రచన- దర్శకత్వం: ప్రేమ్‌సాయి
తారాగణం: నితిన్, యామీ గౌతమ్, అశుతోష్ రాణా, నాజర్, రాజేష్,
హర్షవర్ధన్, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా ( నేపధ్య సంగీతం)
ఛాయాగ్రహణం: సత్య పొన్మార్
బ్యానర్ : ఫోటాన్ కథాస్
నిర్మాతలు : గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాలా
విడుదల : సెప్టెంబర్ 17, 2015
***
తమిళం నుంచి కొత్త దర్శకుడు, ప్రభుదేవా అసిస్టెంట్, ప్రేమ్ సాయి రావడం రావడం ఒకేసారి తెలుగు- తమిళ ద్విభాషా చిత్రాల్ని భుజాన్నేసుకుని, మూడేళ్ళ పైగా అష్టకష్టాలు పడి పూర్తి చేశాడు. తెలుగులో నితిన్ తో, తమిళంలో జయ్ తో తీశాడు. అప్పటికి (2012 నాటికి) నితిన్ కొత్త మేకోవర్ తో ‘ఇష్క్’ అనే సూపర్ హిట్ లో నటించి కొత్త అధ్యాయం ప్రారంభించాడు. డజను ఫ్లాపుల అనుభవంతో ‘ఇష్క్’ విజయాన్నుంచి చాలా నేర్చుకుని, ఇక ముందు తన సినిమాల తీరు తెన్నులెలా ఉండాలో గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఐతే ‘ఇష్క్’ తర్వాత వెంటనే అదే సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కి అంతలోనే కష్టాలు మొదలయ్యాయి...
హర్షవర్ధన్, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా ( నేపధ్య సంగీతం)
ఛాయాగ్రహణం: సత్య పొన్మార్
బ్యానర్ : ఫోటాన్ కథాస్
నిర్మాతలు : గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాలా
విడుదల : సెప్టెంబర్ 17, 2015
***
తమిళం నుంచి కొత్త దర్శకుడు, ప్రభుదేవా అసిస్టెంట్, ప్రేమ్ సాయి రావడం రావడం ఒకేసారి తెలుగు- తమిళ ద్విభాషా చిత్రాల్ని భుజాన్నేసుకుని, మూడేళ్ళ పైగా అష్టకష్టాలు పడి పూర్తి చేశాడు. తెలుగులో నితిన్ తో, తమిళంలో జయ్ తో తీశాడు. అప్పటికి (2012 నాటికి) నితిన్ కొత్త మేకోవర్ తో ‘ఇష్క్’ అనే సూపర్ హిట్ లో నటించి కొత్త అధ్యాయం ప్రారంభించాడు. డజను ఫ్లాపుల అనుభవంతో ‘ఇష్క్’ విజయాన్నుంచి చాలా నేర్చుకుని, ఇక ముందు తన సినిమాల తీరు తెన్నులెలా ఉండాలో గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఐతే ‘ఇష్క్’ తర్వాత వెంటనే అదే సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కి అంతలోనే కష్టాలు మొదలయ్యాయి...
సహజంగానే ఈ సినిమా మీద ‘ఇష్క్’ ఇమేజి ప్రభావముంటుంది. దీంతో ఇటు నితిన్
కొత్త రోమాంటిక్ లుక్ కీ, అటు నితిన్
జానర్ కాని థ్రిల్లర్ కీ రెండిటికీ న్యాయం చేయాల్సిన బాధ్యత అప్పుడే కొత్త
దర్శకుడి లేత భుజాల మీద పడింది. ఇన్ని కష్టాలు- ద్విభాషా చిత్రాలు- నితిన్ కొత్త ఇమేజి
బ్యాలెన్సింగ్, ఎప్పుడు పూర్తవుతుందో తెలీని నిర్మాణం - ఇవన్నీ కోరి ఈ కొత్త
దర్శకుడే తెచ్చుకున్నాడు. ఐతే ఇలా చేసి ఇతర కొత్త దర్శకులందరికీ ఓ హెచ్చరికలా నిల్చినందుకు
మాత్రం అభినందించాలి! బలిదానాలతోనే భావితరాలు బాగుపడతాయి.
ఇంకో ప్రమాదం కూడా తన దాకా వచ్చే
అవకాశం లేకపోయినా- ఈ సినిమాకోసం తను కాపీ చేసిన హాలీవుడ్ సినిమాయే అసలు తన
నవల్లోంచి కాపీ చేశారని, 2011 లోనే ఓ రచయిత కేసేశాడు. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ నిర్మాణానికి పూనుకుంటున్న సమయంలోనే, 2012
జులైలో ఆ కేసు కొట్టేశారు!
సినిమా కంటే కూడా దర్శకుడి
అనుభవాలు థ్రిల్లింగ్ గా వున్నాయి. వివరాల్లోకి వెళ్దాం...
సగాలు రెండు ఒకటైతే..
కళ్యాణ్ ( నితిన్) బియ్యే చదువు మధ్యలో మానేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. అతడికి అక్కా బావలుంటారు ( హర్షవర్ధన్, సురేఖా వాణి). ఇంకో మిత్రుడు ( సత్యం రాజేష్) ఉంటాడు. ఇతను కొరియర్ బాయ్ గా పనిచేస్తూంటాడు. ఒకరోజు ఓ ఖాదీ భండార్ కి లెటర్ డెలివరీకి తను వెళ్ళ లేక కళ్యాణ్ కిచ్చి పంపిస్తాడు. ఆ లెటర్ తో అక్కడికి వెళ్ళిన కళ్యాణ్, ఆ అడ్రెస్సీ కావ్య ( యామీ గౌతమ్) కి అందించి, పనిలో పనిగా ప్రేమలో పడతాడు. ఇక రోజూ కలిసేందుకు, ఉత్తుత్తి కొరియర్ బాయ్ అవతారమెత్తి, రోజుకో కవరు సృష్టించి ఆమెకి డెలివరీ చేయడానికి వస్తూంటాడు. ఇది పసిగట్టిన ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ, అతణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాననీ చెప్పేస్తుంది.
ఇదిలా వుండగా, ఓ సైంటిస్ట్ (ఆశుతోష్ రాణా) ఓ మెడికల్ స్కాంకి తెరతీస్తాడు. అతడికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) అవసరం. వాటిని డబ్బున్న పేషంట్లకి అమ్ముకుంటాడు. ఇందుకోసం గర్భవతుల్ని టార్గెట్ చేస్తాడు. వాళ్ళు గర్భం ధరించిన వెంటనే మాత్రలతో అబార్షన్లు చేయించి, అప్పుడే ఏర్పడిన తాజా పిండాల్ని కాజేస్తూంటాడు. వాటిలోంచి మూలకణాల్ని సేకరించి, స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొందరు డాక్టర్లని లోబర్చుకుని దందా చేస్తూంటాడు. అమాయక గర్భవతులు బలై పోతూంటారు. కళ్యాణ్ అక్క కూడా గర్భవతి అయితే ఆమెని అలాటి ఒక డాక్టర్ దగ్గరికి తీసికెళ్తాడు కళ్యాణ్. ఆ డాక్టర్ ఆ మాత్రలే ఇస్తాడు.
ఈ డాక్టర్ భాగోతం పసిగట్టిన వార్డ్ బాయ్ ఈ విషయం రాస్తూ, ఆ మాత్రలున్న బాటిల్ని మానవ హక్కుల నేత సత్యమూర్తి (నాజర్) కి కొరియర్ లో పంపించి తను పారిపోతాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ సైంటిస్టుకి చెప్తే, వెంటనే సైంటిస్టు గ్యాంగుని దింపుతాడు. ఆ కొరియర్ సత్య మూర్తికి చేరకుండా చేజిక్కించుకోవడానికి గ్యాంగ్ బయల్దేరుతుంది. అప్పటికే కొరియర్ బాయ్ గా ఉద్యోగంలో చేరిన కళ్యాణ్ చేతికే ఆ కొరియర్ వస్తుంది. అతను సత్యమూర్తికి డెలివరీ చేయగలిగాడా లేదా, అసలీ స్కాం గురించి ఎప్పుడు తెలుసుకున్నాడు, అక్కకూడా దీనికి బలవకుండా కాపాడుకున్నాడా, సైంటిస్టుని ఎలా శిక్షించాడూ ..మొదలైనవి ఇక్కడ్నించీ సాగే కథ ద్వారా తెలుస్తాయి.
