన చేశాడు. కాబట్టి గోల్ పూర్తయ్యాక చేసే పనులివే. 

          ఈ కథనం వుండాల్సిన వరస క్రమంలో ఎలా వుందో చూద్దాం. దోపిడీతో వృత్తి చూపించేశారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం చూపించారు. ఇందులో పెంచిన తండ్రి వున్నాడు. ఇంత ముసలి  తండ్రిని చూపిస్తున్నారంటే ఎక్కడో ఇతడికి ప్రమాదముంటుందన్న సంకేతముంది. బేబీకున్న మ్యూజికల్ లోకాన్ని చూపించారు. అతడి ఇయర్ ఫోన్స్ అలవాటుకి కారణమేమిటో ముందే బాస్ చేత చెప్పించారు. అది చిన్నప్పటి ప్రమాద ఫలితం. ఇక బేబీ లోతట్టు జీవితాన్ని చూపించారు. ఆ లోతట్టు జీవితంలో ఫ్లాష్ బ్యాక్ వేసి తల్లిదండ్రులతో అతడి ట్రాజడీ చూపించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ కేవలం రెండు మూడు షాట్స్ తో కూడిన ఫ్లాష్ కట్. ఈ ఫ్లాష్ కట్ లో తల్లితో ప్రేమాప్యాయతలు చూపించలేదు. చూపిస్తే శిల్పం చెడుతుంది. శిల్పమేమిటి? షాకింగ్ ట్రాజడీ. ఇదే చూపించాలి. కాకుండా, అమ్మా బుచ్చీ బావున్నావా నా చిట్టి తండ్రీ...అని తెలుగు చాదస్తాలతో మదర్ సెంటిమంటలు పెడితే మొత్తం తగులబడి పోతుంది. ఈ మంటలు గర్ల్ ఫ్రెండ్ సీన్లకి కూడా వ్యాపిస్తాయి. మదర్ తో వున్నదే లవర్ తో కూడా వుంటే కథనం శిల్పం చెడినట్టే. మదర్ తో ప్రేమని చూపించి, లవర్ తో కూడా ప్రేమని  చూపిస్తే ఇంకెక్కడి శిల్పం, ఇంకెక్కడి డైనమిక్స్. కాబట్టి మదర్ దగ్గర దొరకనిది లవర్ దగ్గర పొందుతున్నట్టు వుంటేనే శిల్పం, డైనమిక్స్. ఈ ముందు చూపుతోనే మదర్ తో ఫ్లాష్ కట్ ఆమె పరిస్థితుల్లోంచి టెర్రిఫయింగ్ గా వేశారు. 

          మదర్ తో ఇలా చిన్నప్పటి ట్రాజడీ చూపించాక, ఇక ఫ్రెష్ గా గర్ల్ ఫ్రెండ్ పరిచయం. రెస్టారెంట్ లో ఈమె సన్నగా బేబీ అని పాట పాడుకుంటూ పోతూంటే చూశాడు. వెంటనే కనెక్ట్అయిపోయాడు. ఎందుకు కనెక్ట్ అయిపోయాడు?  బేబీ అంటూ తన పేరే స్వీట్ గా వినిపించినందుకా? కాదు, ఇంత లేకి తెలుగు ప్రేమ కాదు. మరి ఆమె సంగీతప్రియురాలనా? ఇంత చవక తెలుగు ప్రేమ కూడా కాదు. తన మదర్ సింగర్, ఈమే సింగర్. మదర్ గుణాలు అమ్మాయిలో కన్పిస్తే అమ్మాయికి పడిపోతాడు మగపురుగనే వాడు. బేబీగాడు ఇలా పడిపోయాడు. ఇక ఈ ప్రేమ వదిలేది కాదు. తెలుగు రోమాంటిక్ కామెడీ దర్శకుడుకి అర్ధమై చావని ప్రేమ!

          తను డ్రైవర్ అని చెప్పగానే తనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుందని అనేస్తుంది. ఇక వూరుకుంటాడా? డాక్ బాకీ తీర్చేశాక ఏం చేయాలో డిసైడ్ అయిపోయాడు. ఈమె పరిచయం పుణ్యమాని ఇక మంచి పనేదో చూసుకోవాలని కూడా డిసైడ్ అయిపోయాడు. వీళ్లిద్దరి మధ్య ఇంకొక్క సీను మాత్రమే వుంటుంది. ఆ సీనులో కూడా ప్రేమని వ్యక్తం చేసినట్టు చూపించరు.  ఇది ప్రేమ కథని ప్రారంభించే స్క్రీన్ ప్లే ఏరియా కాదు. బేబీ ఆపరేషనల్  గోల్ ని మాత్రమే పూర్తి చేసే ఏరియా. ఇందుకే ఇందులోకి ఇద్దరి ప్రేమని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేయలేదు. ప్రేమ తాలూకు కథనమంతా మిడిల్ ఏరియాలోనే. కాబట్టి అక్కడి అవసరానికి అట్టి పెట్టుకున్నాడు దర్శకుడు. 

          ఇలా గర్ల్ ఫ్రెండ్ పరిచయ క్రమాన్ని ముగించి తిరిగి కొత్త దోపిడీ జాబ్ చూపించారు. దీంతో బేబీకి డాక్ బాకీ తీరిపోయింది. ఇక ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ సీన్లో జేడీ శవమున్న కారుని క్రష్ చేయిస్తూంటే,  బేబీకి ఇంకో చిన్నప్పటి ఫ్లాష్ కట్. ముందు చూపించిన ఫ్లాష్ కట్ లో మదర్ ని చూపించలేదు. ఇప్పుడు చూపించి ఈ ఫ్లాష్ కట్ కి డైనమిక్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రమే ఆమె వచ్చి ‘హేయ్బే బీ...’ అన్నప్పుడు మాత్రమే లిప్త కాలంపాటు ఆమెని చూపించి ఎఫెక్టివ్ గా కట్ చేసేశారు. ‘చిన్నా...లేదమ్మా... మీ నాన్న... మంచోడమ్మా ...ఏడ్వకు నా బుజ్జి కదూ...’ అంటూ రొయ్యల మార్కెట్ తెర్చి కూర్చోలేదు. తండ్రి ఫేస్ ఎక్కడా చూపించలేదు. కొన్నిటిని ప్రేక్షకుల్ని టీజ్ చేయడానికి చూపించకుండా వదిలెయ్యాలి. ఇది కూడా విజువల్ మీడియా కళ. 

