టాలీవుడ్ దర్శకులు ‘సిఎస్’ పంపిన ‘2.0’ కాన్సెప్ట్ ఎనాలిసిస్ : Regarding your review of ‘2.0’ in Telugurajyam.com : That's the point. Many reviewers quote it as 'Good vs Evil'. Who is Good?, who is Evil? If Akshay is Good (in terms of intentions-as per the story) then Rajni is BAD. That's a fundamental flaw in the plot. Should I empathize with Akshay, a noble man for fighting for a cause (or fought) or with Rajni who wants to Kill the good man! Isn't that confusing! (like u said in the last line..why the hell they kill!). So is it Good (Akshay) vs Bad (Rajni) !!!!
(Sikander answers : Yes. Even after Rajni gets to know about Akshay's flash back story, which evokes a deep sympathy in the audiences, he behaves badly with Akshay! And in the end, he preaches what already Akshay has preached! He has no alternate solution to the main problem, whatsoever).
Just another technical point. If VoiP is used, then the internet received from network may still have some radiation so alternative ways of wifi to be used like we use fibre cable and wifi at home. Anyway the point is, film must propose some alternatives…
2.0
మూవీ కాన్సెప్ట్ : “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల
పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి
శాస్త్రజ్ఞుడి ఆత్మని ― తన చిట్టి రోబో చేత అంతమొందించి ― పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్”
కాన్సెప్ట్ అన్నా ఐడియా అన్నా ఒకటే.
అనుకుంటున్న కథని ఐడియాలో కూర్చినప్పుడే కథ తప్పుగా వుందో ఒప్పుగా వుందో తెలిసిపోయే
వీలుంటుంది. రాస్తూ కూర్చునే స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ ఐడియా దగ్గరే నిర్ణయమవుతుంది.
ఈ కామన్ సెన్స్ లేకుండా స్క్రీన్ ప్లే చక్కగా వస్తోందని సింగారించుకుంటూ ఆనందపడిపోతే,
అది వెళ్లి మేళ తాళాలతో సింగూరు రిజర్వాయర్ లో సమర్పయామి అవుతుంది. ఐడియా అంటే
స్ట్రక్చర్. తట్టిందల్లా ఐడియా ఐపోదు, స్ట్రక్చర్ లో కుదురుకున్నదే ఐడియా. వృక్ష, జంతు,
మానవ జాతులు...ఇంకే జాతైనా సరే, పుట్టిన కాణ్ణుంచీ గిట్టే దాకా జీవ క్రియలకి అదే
నీరు ఎలా కలిగి వుంటాయో, ఐడియా దగ్గర్నుంచీ సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్
మెంట్, డైలాగ్ వెర్షన్, చివరికి మూవీ దాకా, కథా నిర్వహణకి ఒకే స్ట్రక్చర్ ని కలిగివుంటాయి. ఈ స్ట్రక్చర్
వెళ్లి ప్రేక్షకుల కథల్ని రిసీవ్ చేసుకునే మానసిక రాడార్ నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతుంది.
అంటే సినిమా కథల స్ట్రక్చర్, కథల్ని రిసీవ్ చేసుకునేప్పుడు ప్రేక్షకుల మెంటల్
స్ట్రక్చర్ ఒకటేనన్న మాట. ఈ కామన్ సెన్సు లేకపోతే నాన్ సెన్స్, ఇంకా న్యూసెన్సు
స్క్రిప్టులు తయారవుతాయి.
మొట్ట
మొదట ఐడియాకి స్ట్రక్చర్ అంటే, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన మర్యాదైన కథనమని
(స్క్రీన్ ప్లే అని) తెలిసిందే. కాబట్టి ఐడియా దగ్గరే సకల మర్యాదలతో స్క్రీన్
ప్లేగా చూడగల్గాలి.
1) ఐడియాలో తగిన బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలున్నాయో లేవో చూసుకోవాలి.