విచిత్రంగా ప్రేమ కథ ఎక్కడో ఆగిపోయి, మూల కణాల గొడవ ప్రారంభమయినట్టు లేదూ? ఈ రెండు కథల రోమాన్సు గురించి స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.
ఎవరెలా చేశారు మార్పు లేకుండా నితిన్ తనకి పునర్జన్మ నిచ్చిన అదే ‘ఇష్క్’ బ్రాండ్ లవర్ బాయ్ పాత్రలో ఫస్టాఫ్, కాస్త యాక్షన్ జోడించిన మార్పుతో
సెకండాఫ్ శ్రమ లేకుండా నటించేశాడు. తనని కష్టపెట్టే దృశ్యాలేం లేవు, కొన్ని ఫైట్లు
తప్ప. పైగా ఎప్పుడో ఒప్పుకున్న సినిమా కాబట్టి, ఏ సైంటిస్టో దీనికి చాలా సార్లు ‘అబార్షన్లు’
కూడా చేశాడు కాబట్టి, పదేపదే ‘మూలకణాలు’
మాయమైపోయిన ఈ సినిమాలో తను చేయగలిగింది ఇంతకంటే వుండదు. ఈ గంటా 42 నిమిషాల మాత్రమే
నిడివిగల సినిమా విడుదల, దర్శకుడికి ఇంకో సినిమా పట్టుకోవడానికే అవసరంగానీ,
మరెవరికీ అవసరం లేదు. Nitin
has already moved on, you know!
కాకపోతే ఈ సినిమా అనుకున్నట్టు ముందే విడుదలై వుంటే, మంచు విష్ణు ‘డైనమైట్’
చేయడానికి అంత బాడీ బిల్డింగ్ చేసేవాడు కాదేమో. తను మెమరీ కార్డు తో పరిగెత్తాడు,
నితిన్ కొరియర్ తో పరుగెత్తాడు. మధ్యలో 2014 లో న్యూవేవ్ థ్రిల్లర్ నిర్వచనానికి పక్కా
నిదర్శనంగా, ‘రన్ రాజా రన్’ తో శర్వానంద్ పరుగెత్తేసి గెలిచేశాడు!
హీరోయిన్ యామీ గౌతమ్ గ్రేస్ ఫుల్
నటి. చూడ్డానికి చక్కగా వుంటుంది. పాత్ర సరిగ్గా లేక ఈ సినిమాలో ఖాదీ భండార్ కీ,
పాటలకీ పరిమితమై పోయిన షోపీస్ గా మిగిలిపోయింది. ఆశుతోష్ రాణా, నాజర్ ల పాత్రలు కూడా
సరీగ్గా డెవలప్ కాని పాత్రలు.
సింగర్ కార్తీక్ ఈ సినిమాకి సంగీత
దర్శకుడవడం అనే నావెల్టీ కూడా కాలాతీతమైన విడుదలతో కాలగర్భంలో కలవక తప్పలేదు. ఇతనూ,
అనూప్ రూబెన్స్ ఇచ్చిన విడి విడి పాటలు హైలైట్ ఈ సినిమాకి. సందీప్ చౌతా నేపధ్య
సంగీతం ఎప్పటిలాగే రణగొణ ధ్వని. సత్య
పొన్మార్ ఛాయాగ్రహణం ఇంకా స్టన్నింగ్ గా వుండాల్సింది. ఒకసారి ఈవారమే విడుదలైన
హిందీ ‘కట్టీ బట్టీ’ లో తుషార్ కపూర్ విజువల్ వైభవం చూడండి. లైటింగ్ ఎఫెక్ట్స్
తెలియడమే కెమెరా మాన్ కి విజయం.
కొత్త దర్శకుడు ప్రేమ్ సాయి సినిమా
తీయడంలో విఫలమవలేదు, సినిమా రాయడంలో దెబ్బతిన్నాడు. దీన్ని పక్కనబెడితే, దర్శకుడిగా
టాలెంట్ వుంది. పైగా పూర్తిగా హాలీవుడ్ సినిమానే కాపీ చేయకుండా, తనదంటూ కొత్త విషయాన్ని జోడిస్తూ
అందుకవసరమైన రీసెర్చి చేశాడు. ఇంతమంచి రీసెర్చి నిష్ఫలమైపోవడానికి కారణం బ్యాడ్ రైటింగ్
అనే అలవాటే. ముందు రాత బావుంటే దాంతో తీత బావుంటుంది.
రెండోది, ఒక స్టార్ ని చూపించే
విధానంలో ఎక్కడా లోపం జరక్కుండా చూసుకోవాలి. ఇది కూడా రైటింగ్ లో భాగమే. ఎక్కడో బుఖారెస్ట్
లో విలన్ కి అంత అట్టహాసంగా బిల్డప్ ఇచ్చి చూపించిన సీన్లు, అదే ఫారిన్ కంట్రీలో స్టార్
అయిన నితిన్ మీద కూడా వుండాలి. ఇవి కమర్షియల్ సినిమా లెక్కలు. గతంలో ఒక సారి
ఎమ్జీఆర్ ఒక సినిమాలో విలన్ చేతిలో పదిహేను సార్లు ఏకబిగిన కొరడా దెబ్బలు తిని,
తిరిగి అదే కొరడాతో ఆ విలన్ ని కొట్టినప్పుడు తక్కువ కొట్టాడు. ఇది గుర్తు
చేసుకుని మర్నాడు మళ్ళీ అదే సీను షూటింగు పెట్టించి, పాతిక సార్లు ఛెళ్ళు ఛెళ్ళు మన్పించాడు
ఆ విలన్ వొళ్ళంతా. లేకపోతే విలన్
ఎన్నిసార్లు కొట్టాడు, తమ ప్రియతమ పురచ్చి తలైవార్ ఎన్నిసార్లు కొట్టాడూ అని అభిమానులు
లెక్కెట్టు కుంటారని తర్వాత వివరణ ఇచ్చాడు.
స్క్రీన్ ప్లే సంగతులు
ఇది మరో ఫ్రాక్చర్ అయిన బాపతు స్క్రీన్ ప్లే.
నడుస్తున్న కథ మధ్యకి విరిగి, ఇంకో కథ మొదలయి నట్టుండడం. హీరో హీరోయిన్ల మధ్య
ప్రేమ కథగా ప్రారంభమై నడుస్తున్న ప్రేమ కథకి, ఇంటర్వెల్ ముందు అకస్మాత్తుగా బ్రేకు పడి, జానర్
మారిపోయి -మెడికల్ స్కాం కథ మొదలవడం.
కొరియన్ సినిమా ‘ఫోన్’ లో చైల్డ్ సెక్స్ స్కాం ని కనుగొన్న జర్నలిస్టు తో నడుస్తున్న థ్రిల్లర్ కథ కాస్తా, ఆమె ఫోన్ని ఆత్మ ఆవహించడంతో, సూపర్ నేచురల్ హార్రర్ అనే వేరే కథగా (జానర్ గా) మారిపోయినట్టూ..
బ్రిటిష్ సినిమా “హాట్ ఫేజ్’ లో పోలీస్ సినిమాలపై పేరడీగా గా నడుస్తున్న కథ కాస్తా, సెకండాఫ్ లో సీరియల్ కిల్లర్ సినిమాలపై పేరడీ గా మారిపోయినట్టూ..