          ఇక యాక్సిడెంట్ ఎలా జరిగిందో షాట్ వేసి ముగించారు. అతను చెవులకి ఇయర్ ఫోన్స్ తో ఎందుకుంటాడో ఇందులో స్పష్టం చేసేశారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా ఒక ఫ్లోలో ఐదు భాగాలనీ చూపిస్తూ కథనం చేశారు.  ఇలా ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేటప్పటికల్లా డాక్ తో రుణ విముక్తుడయాడు. అమ్మాయి పరిచయమైంది. తనని వెంటాడుతున్న చిన్నప్పటి ట్రాజడీని, ఇప్పటి నేర జీవితాన్నీ క్రషింగ్ యార్డులో ఇక శాశ్వతంగా క్రష్ చేసేసి, అమ్మాయితో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు బేబీ...

          ఇప్పుడు ఈ మిడిల్ కథనం కొత్తదనమేమిటో ఇక చూడాలి...

సికిందర్

Saturday, March 23, 2019

802 : స్క్రీన్ ప్లే సంగతులు


హాలీవుడ్ లో ఒక ఎకానమీ బడ్జెట్ (34 మిలియన్ డాలర్లు) తో నిర్మించిన థ్రిల్లర్  మెగా బాక్సాఫీస్ విజయాన్నిసాధిస్తే (226 మిలియన్ డాలర్లు), అది మూడు ఆస్కార్ అవార్డులకి కూడా నామినేట్ అయి, ఇరవై వివిధ ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంటే, ఆలోచించాల్సిన విషయమే. తారాగణ బలం లేని స్మాల్ మూవీస్ కి కథాబలమొక్కటే ప్రాణమవుతుందా? ఇలా అనుకుని ‘బేబీ డ్రైవర్’ తీసివుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఇది కథాపరంగా బలమైనది కూడా కాదు, పైగా పాత రొటీన్ ఫార్ములా కథే. అయినా పెద్ద హిట్టయ్యింది. కనుక స్మాల్ మూవీస్ కి ఎంత కథాబలమున్నా, లేకపోయినా ఒకటి మాత్రం అత్యవసరం - విజువల్ స్క్రిప్టు. విజువల్ గా లేని స్క్రిప్టుతో  తారాగణ బలం లేని ఎంత బలమైన స్మాల్ మూవీ కథ రాసుకున్నా - నేటి విజువల్ ప్రపంచంలో విజిబిలిటీ లేక అంతర్ధానమైపోవడమే. నాన్ విజువల్ స్క్రిప్టు స్మాల్ మూవీకి శాపం. స్మాల్ మూవీ స్క్రిప్టు ద్విగుణీకృతమవాలంటే విజువల్ అప్పీల్ నిచ్చే ప్రొడక్షన్ డిజైన్ సమకూడాల్సిందే. ఆ ప్రొడక్షన్ డిజైన్ పాత్ర చిత్రణల బట్టి, కథాకథనాల బట్టి సాగాల్సిందే.  అంతేకాదు, కథకి స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి కూడా పాల్పడాల్సిందే!

          ‘బేబీ డ్రైవర్’ అనే స్మాల్ మూవీ స్ట్రక్చర్ కి క్రియేటివిటీ తో బాటు, కంటెంట్ కి ప్రొడక్షన్ డిజైనింగ్ ని కూడా కలుపుకుని ఇంత ప్రపంచ దృష్టి నాకర్షించగల్గింది. విజువల్ అప్పీలే సాధారణ కథని అసాధారణ మూవీగా మార్చేసింది. విజువల్ అప్పీలంటే బ్రహ్మాండమైన కెమెరా వర్క్ ఒక్కటే కాదు, ఇంకా చాలా... కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచీ సౌండ్ వరకూ చాలా. కాస్ట్యూమ్స్ బ్రహ్మాండంగా వుంటే కూడా విజువల్ అప్పీల్ కాదు. పాత్రల మనస్తత్వాల్ని వెల్లడించినప్పుడే విజువల్ అప్పీల్. అంతే కాదు, కథనంలో ప్రతీ కదలికకీ ముందే నిర్ణయించిన మ్యూజిక్. ఈ థ్రిల్లర్ ఆసాంతం సౌండ్ మేనేజ్ మెంటే. సౌండ్ మేనేజిమెంట్ కే ఆస్కార్ నామినేషన్లు, ఇతర అవార్డులూ... 

          దీని ప్రొడక్షన్ విజిబిలిటీ అంశాల్లోకి వెళ్లేముందు, కథనపరంగా ఎలా విజువల్ స్క్రిప్టు అయిందో స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకుందాం...స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగపు క్రియేటివిటీ గురించి, దాంతో మారిపోయే ప్లాట్ పాయింట్ వన్ స్వరూప స్వభావాల
 గురించీ  గత వ్యాసాల్లో కొన్ని సినిమాలు చెప్పుకున్నాం.ఇక్కడ క్లిక్ చేయండి. ప్లాట్ పాయింట్ వన్ అంటే పాత్ర సమస్యలో పడడం, అక్కడో గోల్ ఏర్పడడం అనే రొటీన్ తో సర్వ సాధారణంగా సినిమాలు వస్తూంటాయి. శాస్త్రం శాస్త్రమే చెప్తుంది, క్రియేటివిటీ చెప్పదు. కథానేపథ్యం ఏర్పాటు చేసుకుని, పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసుకుంటూ వెళ్లి, సమస్య ఏర్పాటు చేసి, అక్కడో గోల్ ని కల్పిస్తే అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుందని మాత్రమే శాస్త్రం చెప్తుంది. దీన్ని పట్టుకుని ఇలాగే చేసుకుంటూ పోతున్నందుకే సినిమాలన్నీ ఒకే పోతలో పోసిన బిగినింగ్ కథనంతో వుంటున్నాయి. అప్పుడప్పుడు ఒకటీ అరా మాత్రమే చెప్పిన శాస్త్రానికి కొంచెం క్రియేటివిటీ తాలింపుతో  లేటెస్ట్ ఘుమఘుమలు సృష్టించేసరికి - స్క్రిప్టు తేజోవంతమై విజువల్ స్క్రిప్టు అవుతోంది. ఇట్సె వండర్ఫుల్ లైఫ్, బ్రిక్, ది మేయర్, దొంగరాముడు, అదుగో - ఇలాటివే....ఇక్కడ క్లిక్ చేయండి.