2) ఈ విభాగాలు ఆర్గ్యుమెంట్ సహిత కథని ఏర్పరుస్తున్నాయా, లేక స్టేట్ మెంట్ సమేత గాథగా వున్నాయో చూసుకోవాలి. గాథగా వుంటే ఆర్గ్యుమెంట్ సహిత కథగా మార్చుకోవాలి. అలా వచ్చేదాకా ఐడియాతో కుస్తీ పడుతూనే వుండాలి. అయినా కుదరలేదంటే ఆ ఐడియాని వదిలేయాలి.
3 ) ఆర్గ్యుమెంట్ లో కూడా a) యూత్ అప్పీల్, b) మార్కెట్ యాస్పెక్ట్ వున్నాయో లేవో చూసుకోవాలి. ఉదాహరణకి సామాజిక సమస్యల్ని ఊహాజనిత సైన్స్ ఫిక్షన్ గా పాసివ్ గా చూపించి పరిష్కారాలు చెప్తే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే స్థితిలో వున్నారా, లేక సామాజిక సమస్యల్ని ప్రేక్షకులకి నిత్యానుభవమయ్యే రాజకీయాలతో లైవ్ గా చూపిస్తే ఎక్కువ ఫీలయ్యే పరిస్థితులున్నాయా విశ్లేషించుకోవాలి. దేవుడో, ప్రకృతో శిక్షిస్తాయంటే లైట్ గా తీసుకుంటారు. అదే చట్టం, రాజ్యాంగం శిక్షిస్తాయంటే సీరియస్ గా తీసుకుంటారు. ఈ రెండోదే మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ అన్పిస్తే, సైన్స్ ఫిక్షన్ జానర్ ని ‘ఆదిత్య 369’ లాంటి ఎంటర్ టైనర్స్ కి పరిమితం చేసేయాలి.
4) ఐడియాలో సినిమా కథని ఎలా చూడాలి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” అనేది ‘టాక్సీవాలా’ ఐడియాగా చెప్పుకోవచ్చు. ఇందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ లు ఎక్కడున్నాయి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే” – అనడం బిగినింగ్, “అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి” - అనడం మిడిల్. “దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” - అనడం ఎండ్. ఇలా ఒక లైనుగా చెప్తే అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ లు అర్ధవంతంగా, పరస్పర సంబంధంతో కన్పించడమే ఐడియా. ఇలా కుదిరేవరకూ ఐడియాతో కుస్తీ పట్టడమే.

“ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే ― అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి ― దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు”
ఇందులో కారులో ఆత్మ వుందని తెలియడం ప్లాట్ పాయింట్ వన్. ఈ ఐడియా ఆడియెన్స్ మెంటల్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతోందా? ఐడియాలో వున్న సమస్యేమిటి? ఆత్మకి ఒక అన్యాయపు కథ వుందని హీరోకి తెలియడం. దీనికి పరిష్కారమేమిటి? ఆ అన్యాయాన్ని హీరో సరిదిద్దడం. ఇందులో ప్రేక్షకులకెలాటి అభ్యంతరం వుండాల్సిన పని లేదు. ఆడియెన్స్ ఫ్రెండ్లీగానే వుంది. ఇలాకాక, న్యాయం కోసం తపిస్తున్న ఆత్మని హీరో తుదముట్టించి తన సమస్య తీర్చుకుంటేనే తీవ్ర అభ్యంతరం. బాక్సాఫీసుకి తాళాలో, పాతాళమో.

సైన్స్ ఫిక్షన్ కంటే హార్రర్ సినిమాలంటే ప్రేక్షకులకి పునర్జన్మల సినిమాలంత ప్రేమ. ఎందుకంటే ఇది అన్ కాన్షస్ గా తమలో అనుభవించే సబ్ కాన్షస్ వరల్డే. సినిమాలో దెయ్యం సబ్ కాన్షస్ వరల్డ్. మనిషిలో వుండే నెగెటివ్ భావాలకి సింబాలిక్ ప్రెజెంటేషన్. మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్ ప్రకారం, మనిషిగా తనలో మంచితో బాటు చెడు కూడా వుంటుందని తెలుసుకోని మనిషి, ఆ చెడుని విధి రూపంలో బయటి ప్రపంచంలో అనుభవిస్తాడు. మనిషి తన అంతరంగంలో (సబ్ కాన్షస్ లో) మంచీ చెడులతో పడే సంఘర్షణే వెండితెరమీద కన్పించే ప్లే – స్క్రీన్ ప్లే.