బాలీవుడ్ సినిమా ‘హవా’ లో, తల్లి కథగా నడుస్తున్న కథనం కాస్తా- ఆమె కూతురి కథగా కథనం మార్చుకుని అలాగే ముగిసినట్టూ.. ‘తెరేనామ్’ లో కూడా కొనసాగుతున్న హీరో హీరోయిన్ల ప్రేమలతో అస్సలు సంబంధంలేని ఇంకో కథతో అతుకుపడినట్టూ..
టాలీవుడ్ సినిమా ‘దొంగోడు’ కథా ప్రారంభంలో హీరో చిన్నప్పటి విషాదకర జీవితంతో అదొక కథాత్మగా ఏర్పడ్డ ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అనే స్క్రిప్టింగ్ టూల్ ని అందిపుచ్చుకుని అటుపైన కొనసాగాల్సి వుండగా, హీరో పెద్దయ్యాక దీని ఊసే లేక ఆ కథాత్మ తెగిపోయినట్టూ..
‘థమ్’ లో నల్గురు యువకుల ప్రేమల్ని చక్కబర్చే హీరో కథగా నడుస్తున్న కథనం కాస్తా, పాత ప్రియురాలు కన్పించగానే హఠాత్తుగా వీళ్ళని వదిలి పారేసి, ఆమెతో ఆ హీరో ప్రేమాయణంగా కథ ప్లేటు ఫిరాయించి నట్టూ..
తాజాగా ‘జ్యోతి లక్ష్మి’ లో వేశ్యని ప్రేమించి పెళ్ళాడిన కథగా నడుస్తున్న పెళ్లి కథ కాస్తా, దాన్ని వదిలేసి
పక్కా వేశ్యాగృహపు యాక్షన్ కథలోకి మారిపోయినట్టూ..
‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కూడా అలా ప్లేటు ఫిరాయించిన కథతో ఫ్రాక్చరైన
స్క్రీన్ ప్లేనే!
***
రెండు గంటల లోపు నిడివి వున్న తెలుగు సినిమా ఎప్పుడూ సక్సెస్
అవలేదు. అది నేటివ్ నిడివి కాదు. దాన్ని కమర్షియల్ సినిమాగా ఫీలవలేరు తెలుగు
ప్రేక్షకులు. తెలుగు సినిమా అంటే రెండు గంటలూ - ఆపైన ఉండాల్సిందే. అలాంటిది నితిన్ లాంటి పాపులర్ స్టార్ తో గంటా ముప్పావు లోపు బుడ్డి సినిమా
అంటే సాధారణ ప్రేక్షకులే కాదు, ఏ తెలుగు సినిమా ట్రేడ్ పండితుడూ దాన్నో కమర్షియల్
సినిమాగా భావించలేడు- ఎంతో బలమైన కథతో కూడుకున్నదై వుంటే తప్ప. తెలుగు సినిమా అంటే ఫుల్ మీల్స్ లా
రెండుగంటల పైబడి ఉండాల్సిందే.
కానీ ఈ సినిమా దర్శకుడు ఇది
రెండుగంటల పైబడిన నిడివి గల సినిమాయే అన్నట్టు
పొరబడి-- ఉన్న గంటా ముప్పావులో గంట సేపూ హీరోని కొరియర్ బాయ్ గానే దింపకుండా,
సంబంధంలేని -కథకి తోడ్పడని- ప్రేమ కథతోనే వృధా చేస్తే ఏమనాలన్నట్టు?
ఇలా చేయడంవల్ల ఇంకో నష్టం కూడా
జరిగింది. క్లయిమాక్స్ లోనే హీరో కి ఆ స్కాం గురించి తెలియాల్సి రావడమేనే సీన్ల
పేర్పు అనివార్యమై, దాంతో బిగినింగ్ విభాగం సెకండాఫ్ తర్వాత కూడా తెగ సాగి- మరో మిడిల్
మటాష్ స్క్రీన్ ప్లేలా కూడా తయారయింది! ఫ్రాక్చరైన స్ట్రక్చర్ కి తోడు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే!
సెకండాఫ్ కూడా దాటిపోయి క్లయిమాక్స్ వరకూ సాగే ఈ బిగినింగ్ విభాగంలో,
మొదట బుఖారెస్ట్ లో విలన్ స్కాం సూచనప్రాయంగా ఓపెన్ చేసి, హైదరాబాద్ లో హీరో మీదికి వస్తారు. ఇక్కడ పూర్తి
నిడివి ( అంటే రెండు గంటల పైబడి నిడివి వున్న) సినిమాల్లో చూపించినట్టే, తీరుబడిగా మొదటి నుంచీ
హీరో చరిత్రంతా చెప్పుకొస్తారు. తిరుపతిలో అతను ఎలా కవర్లు తయారు చేసే కుటీర
పరిశ్రమలో పని చేశాడు, అది నచ్చక ఎలా హైదరాబాద్ లో అక్కాబావల దగ్గర చేరాడు, బియ్యే
పూర్తి చెయ్యని అతను బావ సలహాలతో ఏఏ
ఉద్యోగ ప్రయత్నాలు ఎంత కామెడీగా చేశాడు, అప్పుడు కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్
ఇచ్చిన కవరు తో ఎలా హీరోయిన్ కి పరిచయమై ప్రేమలో పడ్డాడు, పడ్డాక ఎలాగెలా కొరియర్
బాయ్ గా నటిస్తూ కామెడీగా ఆమెని పొందాలని చూశాడు, అతడి వ్యవహారం అర్ధమైన ఆమె
ఎందుకు తనని కాదంటే ఇంకేం చేశాడూ...ఇదంతా నార్మల్ నిడివి సినిమా కథనం లాగా
చాంతాడంత చేసుకు పోయారు. దీంతో పుణ్యకాలం కాస్తా గడిచి పోయింది.
ఇంకా దీనికి సమాంతరంగా
హైదరాబాదుకి మకాం మార్చిన విలన్ ఇక్కడేం చేస్తున్నాడో చూపిస్తూ, ఆస్పత్రుల కొచ్చిన
గర్భిణులకి అబార్షన్ లు కావడమనే ఒకలాటి సస్పెన్స్ తో బ్యాక్ డ్రాప్ ( ఇవి సబ్
ప్లాట్ సీన్లుగా పొరబడకూడదు, ముందు ముందు ఈ సీన్లే ప్రధాన కథ!) సీన్లు వేస్తూ పోయారు. ఇలా ప్రేమ కథ- గర్భిణుల
కథ విడివిడిగా సాగిసాగి- ఇంటర్వెల్ కి ముందు సడెన్ గా- ఆ గర్భస్రావాల రహస్యం విప్పుతూ,
డాక్టర్లతో విలన్ పెట్టే మీటింగు పదినిమిషాలంతా సైంటిఫిక్ గా వివరిస్తూ, క్లిప్పింగ్స్
వేస్తూ గొప్ప హడావిడి చేశారు. దీంతో సినిమా స్వరం (టోన్) పూర్తిగా మారిపోయి రస భంగమవడమే గాక-
పిడుగుపాటులా ఇంకో కథ వచ్చి మీద పడినట్టయ్యింది.
ఇక్కడ్నించీ ఇక రహస్యం కొరియర్ ద్వారా
బయటి కెళ్ళి పోయిందని విలన్ గ్యాంగ్ వేట మొదలవుతుంది. ఈ వేట కూడా ఎందుకో
అర్ధంగాదు, ఆ కవరు సత్యమూర్తికి అందుతుందని తెలిసినప్పుడు సత్యమూర్తి ఇంటి దగ్గరే
కాపేసి- సింపుల్ గా కొరియర్ బాయ్ వచ్చినప్పుడు తన్ని లాక్కోవచ్చు. ఇలా చేస్తే గంట
ముప్పావు కూడా మిగలక గంటకే సినిమా ముగిసిపోతుందని కాబోలు- బుఖారెస్ట్ బిల్డప్
విలన్ ని ఉల్ఫా గాణ్ణి చేసి ఆడుకున్నాడు దర్శకుడు.