          ఇప్పుడు దీనికి ‘ది డ్రైవర్’ తోడయ్యింది. 2017 మార్చిలో విడుదలైన ఈ థ్రిల్లర్ కి రచయిత, దర్శకుడు ఎడ్గార్ రైట్. ముఖ్య పాత్రలు, పాత్రధారులు బేబీ (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ హీరో ఆన్సెల్ ఎల్గార్ట్), డెబొరా (లిల్లీ జేమ్స్), డాక్ (కెవిన్ స్పెసీ). సంగీతం ‘గ్రావిటీ’ కి ఆస్కార్ పొందిన స్టీవెన్ ప్రైస్, ఛాయాగ్రహణం ‘మాట్రిక్స్’ ఫేం బిల్ పోప్.

          ఇందులో బిగినింగ్ కథనం, ప్లాట్ పాయింట్ వన్ రెండూ ఎలా భిన్నమైనవో ఇక చూద్దాం...
రేపు!



Friday, March 22, 2019

801 : రివ్యూ





దర్శకత్వం : అనురాగ్ సింగ్
తారాగణం : అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా తదితరులు
రచన : అనురాగ్ సింగ్, గిరీష్ కొహ్లీ, సంగీతం : తనిష్ బాగ్చీ, చిరంతన్ భట్ తదితరులు, ఛాయగ్రహణం : అన్శుల్ చోబే
బ్యానర్ : ధర్మా, అజూరే, కేప్ ఆఫ్ గుడ్, జీ స్టూడియోస్
నిర్మాతలు : కరణ్ జోహార్,  అరుణా భాటియా తదితరులు 
***         చారిత్రక సినిమాల సీజన్ లో మరుగున పడిపోయిన చరిత్రలు వెలుగు చూస్తున్నా యి. మనం మర్చిపోయి, బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికీ స్మరించుకుంటూ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిక్కు పోరాట యోధుల ఆత్మబలిదానాన్ని ఎట్టకేలకు కరణ్ జోహార్ తెరకె క్కించాడు. హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక పోరాట ఘట్టం అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ టైటిల్ తో విడుదలైంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ 
      ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో రాక్షస భర్తని వదిలి పారిపోతున్న ఒకామెని వెంటాడి వస్తూంటారు ముల్లా మనుషులు. ఇటు సరిహద్దులో గులిస్తాన్ పోస్టు నుంచి ఇది చూస్తున్న హవల్దార్ ఇషార్ సింగ్ (అక్షయ్ కుమార్) వెంటనే ఆమెని కాపాడడానికి సిద్ధమవుతాడు. అటు వెళ్ళ వద్దని బ్రిటిష్ లెఫ్టినెంట్ లారెన్స్ (ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్) వారిస్తున్నా వినకుండా వెళ్లి మూకని చంపి, ఆమెకి శిరచ్ఛేదం గాకుండా కాపాడి తీసుకొచ్చేస్తాడు. దీంతో ఆఫ్ఘన్ ముల్లా సైదుల్లా (రాకేష్ చతుర్వేదీ ఓం) కక్ష గడతాడు. సైన్యాన్ని రెచ్చగొట్టి గులిస్తాన్ పోస్టు మీద జిహాద్ జరపాలంటాడు. పఠాన్ సైనిక నాయకులు ఖాన్ మసూద్ (మీర్ సర్వర్), గుల్ బాద్షా ఖాన్ (అశ్వథ్ భట్) లు గిరిజన దండునేసుకుని కోట మీద భీకర దాడి జరుపుతారు. ఇషార్ సింగ్ తన పటాలంతో ఈ దాడిని విజయవంతంగా తిప్పి కొడతాడు. దీంతో దీనికంతటికీ నువ్వే కారణమని ఇషార్ సింగ్ ని బదిలీ చేసేస్తాడు లెఫ్టినెంట్ లారెన్స్. సుదూరంగా వున్న సరగర్హీ ఆర్మీ పోస్టు (కోట) కి వెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు ఇషార్ సింగ్. అక్కడ 36 వ సిక్కు రెజిమెంటుకి చెందిన 21 మంది సైనికులు పనీ పాటా లేక కోళ్ళ పందాలు ఆడుకుంటూ వుంటారు. ఎవరికీ సైనికుల లక్షణాలుండవు. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి సైనికులుగా తీర్చిదిద్దుతాడు.   

          ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ పఠాన్లు, ముల్లా,  పదివేల మంది గిరిజనులతో సరగర్హీ మీదికే భారీఎత్తున దాడికొస్తారు. సరగర్హీ తో బాటు గులిస్తాన్, లొకార్ట్ కోటల్ని కూడా ముట్టడించే పెద్ద పథకంతో వస్తారు. 21 మంది సైనికులతో వున్న ఇషార్ సింగ్ ఈ పది వేల మందిని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇప్పటి పాకిస్తాన్లోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12 న, 21 మంది సిక్కు- 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటలపాటు జరిగిన భీకర పోరాట వాస్తవ గాథ ఇది. వెనక్కి వచ్చేయమని బ్రిటిష్ అధికారులు ఆదేశాలిచ్చినా, ఆ పిరికిపంద చర్యకి మనస్కరించక, 30 గంటల పాటు చివరి శ్వాసవరకూ పోరాడి,180 మందిని హతమార్చి చనిపోయారు సిక్కు దళం. ఈ చరిత్రకి కల్పనని జోడించి తీసినప్పుడు దారితప్పి పోయారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులైన వాళ్లకి నివాళిగా అంటూ ప్రారంభించే ఈ పోరాటం, మత ప్రతిష్ట కోసం చేసే వ్యక్తిగత పోరాటమన్నట్టుగా సాగుతుంది. దీనికి వ్యతిరేకంగా అటు ఆఫ్గన్ ఫైపు జిహాద్ అంటూ మతప్రాతిపదికన రెచ్చ గొడుతున్న ముల్లాని నిలదీస్తాడు పఠాన్ సైనిక నాయకుడు - భూభాగాల కోసం జరిగే యుద్ధంలో మతాన్నెందుకు లాగుతావని.  
  
