Monday, October 31, 2022
1241 : కొరియన్ రివ్యూ!
Sunday, October 30, 2022
1240 :రివ్యూ!
మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీ, ప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీ, మన కోసం కాలం ఆగదనీ, కనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ ఇది. ఇదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీ, జనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీ, మరణాన్ని చూసి భయపడకూడదనీ, చెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ. ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ ‘గాథ’ని ‘కథ’గా మార్చకుండా. సముద్రకని దీన్ని గంటన్నర ప్రయోగాత్మక సినిమాగా తీసి ఓటీటీలో విడుదల చేశాడు. దీన్ని పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ లతో తెలుగులో రీమేక్ చేస్తామని ఆవేశపడ్డారు. తర్వాత వార్తల్లేవు. ఇది గాథ అని తెలుసుకోకుండా రీమేక్ చేసివుంటే చేతులు కాలేవి.
—సికిందర్
Saturday, October 29, 2022
1238 : రివ్యూ!
వరుస ఫ్లాపులెదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తో విజయాలకి వారధి వేసుకుందామని వచ్చాడు. భక్తి- యాక్షన్ సినిమాల సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని చూసి తరిద్దామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ కి ముందు ప్రారంభమై ఈ దీపావళికి విడుదలవుతున్న దీని కోసం చాలా కష్టపడ్డాడు అక్షయ్ కుమార్, దర్శకుడు అభిషేక్ శర్మ మీద విశ్వాసంతో. అభిషేక్ శర్మ కిది రెండో స్టార్ సినిమా. ఇవి తప్పిస్తే గతంలో తీసిన ఐదు సినిమాలూ చిన్న సినిమాలు. 2018 లో జాన్ అబ్రహాంతో ‘పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ అని భారత దేశం జరిపిన అణుపరీక్ష మీద తీశాడు. ఇది ఫర్వాలేదన్పించుకుంది. ఇప్పుడు రామాయణంలోని రామసేతు మీద భక్తి- యాక్షన్ థ్రిల్లర్ తీశాడు. మరి ఈ ప్రయత్నమెలా వుంది? ఇందులో భక్తిగానీ, యాక్షన్ గానీ అర్ధవంతంగా ఏమైనా వున్నాయా? ఇది తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దాం...
Friday, October 28, 2022
1237 : రివ్యూ!
కోర్టులో ఒకడు పరిచయమై విడాకులు జరగవని భవిష్యత్తు చెప్పి, విజిటింగ్ కార్డు ఇచ్చి అదృశ్యమై పోతాడు. అర్జున్ ఆ అడ్రసుకి వెళ్ళేసరికి అక్కడ దేవుడు (వెంకటేష్ ) వుంటాడు, కోర్టులో అదృశ్యమైన వాడు (రాహుల్ రామకృష్ణ) అక్కడే వుంటాడు. దేవుడు అర్జున్ చెప్పుకున్నదంతా విని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి సెకెండ్ ఛాన్సు ఇస్తున్నానని చెప్పి, ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ అర్జున్ తోనే వుండాలి, ఎవరికీ దని గురించి చెప్పొద్దు, చెప్తే చస్తావని హెచ్చరిస్తాడు.
ఇప్పుడు ఆ టికెట్ తో అర్జున్ జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? విడాకులు మానుకుని అనుతోనే వున్నాడా? లేక అనుకోకుండా వచ్చిన స్కూల్ సీనియర్ మీరా (ఆశా భట్)తో ప్రేమలో పడ్డాడా? ఏం జరిగింది? ఎలా పరిష్కరించుకున్నాడు సమస్య? ఇదీ మిగతా కథ.
పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు- ప్రేమ పెళ్ళిళ్ళు; స్నేహాలు- ప్రేమలు, శ్రమ విలువ - ఆనందం వంటి అంశాలు కూడా గంభీరంగానే చెప్పాడు దర్శకుడు. ఈ ఫాంటసీకి దర్శకుడు పాటించిన ఎలిమెంట్ కామెడీ మాత్రమే. ఇది కూడా హీరోతోనే. హీరోయిన్లని కామెడీకి దూరంగా వుంచాడు.
ఫస్టాఫ్ టైమ్ వేస్ట్ చేయకుండా మొదటి పది నిమిషాల్లోనే పెళ్ళయి పోతుంది. 20 నిమిషం కల్లా విడాకులకొస్తుంది కథ. దీంతో దేవుడి పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ్నుంచీ ఇంటర్వెల్ ముందు వరకూ సుమారు 40 నిమిషాలు నస పెడుతుంది. ఎందుకంటే దేవుడు వెంకటేష్ అడుగుతున్న వివరాల్ని విశ్వక్ సేన్ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్పుకొస్తూంటాడు. ఇప్పుడు విడిపోవడానికి కారణాలేంటో ఆ కథనం బలహీనంగా వస్తూంటుంది. ఈ బలహీనతని కవర్ చేయడానికా అన్నట్టు, ప్రెజెంట్ స్టోరీలో వెంకటేష్ తన మార్కు డైలాగ్ కామెడీని ప్రయోగిస్తూంటాడు.