కొన్ని హర్రర్ సినిమాలు మంచి కోసం మంచి ఆత్మల తపనగా వుంటాయి, కొన్ని హార్రర్ సినిమాలు చెడు కోసం దుష్టాత్మల ప్రకోపంగా వుంటాయి. ‘టాక్సీవాలా’ మంచి ఆత్మ కథ. ‘2.0’ కూడా మంచి ఆత్మ కథ.
“ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని ― తన చిట్టి రోబో చేత అంతమొందించి ― పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్”
పై ‘2.0’ ఐడియాలో స్ట్రక్చర్ ఎలా వుంది?
బిగినింగ్ ―ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని
మిడిల్ ―తన చిట్టి రోబో చేత అంతమొందించి
ఎండ్ ―పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్
ఈ మూడు విభాగాలూ పరస్పర విరుద్ధంగా వున్నాయని ఇట్టే తెలిసిపోతోంది. పక్షిజాతి కోసం తిరగబడిన శాస్త్రజ్ఞుడి ఆత్మని, చిట్టి చేత అంతమొందించి, అదే శాస్త్రజ్ఞుడి నివారణోపాయాలు సైంటిస్టు వశీకరణ్ వల్లె వేశాడు. ఇది కన్విన్సింగ్ గా వుందా?
పక్షిజాతి
కోసం శాస్త్రజ్ఞుడి ఆత్మ పోరాడ్డం తప్పని చెప్తున్నట్టా? అలాటి ఆత్మని చంపి ఆ ఆత్మే ఘోషించిన పాఠాలు చెప్పుకోవడం పాఠాలే
చెప్పుకోవడం ఒప్పని అంటున్నట్టా? అలాంటప్పుడు శాస్త్రజ్ఞుడి ఆత్మని ఎందుకు చంపడం? పైగా
నువ్వు కొందర్ని చంపావని సాకు చూపించి ఆత్మని దోషిగా నిర్ధారించి దాని మీద యుద్ధం
ప్రకటించడం. ‘టాక్సీ వాలా’లో కూడా ఆత్మ ఒకరిద్దర్ని చంపేస్తుంది. దానికి హీరో,
నువ్వు చంపావ్ కాబట్టి నిన్ను చంపేస్తానని ఆత్మ మీదికి పోయాడా? తనకి అన్యాయం చేసిన
వాళ్ళనే మంచి ఆత్మ చంపేసింది. అలాగే ‘2.0’ లో సెల్ కంపెనీలతో పక్షులకి అన్యాయం చేస్తున్న
డీలర్నీ, నెట్వర్క్ ప్రొవైడర్నీ శాస్త్రజ్ఞుడి మంచి ఆత్మ చంపేసింది. ఇందులో
తప్పేముంది? 4 కోట్ల 53 లక్షల రేంజిలో ‘టాక్సీవాలా’ లాగా కూడా, 543 కోట్ల మెగా రేంజిలో
‘2.0’ కన్విన్స్ చేయలేకపోతే ఎలా?
ఎవరు హీరోనో, ఎవరు విలనో ప్రేక్షకులే తేల్చుకోవాలని వదిలేశారా? రజనీ కాంత్ విలన్లా, అక్షయ్ కుమార్ హీరోలా అనుకున్నా ఫర్వాలేదా? మంచిని చెడు చంపెయ్యాలని ఉద్దేశమా? ఇలాటి సినిమాలున్నాయా?