           ఇటు ఇషార్ సింగ్ వేరే రంగుతో వున్నపగిడీ (తలపాగా) తీసేసి, కేసరి (కాషాయ రంగు) పగిడీ ధరించి పోరాటం చేయడంతో, ఈ కాల్పనిక చరిత్ర ఎన్నికల ప్రచార సాధనంగా మారిపోయింది - ఇవ్వాళ నా పగిడీ రంగు కేసరి, ఇవ్వాళ నా పారే రక్తం రంగు కేసరి, ఇవ్వాళ నేనిచ్చే సమాధానం రంగూ కేసరీ అంటూ. అటు ముల్లా ప్రభావంతో  ఆఫ్ఘన్లు కూడా మతం కోసమే రాక్షన కాండ ప్రారంభిస్తారు. ఇషార్ సింగ్ పోరాటంలో వీరమరణం పొందాక పఠాన్ నాయకుడు అంటాడు -  ఇతను నేలకొరిగాడని పగిడీ తీసి నేలమీద పారెయ్యకండని. ఇతడి మతాన్ని అగౌరవపర్చ కూడదన్న ఉద్దేశంతో. 

        దళంలో చివరి సైనికుడు చనిపోతూ, తమ మరణాన్ని పోరాట స్ఫూర్తిగా పెట్టుకున్న స్వాతంత్ర్య పోరాటంలో చనిపోయిన తన లాంటి వీరులకి నివాళిగా అర్పించక, నానక్ కీర్తనలు పాడి మరణిస్తాడు. ఇలా నిమిషానికో రకం సంకేతాలతో, సందేశాలతో సాగుతుందీ కాల్పనిక చరిత్ర చిత్రణ. లాజికల్ గా స్వాతంత్ర్య పోరాటంలో నేలకొరిగిన వీరులకి నివాళిగా సైనిక తత్వంతో  ప్రారంభించే పోరాటం, దారితప్పి జింగోయిజంగా మారిపోవడం కన్పిస్తుంది.

          సర్జికల్ స్ట్రయిక్  మీద తీసిన ‘యురీ’ లో సైనిక తత్వం తప్ప మతభక్తి, దేశభక్తి - వాటి జింగోయిజపు నినాదాలూ వుండవు. ఈ సరగర్హీ పోరాట గాథ,  ‘21 సర్ఫరోష్ - సరగర్హీ 1897’ అని  గత సంవత్సరం జింగోయిజం లేని పంజాబీ టీవీ సీరియల్ గా వచ్చింది. అన్ని మతాల వాళ్ళూ వుండే సైన్యానికి మతం వుంటుందా. 

          ఏవో రాజకీయ ఉద్దేశాలతో కల్పితాలు చేసి ‘కేసరి’ ని తీసినప్పుడు ఇంకోటి కూడా చేసి వుండాల్సింది. పోరాటం మధ్యలో చర్చల సందర్భం వస్తుంది. బలగం చాలని ఇషార్ సింగ్ ని లొంగిపొమ్మంటారు అవతలి పక్షం వాళ్ళు. అప్పుడు ఇషార్ సింగ్, ‘మీరు మత పోరాటంగా మార్చేశారు. మేమూ అలాగే మార్చాం. ఇది పోరాటంలో అకృత్యాలకి దారి తీస్తోంది. మత అల్లర్లుగా మారిపోయింది. ఇది చూసి ఇరువైపులా ప్రజలు మతోన్మాదులవుతున్నారు. ఇది మంచిది కాదు. మతం జగడం తేలేది కాదు. టైం వేస్టు. మీరు మతాన్ని పక్కనబెట్టి భూభాగం కోసం మాత్రమే పోరాడతామంటే మేమూ అలాగే పాయింటు మీద పోరాడతాం. ముందు ఇది తేలాలి. ఇది తేల్చడానికే ఇక ముందు చర్చలుంటాయి. తేలేదాకా కాల్పుల విరమణనే’ అని కూడా కల్పన చేసివుంటే కాంటెంపరరీగా ఇంకా బావుండేది. 
ఎవరెలా చేశారు 
     సూపర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటన ఈ వయోలెంట్ పోరాట గాథకి హైలైట్. అన్యాయాన్ని, అవమానాన్నిసహించని ముక్కుసూటి వ్యవసాయదారుడైన తను సైనికుడయ్యాక అదే సంకల్పంతో కొనసాగుతూ ఆకర్షిస్తాడు. వూళ్ళో తల్లీ, భార్యా -  వాళ్ళతో అనుబంధమూ ఇవన్నీ సున్నితంగా ప్రదర్శిస్తాడు. క్రమశిక్షణ లేని దళాన్ని తీర్చిదిడ్డంలో జరిగే హాస్య ప్రహసనాల్లో మాత్రం సీరియస్ గా వుంటాడు. లెఫ్టినెంట్ తనని బదిలీ చేస్తూ అవమానించడంతో తనకి జ్ఞానోదయమైన భావాన్ని పటిష్టంగా ప్రదర్శిస్తాడు. మీరు బానిసలనీ,ఇక్కడి మట్టిలో పిరికిపందలే పుడతారనీ లెఫ్టినెంట్ అవమానించడాన్ని సీరియస్ గా పట్టించుకుని ఫీల్ ని పుట్టిస్తాడు. దేనికి మనం ప్రాణాల్ని త్యాగం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ కోసమా? జీతాల కోసమా? యూనిఫామ్స్  కోసమా? - అని కేసరీ పగిడీ ధరించి వచ్చి, మన పోరాటం, ప్రాణత్యాగం స్వాతంత్ర్య పోరాటంలో అమరుల కోసమని అంటాడు. కానీ కేసరీ పగిడీతో మతప్రతిష్ట ఫీలై పోరాడతాడు. 

            గత సంవత్సరం పంజాబీలో ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ అనే మూవీ విడుదలైంది. ఈ చారిత్రక కథలో సజ్జన్ సింగ్ అనే సిపాయి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున జర్మన్లతో పోరాడి వీరమరణం పొందుతాడు. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు అతడి అంతర్మథనం ఒక్కటే - ఈ యుద్ధం గెలిస్తే ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కి స్వాతంత్ర్యమిస్తుందా అన్నదే. మనల్నికబళించి పాలిస్తున్న ఇంగ్లీషు దొరల కోసం ప్రాణత్యాగం చేయడం అవసరమా అన్న ప్రశ్నని ప్రశ్నలాగే మిగిల్చి అమరుడవుతాడు. అంతేగానీ మతావేశం పూని పోరాడడు. 