ఇంతా చేస్తే విడిపోవడానికి కారణం కొత్తగా వుండదు. స్కూల్ సీనియర్ మీరా ఎంట్రీతో అనుమానం పెనుభూతమై గొడవ పడతారు భార్యా భర్తలు. ఈ టెంప్లెట్ రొటీనే విడాకులకి కారణమవుతుంది. ఈ విడిపోవా లనుకోవడానికి మొదటి రాత్రి ఎస్టాబ్లిష్ చేసిన రోమాంటిక్ గా ఫీలవలేక పోతున్న మానసిక కారణమే వుండుంటే కొత్తదనం వుండేది. ఒక చోట- ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోకూడదు, పెళ్ళి చేసుకున్నాక భార్యని ఫ్రెండ్ గా చేసుకోవచ్చని అంటాడు కూడా విశ్వక్ సేన్. అతడికి అడ్డు పడుతున్న ఈ సైకలాజికల్ కారణాన్నే పక్కన పెట్టేశాడు దర్శకుడు. దానికి ట్రీట్ మెంట్ తీసుకోకుండా వేరే స్కూల్ సీనియర్ తో తిరగడం, భార్యకి అనుమానాలు కల్గించడం, ఇదంతా పాయింటు వదిలేసి క్యారక్టరైజేషన్ని చెడగొట్టిన వ్యవహారంగా మారింది.
ఇక ఇంటర్వెల్ లో దేవుడుగా వెంకటేష్ టికెట్ ఇవ్వడంతో మాత్రమే డల్ గా వున్న ఫస్టాఫ్ కి కాస్త ఊపొస్తుంది. ఇక సెకండాఫ్ కథ- విశ్వక్ సేన్ టైమ్ ట్రావెల్ చేసి- హీరోయిన్ తో పెళ్ళిని తిరస్కరించి వుంటే ఎలా వుండేదన్న కథనంతో సాగి, స్కూల్ సీనియర్ తో ప్రేమాయణం సాగించి, హీరోయిన్ విలువ తెలిసొచ్చి, ఆమెకోసం ప్రాకులాడే సాధారణ రొటీన్ గానే వుంటుంది. చివరికి వెంకటేష్ జోక్యంతో వూహించినట్టుగానే సుఖాంతమవుతుంది హీరోయిన్ తో.
దేవుడి క్యారక్టర్ తో ఫాంటసీ అనేది పేరుకే. ఎక్కడా ఫాంటసీ చూస్తున్నట్టే వుండదు. దేవుడిచ్చిన టికెట్ తో అద్భుతాలేమీ జరగవు. అడ్వెంచర్, థ్రిల్ మొదలైన ఫాంటసీ జానర్ ఎలిమెంట్స్ వుండవు. విశ్వక్ సేన్ లాంటి హైపరాక్టివ్ హీరో రెక్కలు కత్తిరించేసినట్టు వుంది.
హీరోయిన్లిద్దరూ బావున్నారు గానీ, తమిళంలో నటించిన హీరోయిన్లంత కాదు. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన దేవుడి పాత్రని వెంకటేష్ నటించడం బాగానే —వుంది. వంక పెట్టడానికి లేదు. అలాగే ఆయన అసిస్టెంట్ గా రాహుల్ రామ కృష్ణ. ఒక పాత్రలో మురళీ శర్మ ఫ్లాష్ బ్యాక్ కథ కదిలిస్తుంది. గమ్మత్తేమిటంటే, ఈ ప్రేమ కథలో హీరోహీరోయిన్లతో కదిలించే సీన్లు అనేవి లేకపోవడం
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, ఛాయాగ్రహకుడు విధు అయ్యన్నఇద్దరూ తమిళ ఒరిజినల్ కి పనిచేసిన వాళ్ళే. ఫర్వాలేదు. చివరిగా, రొటీన్ గా వచ్చి పోతున్న ప్రేమ సినిమాలకంటే భిన్నంగా వుండడానికి చేతిలో ఫాంటసీ కాన్సెప్ట్ ని వుంచుకుని కూడా, సద్వినియోగం చేసుకోకపోవడం బాక్సాఫీసుకి ఇబ్బందిగా మారింది.
—సికిందర్