ఆ కొరియర్ కూడా వెంటనే హీరో
చేతికి రాదు. దీని కోసం కూడా ఆడియెన్స్ ఇంకా వెయిట్ చేయాలి. ఆ కొరియర్ డెలివరీ
తీసికెళ్ళిన ఫ్రెండ్ కి మరోసారి కోర్టు పని పడుతుంది. ఫస్టాఫ్ లో ఒకసారి ఇదేపని
పడి హీరోకి కవరిస్తే, దాంతో హీరో వెళ్లి
హీరోయిన్ తో ఎటాచ్ అయిపోయాడు. ఇప్పుడు కృతకంగా కథనంలో మళ్ళీ హీరోకే కవరిచ్చే రిపీటీషన్.
అంతసేపూ గ్యాంగ్ తన వెంట పడుతున్నారని కూడా ఆ ఫ్రెండ్ కి తెలీదు. ఆ కవరందుకున్న
హీరో కూడా ఎవరో గ్యాంగ్ తన వెంట ఎందుకు పడుతున్నారో తెలుసుకోడు. తీరా సత్యమూర్తికి
డెలివరీ ఇచ్చేటప్పుడు అతడితో మాట్లాడుతూ ఆ గ్యాంగ్ అక్కడే వుంటారు. వాళ్ళు అక్కడుండి
ఎందుకు మానవ హక్కుల నేత సత్యమూర్తి దృష్టిలో పడాలి? అపార్ట్ మెంట్ బయటే కాపేసి
హీరో మీద దాడి చేసి కవరు లాక్కోవచ్చుగా?
హీరో కవరు ఫ్లాట్ లో సత్యమూర్తికి
డెలివరీ చేస్తే, ఇది కనిపెడతారు అక్కడే కూర్చున్న గ్యాంగ్. హీరో వెళ్ళిపోతాడు. సత్యమూర్తి
ఆ కవరు విప్పిచూడకుండా- అందులో బాటిల్
వుండి ఎత్తుగా వున్నా కూడా- దాన్ని టీపాయ్
మీద పెట్టేసి గ్యాంగ్ తో మాటల్లో పడతాడు. నిత్యం అపాయాల మధ్య జీవించే మాన హక్కుల
నేత సత్యమూర్తి లాంటి వాడు, ఈ వచ్చిన వాళ్ళు తనతో పనుండి వచ్చిన పెద్దమనుషులు కాదని ఎందుకు పసిగట్టలేడో
కూడా అర్ధంగాదు. పైగా వాళ్ళల్లో ఒకడు దగ్గు నటించి మంచి నీళ్ళు అడిగితే తేవడానికి వెళ్లి పోతాడు. గ్యాంగ్ ఆ కవరు
తీసేసుకుంటుంది. ఇంతలో హీరో తిరిగి వచ్చి ఘర్షణ పడతాడు. కవరు తిరిగి హీరో చేతికే
వస్తుంది. మళ్ళీ వేట మొదలవుతుంది. ఇలా మొత్తం ఫాల్స్ డ్రామాతో ఈ థ్రిల్లర్ ని రక్తి
కట్టించాలని చూశారు.
హీరోకి అప్పటికీ స్కాం గురించి
తెలీదు- కానీ ఇంటర్వెల్లోనే ప్రేక్షకులకి తెలుసు. ఇలాటి దయనీయ detached కథనంతో పరుగు
సాగిసాగి- ఆ కవరు హీరో విప్పి చూసేసరికి క్లయిమాక్స్ వచ్చేస్తుంది. ఇలా ఈ
క్లయిమాక్స్ దాకా నడిచిన కథనమంతా అసలు విషయం తెలీని హీరోతో బిగినింగ్ విభాగమే! మిడిల్
మటాషే. ఇక్కడ్నించీ ఓ ఇరవైనిమిషాల వ్యవధిలోనే మిడిల్- ఎండ్ రెండూ ఇరుక్కుంటాయి.
సినిమా ముగుస్తుంది.
ఫస్టాఫ్ లో ఎక్కడో ఆగిపోయిన
హీరోయిన్ ఈ క్లయిమాక్స్ దాకా కన్పించదు. క్లైమాక్స్ లో హీరో కోసం ప్రయత్నాలు చేస్తూంటుంది.
తనకి వేరే బాయ్ ఫ్రెండ్ లేడట, అలా చెప్పడం హీరోని ఏడ్పించడానికేనట. మరి రేపు తన
పెళ్లి వుందని ఖాదీ భండార్ ఒనరుకి చెప్పి సెలవుతీసు
కున్నది? హీరోకి ఎప్పుడు చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది? అసలు
విషయమేమిటంటే, ఆమె బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి
చేసుకోబోతోందన్నట్టు సెలవు తీసుకుంటే -గొప్ప సస్పెన్స్ ఏర్పడి ప్రేక్షకులు కంగారు
పడతారని దర్శకుడి అయిడియా. ఇలా ఫాల్స్ డ్రామాలతో థ్రిల్లర్ వర్కౌట్ అవుతుందా?
***
ఈ కథ మొత్తాన్నీ
దారిలో పెట్టాలంటే, ఇక్కడ దేని బ్యాక్ డ్రాప్ లో ఏది నడవాలో తెలుసుకోవాలి.
తెలుసుకోనందుకే దారితప్పి ఈ పాట్లన్నీ.
మొట్ట మొదట ఓపెన్ చేసిన మెడికల్ స్కాం
బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ నడపాలా? లేకపోతే ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో మెడికల్ స్కాం
నడిపించాలా? ఇది తెలుసుకుంటే ఈ కథ ఇంత గజిబిజిగా వుండదు. ముందు ఈ స్పష్టత లేకపోవడం
వల్లే విడిగా ఒక ప్రేమ కథ- విడిగా మళ్ళీ ఒక స్కాం కథా నడిపించుకొచ్చి- ఏం చేయాలో
అర్ధంగాక- ప్రేమకథ మీదికి స్కాం కథ ఎక్కించేసి తొక్కించేశారు. తట్టుకోలేక మొత్తం
స్క్రీన్ ప్లేనే మధ్యకి విరిగింది.
దర్శకుడు ఈ సినిమా ద్వారా రొమాంటిక్
కామెడీతో ప్రేమకథ అస్సలు చూపించదల్చుకోలేదనీ, కేవలం ఒక థ్రిల్లర్ గా మెడికల్ స్కాం
కథే చెప్పాలనుకున్నాడనేది స్పష్టం.
అంటే మెడికల్ స్కాం బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథని నామమాత్రం
చేసి నడిపించాల్సిన సినిమా ఇది. ఒక బ్యాక్ డ్రాప్ లో ఇంకో కథ నడుస్తోందంటే బ్యాక్
డ్రాప్ లో వున్న కథే ప్రధాన కథవుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. గుర్తు
పెట్టుకోనందు వల్లే మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లో హీరో హీరోయిన్ల మాఫియా
తండ్రులిద్దరి పోరాటాలతో, బ్యాక్ డ్రాప్ లో భీకరంగా సాగుతున్న కథ కంటే - వీళ్ళ
ప్రేమకథ ప్రధానమైపోయి నడుస్తుంది. బ్యాక్ డ్రాప్ లో తండ్రులిద్దరూ నగరాన్ని అట్టుడికిస్తున్నా,
అదేమీ పట్టించుకోకుండా వారస రత్నాలు
ప్రేమించుకుంటూ పాడుకుంటూ వుంటారు. నిజానికిది మాఫియాల బ్యాక్ డ్రాప్ లో
నడుస్తున్న ప్రేమ కథ. అంటే మాఫియాలది ప్రధాన కథ. ప్రేమ కథ దానికి తోడ్పడే ఉపకథ.