అక్షయ్ కుమార్ ది సామాజిక పోరాటం చేసే పాత్ర. సామాజిక పోరాటం చేసే పాత్ర ప్రేక్షకుల దృష్టిలో విలన్ అవదు. నిజ ప్రపంచంలో కూడా సామాజిక పోరాటం చేసే నాయకుడు ప్రజలకి విలన్ కాదు, పాలకులకే విలన్. ఈ రియల్ లైఫ్ సెటప్ ని కథలో పెడితే అప్పుడు పాలకవర్గ, కార్పొరేట్ వర్గ ఏజెంటుగా రజనీ కాంత్ పాత్రకి అక్షయ్ పాత్ర విలనే. ఈ సెటప్ లేనప్పుడు రజనీ లాంటి సైంటిస్టు పాత్ర, లోకకళ్యాణం కోరుతున్న సాటి సైంటిస్టుని ఎలా చంపేస్తుంది? పాలక పక్ష ఏజెంటుగా రజనీ కాంత్ చంపినా హీరో అవడు, అక్షయ్ కుమారే హీరో అవుతాడు ప్రేక్షకుల దృష్టిలో.
ఐడియాలోనే ఇంత కన్ఫ్యూజన్ వుంటే దీన్ని అందంగా సింగారించుకుంటూ పోయారు. అక్షయ్ ని విలన్ అన్నట్టు చూపిస్తూనే, అతడి చర్యల్ని జస్టిఫై చేసే అందమైన ఫ్లాష్ బ్యాకుని కడు దయనీయంగా చూపించారు పాపం అన్పించేలా. ప్రేక్షకులు అతడి పక్షం వహించేలా.
దాదాపు
మృతశిశువుగా అక్షయ్ పుట్టి కడుపు శోకం మిగుల్చుతూంటే, కిటికీలోంచి ఒక పిచ్చుక
ఎగురుకుంటూ వచ్చి శిశువు ఛాతీ మీద కూర్చుని పొడుస్తూ వుంటుంది. అత్యంత వండర్ఫుల్
క్రియేషన్ ఇది. కళ్ళప్పగించి చూడ్డమే శంకర్ పోయెటిక్ టచ్ కి. ఆ పిచ్చుక పొడుస్తూ
వుంటే శిశువులో చలనం వచ్చి క్యారు మంటుంది!
అదీ
జన్మాంతం పిచ్చుకలతో, మొత్తం పక్షిజాతితో అక్షయ్ అత్మీయబంధానికి, వాటికోసం
పోరాటానికీ ఒనగూడిన బలమైన మోటివేషన్. పక్షుల రక్షణ కోసం పోరాడీ పోరాడీ –
ఫ్రీక్వెన్సీలు తగ్గించుకోమని చెప్పీ చెప్పీ ఓడి - సెల్ టవర్ కే ఉరేసుకుంటే,
పక్షులన్నీ చుట్టూ చేరి ఆత్మాహుతి చేసుకున్నాయి. పక్షుల ఆత్మలన్నీ అతడి ఆత్మలో
ఐక్యమై మహా పక్షిగా రూపొందాడతను. పక్షిరాజాగా సెల్ ఫోన్ల మీద దాడులు మొదలెట్టాడు. సర్వ
కమ్యూనికేషన్ వ్యవస్థనీ ధ్వంసం చేశాడు. ఇందులో ఏం తప్పుంది? అతను చెప్పింది కేవలం
ఫ్రీక్వెన్సీ తగ్గించుకుని పక్షుల్ని రక్షించమనేగా? మొత్తం టెక్నాలజీని
మూసెయ్యమన్లేదుగా? కానీ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన ప్రభుత్వమూ సెల్ కంపెనీలూ
ఫ్ర్రీక్వెన్సీ తగ్గించుకోక పక్షి జాతికే, పర్యావరణానికే ఎసరు పెట్టడానికి
సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎవరు తప్పు? ఎవరు ఒప్పు?
