దర్శకత్వం : ఫిలిప్ మార్టిన్
తారాగణం : రూఫస్
సెవెల్, గిలియన్ ఆండర్సన్, కీలీ హవేస్, బిల్లీ పైపర్ తదితరులు
రచన : పీటర్
మోఫాట్, జియోఫ్ బుస్సేటిల్
సంగీతం : అన్నే నికితిన్, హన్నా పీల్; ఛాయాగ్రహణం
: నానూ సెగల్
బ్యానర్స్ : ది లైట్‌హౌస్
ఫిల్మ్ అండ్ టెలివిజన్, వోల్టేజ్ టీవీ
నిర్మాతలు : రాడ్‌ఫోర్డ్
నెవిల్లే, హిల్లరీ సాల్మన్
విడుదల : నెట్‌ఫ్లిక్స్
***
2019 నాటి ఒక బ్రిటిష్
బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని విడుదలైన
నెట్ ఫ్లిక్స్ మూవీ ‘స్కూప్’ ప్రస్తుతం
ట్రెండింగ్ లో వుంది. ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా
వుంది. బిబిసి జర్నలిజం నోయిడాలో కొలువుదీరిన మన గోదీ భజన మీడియా జర్నలిజానికి
అందనంత సుదూరంగా, అందుకోలేని ఎత్తులో జర్నలిజం విలువలతో
వుంటుంది. అందుకే ఎంత భారీ కూపీ లాగినా టీఆర్పీల కోసమని సొంత బాకా వూదుకుంటూ
హంగామా చేయదు. వార్తల్లో ఆ దోషి వుంటాడు, తనుండదు. అందుకే
బ్రిటన్ యువరాజు భాగోతాన్నిబట్టబయలు చేసి, అతడ్ని
పదవీచ్యుతుడ్ని చేసిన విస్ఫోటక టెలివిజన్ ఇంటర్వ్యూని ప్రసారం చేస్తూ- ‘ఇది విమానంవచ్చి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొన్న పేలుడు కాదు, సునామీ ఉత్పాతం కాదు, అణుబాంబు విస్ఫోటం అంతకన్నా కాదు-
ఇది కేవలం కారు ప్రమాదం కంటే తక్కువ రకం మామూలు ప్రసారం’ అని
నిరాడంబరంగా చెప్పుకుంది. ఈ కొటేషన్ బాగా పాపులరైంది.
ఇంతకీ ఎవరా
బ్రిటన్ యువరాజు? అతనేం చేశాడు? తర్వాత ఏమయ్యాడు? ఏమా కథ? ఈ వివరాల్లోకి వెళ్దాం...
2010-2019 రెండే ఆధారాలు
2010 లో న్యూయార్క్ లో సిటీలో డ్యూక్ ఆఫ్ యార్క్ ప్రిన్స్ ఆండ్రూ (రూఫస్ సెవెల్), జెఫ్రీ ఎప్‌స్టీన్ (కొలిన్ వెల్స్) అనే అతడితో కలిసి నడుచుకుంటూ పోతూంటే, ఒక ఫోటోగ్రాఫర్ వెంబడించి ఫోటోలు తీస్తాడు. డ్యూక్ ఆఫ్ యార్క్ బ్రిటన్లో ప్రభువుల బిరుదు. దీన్ని పాలిస్తున్న చక్రవర్తి రెండవ కుమారుడికి ఇస్తారు. తొమ్మిదేళ్ళ తర్వాత, 2019 లో లండన్లో బిబిసి ‘న్యూస్ నైట్’ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్‌అలిస్టర్ (బిల్లీ పైపర్), పత్రికలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ ఆండ్రూ స్పాన్సర్ చేసిన యువ వ్యాపారవేత్తల ఈవెంట్‌లోని ఫోటోల పక్కన ఆ ఫోటోని చూస్తుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ప్రిన్స్ ఆండ్రూ కలిసి వెళ్ళడం. న్యూయార్క్ లో ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికర్. అతడిమీద మైనర్ బాలికలతో పాల్పడిన లైంగిక నేరాల ఆరోపణలున్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కోసం అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూంటాడు. ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అతను పలుకుబడిగల ధనిక అమెరికన్ ఫైనాన్షియర్.