అలా ఈ ప్రేమ కథ వెళ్లి మాఫియా కథతో ఢీకొనడమో, మాఫియా కథే ప్రేమ కథలో జోక్యం చేసుకోవడమో జరిగి- రెండూ ఒకటై
ఒకే పట్టాల మీదికి రావాల్సిన వ్యవహారం. ఇలా బ్యాక్ డ్రాప్ తో ఉపకథ స్పర్శించనందుకే,
లేదా ఉప కథతో బ్యాక్ డ్రాప్ స్పర్శించనందుకే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ స్క్రీన్ ప్లే ఫ్రాక్చరై పోయింది.
‘శివ’
లో అది కాలేజీ కథ బ్యాక్ డ్రాప్ లో నడిచే మాఫియా కథా, లేకపోతే మాఫియా బ్యాక్
డ్రాప్ లో నడిచే కాలేజీ కథా? రెండోదే చూస్తాం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే
కాలేజీ కథ. అంటే బ్యాక్ డ్రాప్ లో ఉన్నదే ప్రధాన కథ కాబోతోందని సూచనలిచ్చారు. ఈ
బ్యాక్ డ్రాప్ లో వున్న పాత్రలు కాలేజీ కథలో వేళ్ళు పెడుతున్నాయి. చూసి చూసి హీరో తిరగబడ్డంతో,
అరగంటలోనే బిగినింగ్ విభాగం ముగిసిపోయి- కాలేజీ ఉపకథ మాఫియా బ్యాక్ డ్రాప్ తో
స్పర్శించింది. మాఫియాతో పోరాటానికి పట్టాలెక్కేసింది.
కానీ ‘ఇష్క్’ సక్సెస్ తో
మారిపోయిన నితిన్ ఈక్వేషన్స్ కి న్యాయం చేయాలన్న ఆదుర్దాతోనో ఏమో, కథ డిమాండ్
చేస్తున్న బ్యాక్ డ్రాప్ ప్రాధాన్యాన్ని నిర్లక్ష్యం చేసి- లవర్ బాయ్ గా సగం
సినిమా ప్రేమకథతో తో ప్రేక్షకుల్ని సంతృప్తిపర్చేద్దా మనుకుని, మిగతా సగం యాక్షన్
హీరోగా స్కాం కథ చెప్పేసి ముగిద్దా
మనుకున్నట్టుంది చూస్తే.
***
ఓసారి ఈ కథ ఎలా వుంటే బావుండేదో సరదాగా చూద్దాం.. ఒకరి కథలో లోపాలుంటే చెప్పుకోవచ్చు.
కానీ ఆ కథ మొత్తం ఇలా వుండాలని చెప్పడం మాత్రం సబబు అన్పించుకోదు. అయినా చొరవ
తీసుకుని లూజ్ లూజ్ గా చూసేద్దాం..
ఈ షార్ట్ కమర్షియల్ సినిమాకి సంబంధించి మన కామన్ సెన్స్ ఏం చెబుతోందంటే,
ఓ మెడికల్ స్కాంతో సినిమా ఓపెనయ్యాక, ఇటు హీరోని
చూపిస్తే అతను ఆల్రెడీ కొరియర్ బాయ్ గా పని చేస్తూనే వుండాలి. అతడి జీవిత చరిత్ర
అనవసరం. సమయాభావంవల్ల ఈ కథనానికి వీలైనంత క్లుప్తత అవసరం. ఇక అదే కంపెనీలో
హీరోయిన్ కూడా కొరియర్ గర్ల్ గా పని చేస్తూండాలి. ఎందుకంటే, ఒక పక్క స్కాం కి
బలైపోతున్న సామాన్య మహిళల్ని చూపించుకొస్తూనే మరో పక్క- దీంతో తనకేం సంబంధం లేనట్టు, సాటి మహిళ
అయిన హీరోయిన్ స్థాయిలో వున్న పాత్రని, మేకప్ చెక్కు చెదరకుండా, ఎప్పటికప్పుడు కొత్తకొత్త
కాస్ట్యూమ్స్ తో, ముట్టుకుంటే కందిపోయే
అందచందాలతో, ఇంకేదో లోకంలో జీవిస్తున్న దొరసానిలా చూపించడం సంస్కారం లేని కథనమే
అవుతుంది కాబట్టి.
రెండోది, పోరాటానికి సిద్ధం
చేసేముందు సమీకరణల సంగతి. కురుక్షేత్ర మహా సంగ్రామంలో సమీకరణ లెలా వున్నాయి? ఇక్కడ
కూడా పెద్ద తలకాయలతో బిగ్ స్కాం జరుగుతోంది- బలవుతున్నది అమాయక సగటు మహిళలు.
దీనికి ప్రతిగా సగటు జీవుల పోరాటమే వుండాలి. హీరో సగటు యువకుడే అయినట్టు, అలాటి
కొరియర్ పని చేసే సగటు యువతిగానే హీరోయిన్ కూడా వుండాలి. అప్పుడే ఈ ఎదురెదురు
పోరాట శక్తుల సమీకరణలు విజువల్ గా కంటికింపుగా వుంటాయి. ఒకవైపు బిగ్ షాట్స్-
మరోవైపు ఆమ్ ఆద్మీలు. ఇలా పాత్రల్ని సమీకరించాలి. లేదనుకుంటే హీరోయిన్ ఆ బిగ్ షాట్
విలన్ కూతురైపోవాలి. ఎటూ కాని గ్లామర్ పాత్రగా మాత్రం ఈ కాన్సెప్ట్ బేస్డ్
థ్రిల్లర్ లో చోటు లేదు. థ్రిల్లర్ లో వున్న ప్రతీదీ దానికి తోడ్పడేదే అయి వుండాలి-
మూసఫార్ములా నాన్సెన్సులు ఇందులో జొరబడాల్సిన అవసరం లేదు.
అలా కొరియర్ వృత్తిలో ఇద్దరూ
కలిసిసాగే కథనంలో, వాళ్ళు ఆల్రెడీ ప్రేమికులని చెప్పేయా లి. ఇలా హాఫ్ వేలో
చెప్పేయడం వల్ల సమయం కలిసివస్తుంది. ఆ ప్రేమ సరదాల మధ్య మధ్యే స్కాం కి సంబంధించిన
సీన్లు రావాలి. హీరో తన అక్కని కూడా డాక్టర్ దగ్గరికి తీసేకెళ్తే, ఆ డాక్టర్ అలాటి
మాత్రలే ఇవ్వడాన్ని ఇక్కడే చూపించాలి. ఇలా కథా నేపధ్యం ఏర్పాటయ్యింది, పాత్రల
పరిచయం జరిగింది. ఇక సమస్యకి ( సంఘర్షణ కి ) దారి తీసే పరిస్థితుల కల్పనగా
ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ ని ఓపెన్ చేసి- ఆ స్కాం సీక్రెట్ వున్న కవర్ని
తీసుకుని కొరియర్ ఆఫీసుకు వచ్చే సీను
వేయాలి. ఆ కొరియర్ డెలివరీ ఇవ్వడానికి ఏరియా ప్రకారం హీరోయిన్ చేతికి రావాలి.
ఈలోగా కొరియర్ సత్యమూర్తికి వెళ్లిపోతోందని పసిగట్టిన విలనూ అతడి గ్యాంగూ, ఆ వార్డ్ బాయ్ ని చంపి- కొరియర్ ని చేజిక్కించుకోవడానికి హీరోయిన్ వెంట
పడాలి- ఈ ఘట్టమే కథలో సమస్య- లేదా సంఘర్షణ ఏర్పాటుకి కారణమై, బిగినింగ్ విభాగం ఓ
అరగంటలో ఇక్కడే ముగిసిపోవాలి. ముగిసి, సంఘర్షణతో మిడిల్ విభాగం ప్రారంభం కావాలి.