విలన్ అనుకున్న పాత్రకి ఇంత ఎలిబీ ఇచ్చేశాక అది హీరో పాత్రే! ఎంత గందరగోళంగా వుందంటే, దీని గురించి ఇంకా రాయాలంటే ఎలా రాయాలో అర్ధంగావడం లేదు! మైండ్ పూర్తిగా ‘0.0’ ఐపోయేలా వుంది.
ఓకే, రజనీ, అక్షయ్ లిద్దర్నీ పాజిటివ్ పాత్రలుగానే వూహిద్దాం. రెండు పాజిటివ్ పాత్రలతో సినిమా కథ వుంటుందా అంటే వుంటుంది. కాకపోతే కథకి హీరో అయిన మొదటి పాత్రకి మొదట వున్న గోల్ తర్వాత వుండదు. మొదట నెగెటివ్ అనుకున్న పాత్రతో పెట్టుకున్న గోల్, తీరా అది పాజిటివేనని తెలుసుకుని, ఇద్దరి ఉమ్మడి గోల్ గా కథ మారిపోతుంది...
అంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రజనీకి అక్షయ్ విలన్ గానే
కన్పించి పోరాడతాడు. ప్లాట్ పాయింట్ టూలో అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాక అతను
హీరోలా కన్పించి చేయి కలుపుతాడు. అతడి గోల్ పూర్తి చేయడానికి అతడితో కలిసి వ్యవస్థతో
ఉమ్మడి పోరాటం చేస్తాడు. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఔటర్ గోల్ వుంటుంది. కానీ
ప్లాట్ పాయింట్ టూ దగ్గర, ఒక రియలైజేషన్ తో, ఆత్మ విమర్శతో ఔటర్ గోల్ తొలగి,
ఇన్నర్ గోల్ పుడుతుంది రజనీకి. నిజం తెలియక మొదలెట్టిన ఔటర్ జర్నీ, నిజం తెలిశాక
ఇన్నర్ జర్నీగా, తనలోకి తన ప్రయాణంగా మారుతుంది. ఇప్పుడు విలన్ ఎవరంటే, తను నమ్మి
మొదట్లో పోరాటం మొదలెట్టిన వ్యవస్థే.
ఇలా హీరో గోల్ మారిపోయే స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా, ది వింటర్ సోల్జర్ వంటి సినిమాలున్నాయి. అంటే, అంతిమంగా అక్షయ్ ఆత్మకి దాని గోల్ ని పూర్తిచేసి, శాంతిని చేకూర్చి, రజనీ వీడ్కోలు చెప్పడమే – ‘ఈటీ’ లో అందమైన ముగింపు లాగా. అప్పుడు కథా ప్రయోజనం, సామాజిక ప్రయోజనం అన్నీ నెరవేరతాయి. మొదట రజనీకి విలన్ గా ప్రేక్షకులకి కన్పిస్తున్న అక్షయ్ పాత్ర, తర్వాత ఇద్దరి మిలాఖత్ తో ‘కో – లెడ్’ పాత్రగా మారుతుంది.
ఇప్పుడు సుమారుగా ఐడియా ఇలా వుండొచ్చు - “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మతో ― తన చిట్టి రోబోని కలిపి అవినీతి వ్యవస్థని అంతమొందించి ― ఆ ఆత్మకి శాంతిని చేకూరుస్తాడు సైంటిస్టు వశీకరణ్”
సమస్యకి
దర్శకుడు సిఎస్ గారు సూచించిన ప్రత్యాన్మాయాలు కూడా రిజల్యూషన్ గా ఇవ్వొచ్చు. ఈ రోజుల్లో గూగుల్ చేస్తే అర క్షణంలో తెలిసిపోనిదంటూ ఏమీ లేదు. ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం
కష్టం.
(సిఎస్ స్పందన : I read your who is hero article. That's exactly what i thought as a solution to the plot point. Any good script consultant would have told Shankar that...After knowing flash back of Akshay, Rajni joins hands with Akshay and declare a war on techno goons ending with dialogues on alternative methods. Akshay atma slowly disappearing into clouds with a satisfied smile is the last shot)

―సికిందర్