మూడవ బాండ్ రోజర్ మూర్. ఇతను చాలా ఫన్నీగా ఎంటర్ టైన్ చేస్తాడు. కామెడీ పాలెక్కువ. 1972-1985 మధ్య ఏడు బాండ్ సినిమాలు నటించి ఎక్కువ పాపులరయ్యాడు. చిన్న తుపాకులు పేల్చడంలో, బాంబులు- పేలుడు పదార్థాలు పేల్చడంలో, పెద్ద వాహనాలు నడపడంలో, స్నోబోర్డింగ్ తో, స్కీయింగ్ తో , జలాంతర్గాములతో, వైన్- షాంపేన్- సిగార్లు వంటివి తాగడంలో ప్రత్యేక స్కిల్స్ గడించాడు.
నాల్గో జేమ్స్ బాండ్ టిమోతీ డాల్టన్. 1986-1994 మధ్య రెండు బాండ్ సినిమాల్లో నటించాడు. చిన్న తుపాకులు, పెద్ద విమానాలు, డైవింగ్, గాంబ్లింగ్, స్నిపింగ్, స్మోకింగులతో స్పెషల్ స్కిల్స్.
ఐదో బాండ్ పియర్స్ బ్రాస్నన్. 1994-2005 మధ్య 4 బాండ్ సినిమాలు నటించాడు. ప్రత్యేక స్కిల్స్ : చిన్న తుపాకులు, జెట్ పైలటింగ్, బేస్-జంపింగ్, స్కీయింగ్, మోటార్‌సైక్లింగ్, లైట్-ఎయిర్‌క్రాఫ్ట్, వైస్, సిగార్లు.
ఆరవ బాండ్ గా ఇప్పుడు డేనియల్ క్రేయిగ్ రిటైరయ్యాడు. బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన సూపర్ స్పై జేమ్స్ బాండ్ పాత్ర సాహసకృత్యాలు చేయని దేశం లేదు. 1983 లో రోజర్ మూర్ నటించిన ‘ఆక్టోపస్సీ’ లో ఇండియా వచ్చి ఉదయపూర్ లో హంగామా చేసిపోయాడు.
1962 నుంచీ ఈ 60 ఏళ్ళ కాలంలో 25 జేమ్స్ బాండ్ 007 సినిమాలు నిర్మించిన ఆల్బర్ట్ బ్రకోలీ, ఆయన మరణానంతరం కుమార్తె బర్బరా బ్రకోలీ, 26వ బాండ్ సినిమాని 2024 లోపు ప్రారంభించే అవకాశంలేదు. విడుదల 2025-26 లలో వుండొచ్చు. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ‘బాండ్ 26’ గా వర్కింగ్ టైటిల్ పెట్టారు. దర్శకుడుగా మాత్రం డెనిస్ విలెన్యూ అనే కెనడియన్ -ఫ్రెంచి దర్శకుడు ఎంపికయ్యాడు. ఇతను హాలీవుడ్ లో 11 సినిమాలకి దర్శకత్వం వహించాడు- ‘బ్లేడ్ రన్నర్ 2049’ సహా.
హెన్రీ కావిల్ |
రెజ్-జీన్ పేజీ పరిశీలనలో వున్న ఇంకో పేరు. ఇతను మూడవ బాండ్ రోజర్ మూర్ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా వున్నట్టు చెప్పాడు. టామ్ హార్డీ వినిపిస్తున్న ఇంకో పేరు. ఇతను ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ఇన్సెప్షన్’, ది డార్క్ నైట్ రైజెస్’ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు.
క్రేయిగ్ శకం ముగియడంతో, 007 నిర్మాతలు ఫ్రాంచైజీని కొంచెం ముందుకు -అంటే నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలని కోరుకునే అవకాశం వుంది. దీనికి కూడా అర్హతలున్న హీరో కావాలి. హెన్రీ కావిల్ ఇంకో పేరు. అలాగే ఐడాన్ టర్నర్, రాబర్ట్ ప్యాటిన్సన్, రిచర్డ్ మాడెన్, గాబ్రియేల్ బస్సో, సిలియన్ మర్ఫీ, సామ్ హ్యూగన్, జాక్ లోడెన్, టామ్ హిడిల్స్టన్, జేమ్స్ నార్టన్, జోనాథన్ బెయిలీ, హెన్రీ గోల్డింగ్, జామీ బెల్, జాన్ బోయెగా, విల్ పౌల్టర్, డాన్ స్టీవెన్స్, డేనియల్ కలుయుయా, క్లైవ్ స్టాండెన్, డ్వేన్ జాన్సన్, టామ్ హాప్పర్, చివెటెల్ ఎజియోఫోర్...ఇలా లిస్టు పెద్దదే. ఇందులో ఇంకో పేరు చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. దేవ్ పటేల్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ నటుడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రేక్షకులకి పరిచయం.
గాబ్రియేల్ బస్సో |
—సికిందర్