ఈ మిడిల్ లో విలన్ తో ప్రారంభమైన
సంఘర్షణలో భాగంగా, హీరోయిన్ ని రక్షిస్తూ హీరో ఆ కొరియర్ ని హీరో తీసుకుని, ఆటని
తను టేకోవర్ చేయాలి. హీరోయిన్ కూడా తోడుంటే ఉండొచ్చు. గ్యాంగ్ వెంటపడతారు. వాళ్ళని ఎదుర్కొంటూ వీలుచూసుకుని హీరో ఇదంతా అసలెందుకు
జరుగుతోందని, రూల్స్ కి విరుద్ధమైనా, ఆ కొరియర్ విప్పి చూసెయ్యాలి. అలా అప్పుడే హీరో
ఏదో స్కాం జరుగుతోందని పసిగట్టాలి. కవర్లో ఆ మాత్రలున్న బాటిల్ ని గుర్తు పట్టి
-అక్క గుర్తుకి రావాలి. ఆమెకీ ఇలాటి మాత్రలే ఇచ్చాడు డాక్టర్. వెంటనే ఎలర్ట్ అయి
అక్కని అప్రమత్తం చేయాలి. అప్పటికే ఆమె చాలా మాత్రలు వాడేసి వుండాలి. ఇలా మిడిల్ విభాగం ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోపు పించ్ - 1 పాయింటుకి కథనం చేరుకుని, ఇక్కడ హీరో కవరు విప్పి చూసెయ్యాలి. ఈ పించ్-1 పాయింటే ఇంటర్వెల్ కి దారి తీసే
పరిస్థితిని సృష్టిస్తుంది.
బిగినింగ్ ముగిస్తున్నప్పుడు, అంటే
మిడిల్ ని ప్రారంభిస్తున్నప్పుడు, హీరో
చేతికి ఆ కవరొచ్చింది- పించ్ 1 దగ్గర ఆ కవరులో ఏముందో చూశాడు, నెక్స్ట్ దీన్ని
పట్టుకుని అసలీ స్కాం దేని గురించో తెలుసుకుందామని, మిడిల్ మిడ్ పాయింటుకి- అంటే ఇంటర్వెల్ సీను కేసి హీరో సాగిపోవాలి.
పించ్- 1 వరకూ ఈ ముప్పావు గంట సేపూ కథనంలో ప్రేక్షకులకి సూచన ప్రాయంగా
తెలుస్తున్న స్కాం, ఇప్పుడు హీరోకి కూడా సూచన ప్రాయంగానే తెలిసింది. పూర్తి
స్పష్టత రాలేదు. ప్రేక్షకులతో పాటు హీరో ఒకే ట్రాకులోకి వచ్చేశాడు. ప్రేక్షకులకి
రిలీఫ్. ఇంతసేపూ ప్రేక్షకులకి ఒక తహతహ వుంటుంది. అసలా సబ్ ప్లాట్ లాగా ముక్కలు ముక్కలుగా చూపిస్తున్న స్కాం ఏమిటో, అదెందుకు
జరుగుతోందో తెలుసుకోవాలన్న తహతహ. ఈ తహతహని దర్శకుడెప్పుడు, ఎలా తీరుస్తాడా అని ఉత్కంఠతో ఎదురు
చూస్తుంటారు (చూసేట్టు చెయ్యాలి) -ఇప్పటికి హీరో కూడా తమ ట్రాకులోకే వచ్చెయ్యడంతో
హమ్మయ్యా అనుకుంటారు. తమలాగే ఇక్కడ హీరోకి కూడా సూచనప్రాయంగా ఏదో స్కాం వుందని తెలిసిపోయిందని
అర్ధం జేసుకుంటారు. కాబట్టి ఇతనే ఆ స్కాం ని పూర్తిగా వెల్లడించి, తమ తహతహ తీర్చే
దేవుడని ఉబలాటపడతారు.
ఇంత సన్నివేశ బలం వున్నఈ కీలక
పించ్ - 1 దగ్గర్నుంచీ ఇంకెక్కడా హీరో ప్రేక్షకుల్ని వదిలెయ్యకుండా, తన వెంటే
తీసుకుపోతూండాలి. తను తెలుసుకుంటున్నవి వాళ్ళకీ తెలిసేలా చేస్తూ ఏకకాలంతో వాళ్ళూ
థ్రిల్, ఎక్సయిట్ మెంట్, షాక్ మొదలైన భావోద్వేగాలకి లోనయ్యేట్టు చేయాలి. స్కాంకి సంబంధించి బిగినింగ్ విభాగం లో ప్రేక్షకులతో
కనెక్ట్ కాలేదు హీరో. ఇంకాలస్యం చేయకుండా ఈ మిడిల్ విభాగపు పించ్ -1 దగ్గర ఆడియెన్స్ తో కనెక్ట్ అయిపోవాలి.
దీనివల్ల నత్తనడక నడవకుండా కథనంలో వేగం పెరుగుతుంది. హీరో యాక్టివ్ పాత్రగా
మారతాడు. బ్యాక్ డ్రాప్ ని స్పర్శిస్తున్నాడ న్న ఆశాభావం కథనం రేకెత్తిస్తుంది.
ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గరలో విలన్ (
సైంటిస్టు) డాక్టర్లతో మీటింగు పెట్టి, తన స్కాం సాంతం ఓపెన్ చేసి ట్రైనింగ్ ఇస్తూంటే, హీరో చాటున
గమనిస్తూండాలి. కథకి గుండెకాయ అనదగ్గ సీను. ఇది కథలో హిడెన్ ట్రూత్. ఇక్కడే హీరోతో
బాటు ఆడియెన్స్ కూడా గుండెలు చెదిరే రహస్యం తెలుసుకుంటున్నారు. ఆడియెన్స్ కూడా మొట్ట మొదటి సారి విలన్ దుర్మార్గపు పథకం
గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు కాబట్టి- మూలకణాల వ్యాపారం గురించి విలన్
ఇస్తున్న సైంటిఫిక్ డేటాతో బాటు,
గర్భస్రావాలు ప్లానూ చెబుతూంటే సీను ఓకే బిగ్ బ్యాంగ్ ఇచ్చి బ్లాస్ట్ అవ్వాలి.
పిండాలని చంపుతూంటే
పుట్టాలనుకుంటున్న పిల్లల ఆర్తనాదాలతో, స్త్రీల రోదనలతో బిజిఎం లో మెలోడ్రామా హోరెత్తి పోవాలి. హీరోకి
తన అక్క కూడా ఎంత ప్రమాదంలో పడిందో అప్పుడే తెలిసిరావాలి- వెంటనే ఆమె కి ఫోన్
చేసేందుకు పరిగెత్తబోతూంటే విలన్ చూసెయ్యాలి. స్వయం గా విలనే వచ్చి ఒక్క తన్ను
తన్నాలి. హీరో చేతిలో సెల్, కవరూ ఎటో ఎగిరిపోవాలి. అతను కుప్ప కూలాలి. స్టాప్
మోషన్ లో ఇంటర్వెల్.