          అక్షయ్ కుమార్ చివర ఒంటరిగా మిగిలి వేల మందితో చేసే పోరాటం నాటి ఇషార్ సింగ్ వీరపరాక్రమాన్ని కళ్ళకి కట్టినట్టు వుంటుంది. అయినంత మాత్రానా ఇషార్ సింగ్ మూర్తిమత్వాన్ని అల్లూరి సీతారామ రాజు మూర్తిమత్వాన్ని ప్రేక్షకుల్లో కృష్ణ ప్రతిష్టించినట్టుగా ప్రతిష్టించడంలో విఫలమయ్యాడు అక్షయ్. కనీసం చివరి డైలాగులైనా లేకుండా కన్ను మూస్తాడు. ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఇషార్ సింగ్ ని ప్రతిష్టించలేక పోవడానికి కారణం పాత్ర చిత్రణే అలా వుండడం. కాషాయీకరణ జరగడం. అల్లూరిని ప్రజలు ఎంత దైవంలా కొలిచి పాటలు పాడినట్టు సినిమాటిక్ గా చిత్రీకరించినా, అల్లూరి అలా ఫీలై పోరాటం చేయడు. ఒక విప్లవకారుడి స్పష్టతతోనే పోరాడతాడు. అక్షయ్ ఇషార్ సింగ్ పాత్రకి సైనిక స్ఫూర్తి కొరవడింది. లేకపోతే అతనెంత గొప్ప సైనికుడో మర్చిపోలేని ముద్రవేసేవాడు. 

          ఇషార్ భార్య జీవనీ కౌర్ పాత్రలో పరిణీతీ చోప్రాది పరిమిత పాత్ర. ఆమె అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తుంది. ఆమె పూర్వమెప్పుడో చనిపోయిందని చరిత్ర చెప్తోంది. అందుకే చివర్లో ఇషార్  మరణించినప్పుడు సమూహంలో నిలబడి చూస్తూంటుందే గానీ దగ్గరికి రాదు. ఆమె ఆత్మరూపం. అంతవరకూ ఆమెతో మనం చూసిన సన్నివేశాలన్నీ ఇషార్ వూహల్లో ఆమె ఆత్మరూపం. మంచి క్రియేటివ్ అయిడియాతో ఈ చిత్రణ. 

       దళంలో ప్రతీ ఒక్కరూ ఫస్టాఫ్ లో వాళ్ళ వెర్రితనాలతో  కామెడీలు చేస్తారు. కోడి పందాలతో మొదలయ్యే వీళ్ళ కామెడీ సీక్వెన్స్ - ఆ కోడి పుంజుల ముందే తాము కోళ్ళుగా పోట్లాడుకునే శిక్షగా, ఆ తర్వాత ఆ కోడి పుంజుల్ని కూరొండేసుకున్నందుకు, అన్నపానీయాలు లేని రెండు వారాల కఠిన శిక్షగా అనుభవించే దాకా నవ్విస్తూ సాగుతుంది.  

          ఇషార్ దళంలో పఠాన్ వంటవాడుగా పొట్టి బ్రహ్మామిశ్రా వుంటాడు. పోరాటం జరుగుతున్నప్పుడు, ‘నేను పఠాన్ ని కాబట్టి పఠాన్లతో పోరాడలేననా?’ అని ఇషార్ ని ప్రశ్నిస్తాడు. ‘నువ్వు ఎవరు గాయపడితే వాళ్లకి మంచి నీళ్ళు అందించు’ అంటాడు ఇషార్. ‘శత్రువులకి మంచి నీళ్ళిచ్చి నేను బ్రతికించను’ అంటాడు. శత్రువుని చంపితే శత్రువే చస్తాడు, మంచి నీళ్లిస్తే శత్రుత్వం నశిస్తుందంటాడు ఇషార్ సింగ్. గాయపడ్డ శత్రువులకి మంచి నీళ్ళిస్తూంటే చంపేస్తాడు ముల్లా.

          అల్లా కోసమని మధ్యలో దూరే ముల్లా సైదుల్లాగా రాకేష్ చతుర్వేదీ ఓం ఎక్సెలెంట్ గా నటిస్తాడు. ముల్లాగిరీని డిప్లమటిక్ గా పోషిస్తాడు. పఠాన్ సైనిక నాయకులుగా మీర్ సర్వర్, అశ్వథ్ భట్ లు ఆఫ్ఘనీ రూపురేఖలతో పర్ఫెక్ట్ గా వుంటారు. దళంలో వార్తాహరుడుగా వుండే పిరికివాడైన గురుముఖ్ సింగ్ పాత్రలో సుమీత్ సింగ్ బస్రా చివరి సన్నివేశాల్లో హైలైట్ అవుతాడు. నిజానికి ఇతడితో ఓ క్లయిమాక్స్, అక్షయ్ తో ఓ క్లయిమాక్స్ అన్నట్టుంటుంది సినిమా. 

చివరికేమిటి
      దర్శకుడు అనురాగ్ సింగ్ కేవలం 80 కోట్లతో ఇంత భారీ పోరాట యాక్షన్ తీయడం రికార్డే. సెకండాఫ్ గంటన్నర పాటూ ఏకబిగి, సుదీర్ఘ పోరాట దృశ్యాలు కాలీన స్పృహతో వాస్తవ దృశ్యాలన్పించేలాగే తీశాడు. చరిత్రని ఎంత కల్పితం చేసినా కృతకమైన డిజైనర్ చరిత్రలా చిత్రీకరించలేదు. ఎక్కాడా గ్రాఫిక్స్ వున్నట్టే అన్పించదు. పైగా వాడిన ఆయుధాలు ఆ కాలంలో ఏవైతే వుండేవో అవే సింగిల్ లోడెడ్ తుపాకులు, తూటాలు, మామూలు కత్తులు, తల్వార్లు, నాటు బాంబులు మాత్రమే చూపించాడు. ‘పద్మావతి’ లో లాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో లాగా చిత్ర విచిత్ర నమ్మశక్యంగాని టెక్నాలజీలతో డిజైనర్ ఆయుధాలూ, వాహనాలూ, వీటితో సర్కస్ ప్రదర్శన చేస్తున్నట్టు డిజైనర్ పోరాట దృశ్యాలూ లేకుండా, పక్కా నేటివ్, సహజ మాస్ లుక్ తో దృశ్యాల్ని సృష్టించి ఆ కాలంలోకి తీసికెళ్ళాడు. అక్షయ్ కుమార్ దుర్బిణీని తుపాకీకి కట్టి టెలిస్కోపిక్ రైఫిల్ గా మార్చుకోవడంలో కూడా డిజైనర్ లుక్  వుండదు. ఇక ఆఫ్ఘన్ వైపు ముగ్గురు నాయకుల గుర్రాలు తప్ప ఇంకే గుర్రాలూ ఏనుగులూ, మోటారు వాహనాలూ వుండవు. వేలమంది కాలినడకనే వస్తారు. లారెన్స్ ఉడ్ వర్డ్, పర్వేజ్ షేక్ లు సృష్టించిన అద్భుత యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా నమ్మశక్యంగాని విన్యాసాల్లేవు. 

          మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లలోని అనంతమైన ఎడారిమయమైన కొండ ప్రాంతాల్లో లొకేషన్స్ ఒకెత్తు. పీరియడ్ లుక్ రావడానికి చేసిన డీఐ కూడా, దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కలర్స్ కూడా కూల్ గా వుంటాయి. సుబ్రతా చక్రవర్తి, అమిత్ రేల ప్రొడక్షన్ డిజైనింగ్, అన్శుల్ చోబే కెమెరా వర్క్ చాలా గొప్ప కళాత్మకతలు.

          ఆరుగురు సంగీత దర్శకుల పాటలు అక్కడక్కడా నేపథ్యంలో బిట్ సాంగ్స్ గా వుంటాయి గానీ, రాజూ సింగ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం కట్టి పడేస్తుంది. 

          ఒక్కటే సమస్య. జింగోయిజం. రాజకీయ కేసరీయం. ఎన్నికల కంగాళీయం. ఆగస్టు పదిహేనున విడుదల చేయమని అక్షయ్ కుమార్ అంటే, అప్పుడెవరూ చూడరని ఇప్పుడే విడుదల చేయడం. ప్రేక్షకులు షహీద్ హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్ర చూడాలంటే కూడా ఫలానా ఒక ఇలాటి టైంలోనే చూడాలన్న మాట. ప్రతీ యేటా లండన్లోని ఆర్మరీ హౌస్ లో బ్రిటిష్ ఆర్మీ నాటి సరగర్హీ సిక్కు అమర సైనికులకి శ్రద్ధాంజలి ఘటిస్తూనే వుంటుంది. 1897 లోనే ఈ పోరాట యోధులకి బ్రిటన్ అత్యున్నత ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ప్రకటించింది. విక్టోరియా రాణి వేనోళ్ళ కొనియాడింది. ఇండియాలో ఈ దళం గుర్తే లేదు. ఎన్నికలప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించాలి...

సికిందర్
Watched at Prasads,
7.30 pm, 21 March, 2019

Ps : సరగర్హీ పోరాట కారణం సినిమాలో చూపించినట్టు ఇషార్ సింగ్ ఆఫ్ఘన్ స్త్రీని రక్షించడం కాదు. ఖైబర్ పాస్ కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో తేడాలొచ్చి దాడులు చేశారు ఆఫ్ఘన్లు.


Tuesday, March 19, 2019

800 : వెబ్ సిరీస్ సంగతులు


Q : నాకు కామెడీ వెబ్ సిరీస్ దర్శకత్వం అవకాశం వచ్చింది. ఇందుకు నేను కామెడీ షుగర్ కోటింగ్ నిస్తూ క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ ఫాలో అవచ్చా? క్యాంప్ బెల్ స్ట్రక్చర్ యూట్యూబ్ లో వుంది. వెబ్ సిరీస్ పది ఎపిసోడ్లు వుంటుంది. నిడివి ఐదు నుంచి 10 నిమిషాలు. ప్రతీ ఎపిసోడ్ ముగింపులో ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది తర్వాతి ఎపిసోడ్ కి లీడ్ అవుతుంది. ఇలా చివరి ఎపిసోడ్ లో హీరో గోల్ సాధించే వరకూ ట్విస్టులుంటాయి. ఇలా వెబ్ సిరీస్ సీరియల్ కథ ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా?
హరీష్, అసిస్టెంట్ డైరెక్టర్
A :  కంగ్రాట్స్, ఇలా ముందుకు వెళ్తున్నందుకు. ఐతే వెబ్ సిరీస్ రచన సినిమా రచన ఒకటి కాదు. జోసెఫ్ క్యాంప్ బెల్ స్ట్రక్చర్ అనేది సినిమాల వరకే. అది కూడా ఒకప్పటి సినిమాలకే. గత 30 ఏళ్లుగా హాలీవుడ్ సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తోంది. పురాణాల ఆధారంగా క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో 10 ప్లాట్ పాయింట్స్ వుంటాయి. దీని వల్ల కథ భారంగా, నిదానంగా సాగుతుంది. ఒకప్పటి కళాఖండాలకిది సరిపోయింది. సిడ్ ఫీల్ట్ ఈ ప్లాట్ పాయింట్స్ ని ఐదుకి కుదించి (మూడు ప్లాట్ పాయింట్స్, రెండు పించ్ పాయింట్లు) వేగం పెంచాడు. సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వచ్చిన జేమ్స్ కెమెరాన్ ఇటీవల ‘అలీటా’ కి,  క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ స్ట్రక్చర్ అనుసరిస్తే ఏమైందో తెలిసిందే. ఈ బ్లాగులోనే వివరించాం. 

          అలాగని వెబ్ సిరీస్ కి సిడ్ ఫీల్డ్ పారడైం పనికొస్తుందని కాదు. సినిమాకి పనికొచ్చేదేదీ వెబ్ సిరీస్ కి పనికి రాదు. సినిమా కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన త్రీ యాక్ట్స్ లో వుంటుంది. దీన్ని పది ఎపిసోడ్ల వెబ్ సిరీక్ కి వర్తింపజేస్తే, బిగినింగ్ ఓ రెండు ఎపిసోడ్లు, మిడిల్ ఓ ఆరు ఎపిసోడ్లు, ఎండ్ ఓ రెండు ఎపిసోడ్లుగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి రెండు ఎపిసోడ్లూ బిగినింగ్ బిజినెస్ అయిన పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసి, ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ కి తెచ్చి గోల్ ని ఏర్పాటు చేయాలన్న మాట. దీని తర్వాత మిడిల్ ఆరు ఎపిసోడ్స్ లో ఆ గోల్ కోసం సంఘర్షణ చూపించుకొస్తూ, మిడిల్ ఆరవ ఎపిసోడ్ ముగింపులో ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటు చేయాలన్న మాట. అప్పుడు చివరి రెండు ఎండ్ ఎపిసోడ్స్ లో వెబ్ సిరీస్ కి ముగింపు నిచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా సిల్లీగా వుంటుంది.  

