(‘సాహో’ లైన్ ‘లార్గో వించ్’ నుంచి కాపీ అని వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు టాలీవుడ్ మిత్రులు ‘సాహో’ లో ఎండ్ సస్పెన్ తో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే చేశారని ఫోన్లు చేసి చెప్పేస్తున్నారు. తాజాగా సిఎస్ అనే ఇంకో మిత్రుడు, ఇంకో అడుగు ముందుకేస్తూ రీసెర్చి చేసి, అసలు ‘సాహో’ స్క్రీన్ ప్లే, కథనం ఇదే దర్శకుడు తీసిన తొలి మూవీ, ‘రన్ రాజా రన్’ నుంచే దించేశాడని విశ్లేషణ రాసి పంపారు. ‘రన్ రాజా రన్’ లోని రోమాన్సు, ‘సాహో’లో యాక్షన్ గా ఎలా మారిందో వివరించారు. ఇంకా ‘రన్ రాజా రన్’ లోని పాత్రలే, వాటితో వున్న కథనాలే ‘సాహో’ లో ఎలా మార్చి తీశాడో చెప్పారు. ఈ విశ్లేషణ చదవండి. చివర ‘రన్ రాజా రన్’ కి అప్పట్లో పోస్టు చేసిన బ్లాగు రివ్యూ లింక్ ఇచ్చాం, అది కూడా చదవండి)
‘రన్ రాజా రన్’ సినిమానే మళ్ళీ ‘సాహో’ గా తీసిన సుజీత్. అదేంటి? ‘లార్గో వించ్’ నుండి ‘సాహో’ కు లైన్ తీసుకున్నారని
అంటున్నారే? మరి 'రన్ రాజా రన్' కు పోలిక ఏమిటి? ఎందుకో చూద్దాం...
‘రన్ రాజా రన్' సినిమాలో కథ ఏమిటో, అసలేం జరుగుతుందో చివరి ఇరవై నిమిషాల వరకూ తెలీదు. మరి అంత వరకూ జరిగింది ఏమిటి? ఒక పక్క, శర్వానంద్ కూరగాయల షాపు నడుపుకుంటూ డిజైనర్ డ్రెస్సులు వేసుకుని తెలుగు సినిమా హీరోలా ఏ పనీ పాట లేకుండా హీరోయిన్ తో అచ్చిక బుచ్చికలు, ఇంకో పక్క నగరంలో జరుగుతున్న కిడ్నాపులు, కిడ్నాపర్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్న కమీషనర్ సంపత్ రాజ్, అతను వేసే చెత్త పథకాలు. సినిమా మొదలైన గంటా యాభై నిముషాలు వరకూ జరిగింది ఇంతే.
హీరో సమస్య ఏమిటి, అతని గోల్ ఏమిటి, విలన్ ఎవరు, వాడి గోల్ ఏమిటి? ఇలా ఏమీ తెలీకుండా గూగుల్ లో వెతికితే వచ్చే జోకులతో టైమ్ పాస్ తప్ప, దాదాపు ఒక గంటా యాభై నిముషాల సినిమాలో కథ ప్రసక్తే లేదు. ఇంటర్వల్లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేయడం ట్విస్ట్ అట! నాకు బోర్ కొట్టి ఇక వెళ్ళి పోదాము అనుకున్న టైమ్ లో, చివరి ఇరవై నిమిషాలూ ట్విస్టుమీద ట్విస్టులు.

ఒకప్పుడు కిడ్నాపులు (డబ్బు కోసం)
చేసింది ఇప్పటి కమీషనరు సంపత్ రాజ్ అనీ,
అప్పటి ఆ కిడ్నాపు
నేరాన్ని మన హీరో నాన్న మీద వేసి జైలుకు పంపాడనీ, ఇప్పటి కిడ్నాపులు చేసేది
మన హీరో అనీ, ఇది సంపత్ రాజ్ ను జైలుకు పంపడాని కి మన హీరో వేసిన
‘అతి తెలివైన (!) పథకం అనీ.
ఇవి కాక, హీరోయిన్ హీరో ను ప్రేమించలేదనీ, జస్ట్ బక్రా గా సెలెక్ట్ చేసుకుందనీ, అయితే అంత కంటే ముదురైన మన హీరో ఆమెను బక్రాను చేయడానికే తాను
బక్రాగా నటించాననీ, ఇలా వంశీ తీసిన ‘అన్వేషణ’
సినిమా చివరలో రాళ్ళ పల్లి అన్ని రహస్యాలు
ఒక్క సారి గా గుక్క తిప్పుకోకుండా చెప్పినట్టు, డైరెక్టర్ మనకు చెప్తాడు- చూసారా
నా స్క్రీన్ ప్లే అన్నట్టు.
చివరలో సస్పెన్స్ విప్పడానికి ఇదేమీ ‘అన్వేషణ’ లా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ‘అన్వేషణ’ లో ఆ సస్పెన్స్ మొదటినుండీ బిల్డ్అప్ అవుతుంది.
చివరి నిమిషం వరకూ ఏదో సోది చెబుతూ, చివరలో వాటికి కారణాలు చెబుతూ, ఇదీ అసలు కథ అని అప్పుడు రివీల్ చేయడం ఒక రకమైన మోసమే. డైరెక్టర్ ఉద్దేశం ప్రకారం ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ. అయితే ఇది స్ట్రక్చర్ లో లేని సినిమా. అయినా కూడా ‘రన్ రాజా రన్’ సక్సెస్ అయిందంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. కొంత మంది యువతకు నచ్చే హీరో హీరోయిన్ మధ్య వచ్చే పిచ్చి కామెడీ సీన్లు కావచ్చు , ఇంకొంత మందికి నచ్చే పాచి పోయిన 'మామను తిప్పలు పెట్టే అల్లుడు' కామెడీ సీన్లు కావచ్చు, లేదా శర్వానంద్ తన కుబుసాన్ని విడిచి రవితేజ మాస్కును తొడుక్కుని వేసే వెకిలి వేషాల సీన్లు కావచ్చు, రిలీజ్ అయిన టైమ్ కావచ్చు. ఇంకా అనేకం కావచ్చు. Sujeeth just got away.
ఇంటర్వల్లో హీరోనే దొంగ అని ఒక ట్విస్ట్ (‘రన్ రాజా రన్’ లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేసినట్టు). ఇక చివరి ఇరవై నిమిషాల్లో...ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ (రన్ రాజా రన్ లాగా). హీరో చేసే ప్రతీ పని వెనుక పెద్ద ప్లాన్ ఉంది (రన్ రాజా రన్ లాగా). హీరోయిన్ హీరో ను ప్రేమించినట్టు నటించింది బట్ చివరికి ప్రేమలో పడింది (రన్ రాజా రన్ లాగా). ఇకపోతే పోలీసే ఒక క్రిమినల్ (రన్ రాజా రన్ లో సంపత్ రాజ్ లాగా). ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చివరి నిమిషాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు. ‘లార్గో వించ్’ లైన్ తీసుకుని, ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ ను మళ్ళీ రాస్తే అయింది ‘సాహో’. Sujeeth got away for the first time but luck won't favour every time.
―సి.ఎస్, టాలీవుడ్