***
ఇప్పుడొక సారి చూద్దాం...బిగినింగ్ ముగిసే చోట
మొదటి మూలస్థంభం దగ్గర, కొరియర్ అనే ప్లాట్ డివైస్ కథలోకి రావడం, పించ్-1 దగ్గర అందులో
ఏముందో హీరో చూడ్డం, మిడ్ పాయింట్ ఇంటర్వెల్ దగ్గర, ఆ కొరియర్ తాలూకు స్కాం
మొత్తాన్నీ హీరో కళ్ళారా చూడ్డం.. ఇలా కథకి లంగరేసి పట్టి ఉంచే ఈ మూడు కీలక పాయింట్లలో,
స్టెప్ బై స్టెప్ ఒక్కో విషయం రివీలవుతూ,
రివీలవుతున్న కొద్దీ పరిస్థితి తీవ్రత
పెరుగుతూ, టైం అండ్ టెన్షన్ ఎలిమెంట్ అమలవుతూ పోతోంది. దీంతో బాటే, బిగినింగ్ విభాగంలో
ఇంకా బ్యాక్ డ్రాప్ తో స్పర్శలేక పాసివ్ గా వున్న హీరో, ఇప్పుడు మిడిల్లో ఆ స్పర్శతో పూర్తిగా యాక్టివ్ గా మారిపోయి-
క్యారక్టర్ ఆర్క్ పైపైకి సాగుతోంది. అతడి ఫిజికల్ గోల్ స్కాంని బద్దలు చేయడమైతే, ఎమోషనల్
గోల్ అక్కని కాపాడుకోవడంగా ఎష్టాబ్లిష్ అయ్యింది ఇంటర్వెల్ కొచ్చేసి. ఇలా కథలో జరగాల్సినవి
సకాలంలో జారుతూ స్ట్రక్చర్ పక్కాగా వుంది.
ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభంలో, అంటే
మిడిల్ విభాగం తరవాయి భాగంలో- విలన్ హీరో
సెల్ ఫోన్ లో వీడియో చూస్తూండాలి. అది ఇందాకా చాటుగా హీరో తీసిందే. అప్పుడు కింద
కుప్పకూలిన హీరో లేచి విలన్ని ఒక్క తన్ను తన్నాలి. జామా ఖర్చు బరాబర్- ఎమ్జీఆర్
స్టయిల్లో. ఎగిరిపోయిన సెల్ నీ, కవర్నీ
క్యాచ్ పట్టి హీరో పారిపోవాలి.
సినిమాలో అక్క పాత్ర
పన్నెండేళ్ళుగా సంతానవతి కాలేక- ఇప్పుడు అవబోతున్నట్టు చూపించారు. ఇదే నేపధ్యంలో ఆ మాత్రలవల్ల ఆమె
గర్భం పోగొట్టుకుని, భర్తకి మొహం చూపించలేక ప్రాణాలు తీసుకోవాలి. హీరో వచ్చేసరికి
ఇదీ పరిస్థితి.
ఇది మిడిల్ విభాగపు కథనం. ఇక్కడ కథనం
బిగినింగ్ విభాగపు లాంటి తేలికదనంతో వుండకూడదు.
మొత్తం సంఘర్షణాత్మకంగా, సీరియస్ నెస్ తో రగిలిపోతూ వుండాలి. హీరోకి ఇలాటి వ్యక్తిగత నష్టమే జరగాలి. అప్పుడే
గోల్ కి ఎనలేని బలం, ఎమోషన్, పరిణామాల
పట్ల వెరవని తెగింపూ వచ్చేస్తాయి. అంతేగాక విలన్ దుర్మార్గాలు పెరుగుతూంటే, అది
టైం అండ్ టెన్షన్ స్థాయిని పెంచుతూ, హీరోని
ఉక్కిరిబిక్కిరి చేస్తూంటుంది.
అక్క పరిస్థితి చూశాకా అక్కడ్నించీ
హీరో పవర్ఫుల్ సత్యమూర్తికి ఆ కవరందించేసి, విషయం చెప్పెసేందుకు వెళ్లిపోవాలి. విలన్
గ్యాంగ్ ద్విముఖ వ్యూహంతో వుండాలి. ఒక గ్రూపు కవరు కోసం హీరోని వెంటాడుతూంటే, ఇంకో
గ్రూపు సత్యమూర్తి ఇంటి దగ్గర పొంచివుండాలి. హీరోకి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి
పరిస్థితి ఏర్పడాలి. వెంటాడుతున్న గ్రూపుని తప్పించుకుని సత్యమూర్తి ఇంటి కొస్తే,
ఇక్కడ ఆ రెండో గ్రూపు కవరు కోసం ఎటాక్ చేయాలి. ఈ గొడవకి బయటి కొచ్చి అడ్డు పడిన
సత్యమూర్తి అనూహ్యంగా చనిపోవాలి. గ్యాంగ్ పారిపోవాలి. సత్యమూర్తి మరణంతో హీరోకి
ఇంకో నష్టం జరిగిపోవాలి. హీరోకి దారులన్నీ మూసుకుపోతూండాలి.
అయితే బిగినింగ్ విభాగంలో
ప్రేక్షకులు చూసిన, హీరో చూడని సంఘటన లున్నాయి. అవి గర్భ స్రావాలైన స్త్రీల పరిస్థితి.
ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఇవి కూడా హీరో కళ్ళారా చూస్తేనే- తను
తెలుసుకున్న స్కాం పరిణామాలెలా ఉండబోతాయో అర్ధమవుతుంది. అలాటి దృశ్యాలు రెండు మూడు
ఇప్పుడు హీరోకీ అనుభవం కావాలి. ఇక
ఈ సమస్యకి పరిష్కారంగా పోలీసుల దగ్గరికెళ్ళి పోవాలనుకోవాలి. కానీ ఇక్కడ అసలుకే
మోసం వచ్చే పరిస్థితి వుందని తెలుసుకోవాలి. వ్యవస్థలన్నీ ఇలాగే ఉంటాయనీ, వాళ్ళ
చేతిలో తను ఆధారాలు పెడితే వాళ్ళే ప్రయోజనం పొందుతారని అర్ధమైపోయి - ఇక ఒకే ఒక్క
పనికి- సోషల్ మీడియాలో ఈ స్కాం రట్టు చేసేందుకు సిద్ధమైపోవాలి.
అయితే విలన్ హీరో కంటే ఒకడుగు
ముందుండాలి. హీరోయిన్ని కిడ్నాప్ చేసెయ్యాలి. హీరో ఆ ఆధారాల్ని సోషల్ మీడియాలో
బట్టబయలు చేయకుండా, ఈ కిడ్నాప్ తో చెక్ పెట్టాలి. గర్భిణులతో నా వ్యాపారాన్ని నువ్విలా
మూయించేస్తే, నీతో నీ హీరోయిన్ గర్భమే ధరించకుండా గర్భ సంచీనే తీయించేస్తా- అని బెదిరించాలి. దీంతో మిడిల్ విభాగం ముగిసి ఎండ్ (క్లయిమాక్స్)
విభాగంలో పడుతుంది కథ.
ఇలా హీరోయిన్ కిడ్నాప్ తో ఇక్కడ రెండో
మూల స్థంభం ఏర్పాటయింది. ఇదెలా ఏర్పడింది? రెండో మూల స్థంభం మిడిల్ విభాగం లో
పించ్- 2 అనే పాయింటు వల్ల ఏర్పడుతుంది. హీరో పోలీస్ స్టేషన్ కెళ్ళడం పించ్-2.
అక్కడ్నించే పరిస్థితులు కిడ్నాప్ కి దారి తీ శాయి. అలా కిడ్నాప్ తో కథ మలుపు
తిరిగి మిడిల్ ముగుస్తూ రెండో మూల స్థంభం ఏర్పాటయింది. అంటే ఫస్టాఫ్ లో పించ్ -1
ఇంటర్వెల్ కి దారి తీసే పాయింటైతే,
సెకండాఫ్ లో పించ్- 2 క్లయిమాక్స్
కి దారి తీసే పాయింటని గుర్తు పెట్టుకోవాలి.
ఇప్పుడొకసారి
చూద్దాం..
ఫస్టాఫ్ లో మొదటి మూలస్థంభం
లేదా ప్లాట్ పాయింట్- 1 : కథలోకి కొరియర్ ప్రవేశించడం.
పించ్ -1 : కొరియర్ లో ఏముందో హీరో తెలుసుకోవడం.
మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) : స్కాం సంగతి
హీరో కళ్ళారా చూడ్డం.
సెకండాఫ్ లో పించ్- 2 : హీరో పోలీస్
స్టేషన్ కెళ్ళడం.
