ఆరు ఘట్టాల గాథ
Friday, April 21, 2023
1320 : మూవీ నోట్స్
ఆరు ఘట్టాల గాథ
Friday, April 14, 2023
1319 : రివ్యూ
టీనేజర్స్ కి ప్రీతీ అస్రానీ టీనేజి పాత్ర, పిల్లలకి మాస్టర్ అద్వైత్ బాల పాత్ర, జనరల్ యూత్ కి హీరో శశికుమార్ పాత్ర, గృహిణులకి అంజూ అస్రానీ తల్లి పాత్ర, పెద్దలకి యశ్పాల్ శర్మ పాత్రా ముట్టడించి అన్ని ఏజి గ్రూపులకి విజువల్ అప్పీల్ ని ఎడతెరిపి లేకుండా పంచుతోంటే, విషాదంతో నిండిన రెండు గంటల ఈ స్వల్ప కథ తేలిపోయే అవకాశం లేదు.
ప్రేక్షకుల్ని ప్లీజ్ చేయడానికి రోమాన్స్ లేదు, కామెడీల్లేవు, టైమ్ పాస్ పాటల్లేవు, ఎలాటి కమర్షియల్ హంగులూ లేవు. అసలు సాధారణంగా అనుకునే హీరోయిజమే లేదు. సబ్ ఫ్లాట్స్ లేవు. ఎక్కువ పాత్రల్లేవు. కేవలం మరణమనే విషాదంతో, మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే ఒకే లైనుతో, దాని చుట్టూ సంఘర్షణతో మాత్రమే ఈ స్వల్ప కథ వుంది.
ఈ సంఘర్షణలో సాధారణంగా హీరోకి వుండే ప్రత్యర్ధి లేడు. పరిస్థితులే వివిధ అడ్డంకులుగా వుంటాయి. మృత దేహం తరలింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి చేయాల్సిన పనులకి సంబంధించి. స్క్రీన్ ప్లేలో 25 వ నిమిషంలో యశ్పాల్ శర్మ - టాక్సీ డ్రైవర్ కొట్లాడుకుని జరిగే యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ లో హీరో శశి కుమార్ వుండడు. అమల్లో వున్న నియమాల ప్రకారమైతే టాక్సీ డ్రైవర్ గా శశికుమారే వుంటాడు. కాన్ఫ్లిక్ట్ లో అతనుండాలి కాబట్టి. కానీ ఈ నియమాన్ని పాటించలేదు కొత్త దర్శకుడు. అయినా కథ గానీ, పాత్ర గానీ దెబ్బ తినలేదు. ఇదొకటి గమనించాల్సిన విషయం.
ఫస్ట్ యాక్ట్ అయోధ్యలో 10 వ నిమిషంలో యశ్పాల్ శర్మ రామేశ్వరం ప్రయాణం గురించి కుటుంబానికి చెప్పాక, రామేశ్వరం సముద్ర తీరంలో సన్నాసులతో పైటింగ్ తో ఎంట్రీ సీను వేసుకుని వెళ్ళిపోతాడు హీరో శశికుమార్. ప్లాట్ పాయింట్ వన్ లో మదురై సమీపంలో యాక్సిడెంట్ తర్వాత, టాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో, అంబులెన్స్ డ్రైవర్ గా శశికుమార్ కాన్ఫ్లిక్ట్ లోకి - సెకండ్ యాక్ట్ లో ఎంటరవుతాడు. ఇది గమనించాలి.
ఇక్కడ్నుంచి మృతదేహాన్ని అయోధ్యకి తరలించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకదాని తర్వాతొకటి కాన్ఫ్లిక్టుల వరస మొదలవుతుంది. ఆ రోజు దీపావళి పండుగ సెలవు కాబట్టి ఈ పరిస్థితి. కథనంలో ఐరనీ ఏమిటంటే, ఒక వైపు మృతదేహంతో పాట్లు, మరో వైపు తెల్లారినప్పట్నించే వీధుల్లో టపాకాయలతో పండుగ సందడి. అయితే ఎవరైనా శుభమా అని దీపావళి పండుగ రోజు ఇల్లు వదిలి తీర్ధ యాత్ర పెట్టుకుంటారా అన్నది ప్రశ్న. పెట్టుకుంటారేమో అదేమంత పెద్ద విషయం కాదనుకుంటే, అఖండ సాంప్రదాయ వాదియైన బలరాం (యశ్పల్ పాత్ర) లాంటి వాడు పెట్టుకుంటాడా అన్న పాత్ర చిత్రణకి సంబంధించిన ప్రశ్న తలెత్తుతూనే వుంటుంది. పండుగ సెలవుతో అవాంతరాల కోసమే కొత్త దర్శకుడు పాత్రచిత్రణని బలిపెట్టి వుండాలి.