          అంటే  మొదటి రెండు వారాలు పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితులే చూపిస్తూ కూర్చోవాలి. గోల్ ఏర్పాటు అంటే కథా ప్రారంభమే కాబట్టి, కథేమిటో రెండో వారంలో గానీ చెప్పలేం. అప్పటి వరకూ ప్రేక్షకులుంటారా? అలాగే చివరి రెండు వారాలు ముగింపు చూపిస్తూ కూర్చోవాలి.  వెబ్ సిరీస్ కి రెండు వారాల పాటు ముగింపు అంటే, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లాంటిదే. ఇక మధ్యలో మిడిల్ ఆరు వారాలూ గోల్ కోసం సంఘర్షణ చూపిస్తూ కూర్చోవడమే. ఒకే గోల్ ని వారాల పాటు చూపిస్తూ కూర్చుంటే బోరు కొట్టక మానదు. ఎప్పుడో రెండో వారంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటు చేసిన గోల్ ని, ఐదో వారం కల్లా ప్రేక్షకులు మర్చిపోవచ్చు కూడా. ఆ మిడిల్ సంఘర్షణ చూస్తూ, ఇంతకీ దేని కోసమబ్బా ఈ సంఘర్షణా అని బుర్ర గోక్కోవాల్సిందే. ఆ పై వారం కట్ చేసి పారేసి, పక్క వెబ్ సిరీస్ కి జంపై పోవడమే. వెబ్ సిరీస్ బిజినెస్ కూడా టీఆర్పీ బిజినెస్సే నని మరువకూడదు. 

          గతవారమే ఒక దర్శకుడితో వెబ్ సిరీస్ ప్రస్తావన వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ కుర్రాడు వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ని ఐదు నిమిషాలకి మించి చూడడని తేల్చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఏదైనా చకచకా అయిపోవాలి, ఎక్కువసేపు చూసే ఏకాగ్రత వుండదన్నారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకులు వేరు, వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులు వేరన్నారు. ఇరవై నిమిషాలు - అరగంట నిడివి వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూడడం కష్టమన్నారు. 

          ఇదొక అభిప్రాయం. అయితే ఇప్పుడు తీస్తున్న వెబ్ సిరీస్ అరగంట నిడివిగలవే. ఈ నిడివి కారణంగా సహజంగానే వీటి కథన వేగం తక్కువ. మీది పది నిమిషాలలోపే  అన్నారు కాబట్టి కథన వేగం ఎక్కువ. మంచి వ్యూస్ స్కోర్ చేయవచ్చు. ఐతే దీని స్ట్రక్చర్ ఎట్లా? పైన చెప్పుకున్నట్టు వారాలకి వారాలు త్రీయాక్ట్స్ లో చూపిస్తూ ప్రేక్షకుల్ని కోల్పోవాలా?

          దీనికి PCR మెథడ్ అని వుంది. మీరు స్ట్రక్చర్ స్కూలే కాబట్టి మీకిది నచ్చవచ్చు.  వెబ్ సిరీస్ స్ట్రక్చర్ కి PCR మెథడ్ లో ఆలోచించండి. ప్రొఫెసర్ జే మొరార్టీ దీన్ని1970 లలో టీవీ లో కామెడీ సిరీస్ రాస్తున్నప్పుడు రూపొందించాడు. ఈ మెథడ్ లో నేరుగా మొదటి ఎపిసోడ్ ని ప్లాట్ పాయింట్ వన్ తో ప్రారంభించడమే. 

          ప్లాట్ పాయింట్ వన్ తోనే ప్రారంభం. అంటే నేరుగా సమస్య చూపించేయడం. పాత్రల పరిచయాలు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా వంటి ఉపోద్ఘాతాలుండవు. పాత్రని నేరుగా సమస్యలో పెట్టి, ఆ పాత్ర లేమిటో వాళ్ళ మాటల్లోనే ఇక్కడే చెప్పేయాలి. హీరో అలసి సొలసి ఆర్ధరాత్రి తూలుతూ ఫ్లాట్ కొచ్చాడనుకుందాం. డోర్ తీసుకుని లోపలికెళ్తే లోపల ఎవడో పడుకుని వుంటాడు. వీడెవడో తెలీదు, ఎలా లోపలి కొచ్చాడో తెలీదు. ఇదీ సమస్య. వెంటనే సమస్యలోకి వెళ్ళిపోవడం. ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి పడెయ్యడం. . PCR లో P, అంటే Problem వెంటనే ఎస్టాబ్లిష్ అవడం. 

          ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం. వచ్చిన వాడు ఎవరనేది చెప్పడు. ఈ ఫ్లాట్ తనదేనంటాడు...ఇలా ప్రాబ్లం పెద్దదై పోతుంది. ఇది PCR లో C, అంటే Complication. 

          చివరికి ఈ మొదటి ఎపిసోడ్ లో హీరోకి ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. దీన్నిగోల్ అనొచ్చు. ఆ పరిష్కారమార్గంతో వచ్చిన వాణ్ణి చిత్తు చేసే గోల్ తో పైచేయి సాధిస్తాడు. PCR లో ఇది R, అంటే  Resolution. ఇప్పుడు PCR =  Problem + Complication + Resolution, దట్సాల్. 