రెండో మూల స్థంభం లేదా ప్లాట్ పాయింట్ -2 : హీరోయిన్ కిడ్నాప్.
ఇదీ స్ట్రక్చర్. ఈ అయిదు పిల్లర్స్ స్క్రీన్ ప్లేని
పకడ్బందీగా నిలబెట్టాయి. స్క్రీన్ ప్లేలో ఈ ఐదు పిల్లర్సూ ఒకదాని పర్యవసానంగా
మరొకటి ఏర్పడుతూపోయి కథని సమగ్రంగా ముందుకు నడిపించాయి.
***
డేవిడ్ కెప్ పేరు వినే వుంటారు. ‘జురాసిక్ పార్క్’, ‘మిషన్ ఇంపాసిబుల్’, ‘మెన్ ఇన్ బ్లాక్-3’ వంటి 30 భారీ
సినిమాలకి రచన చేసిన టాప్ -5 హాలీవుడ్ స్క్రీన్ రైటర్లలో ఒకడు. ఈయన రచన చేసిన
సినిమాలు 2.3 బిలియన్ డాలర్ల కలెక్షను సాధించాయి. 2012 లో ‘ప్రీమియం రష్’ అనే
స్క్రిప్టు రాసుకుని దర్శకుడయ్యాడు.
ఇందులో యంగ్ హీరో న్యూయార్క్ లో
ఒక పెద్ద నెట్ వర్క్ గా వుండే 1500 మంది సైకిల్ మెసెంజర్ బాయ్స్ లో ఒకడు. అక్కడ
మెసెంజర్ బాయ్స్ ( కొరియర్ బాయ్స్) ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించేందుకు,
తద్వారా స్పీడ్ డెలివరీ చేసేందుకు సైకిళ్ళ మీదే విన్యాసాలు చేస్తూ దూసుకుపోతారు (ఈ వ్యవస్థ
ఒకప్పుడు ఉండేదనీ, ఇంటర్నెట్ వచ్చాక అంతరించిపోయిందనీ అంటారు). ఈ సినిమాని డేవిడ్ నేటి యువతరం ప్రేక్షకులని దృష్టిలో
పెట్టుకుని న్యూవేవ్ థ్రిల్లర్ గా తీశాడు. ఇందుకు ఈ కథని ‘టైం లాక్’ స్టోరీ లిమిట్ లో పెట్టి నడిపాడు. కథాకాలం
కేవలం 93 నిమిషాలు. గంటన్నరలో అంటే 90 నిమిషాల్లో హీరో కొరియర్ డెలివరీ చేయాలి.
దాటితే ఉపయోగం వుండదు. ఈ గంటన్నరలో ఫటాఫట్ గా ఏమేం జరిగాయన్నదే కథ.
ఈ టైం లాక్ లోనే కథ కొన్ని పొరలుగా
వుంటుంది. ఒక్కో పొరలో ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంతుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాకులు కేవలం అంతకి ముందు గంట
క్రితమో, గంటన్నర క్రితమో జరిగిన సఘతనలే అయ్యుంటాయి తప్ప- పెద్ద దుకాణం పెట్టి
చరిత్రలు చెప్పుకొచ్చే సోదిగా వుండవు. అలా చేస్తే గంటన్నరలో టైం లాక్ తో స్పీడుగా
సాగుతున్న ప్రస్తుత కథ దెబ్బతింటుంది. స్క్రీన్ మీద టైం తెలియడానికి డిజిటల్
క్లాక్ రన్ అవుతూ వుంటుంది. అవసరమున్న సమయంలో ఇది కన్పిస్తూ వుంటుంది. ఫ్లాష్
బ్యాక్ పడ్డప్పుడు టైం వెనక్కి రన్ అవుతుంది.
ఇందులో హీరో చదువు మానేసిన వాడే.
అయితే అందుకో కారణం వుంటుంది. లా చదివి లాయరై ఎవరివో గొడవలు పరిష్కరిస్తూ జీవితం
గడిపెయ్యలేనని తెలుసుకుని, చదువు మానేసి మరో థ్రిల్లింగ్ గా వుండే వృత్తికోసం
చూస్తూంటే, సైకిళ్ళ మీద సాహసోపేతమైన మెసెంజర్ బాయ్స్ ఆకర్షిస్తారు....ఇది
చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ ఏమీ వేయరు. డైలాగుల్లో వచ్చేస్తుంది..
హీరోయిన్ కూడా మెసెంజర్ గర్ల్
గానే వుంటుంది. ఆల్రెడీ ఇద్దరూ ప్రేమలో వున్నారని మనకి తెలుస్తూంటుంది. పదినిమిషాల్లో
బిగినింగ్ ముగించేసి- ఒక యూనివర్సిటీలో చదివే చైనీస్ అమ్మాయి, హీరోకి కొరియర్
అందించి, అర్జెంటుగా దాన్ని చైనా టౌన్ లో ఒకరికి డెలివరీ చేయాలని చెప్పడంతో మిడిల్
ప్రారంభమవుతుంది.
ఆ కొరియర్ కోసం ఒక పెద్దమనిషి
వెంటబడతాడు. అతడి కారూ- హీరో సైకిలూ ఛేజింగ్స్ మొదలవుతాయి. తనని చంపేసేట్టు ఉన్నాడని, కారు నంబర్ ఫోటో తీసుకుని పోలీస్ స్టేషన్ కి చేరుకుంటాడు హీరో. ఆ పెద్ద మనిషి అక్కడే ఉంటాడు పోలీసు అధికారిగా.
హీరో తప్పుకుని దాక్కుని, అసలా కొరియర్ లో ఏముందో చూస్తేస్తాడు. ఇది స్క్రీన్ ప్లేలో 28 వ
నిమిషంలో వస్తుంది.
ఆ కొరియర్ లో ఒక టికెట్ వుంటుంది.
చైనా నుంచీ ఓడలో మనుషుల్ని అమెరికాకి స్మగుల్
చేసే టికెట్. ఆ అమ్మాయి తన తల్లినీ కొడుకునీ ఇలా అక్రమ మార్గంలో అమెరికాకి రప్పించుకోవాలనుకుంటోందికుంది..
ఇది ముందే ఏజెంట్ ద్వారా
తెలుసుకున్న ఆ పోలీస్ అధికారి- ఆ టికెట్ కొట్టేయాడానికి వెంట బడుతున్నాడు. ఆ
టికెట్ అమ్ముకుంటే 50 వేల డాలర్లు వస్తాయి. ఈ డబ్బు ఎందుకనే దానికి క్లాక్ లో టైం మధ్యాహ్నం
3.37
గంటలకి వెనక్కి చూపించి- అప్పుడేం జరిగిందో ఫ్లాష్ కట్ పడుతుంది. గత
కొంతకాలంగా గ్యాంబ్లింగ్ లో భారీగా బకాయి పడుతూ వస్తున్న ఆ పోలీసు అధికారి, ఎంతకీ ఆ బాకీ తీర్చకపోవడంతో చిత్తుగా తన్నులు
తిన్నాడు. ఇక లాభం లేదని ఆ బాకీ తీర్చెయ్యడం కోసం ఈ టికెట్ మీద కన్నేశాడన్నమాట...
చాలా కథ చిన్నదే, కానీ కథనం
గొప్పది. యూత్ ని ఎలా కట్టిపడెయ్యాలో అలా కట్టిపడేసే టెక్నిక్ డేవిడ్ కెప్ ది,
దీన్ని తెలుగు తమిళాల్లో దింపాలనుకున్న దర్శకుడు కొరియర్ వెనుక కథ మార్చేసి మెడికల్ స్కాం
పెట్టడం గొప్పతనమే- కానీ కథ చేసుకోవడం దగ్గరే వచ్చింది సమస్య! స్క్రీన్ ప్లే నిరక్షరాస్యత దర్శకత్వాల్ని పట్టి
పల్లార్చుతోంది...
—సికిందర్