రెండోది యశ్పాల్ దగ్గర డబ్బుల్లేకపోవడం. పేదవాడైన శశికుమార్ పర్సులో వున్న రెండు మూడొందలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడడం. ఎక్కడో పర రాష్ట్రానికి ప్రయాణం పెట్టుకున్న యశ్పాల్ దగ్గర టాక్సీ ఫేర్ కి మించి డబ్బులే వుండవా? అయోధ్యలో మిత్రుడికి ఫోన్ చేస్తే, విమాన టికెట్లు నేను చూసుకుంటాను, దిగులు పడొద్దంటాడు మిత్రుడు. ఈ లోపాలు కూడా గమనించాలి.
ప్రీతీ అస్రానీ తల్లికి రామేశ్వరంలో కట్టుకోవడానికి సెలెక్టు చేసే చీర, తమ్ముడు హుండీలో డబ్బు దాచుకునే చర్యా- ఈ రెండూ తర్వాత ప్లాట్ డివైసుల రూపంలో అవసరంలో అనూహ్యంగా తెరపైకొచ్చి థ్రిల్ చేస్తాయి. స్వల్ప కథ సింగిల్ లైను కుంగ కుండా ఇలాటి క్రియేటివ్ ఎలిమెంట్స్ ప్రయోగం కూడా తోడ్పడింది.
భాషల విషయంలో రాజీ పడలేదు కొత్త దర్శకుడు. హిందీ మాట్లాడే పాత్రలు హిందీయే మాట్లాడడం, తమిళం మాట్లాడే పాత్రలు తమిళమే మాట్లాడడం చేస్తాయి. ఎవరి మాతృభాషలో ఆ పాత్రలు మాట్లాడ్డం వల్ల సహజత్వమే కాకుండా, ఎదుటి పాత్ర భాష అర్దంకాని టెన్షన్, భావోద్వేగాలు కూడా ఏర్పడుతూ కథనం బలీయమవుతూ పోవడానికి తోడ్పడింది.
ప్రత్యర్ధి లేని కథనంలో కథనం చప్పబడకుండా వివిధ ప్రభుత్వ లాంచనాల సమస్యలే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫుని పెంచుతూపోయే క్రమం కన్పిస్తుంది. ప్రభుత్వ లాంచనాలకి సంబంధించి కొత్త దర్శకుడు మంచి రీసెర్చి చేసినట్టు కన్పిస్తుంది. సన్నివేశాల్లో బలీయమైన హ్యూమన్ డ్రామా సృష్టి వల్ల డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం కూడా తొలగిపోయింది. పౌరుల జీవితాల భద్రత కోసం రూపొందించిన ప్రభుత్వ నిబంధనల మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల వేదనని, వాటిని పాటించడంలో వున్న ఆచరణాత్మక సమస్యల్ని, ఓ పరాయి పట్టణంలో చిక్కుకుపోయిన దిక్కులేని కుటుంబాన్ని ప్రతీకగా చేసి చూపించాడు కొత్తదర్శకుడు. పోలీసు రిపోర్టులో పేరులో స్పెల్లింగ్ తప్పులు చూసి ఏర్ పోర్టు అధికారి అనుమతి నిరాకరించే లాంటి బ్రిటీష్ కాలం నాటి ఆఫీసర్ల ‘బాబు డమ్’ ఇంకా వేళ్ళూ నుకోవడం ఒక విచారకర స్థితి.
'అయోతీ’ ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు. కథ చెప్పడంలో అమల్లో వున్న సాంప్రదాయాల్ని కాసేపు పక్కన బెట్టి, ఒక క్రియేటివ్ వైకల్పం చూపిస్తున్న కొత్త దర్శకుడు మంధిర మూర్తి మలి ప్రయత్నమెలా వుంటుందో ఇక చూడాలి.