          మరి ఎపిసోడ్ చివర ట్విస్ట్? ఆ వచ్చిన వాడు చిత్తవడం ట్విస్టు అవదు. ఆ చిత్తయ్యాక, అంటే Resolution పూర్తయ్యాక, రివర్స్ లో ఇంకోటి జరిగి ఇంకో ప్రాబ్లం అక్కడే పుట్టడమే ట్విస్టు. రెండో ఎపిసోడ్ కి మీరన్నట్టు లీడ్. సినిమాలో హీరో చంపేస్తే విలన్ చచ్చిపోవడం ఎండ్. కానీ చచ్చిన వాడు లేచి కూర్చుంటే ట్విస్ట్. వెబ్ సిరీస్ లో చచ్చిందనుకున్న ప్రాబ్లం లేచి కూర్చుంటుంది.
          ఈ ట్విస్టు ఎపిసోడ్ ముగింపు. హీరో ప్రాబ్లం సాల్వ్ చేశాననుకుంటే అది కాస్తా ఇంకో ప్రాబ్లంగా తిరగబెట్టడం ట్విస్ట్. ఈ ట్విస్టు తర్వాతి ఎపిసోడ్ కి ప్రారంభం. అంటే P. దీంతో C, దీనికి R. ఈ R కి  మళ్ళీ ట్విస్టుతో ఎపిసోడ్ ఎండ్. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ కి ఈ ట్విస్టు P... ఇలా రిపీటవుతూనే వుంటుంది చైన్ రియాక్షన్ లా చివరి ఎపిసోడ్ వరకూ. 

          PCR తో లాభాలేమిటంటే, మొదటి ఎపిసోడ్ లోనే కథేమిటో తెలిసిపోతుంది. ఇక ప్రేక్షకులు పారిపోరు. అంతే కాదు, ప్రాబ్లం ఏమిటో, గోల్ ఏమిటో కూడా తెలిసిపోతాయి. ఇక ప్రతీ ఎపిసోడ్ కి ఒక కొత్త ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతో ఫ్రెష్ గా కొత్త గోల్... ప్రాబ్లం మారుతూంటే గోల్ ఫ్రెషప్ అవుతూనే వుంటుంది ప్రతీ ఎపిసోడ్ కీ.  త్రీ యాక్ట్ లోలాగా ఒకే గోల్ ని చివరి దాకా ఈడ్చుకుపోవడనే సమస్య వుండదు. ఇక ప్రేక్షకులు మర్చిపోయే సమస్యా వుండదు. ‘టీఆర్పీ’ ని కోల్పోయే ప్రమాదమూ వుండదు. మొదటి ఎపిసోడ్ లో చూపించే గోల్ మాస్టర్ గోల్ అవుతుంది. అంటే వచ్చిన వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళ గొట్టడం మాస్టర్ గోల్. ఈ మాస్టర్ గోల్ కి తర్వాతి ఎనిమిది ఎపిసోడ్స్ లో పుట్టే ఒక్కో ప్రాబ్లం ని సాల్వ్ చేసేందుకు అక్కడికక్కడే పుట్టేవి మినీ గోల్స్. చివరి ఎపిసోడ్ లో మాత్రం మాస్టర్ గోల్ కే రిజల్ట్ చెప్పాలి. హీరో వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళగొట్టాడా లేదా? 

          సినిమా కథకే ఒకే సమస్య, దాన్ని సాధించే ఒకే గోల్, ఆ గోల్ కి, లేదా సమస్యకి ఒకే ముగింపూ వుంటాయి. పైన చెప్పుకున్న ఎపిసోడిక్ కథనాలతో గోల్స్  మారిపోతూంటే అది సినిమాలా వుండదు. విడివిడి సమస్యలు చూపిస్తున్న డాక్యుమెంటరీలా వుంటుంది. ఇందుకే టైగర్ హరిశ్చంద్ర, ఆటోనగర్ సూర్య లాంటివి ఇలాటి కథనాలు చేసి ఫ్లాపయ్యాయి. విచిత్రమేమిటంటే క్యాంప్ బెల్ ని చదువుకుని ‘ప్రస్థానం’ తీసిన దర్శకుడు దేవకట్టా, ‘ఆటోనగర్ సూర్య’కి సినిమా మాధ్యమానికి వ్యతిరేకమైన ఎపిసోడిక్ కథనం చేయడం!  

          చివర్న మీరడిగింది - ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా? – అంటే ఎపిసోడిక్ విరామాలెక్కడున్నాయి? ప్రతీ ఎపిసోడ్ ముగింపూ ఇంకో ఎపిసోడ్ కి ప్రారంభమే కదా? 

          ఇక ఒక్కో ఎపిసోడ్  క్లిక్ అవాలంటే చివర ట్విస్టు అవసరమే. ఐతే ప్రతీ ఎపిసోడుకిచ్చే  ట్విస్టు, వెనక ఎపిసోడ్ కి మించిన స్థాయిలో వుండాలి. పది ఎపిసోడ్లుంటే పది మెట్లు ఒక్కో తీవ్రతతో ఎక్కుతూ పైపైకి పోతూండాలి ట్విస్టులు - ఒకదాన్ని మించొకటి. అప్పుడే వెబ్ సిరీస్ నిలబడుతుంది. ఈ ట్విస్టుల్ని క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ అంటారు. ఈ మూమెంట్స్ ని ఎప్పుడూ సాగదీయకూడదు. సాగదీస్తే వీగిపోతుంది. సడెన్ జర్క్ ఇచ్చి ముగించెయ్యాలి. 

          క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథల్లో, నవలల్లో ఎక్కువుంటాయి. ముగింపు ట్విస్టులకి మాస్టర్ రైటర్ ఓ హెన్రీ కథలు చదువుకోవచ్చు. వాటిలోంచి మీ ఎపిసోడ్స్ కి భిన్నమైన ఐడియాలు రావచ్చు. అలాగే కొన్ని నవలల్లోంచి తీసిన 12 రకాల ట్విస్టులున్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి స్టడీ చేయండి ఏదీ చదవకుండా, చూడకుండా సొంత ఆలోచనలతో కథలు ఎప్పుడూ రాయకూడదు. ఎందరెందరో పోటీ పడుతున్న మీడియాలో నిలదొక్కుకోవాలన్నా, ముందుండాలన్నా చేస్తున్న కథలకి అవసరమైన రీసెర్చి చేసి కొత్తకొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఇకపోతే, పదినిమిషాల లోపు వెబ్ సిరీస్ ఎపిసోడ్ శాంపిల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

          ఇక మీ ఎపిసోడ్స్ కథ గురించి ఇక్కడ చర్చిండం బాగోదు. ఫోన్ చేయండి. స్ట్రక్చర్ గురించి చాలావరకూ మీకు ఫోన్లోనే వివరించాం మెసెంజర్ లో మీ ప్రశ్న చూసి. అయినా నల్గురికీ ఉపయోగపడుతుందని బ్లాగులో రాయమంటే రాశాం.

సికిందర్