ప్రిన్స్ ఆండ్రూ, ఎప్‌స్టీన్ లు చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా వున్నారు. 2006లో లైంగిక నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తో యువరాజు స్నేహాన్ని కొనసాగించినట్టు ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది సామ్ కి. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ని కాంటాక్టు చేసి ఎప్‌స్టీన్ వివరాలు మరిన్ని రాబడుతుంది. ఎప్‌స్టీన్ ఇంటికి వస్తూ పోతున్న చాలా మంది మైనర్ బాలికల ఫోటోలు ఆమె చేతికొస్తాయి.
రియల్ సీన్ |
ఇదే సమయంలో, వర్జీనియా గుఫ్రే అనే ఎప్‌స్టీన్ బాధితురాలు యువరాజు తనతో మూడుసార్లు గడిపాడని బయట పెడుతుంది. దీంతో యువరాజు ఆండ్రూ, సామ్ కి ఇంటర్వ్యూ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ ఇంటర్వ్యూలో అతనేం చెప్పాడు? 2010 లో ఆ రోజు ఎప్‌స్టీన్ ని ఎందుకు కలిశాడు? వర్జీనియా చేసిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్పాడు? ఇంటర్వ్యూ పూర్తయ్యాక ‘ఇంటర్వ్యూ బాగా వచ్చింది కదూ’ అని ఎందుకు సంతృప్తి చెందాడు? అసలు తన మీద ఆరోపణల్ని ఖండించి ఇంటర్వూని నిరాకరించకుండా ఎందుకు మొత్తం తన చిట్టా విప్పాడు? ఈ ఇంటర్వ్యూ ప్రసారమయ్యాక అతడి పరిస్థితి ఏమిటి? అతడిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఏం నిర్ణయం తీసుకుంది? ఇవన్నీ ఈ 103 నిమిషాల పాటు సాగే ఈ మూవీ చూస్తే తెలుస్తాయి.
జర్నలిజపు ఝలక్
2022 లో బిబిసి మాజీ ‘న్యూస్ నైట్’ ప్రోగ్రాం ఎడిటర్ సామ్ మెక్అలిస్టర్ రాసిన ‘స్కూప్స్ : బిహైండ్ ది సీన్స్ ఆఫ్ ది బిబిసీస్ మోస్ట్ షాకింగ్ ఇంటర్వ్యూ’ అన్న పుస్తకం ఆధారంగా ఈ మూవీ నిర్మించారు. ప్రిన్స్ ఆండ్రూ పతనానికి కారణమయిన స్కూప్ కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్ సిబ్బందితో చర్చలు జరిపిన ముగ్గురు బిబిసి మహిళా జర్నలిస్టుల తెర వెనుక కథ ఇది. మూవీ కోసం కథని బిబిసి ‘న్యూస్‌నైట్’ బృందం స్కూప్ ని ఎలా లాగింది, ఆండ్రూ అసలు ఇంటర్వ్యూకి ఎందుకు అంగీకరించాడన్న రెండు అంశాల చుట్టూ కేంద్రీకరించా మని రచయితల్లో ఒకడైన పీటర్ మఫాట్ చెప్పాడు.

నిజ జీవితంలో ఈ ఇంటర్వ్యూ యువరాజు ఆండ్రూ పబ్లిక్ ఇమేజ్‌ని తుడిచిపెట్టేసింది. ఇంటర్వ్యూలో 59 ఏళ్ళ ఆండ్రూతో అతడి ఇగోని ముక్కలు చేసే ఒక మాట అంటుంది సామ్- ఇది మీ బ్రాండ్ కి దెబ్బ కాదు, ఇది మాత్రమే మీ బ్రాండ్- అని! మనకేదో బ్రాండ్ వుందని మనసు లోపల అనుకుంటాం. బయటినుంచి చూసేవాళ్ళకి ట్రోలింగ్ మెటీరియల్ లా కనపడతాం. నా బ్రాండే నాకు రక్ష అని ఆండ్రూ చేయరాని పనులు చేశాడు. బహుశా ఈ కారణంగానే ఇవ్వరాని ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంతో ట్రోలింగ్ మెటీరీయల్ గా మారాడు.