Tuesday, April 11, 2023
1318 : మూవీ నోట్స్
టాలీవుడ్ (బెంగాలీ సినిమా పరిశ్రమ) లో ప్రోస్థెటిక్స్ మేకప్ ఆర్టిస్టు విన్సీ డా. ఇతను జగత్ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ వీరాభిమాని. డా విన్సీ పేరుని తిరగేసి తన పేరుగా పెట్టుకున్నాడు. ఇతను పరమ నీచంగా మారిన తన జీవిత కథ చెప్పుకొస్తూంటాడు. ఈ కథలో ఆది బోస్ అనే 18 ఏళ్ళ వాడు తల్లిని వేధించే తాగుబోతు తండ్రిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేస్తాడు. పోలీసులకి లొంగిపోతాడు. కోర్టు పిచ్చాసుపత్రికి పంపిస్తుంది. ఇలా వుండగా, టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అయిన విన్సీ డా తండ్రి చనిపోవడంతో, అతడి కొడుకుగా టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అవకాశాలు పొందడానికి స్ట్రగుల్ చేస్తూంటాడు. డావిన్సీ కళనే నమ్మిన తను, ఆ కళా ప్రక్రియతో రాణించే పరిస్థితుల్లేక తీవ్ర నిరాశతో వుంటాడు. ఇలా వుంటూనే జయ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఇప్పుడు ఆది బోస్ పెద్దవాడై జైలు నుంచి విడుదలవుతాడు. ఇతను తనని తాను సీరియల్ లాయర్ గా భావించుకుంటాడు. అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఒక దుర్మార్గమైన పథకాన్ని ఆలోచించుకుంటాడు. జైల్లో మానసిక చికిత్స అతడి క్రూర సైకో మనస్తత్వాన్ని ఏ మాత్రం రూపు మాపలేదు. ఆ పథకంతో సినిమా దర్శకుడుగా నటిస్తూ విన్సీ డా ని కలుస్తాడు. తనకి కొన్ని వందల కోట్లు బ్యాంకు స్కామ్ చేసిన శ్యామ్ సుందర్ అనే బిజినెస్ మాన్ రూపంతో మాస్కు కావాలంటాడు. ఆర్ధిక సమస్యల్లో వున్న విన్సీ డా ఈ పనికి ఒప్పుకుని మాస్క్ తయారు చేసి ఇస్తాడు. ఆది బోస్ ఆ మాస్క్ వేసుకుని బ్యాంకుని దోచుకుని, సెక్యూరిటీ గార్డ్ ని చంపేసి పారిపోతాడు. దీంతో బ్యాంకు స్కామ్ కేసులో తప్పించుకున్న బిజినెస్ మాన్ శ్యామ్ సుందర్, ఇప్పుడు బ్యాంకు దోపిడీ ప్లస్ హత్య కేసులో అరెస్టయి పోతాడు.
దీంతో అరెస్టు భయంతో బ్లాక్ మెయిల్ కి లొంగిన విన్సీ డా, రెండో మాస్కు తయారు చేసి ఇస్తాడు. ఈసారి ఒక రాజకీయ నాయకుడి కొడుకు మాస్కు. ఈ కొడుకు నిర్లక్ష్యంగా కారు నడిపి కొందర్ని చంపేసిన కేసు నుంచి బయటపడ్డాడు. ఇతడి మాస్కు వేసుకున్న ఆది బోస్, ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కారు తోలి చంపేస్తాడు. దీంతో అప్పుడు అంత మందిని చంపి తప్పించుకున్న రాజకీయ నాయకుడి కొడుకు, ఇప్పుడు తప్పించుకోలేని విధంగా ఇరుక్కుంటాడు.
ఆ చనిపోయిన వాళ్ళల్లో ఒకడి కొడుకు విన్సీ డా ని కలుసుకోవడంతో విన్సీ డాకి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంకా ఈ నేరాల్లో ఆది బోస్ కి భాగస్థుడ్ని కాలేనని ఎదురు తిరుగుతాడు. ఆది బోస్ విన్పించుకోకుండా, చివరి మాస్కు ఒక రేపిస్టుది తయారు చేయమంటాడు. ఆ మాస్కు వేసుకుని రోడ్డు మీద పోతున్న ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు. ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాడు. ఇది వరకు రేప్ కేసులో విడుదలై పోయిన రేపిస్టు ఈసారి బయటపడలేని విధంగా ఇరుక్కుంటాడు. అయితే ఆ వీడియో చూసిన విన్సీ డా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆది బోస్ రేప్ చేసింది ఎవర్నో కాదు, తన గర్ల్ ఫ్రెండ్ జయనే! ఆమె ఆత్మహత్య చేసుకోబోతూంటే కాపాడుకుంటాడు.
విన్సీ డా ట్రైలర్