మూవీ సీన్ |
జర్నలిస్టుల వైపు నుంచి కథ సాగుతుంది. వాళ్ళలో టెన్షన్ ఏమీ వుండదు. పరుగులుండవు. బ్యాంకు ఉద్యోగులు తలవంచుకుని పని చేసుకుంటున్నట్టు డెస్కుల్లో కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుంటూ వుంటారు. ఆండ్రూ మొదట ఇంటర్వ్యూకి ఒప్పుకోకపోతే భారీగా ఇంటర్వెల్ బ్యాంగేమీ పడదు. తెలుగు దర్శకుడు ఈ ఛాయాల్లో కనిపించడు. ఇంకెలా ఇంటర్వ్యూ సంపాదించాలన్న గోల్ కూడా వుండదు. విధివశాత్తూ జైల్లో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకుంటే, వర్జీనియా అనే బాధితురాలు ఆండ్రూ మీద ఆరోపణలు చేస్తే అలా కలిసి వస్తుంది.
ఇంటర్వ్యూ లో సామ్ ఆండ్రూని ప్రశ్నలతో అదరగొట్టదు. ‘మీరు మామిడిపండు ఎలా తీసుకుంటారు? చీకుతారా? లేక కోసుకు తింటారా? అని అభిమానంతో అడిగినట్టు, ‘మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఏం డ్రింక్ తీసుకుంటారు? అని ప్రేమగా అడిగినట్టు, ప్రశ్నలు అడుగుతుంది.
కుతూహలమే బలం
గొప్ప తారాగణం లేకపోతే ఈ రకమైన మూవీ పని చేయదు. కల్పిత కథయితే ఎంత గొప్ప తారాగణ బలమున్నా పనిచేయదు. ఇది నిజ కథ. అందుకని ఏం జరిగి వుంటుందన్న సహజ ఆసక్తి, కుతూహలమే తారాగణానికి కలిసి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బిబిసి గురించి తెలుసు. ప్రజల సొమ్ముతో నడిచే దానికో గౌరవముంది. అది ఇతర వార్తా సంస్థల్లాగా, సోషల్ మీడియాలాగా లాభార్జన దృష్టితో పోటీపడదు. సమగ్రతతో కూడిన బ్రాండ్ నేమ్ ని కాపాడుకునే ఔచిత్యం దానికవసరం- ‘స్కూప్’ లోని పాత్రల్ని ఈ సూత్రమే నడిపిస్తుంది. అందుకే ఈ శతాబ్దంలో మీడియా స్వేచ్ఛ గురించి, విలువ గురించి, దాని ఆవశ్యకత గురించీ చాలా నిరాడంబరంగా, అంతర్లీనంగా మెసేజీనిచ్చే ఈ కథని రెగ్యులర్ జర్నలిజం థ్రిల్లర్ లా తీయలేదు దర్శకుడు ఫిలిప్ మార్టిన్.

ఇంటర్వ్యూ తర్వాత పరిణామాల్ని కొన్ని
చిన్న చిన్న
సన్నివేశాలతో, టైటిల్ కార్డ్స్ తో, అలాగే సోషల్ మీడియా రియాక్షన్స్ తో కలిపి, ప్రిన్స్
ఆండ్రూ స్కాండల్ కి ముగింపు నిచ్చాడు. రాణి
ఎలిజబెత్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులోనే వచ్చేస్తునది. ఆఖర్న వర్జినియా విషయంలో
ఆండ్రూ లో వచ్చిన మార్పు కూడా. ఇది జర్నలిస్టులు తప్పక చూడదగ్గ మూవీ.
—సికిందర్